📄 ePaper
Thursday, March 12, 2026
ADS
Homepatancheru political newsకేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మున్సిపల్ చైర్మన్...

కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి.

📰 Generate e-Paper Clip

అమీన్పూర్,ఫిబ్రవరి,17,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ తుమ్మల పాండురంగ రెడ్డి కేసీఆర్ నివాసానికి వెళ్లి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.కేసీఆర్ నివాసంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసిన పాండురంగ రెడ్డి , పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాతగా, కోట్లాది మంది ప్రజల ఆశాజ్యోతిగా కేసీఆర్ నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా తుమ్మల పాండురంగ రెడ్డి మాట్లాడుతూ..”తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, దేశానికే ఆదర్శంగా నిలిపిన గొప్ప నాయకుడు కేసీఆర్. వారి మార్గదర్శకత్వంలో పనిచేయడం మాకు గర్వకారణం. అమీన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో వారి సహకారం మరువలేనిది,” అని పేర్కొన్నారు.”కేసీఆర్ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”— తుమ్మల పాండురంగ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్..ఈ కార్యక్రమంలో పాండురంగ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేసీఆర్ కి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments