📄 ePaper
Thursday, June 4, 2026
ADS
Home Blog Page 64

ఢిల్లీ పేలుడు.. కీలక సూత్రధారి ఈమే..

0

ఢిల్లీ,(స్టేట్ బ్యూరో) నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

ఢిల్లీ పేలుడు.. కీలక సూత్రధారి ఈమే..

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసులో అరెస్టైన మహిళ Dr.షాహీన్ ఫొటో బయటికొచ్చింది. అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. అల్ ఫలాహ్ వర్సిటీలో ప్రొఫెసర్ పనిచేస్తున్న ఆమె ఉగ్రవాద ఆపరేషను నిధులు సమకూర్చడం, ఆపరేషన్ను సులభతరం చేయడంలో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. దేశంలో జైషే మహ్మద్ కోసం మహిళా నియామకాలను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదునపు కలెక్టర్..

0

మెదక్ నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్.

కొనుగోలు లో ఆలస్యం ఉండద్దు.

•70 వేల 100 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు.

•అదనపు కలెక్టర్ నగేష్.

మెదక్ మండలం పాతూరు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నగేష్ మంగళవారం ఆకస్మికం గా సందర్శించారు.ఈ సందర్బంగా కలెక్టర్ కేంద్రం లో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్ లను పరిశీలించి ఎప్పటికప్పుడు వచ్చే ధాన్యం వివరాలను అలాగే కొనుగోలు అయిన వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు.తేమ వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా కొనుగోలు చేసి… ట్యాగ్ చేసిన మిల్లు లకు తరలించాలన్నారు.సరిపడా టార్ఫాలిన్ లను అందుబాటులో పెట్టుకోవాలని.. వాతావరణ ప్రతికూల ప్రభావం వలన .వర్షం వచ్చే సూచనలు తెలిసినప్పుడు కేంద్రం లో ఉన్న ధాన్యం తడవకుండా వెంటనే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లాలో ధాన్యం కొనుగోలు సమర్ధవంతంగా నిర్వహించడం జరుగుతుందని ఇప్పటివరకు 70 వేల 100 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని వివరించారు.ఈ పరిశీలన లో అదనపు కలెక్టర్ వెంట కొనుగోలు కేంద్ర నిర్వాహకులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం,పుస్తకాలు తరలించేందుకు విద్యార్ధులను కూలీలుగా వాడుకున్న ప్రభుత్వ పాఠశాల సిబ్బంది

0

(స్టేట్ బ్యూరో)నగర కర్నూల్ జిల్లా, నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

•నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం,పుస్తకాలు తరలించేందుకు విద్యార్ధులను కూలీలుగా వాడుకున్న ప్రభుత్వ పాఠశాల సిబ్బంది

•పుస్తకాలు తరలించే ఆటో బోల్తా పడి తీవ్రంగా గాయపడిన నలుగురు విద్యార్థులు

నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల సతాపూర్ గ్రామంలో 9వ తరగతి విద్యార్థులతో పాఠ్య పుస్తకాలను తరించిన జెడ్పీహెచ్ఎస్ సిబ్బంది,పుస్తకాలను తరలించే క్రమంలో ఆటో బోల్తాపడడంతో, తీవ్రంగా గాయపడిన అశోక్, కార్తీక్, నాని, శివ అనే నలుగురు విద్యార్థులు,గాయాలపాలైన విద్యార్థులలో శివ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు,ఈ ఘటనపై వివరణ అడగగా తనకు సంబంధం లేదని సమాధానం ఇవ్వడంతో, డీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు..

హైదరాబాద్ లో ఉగ్రవాది అరెస్ట్.. సామూహిక విష ప్రయోగ కుట్ర గుట్టురట్టు..

0

హైదరాబాద్, నవంబర్,11 మెదక్ టుడే న్యూస్:

హైదరాబాద్ లో ఉగ్రవాది అరెస్ట్.. సామూహిక విష ప్రయోగ కుట్ర గుట్టురట్టు.హైదరాబాద్ లో గుజరాత్ ఏటీఎస్ ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసింది. డాక్టర్ మొయినుద్దీన్ అనే ఈ వ్యక్తి, రాజేంద్రనగర్లో పట్టుబడ్డాడు. భారీ మొత్తంలో విష ప్రయోగం చేసి సామూహికంగా ప్రజలను చంపాలని కుట్ర పన్నినట్లు సమాచారం. దేవాలయాలు, వాటర్ ట్యాంకులలో రెసిన్ అనే విషాన్ని కలిపి ఈ దుశ్చర్యకు పాల్పడాలని యోచించినట్లు తెలిసింది. ఇప్పటికే సయ్యద్ మొయినుద్దీన్తో పాటు మరో నలుగురిని గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది.

ఎర్రకోట పేలుళ్ల సూత్రధారులను వదిలిపెట్టం, భూటాన్ నుంచి మోదీ హెచ్చరిక..

0

ఢిల్లీ, (స్టేట్ బ్యూరో) నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

ఎర్రకోట పేలుళ్ల సూత్రధారులను వదిలిపెట్టం: భూటాన్ నుంచి మోదీ హెచ్చరిక

•ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారులో భారీ పేలుడు

•భూటాన్ పర్యటన నుంచే తీవ్రంగా స్పందించిన ప్రధాని

•బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందని భరోసా

ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన కుట్రదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 12 మంది మరణించగా, 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్‌లో ఉన్న ప్రధాని మోదీ… థింపూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “ఈ పేలుళ్ల వెనుక ఉన్న కుట్రను మన దర్యాప్తు సంస్థలు ఛేదిస్తాయి. సూత్రధారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బాధ్యులైన ప్రతి ఒక్కరినీ న్యాయస్థానం ముందు నిలబెడతాం” అని మోదీ స్పష్టం చేశారు.ఢిల్లీ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఎంతో భారమైన హృదయంతో ఇక్కడికి వచ్చానని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. “నిన్న సాయంత్రం జరిగిన ఈ భయానక ఘటన అందరినీ విషాదంలోకి నెట్టింది. బాధిత కుటుంబాల దుఃఖాన్ని నేను అర్థం చేసుకోగలను. ఈ కష్ట సమయంలో యావత్ దేశం వారికి అండగా నిలుస్తుంది” అని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అన్ని ఏజెన్సీలతో తాను రాత్రంతా టచ్‌లోనే ఉన్నానని ప్రధాని వెల్లడించారు.

కొడుకును కాపాడేందుకు వెళ్లిన తల్లిపై కత్తితో దాడి..

0

(స్టేట్ బ్యూరో)మహబూబా బాద్, జిల్లా నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్

కొడుకును కాపాడేందుకు వెళ్లిన తల్లిపై కత్తితో దాడి.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో కొడుకును కత్తితో పొడుస్తున్నాడని అడ్డుకోబోయిన తల్లిని కూడా కత్తితో పొడిచిన ఘటన కలకలం రేపింది. బూరుగండ్ల రవి, పారునంది అర్జున్ ల మధ్య జరిగిన ఘర్షణలో రవి, అర్జున్ ను పొడుస్తుండగా, అడ్డుకోబోయిన అర్జున్ తల్లి సునీతను కూడా రవి కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలైన తల్లి, కొడుకులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత పాతకక్షలే ఈ ఘర్షణకు కారణమని గ్రామస్తులు తెలిపారు.

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జీవితం ఆదర్శనీయమని అదనపు కలెక్టర్‌ నగేష్ అన్నారు..

0

మెదక్, నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జీవితం ఆదర్శనీయమని అదనపు కలెక్టర్‌ నగేష్ అన్నారు.

అబుల్‌ కలాం 137ఆజాద్‌ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో మంగళవారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంబంధిత అధికారులు సిబ్బందితో అదనపు కలెక్టర్ నగేష్ అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆజాద్‌ జయంతి రోజును జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోని విద్యాభివృద్ధికి
బాటలు వేసిన మొదటి దేశ విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు.
జర్నలిజంలో అపార అనుభవంతో ఉర్దూ పత్రికను నెలకొల్ పి న సమాజంలో నెలకొన్న రుగ్మతలను రూపుమాపేందుకు కృషి చేశారని చెప్పారు. కేంద్ర విద్యాశాఖా మంత్రిగా పని చేసి విద్యావ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకవచ్చారని వివరించారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య,ఇన్చార్జి మైనారిటీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, కలెక్టరేట్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

0

లోక్ అదాలత్ – ప్రజలకు త్వరగా న్యాయం అందించడానికి విలువైన అవకాశం.

•లోక్ అదాలత్ – ప్రజలకు త్వరగా న్యాయం అందించడానికి విలువైన అవకాశం.

•స్పెషల్ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి రాజీయే రాజమార్గం.

•జిల్లా ఎస్ పి. డి. వి. శ్రీనివాస రావు ఐపీ ఎస్.

మెదక్, నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

మెదక్ జిల్లా ఎస్ పి శ్రీ డి. వి. శ్రీనివాస రావు, ఐపీఎస్  ఈ నెల 15వ తేదీన జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్ ను కక్షిదారులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఎస్ పి మాట్లాడుతు,
లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన, తక్కువ ఖర్చుతో, ఇరువైపుల సమ్మతితో సమస్యలను పరిష్కరించుకునే అవకాశం అందుబాటులో ఉందని తెలిపారు.రాజీ చేసుకునే అవకాశమున్న వివిధ రకాల కేసులు
క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన కేసులు, వైవాహిక జీవితం & కుటుంబ సమస్యలకు సంబంధించిన కేసులు, డ్రంకన్ డ్రైవ్, మోటారు వాహన చట్ట ఉల్లంఘనలు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం తదితర కేసులు అని వివరించారు.మెదక్ జిల్లా ఎస్ పి ప్రజలకు సూచిస్తూ,చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దని, రాజీ అంటే విజయం వైపు దారితీసే నిజమైన మార్గమాని పేర్కొన్నారు.న్యాయశాఖ అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎస్ పి సూచించారు.అదే విధంగా జిల్లా పోలీసు అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, కోర్టు విధులు నిర్వర్తించే కానిస్టేబుల్‌లు మరియు ఇతర సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.తమ కేసులు లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకోవాలనుకునే వారు సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులను సంప్రదించాలని ఎస్ పి సూచించారు.లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరిత న్యాయం అందుతుందని ఎస్ పి అన్నారు.

నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు..

0

(స్టేట్ బ్యూరో) నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు

ఫిలిం నగర్ రోడ్డు నెంబర్–7లో నివాసం ఉంటున్న శివ ప్రసాద్ అనే వ్యక్తి

కొంతకాలంగా తన ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్ళిన శివ ప్రసాద్

మూడు రోజుల క్రితం ఆ తాళం పగలగొట్టి, ఇంట్లో ఆస్తులు, గోడలు ధ్వంసం చేసి, ఇంటిని ఆక్రమించేందుకు యత్నించిన బెల్లంకొండ సురేష్ మరియు ఆయన అనుచరులు,ఇంటికి వచ్చి ధ్వంసమైన వస్తువులను చూసి విషయం తెలుసుకొని, తన సిబ్బందిని బెల్లంకొండ సురేష్ ఇంటికి పంపిన బాధితుడు శివ ప్రసాద్,

శివ ప్రసాద్ సిబ్బందిపై అసభ్యకరంగా దూషిస్తూ దాడికి యత్నించిన బెల్లంకొండ సురేష్,దీంతో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో బెల్లంకొండ సురేష్‌పై ఫిర్యాదు చేసిన శివ ప్రసాద్.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఢిల్లీ సమీపంలో భారీగా ఆయుధాలు స్వాధీనం.. దర్యాప్తు ముమ్మరం..

0

(స్టేట్ బ్యూరో) నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

ఢిల్లీ సమీపంలో భారీగా ఆయుధాలు స్వాధీనం.. దర్యాప్తు ముమ్మరం

దేశంలో మరోసారి ఉగ్రకుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఢిల్లీ సమీపంలో ఉగ్రవాదులకు సంబంధించిన భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు విచారణలో తీగ లాగగా సంబంధమున్న వ్యక్తుల డొంక కదులుతోంది.

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఉగ్రవాదులకు సంబంధించిన ఆయుధాలు భారీఎత్తున లభ్యమయ్యాయి. హరియాణాలోని ఫరిదాబాద్‌ లో 350 కిలోల అమ్మోనియం నైట్రేట్ సంబంధిత పేలుడు పదార్థాలు(350 Kg of Explosives), ఒక రైఫిల్‌ సహా 20 టైమర్లను స్వాధీనం చేసుకున్నట్టు స్థానిక పోలీస్ కమిషనర్ సతేందర్ కుమార్ గుప్తా వెల్లడించారు. వీటితో పాటు మూడు మ్యాగజైన్లు, పిస్టల్, వాకీటాకీ సెట్‌ను స్వాధీనపరచుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.

ఉగ్రసంస్థ పోస్టర్లు అంటించడంతో వెలుగులోకి..

శ్రీనగర్‌లో అక్టోబర్ 27న జైష్-ఎ-మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా పలు పోస్టర్లు వెలిశాయి. వీటిని కశ్మీర్‌కు చెందిన వైద్యుడు ఆదిల్ అహ్మద్ రాథర్ వేసినట్టు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు పసిగట్టారు. సదరు వ్యక్తి ఉత్తర్‌ ప్రదేశ్‌ సహరాన్‌పుర్‌లోని ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా సేవలందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతణ్ని గతవారం అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. నిందితుడు గతేడాది అక్టోబర్ ముందువరకూ అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో విధులు నిర్వర్తించాడని, అక్కడ అతని లాకర్‌ను తనిఖీ చేయగా ఒక రైఫిల్ దొరికిందని తెలిపారు. అతను ఇచ్చిన సమాచారం ప్రకారమే ఫరిదాబాద్‌లో ఈ రికవరీ జరిగినట్టు వెల్లడించారు.

నిందితుడు రాథర్ చెప్పిన ప్రకారం.. ముజామ్మిల్ షకీల్ అనే మరో డాక్టర్ వద్ద కూడా పేలుడు పదార్థాలు, ఆయుధ సామాగ్రి నిల్వ ఉన్నట్టు తేలింది. దీంతో పుల్వామాకు చెందిన షీకల్‌నూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు ఫరిదాబాద్‌లోని ఆల్-ఫలాహ్ ఆస్పత్రి లో పనిచేస్తున్నాడు.

లేడీ డాక్టర్ కారులో..

ఈ ఘటనకు సంబంధించి ఓ మహిళా వైద్యురాలి కారులో ఒక రైఫిల్, పిస్టల్ బయటపడ్డాయి. ఆమె మందుగుండు సామాగ్రిని నిల్వచేసేందుకు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు.. ఆమెపై విచారణ చేపట్టారు.