📄 ePaper
Thursday, April 16, 2026
ADS
HomeNewsరోడ్డు భద్రతా నియమాలు పాటించండి చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి.

రోడ్డు భద్రతా నియమాలు పాటించండి చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

చేగుంట,ఏప్రిల్,15,మెదక్ టుడే న్యూస్:రోడ్డు వారోత్సవాల్లో భాగంగా పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంట విద్యార్థులు చేగుంట పాఠశాల నుండి గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించినప్పుడే, రోడ్డు ప్రమాదాలను నివారించగలుగుతామని, మద్యం తాగి వాహనాలు నడప రాదని, అతివేగం కూడా ప్రమాదాల కారణమవుతాయని, ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించాలి వారన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంఈఓ నీరజ, ఎస్సై 2 బిక్య నాయక్, పోలీస్ సిబ్బంది వెంకటేష్,మహేష్,సిద్దు,రవి, ఉపాధ్యాయులు చల్లా లక్ష్మణ్, గర్దాస్ మనోహర్ రావు, రావుల వెంకటేష్, ఉమామహేశ్వరి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments