📄 ePaper
Thursday, June 4, 2026
ADS
Home Blog Page 65

మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు..

0

(స్టేట్ బ్యూరో) మెదక్ టుడే న్యూస్:

మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్ధం ఆయన పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని 2008, సెప్టెంబరు 11న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
దేశంలోని అన్ని విద్యాసంస్థలు విద్యపై సదస్సులు, వ్యాస రచన, ఉపన్యాస పోటీలు, శిక్షణా శిబిరాలు నిర్వహించబడుతాయి.
అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యత, విద్యారంగంపై ఉన్న నిబద్ధతతో గురించి ర్యాలీలు తీస్తూ, నినాదాలు ఇవ్వబడుతాయి.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ (1888 నవంబరు 11 – 1958 ఫిబ్రవరి 22) (Bengali: আবুল কালাম মুহিয়ুদ্দিন আহমেদ আজাদ, ఉర్దూ: ابو الکلام آزاد ) స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. అతను అసలుపేరు “మొహియుద్దీన్ అహ్మద్”, ‘అబుల్ కలాం’ అనేది బిరుదు, ‘ఆజాద్’ కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు 1888 నవంబరు 11 న మక్కాలో జన్మించాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమర ముఖ్య నాయకులలో ఒకడు. అతను ప్రఖ్యాత పండితుడు, కవి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పెర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావిణ్యుడు.భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ మక్కానగరంలో 1888 నవంబరు 11 న జన్మించాడు. అతని వంశస్థులు బాబర్ రోజుల్లో హేరాత్ (ఆఫ్ఘనిస్తాన్లో ఒక నగరం) కు చెందిన వారు. ఆజాద్ ముస్లిం పండితులు, లేదా మౌలానాల వంశం నుండి వచ్చాడు. అతని తల్లి ఒక అరబ్, షేక్ మహ్మద్ జహీర్ వత్రి, అతని తండ్రి మౌలానా ఖైరుద్దీన్ ఆఫ్ఘన్ మూలాల ఉన్న ఒక బెంగాలీ ముస్లిం. ఖైరుద్దీన్ సిపాయి తిరుగుబాటు సమయంలో భారతదేశం నుండి మక్కా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

1890 లో అయన తన కుటుంబంతో కలకత్తా వెళ్లాడు. ఆజాద్ సంప్రదాయ ఇస్లామిక్ విద్య అభ్యసించాడు. అతని విద్య ఇంట్లోనే సాగింది. మొదట తండ్రి, పిదప ఉపాధ్యాయులు ఇంట్లోనే బోధించారు. ఆజాద్ మొదట *అరబిక్, పెర్షియన్ నేర్చుకున్నాడు. తరువాత *తత్వశాస్త్రం, రేఖాగణితం, గణితం, బీజగణితం అభ్యసించాడు. స్వీయ అధ్యయనం ద్వారా ఇంగ్లీష్, ప్రపంచ చరిత్ర, రాజకీయాలు నేర్చుకున్నాడు.ఆజాద్ మౌలానా అగుటకు కావలసిన మత శిక్షణ పొందాడు.అతను దివ్య ఖురాన్ పై భాష్యం వ్రాసాడు.
అతను జమాలుద్దిన్ ఆఫ్ఘానీ పాన్-ఇస్లామిక్ సిద్ధాంతాలలో, అలిగర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆలోచనలో ఆసక్తి చూపేవాడు. పాన్-ఇస్లామిక్ భావాలతో అతను ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఈజిప్ట్, సిరియా, టర్కీ సందర్శించాడు.ఇరాక్ లో అతను ఇరాన్ రాజ్యాంగ ప్రభుత్వ స్థాపనకు పోరాటం సల్పుతున్న నిర్వాసిత విప్లవ కారులను కలుసుకున్నాడు. ఈజిప్ట్ లో అతను షేక్ ముహమ్మద్ అబ్దుహ్, సయీద్ పాషా వంటి అరబ్ ప్రపంచంలోని ఇతర విప్లవకారులను కలుసుకున్నారు. అతను కాన్స్టాంటినోపుల్లో యంగ్ టర్క్స్ భావాలతో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయాలు అన్ని అతనిని ఒక జాతీయవాద విప్లవవాదిగా రూపాంతరం చెందించాయి.

విదేశాల నుంచి తిరిగొచ్చిన అనంతరం ఆజాద్, బెంగాల్ కు చెందిన అరవింద ఘోష్, శ్రీ శ్యాం సుందర్ చక్రవర్తి వంటి ప్రముఖ విప్లవకారులను కలుసుకున్నారు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమాన్ని చేపట్టారు. విప్లవాత్మక చర్యలు బెంగాల్, బీహార్ లకు పరిమితం అగుట ఆజాద్ కు తెలిసి రెండు సంవత్సరాల లోపల, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉత్తర భారతదేశం, బాంబే లాంటి ప్రాంతాలలో రహస్య విప్లవ కేంద్రాలు ఏర్పాటుచేసారు. ఆసమయంలో విప్లవ వాదులు ముస్లింల విప్లవ వ్యతిరేకులుగా భావించసాగారు ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి వ్యతిరేకంగా ముస్లిం కమ్యూనిటీని ఉపయోగిస్తుందని భావించాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన సహచరులను ముస్లింల పట్ల వారి పగను పోగొట్టటానికి ప్రయత్నించాడు
1912 లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూలో ‘ అల్ హిలాల్’ వార పత్రిక ముస్లింల మధ్య విప్లవాత్మక భావాలను పెంచడానికి ప్రారంభించారు. అల్ హిలాల్ మోర్లే-మింటో సంస్కరణల ఫలితంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన సంఘర్షణల తర్వాత హిందూ మతం-ముస్లిం వర్గాల మద్య ఐక్యత కుదుర్చటంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ‘అల్ హిలాల్’ అతివాద భావనల ఒక విప్లవాత్మక ధ్వనిగా మారింది. ప్రభుత్వం వేర్పాటువాద భావనల ప్రచారకునిగా “అల్- హిలాల్”ను భావిస్తింది. ప్రభుత్వం దానిని 1914 లో నిషేధించింది.

ఆజాద్ భారతీయ జాతీయ వాదం, హిందూ -ముస్లిం ఐక్యత ఆధారంగా విప్లవాత్మక ఆలోచనలతో మరో పత్రికను “అల్ బలఘ్” ప్రారంభించారు.1916 లో ప్రభుత్వం ఈ పత్రికను కూడా నిషేధించారు, రాంచిలో ఆజాద్ ను నిర్భందించారు. ఆతరువాత మొదటి ప్రపంచ యుద్ధం 1920 తర్వాత విడుదల చేసారు. విడుదల తరువాత ఆజాద్ ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ముస్లిం కమ్యూనిటీలో బ్రిటిష్ వ్యతిరేక భావాలు పెంచారు. ఖలీఫా ఉద్యమం ప్రధాన లక్ష్యం ఖలీఫాను తిరిగి టర్కీ రాజుగా ప్రకటించడం.
గాంధీజీ ఇతడిని భారత ప్లాటో అని, గాంధీ, నెహ్రూ ఇతడిని మౌలానా, మీర్-ఎ-కారవాన్‌ అని పిలిచేవాడు.
భారత ప్రభుత్వం మరణానంతరం (1888-1958) 1992లో అతనికి భారతరత్న ఇచ్చి గౌరవించింది.[1]
ఇతడి జన్మదినం నవంబరు 11ను జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకుంటారు.
మౌలానా ఆజాద్ గాంధీజీ *ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1930లో అరెస్టు అయ్యాడు. అతనిని ఒక సంవత్సరంన్నర పాటు మీరట్ జైల్లో ఉంచారు. ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ గాంధీజీ ప్రారంభించిన “సహాయ నిరాకరణ” ఉద్యమం ను సమర్ధించి 1920 లో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరాడు.ఇతడు ఢిల్లీ కాంగ్రెస్ ప్రత్యేక సెషన్ అధ్యక్షుడు గా (1923) ఎన్నికయ్యాడు.మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1940 (రాంగడ్) లో కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు , 1946 వరకు ఆ పదవిలో ఉన్నాడు.అతను విభజనకు వ్యతిరేకి. విభజన అతని కలలను నాశనం చేసింది. హిందువులు , ముస్లింలు కలసి సహజీవనం చేస్తున్న ఒక ఏకీకృత దేశం బద్దలు అగుట అతని కలను నాశనం చేసి అతనిని విపరీతంగా బాధించింది.

ప్రజావాణి కార్యక్రమంలో 11 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్ పి . శ్రీనివాసరావు..

0

ప్రజావాణి కార్యక్రమంలో 11 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ . శ్రీనివాసరావు,

మెదక్ నవంబర్ 10 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం రోజు ప్రజావాణి కార్యక్రమంలో బాగంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు.జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎస్పీ గారికి తెలియజేశారు. మొత్తం 11 ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించి, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. కొన్నింటిపై వెంటనే స్పందిస్తూ, సంబంధిత పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్ఐలతో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,
ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలి. చట్టబద్ధ మార్గంలోనే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది. ప్రజల భద్రత, శాంతి కాపాడటం మరియు వారితో మరింత దగ్గరగా ఉండటం ప్రధాన లక్ష్యం అని అన్నారు.అలాగే ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారుల సహకారంతో వేగవంతంగా పరిష్కరిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశించారు.

0

•సమస్య పరిష్కరించాలని
ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశించారు.

మెదక్ నవంబర్ 10 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి

సోమవారం ఐడిఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు పరిష్కార నిమిత్తం పంపించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో 75 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అందులో భూ భారతి 34,పెన్షన్14 ,ఇందిరమ్మ ఇండ్లు 5,ఇతర 26 దరఖాస్తులు వచ్చాయన్నారు.
సమస్యలను విని వెంటనే పరిష్కారం చూపించడం లక్ష్యంగా ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.ప్రజావాణికి వచ్చిన 75 మంది దరఖాస్తుదారులతో కలెక్టర్, మీ సమస్య చెప్పండని అడిగి తెలుసుకుని దరఖాస్తు పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు ఎండార్స్మెంట్ చేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులను సమయానికి పరిష్కరించడం అన్ని శాఖల బాధ్యత అని ఆయన తెలిపారు. ప్రతి ఫిర్యాదును జాగ్రత్తగా నమోదు చేసి, పరిష్కారం వరకు అధికారులు పర్యవేక్షించాలని,
అవసరమైతే ఫీల్డ్ పరిశీలనలు కూడా చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాసరావు, డిఆర్ఓ భుజంగరావు,అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలికార్తీక సోమవారం పురస్కరించుకొని శివాలయంలో లక్ష బిల్వార్చన నిర్వహించిన ఎమ్మెల్యే..

0

ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలి
కార్తీక సోమవారం పురస్కరించుకొని శివాలయంలో లక్ష బిల్వార్చన నిర్వహించిన ఎమ్మెల్యే

పటాన్చెరు నవంబర్ 10
(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి

ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. కార్తీక మాసం పురస్కరించుకొని సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జెపి కాలనీ శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో ఏర్పాటు చేసిన లక్ష బిల్వార్చన కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. శివయ్య కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు సూర్య ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్..

0

నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్

చేగుంట నవంబర్ 10 మెదక్ టుడే న్యూస్:

చేగుంట మండలం బి కొండాపూర్ గ్రామానికి చెందిన పాలిటి రాజు తల్లి లక్ష్మి మరణించిన విషయం తెలుసుకున్న సండ్రుగు శ్రీకాంత్ దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్ధిక సహాయం మరియు 50 కేజీ ల బియ్యం అందజేశారు.ఈ కార్యక్రమంలో కొండాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు వడియారం ప్రభాకర్, పెద్దపోత చంద్రం,గోరిమిండ్ల శ్రీనివాస్,కత్తుల నరసింహులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సీడ్ కంపెనీ వారిని నమ్మినందుకు కన్నీళ్లు మిగిలాయి అంటున్న రుక్మాపూర్ రైతులు..

0

సీడ్ కంపెనీ వారిని నమ్మినందుకు కన్నీళ్లు మిగిలాయి అంటున్న రుక్మాపూర్ రైతులు

చేగుంట నవంబర్ 10 మెదక్ టుడే న్యూస్:

చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో
ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడి వస్తుందని రైతులకు సీడ్ కంపెనీ వారు ప్రయోగాత్మకంగా వరి విత్తన రకం 45,47( మగరకం విత్తనం) కంపెనీవారు రైతులకు చెప్పడంతో సుమారు 40 మంది రైతులు దాదాపు 100 ఎకరాల్లో విత్తనం వేశారు దిగుబడి రాకపోవడంతో చేతికి వచ్చే సమయంలో పంట ఎండిపోవడం గొలలు రాకపోవడం వల్ల నిండా మునిగారు, ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడి వస్తుందని సీడ్ కంపెనీ వారిని నమ్మినందుకు కన్నీళ్లు మిగిలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు, ప్రయోగాత్మకంగా దొడ్డు రకం విత్తనమని కంపెనీ వారు చెప్పి ఇచ్చారని రైతులు తెలిపారు పంట కోతకు వచ్చే సమయంలో వారికి కొన్ని పొలాల్లో ఒకటి రెండు పిలకలు మాత్రమే వచ్చాయని మరికొంతమంది రైతుల పొలాల్లో మాత్రం మొత్తం పంట ఎండిపోయిందని రైతులకు తెలిపారు లాభం రావడం దేవుడేరుగు కానీ కనీసం పెట్టిన పెట్టుబడి దిగబడి కూడా రాకపోవడంతో రైతులు కన్నీరు పెట్టారు, ఎవరికి చెప్పాలో ఏం చేయాలో అర్థం కాక రైతులు వ్యవసాయ అధికారులకు చూపిన విత్తనాల ప్రాబ్లమ్ అని తెలిపారు. ఒక్కో రైతు ఎకరాకు సుమారు 25 వేల నుండి 30 వేల వరకు ఖర్చు చేశారు ఈ నకిలీ విత్తనాల పట్ల రుక్మాపూర్ గ్రామంలో 40 మంది రైతులకు సుమారు 20 లక్షల వరకు నష్టం కలిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు, విత్తనాలు ఇచ్చిన సీడ్ కంపెనీ సూపర్వైజర్ ఫోన్ లేపడం లేదని కనీసం మళ్ళీ గ్రామానికి కూడా రావడం లేదని ఈ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోయామని అధికారులకు పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు పిలుకలు తక్కువగా వస్తున్నాయని సూపర్వైజర్ కు ఫోన్ చేస్తే అతను చెప్పిన మందు కొనుగోలు చేసి పొలానికి పిచికారి చేసామని దీంతో పంట పూర్తిగా మాడిపోయిందని గ్రామానికి చెందిన మేకల శ్రీనివాస్, గణేష్, లక్ష్మీ, రామచంద్రం, మోహన్, అనే రైతులు లబోదిబోమన్నారు సదరు విత్తన కంపెనీ పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రైతుల కోరుతున్నారు.

ఆర్మీ ,సహాయ సహకారాలకు ఆర్ధిక సహాయం చేద్దాంజిల్లా అదనపు కలెక్టర్ నగేష్..

0

ఆర్మీ ,సహాయ సహకారాలకు ఆర్ధిక సహాయం చేద్దాం
జిల్లా అదనపు కలెక్టర్ నగేష్

మెదక్ నవంబర్ 10 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి.

ఆర్మీ , సహాయ సహకారాలు ఆర్ధికంగా సహకరిద్దామని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.
స్థానిక కలెక్టర్ కార్యాలయంలో భారత స్కౌట్ అండ్ గైడ్స్ వారి వారోత్సవాల్లో భాగంగా భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ స్టిక్కర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ఈ ఆవిష్కరించిన స్టిక్కర్స్ ను పాఠశాల స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులకు విక్రయించగా వచ్చే డబ్బులను ఆర్మీ, సహాయ సహకారాలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు .భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ లో శికష్ణ పొందిన వారు పాఠశాల,,ప్రభుత్వ ,ప్రైవేట్ సంస్థలో విక్రఇస్తారన్నారు.ఈ కార్యక్రమంలో డి ఈ ఓ రాధకిషన్, భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి ఇప్ప రాజేందర్,నాగరాజు,జ్యోష్ణ, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణా ఉద్యమ పిడికిలి అందేశ్రీమెతుకు సీమతో అందేశ్రీకి విడదీయరాని అనుబంధంమెదక్ లో ఘన నివాళి..

