కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి.
అమీన్పూర్,ఫిబ్రవరి,17,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ తుమ్మల పాండురంగ రెడ్డి కేసీఆర్ నివాసానికి వెళ్లి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.కేసీఆర్ నివాసంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసిన పాండురంగ రెడ్డి , పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాతగా, కోట్లాది మంది ప్రజల ఆశాజ్యోతిగా కేసీఆర్ నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా...