📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 62

కార్తీక మాసంలో ద్వార లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి..

0

(స్టేట్ బ్యూరో) హైదరాబాద్ నవంబర్ 13 మెదక్ టుడే న్యూస్:

కార్తీక మాసంలో ద్వార లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి ?

•ఇంటి గడపకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు చాలా మందికి తెలిసినదే కానీ..

•ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్య మైనవి రెండు ఒకటి ఇలవేలుపుని కొలుచుకోవడం రెండు ఇంటి ప్రధాన గుమ్మం “గడప”కు పూజ చేయడం.

•ఇంటి గడపను సింహ ద్వారమని లక్ష్మీ ద్వారమని, ద్వారలక్ష్మి అని అంటారు. ఈ గడపకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు చాలా మందికి తెలిసినదే ఎందుకు చేయాలో తెలియక పోయినా పెద్దవారి నుండి సంప్రదాయంగా ఆచరిస్తున్నారు.

•గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతో షాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని కోరుకోవడం.

ఇప్పుడు ఈ గడప పూజతో కొన్ని సమస్యలకు పరిష్కారం తెలుసుకుందాం:

•పెళ్లి కాని అమ్మాయిలు ఎన్ని సంబంధాలు చూసిన కుదరక జాతకాల విషయంలో అంత రాయాలు ఏర్పడే వాటికి కట్న, కానుకల విషయంలోను ఏదో ఒక ఆటంకంతో ఆలస్యం అవుతున్న అమ్మాయిలు 16 రోజులు ఇంటి ప్రధాన గడపకు పూజ చేయాలి.

పూజ విధానం:

  1. ఉదయం 3 గంటలకు ఈ పూజ చేయాలి 16 రోజులు పాటు ఆటంకం లేకుండా అదే సమయంలో చేయాలి.
  2. మొదట గడపను నీటితో మూడు సార్లు కడగాలి. తర్వాత పాలుపోసి కడగాలి అంటే అభిషేకం చేసిన విధంగా కొద్దీ పాలతో పోసి చేతితో గడపను పాలతో తుడవాలి. తర్వాత చివరిగా ఇంకోసారి నీటితో గడపను శుభ్రం చేయాలి.
  3. గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టి అలంకరించాలి.
  4. చిన్న పళ్లెంలో మూడు ఒత్తులు ఒకే దీపంలో పెట్టి ఆవునైయి కానీ నూనె కానీ పోసి వెలిగించాలి.
  5. ఇంకో పళ్లెంలో బెల్లం అటుకులు, తాంబూలం పెట్టి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకునే మంచి పెళ్లి సంబంధం కుదరాలి ఆ ఇంట్లో శుభకార్యం జరగాలి అని సంకల్పం చెప్పుకుని వెంకటేశ్వరస్వామి అష్టోత్తరం లక్ష్మి అష్టోత్తరం చదువుకుని హారతి ఇవ్వాలి.
  6. గడప దగ్గర పెట్టిన దీపానికి నమస్కరించి కొండ ఎక్కే వరకు ఉంచి తర్వాత తీసేయాలి.
  7. పూజ అయిన వెంటనే వెళ్లి నిద్రపోకూడదు, ఒక అరగంట అయినా ఆగి తర్వాత నిద్రపోయిన పర్వాలేదు.
  8. ఆ పదహారు రోజులు పూజ గదిలో దీపం వెలిగించిన చాలా శుభం.

పెళ్లి కాని అబ్బాయిలు కూడా ఇదే విధంగా ఉదయం 3 గంటలకు పూజ చేసి ఆ ఇంట మంచి అమ్మాయి భార్యగా రావాలి అని కోరుకోవాలి. లేదా ఆ పిల్లవాడి తల్లి కొడుకుకు సంబందించిన వస్త్రం ఏదైనా భుజాన వేసుకుని ఆ ఇంట కోడలు అడుగు పెట్టాలి అని కోరుకుని పదహారు రోజులు ఈ గడప పూజ చేయవచ్చును.