0

తెలంగాణా ఉద్యమ పిడికిలి అందేశ్రీ
మెతుకు సీమతో అందేశ్రీకి విడదీయరాని అనుబంధం
మెదక్ లో ఘన నివాళి*

మెదక్ నవంబర్ 10 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి

మెదక్: తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి బిగిసిన పిడికిలి అందేశ్రీ అని టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి.కొండల్ రెడ్డి, తెలంగాణ ఎన్ జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు దొంతి నరేందర్, సీనియర్ కాంగ్రెస్ నేత మధుసూదన్ రావు కొనియాడారు. సోమవారం మెదక్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద అందేశ్రీ చిత్రపటానికి పూల మాల వేసి ప్రజా సంఘాలు నివాళులర్పించాయి. ఈ సందర్భంగా సాహితీ రంగంతోపాటు తెలంగాణ ఉద్యమ నినాదాన్ని బిగిసిన పిడికిలిలా మార్చిన ఘనత అందేశ్రీకి దక్కుతుందని వక్తలు కీర్తించారు. అందేశ్రీకి మెతుకు సీమతో విడదీయరాని అనుబంధం ఉందని వక్తలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు నాగరాజు, శంకర్, మానవ హక్కుల వేదిక నేత షేక్ అహ్మద్, డీబీఎఫ్ నేతలు రామస్వామి, దయాసాగర్, నాయకులు మనోహర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా ఆరా..

0

ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా ఆరా

•నగర పోలీస్ కమిషనర్‌తో మాట్లాడిన అమిత్ షా

•ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న కేంద్ర మంత్రి

•ఇప్పుడేం చెప్పినా తొందరపాటు అవుతుందన్న సీఆర్పీఎఫ్ డీఐజీ

(స్టేట్ బ్యూరో) మెదక్ టుడే న్యూస్:

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. అమిత్ షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్‌తో మాట్లాడారని అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌తో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని వెల్లడించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడి పేలుడు ఘటనపై ఆరా తీశారు.ఇదిలా ఉండగా, పేలుడు సంభవించిన చోటుకు ఎన్ఎస్‌జీ, ఎన్ఐఏ చేరుకున్నాయి. ఢిల్లీ పోలీసు ప్రత్యేక సెల్, డీఐజీ సీఆర్పీఎఫ్ కూడా సంఘటన స్థలానికి వచ్చాయి. ఈ ప్రమాదంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, ఏం చెప్పినా తొందరపాటు అవుతుందని సీఆర్పీఎఫ్ డీఐజీ కిశోర్ ప్రసాద్ అన్నారు.పేలుడు తర్వాత, రోడ్డుపై శరీర భాగాలు కనిపించాయని ఒక ప్రత్యక్ష సాక్షి వివరించాడు. అక్కడి పరిస్థితిని చూసి ప్రజలు షాక్ అయ్యారని అన్నాడు. “రోడ్డుపై ఒకరి చేయి రక్తపు మడుగులో కనిపించడం చూసి మేం షాకయ్యాం. మాటల్లో వివరించలేని విధంగా ఉంది” అని అతను తెలిపాడు. పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని లోక్ నాయక్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

అందెశ్రీ మరణం పట్ల కేసీఆర్ సంతాపం.వారి అకాల మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్..

0

(స్టేట్ బ్యూరో) మెదక్ టుడే న్యూస్:

అందెశ్రీ మరణం పట్ల కేసీఆర్ సంతాపం…వారి అకాల మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్. ప్రముఖ కవి‘జయ జయ హే తెలంగాణ ఉద్యమ గీత రచయిత డా. అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.వారి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని కేసీఆర్ అన్నారు.ఉద్యమ కాలంలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.అందెశ్రీ మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.దివంగత అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.