రోడ్డు భద్రతా నియమాలు పాటించండి చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి.

చేగుంట,ఏప్రిల్,15,మెదక్ టుడే న్యూస్:రోడ్డు వారోత్సవాల్లో భాగంగా పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంట విద్యార్థులు చేగుంట పాఠశాల నుండి గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించినప్పుడే, రోడ్డు ప్రమాదాలను నివారించగలుగుతామని, మద్యం తాగి వాహనాలు నడప రాదని, అతివేగం కూడా ప్రమాదాల కారణమవుతాయని, ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించాలి వారన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంఈఓ నీరజ,...