ఇంట్లో సమస్య ఇంటిపైన అప్పు కానీ ఇంటి పత్రాలు తాకట్టులో ఉండి ఏదైనా కోర్టు గొడవ ఇంటి పైన ఉన్నను ఆ ఇంటి యజమాని కానీ భార్య భర్తలు ఇద్దరు కలసి కానీ భర్త ఆరోగ్యం సహకరించని స్థితిలో భార్య అతని వస్త్రం భుజాన వేసుకుని ఇంటి సమస్య తీరాలి అని వేడుకుని పైన చెప్పిన విధంగా గడపకు పూజ చేసి లక్ష్మి నారాయణ అష్టోత్తరం, మణి ద్వీపవర్ణన చదువుకుని హారతి ఇవ్వాలి. ఆ ఇంటిలో ఉన్న సమస్య తీరిపోతాయి. ఈ విధంగా గడపకు పూజలు చేసి ఎన్నో సమస్యలు పరిష్కరించే వారు మన పూర్వీకులు.

30 రోజుల్లో 8 ఉగ్ర కుట్రల భగ్నం.. భద్రతా సంస్థలు విపత్తులను ఎలా నివారించాయో చూడండి…

0

(స్టేట్ బ్యూరో) ఢిల్లీ నవంబర్ 13 మెదక్ టుడే న్యూస్:

30 రోజుల్లో 8 ఉగ్ర కుట్రల భగ్నం.. భద్రతా సంస్థలు విపత్తులను ఎలా నివారించాయో చూడండి…ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు తీవ్ర విషాదాన్నే నింపింది. ఇప్పటి వరకు మొత్తం 11 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. దీంతో అప్పటికే భద్రతా బలగాలు, ఎన్ఐఏ, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ లాంటివి అప్రమత్తమై, అక్కడికి చేరుకున్నాయి. దర్యాప్తును కూడా ప్రారంభించాయి. ఈ పేలుళ్ల వెనుక ఇస్లామిక్ ఉగ్రవాది సానుభూతిపరుడు, ఫరీదాబాద్ ఉగ్ర కుట్రతో సంబంధాలున్న డాక్టర్ ఉమర్ మహ్మద్ కీలక పాత్ర పోషించాడని కూడా వెను వెంటనే ఓ నిర్ధారణకు కూడా వచ్చేశారు. అంతేకాకుండా ఈ పేలుడులో డిటోనేటర్లు, అమ్మోనియం నైట్రేట్ వంటి పలు ఇంధనాలను కూడా వాడినట్లు తేల్చేశారు. భారత భద్రతా బలగాలు వెనువెంటనే అప్రమత్తమై, దర్యాప్తును వేగిరం చేశాయి.

అయితే… గత 30 రోజుల్లో 8 సార్లు ఇస్లామిక్ ఉగ్రవాదుల వ్యూహాలన్నింటినీ భారత భద్రతా బలగాలు, నిఘా సంస్థలు తుత్తునీయలు చేశాయి. వారు రచించిన ప్రతి వ్యూహాన్ని కూడా మొగ్గలోనే తుంచేసి, భారత ప్రజలను సురక్షితంగా వుంచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. గత 30 రోజుల్లో 8 సార్లు భారత భద్రతా బలగాలు ప్రజలను అనేక ఉపద్రవాల నుంచి కాపాడిన వివరాలిలా వున్నాయి…

  1. ఢిల్లీ -ఎన్సీఆర్ పరిధిలో 2900 కిలోల పేలుడు పదార్థాలను, 5 కిలోల భారీ పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇస్లామిక్ ఉగ్రవాదుల మాడ్యుల్ దురాగతం బయటపడింది.
  2. ఇక.. ఈ నెల తొమ్మిదో తేదీన (9) గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ముగ్గురు ISIS ఇస్లామిక్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరు భారత్ లో పేలుళ్లకు రచన చేశారు. వీరి వ్యూహాన్ని కూడా భద్రతా బలగాలు ముందుకు సాగనీయలేదు.
  3. ఇదే నెల ఏడో తేదీన (7) నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)తో సంబంధాలున్న ఒసామా ఉమర్‌ అనే మౌల్వీని రాజస్థాన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు మరో ముగ్గుర్ని కూడా అరెస్ట్ చేసింది. వీరంతా ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థకు చెందిన అగ్ర కమాండర్లతో సంబంధాలు నెరుపుతున్నారు.
  4. గత నెల అక్టోబర్ 28 వ తేదీన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధాలున్న ఓ ఐటీ ఉద్యోగిని మహారాష్ట్ర ఏటీఎస్ పూణెలో అరెస్ట్ చేసింది. అంతేకాకుండా అతనిపై UAPA కింద కేసులు కూడా నమోదు చేసింది.
  5. గత నెల అక్టోబర్ 24 న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాద మాడ్యూల్‌ను ఛేదించింది. దేశ రాజధానిలో ఆత్మాహుతి దాడికి ప్రణాళికలు వేస్తున్న ఇద్దర్ని అరెస్ట్ చేసింది.ఢిల్లీ మరియు మధ్యప్రదేశ్‌లలో సమన్వయంతో దాడులు చేసిన తర్వాత ఈ అరెస్టులు జరిగాయి. అనుమానితులలో ఒకరిని దక్షిణ ఢిల్లీ నుండి అరెస్టు చేయగా, రెండవ వ్యక్తిని మధ్యప్రదేశ్‌లో అరెస్టు చేశారు.
  6. అదే నెల 17 వ తేదీన ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలున్న ఇద్దర్ని అరెస్ట్ చేసింది. వీరిలో ఒకరిది యూపీ కాగా, మరొకరిది మహారాష్ట్ర.

7.అదే నెల 15 న పాకిస్తాన్‌తో సంబంధాలున్న సరిహద్దు వ్యవస్థీకృత ఆయుధాలు మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణా మాడ్యూల్‌ను పంజాబ్ పోలీసులు ఛేదించారు, అమృత్‌సర్‌లో ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు.నిందితుల నుంచి 10 అధునాతన పిస్టళ్లు, 500 గ్రాముల నల్లమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  1. అదే పంజాబ్ పోలీసులు బబ్బర్ ఖల్సా అంతర్జాతీయ టెర్రర్ మాడ్యుల్ ను ఛేదించారు. పేలుళ్లకు ప్రణాళిక వేసిన జలంధర్ కి చెందిన ఇద్దర్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి రిమోట్ కంట్రోల్‌తో పాటు RDX అమర్చిన ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇకపై పోలీసులు ఎవర్ని అరెస్టు చేసిన,లికిత పూర్వకంగా కారణం తెలపాల్సిందే..! సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

0

(స్టేట్ బ్యూరో) నవంబర్ 13 మెదక్ టుడే న్యూస్:

ఇకపై పోలీసులు ఎవర్ని అరెస్టు చేసిన….. లికిత పూర్వకంగా కారణం తెలపాల్సిందే..! సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

అరెస్టు అయిన నిందితుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించే దిశగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం.. ఎలాంటి నేరం కింద అరెస్టు చేసినా సరే, ఎలాంటి మినహాయింపులు లేకుండా అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా, నిందితుడికి అర్థమయ్యే భాషలోనే తెలియజేయాలని స్పష్టం చేసింది.రాజ్యాంగంలోని అధికరణం 22(1) ప్రకారం.. అరెస్టు చేసిన వ్యక్తికి అరెస్టు కారణాలు సాధ్యమైనంత త్వరగా తెలియజేయాలనే అంశాన్ని ఈ తీర్పు బలంగా సమర్థించింది.జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ 52 పేజీల తీర్పులో.. “ఇది ఏదో లాంఛనప్రాయంగా పాటించాల్సిన విధానం కాదు. ఇది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక రక్షణ” అని స్పష్టం చేశారు. ముఖ్యంగా తనను ఎందుకు అరెస్టు చేశారో, తనపై మోపిన నేరారోపణల స్వభావం ఏమిటో నిందితుడికి తెలియాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది.ఈ జ్ఞానం మాత్రమే నిందితుడు న్యాయ సహాయం కోసం ప్రయత్నించడానికి, తనపై వచ్చిన ఆరోపణలకు తగిన విధంగా ప్రతిస్పందించడానికి వీలు కల్పిస్తుంది.•రిమాండ్‌కు 2 గంటల ముందు గడువు,సాధారణంగా అరెస్టు సమయంలోనే లిఖితపూర్వక కారణాలు ఇవ్వడం తప్పనిసరి. అయితే ప్రత్యేక పరిస్థితుల కారణంగా అరెస్టు సమయంలో కారణాలు తెలియజేయడం సాధ్యం కాకపోతే.. వాటిని రిమాండ్‌ కోసం న్యాయమూర్తి ఎదుట నిందితుడిని హాజరు పరచడానికి కనీసం రెండు గంటల ముందుగానైనా లిఖిత పూర్వకంగా అందజేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.ఈ గడువును పాటించడంలో విఫలం అయితే.. ఆ అరెస్టును, నిందితుడి రిమాండ్‌ను చట్టవిరుద్ధ చర్యగా పరిగణించే అవకాశం ఉంటుందని పేర్కొంది.ఈ తీర్పు ముంబయిలో 2024లో జరిగిన బీఎండబ్ల్యూ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నిందితుడు మిహిర్‌ రాజేశ్‌ షా దాఖలు చేసిన అప్పీలుపై వెలువడింది. తన అరెస్టుకు గల కారణాలను రాతపూర్వకంగా ఇవ్వలేదనే కారణంపై షా తన అరెస్టు చట్టబద్ధతను సవాలు చేశారు.సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ చారిత్రక తీర్పు అమలు కోసం, దీని ప్రతులను అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరళ్లకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

బాల్య వివాహాలు చట్ట నిత్య నేరంఎస్సై చైతన్యకుమార్ రెడ్డి..

0

బాల్య వివాహాలు చట్ట నిత్య నేరం
ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి,

బాలికలను రక్షిద్దాం బాల్య వివాహాలను అరికడదాం

సి డి పి ఓ స్వరూప రాణి

చేగుంట నవంబర్ 12 మెదక్ టుడే న్యూస్

బాల్య వివాహాల నిర్మూలనకై అవగాహన సదస్సు రామయంపేట సిడిపిఓ స్వరూప రాణి ఆధ్వర్యంలో బుధవారం నాడు చేగుంట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు, సీ డి పి ఓ స్వరూప రాణి మరియు ఎమ్మార్వో శివప్రసాద్, ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి మాట్లాడుతూ, బాల్య వివాహాలు నేరం అని భారత శిక్షస్మృతి (ఐపిసి) 1860 లోని 375వ సెక్షన్ లో పేర్కొనబడింది బాల్య వివాహాలను నిరోధించడానికి మరియు బాల్య వివాహాలకు సంబంధించిన నేరాలను శిక్షించడానికి ఈ చట్టం రూపొందించబడింది,
బాల్య వివాహం అంటే ఏమిటి,
బాల్య వివాహం అంటే 21 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాలుడు మరియు 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాలిక యొక్క వివాహం,
బాల్య వివాహాలు చట్ట విరుద్ధం ఇది ఒక నేరం,
బాల్య వివాహాలకు సంబంధించిన నేరాలు, బాల్య వివాహం జరిపించడం, బాల్య వివాహనికి సహకరించడం, బాల్య వివాహాలకు సంబంధించిన శిక్షలు బాల్య వివాహాలు జరిపినట్లయితే 2 సంవత్సరాలు జైలు శిక్ష 100,000 రూపాయలు జరిమానా, బాల్య వివాహాలు చట్ట నిత్య నేరం బాల్యనీ రక్షించండి విద్యను ప్రోత్సహించండి బాలికలను శక్తివంతం చేయండి అని వారు పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో సిడిపిఓ. స్వరూప రాణి, ఎమ్మార్వో శివ ప్రసాద్, ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి, ఎంపీడీవో చెన్నారెడ్డి, సూపర్వైజర్, షైనీ సువర్ణ, వివిధ గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, వివిధ గ్రామాల ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడి ఆయలు, ఆశ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.

చేగుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని పుట్టినరోజు వేడుకలు..

0

•చేగుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని పుట్టినరోజు వేడుకలు

చేగుంట నవంబర్ 12 మెదక్ టుడేమెదక్ టుడే న్యూస్ న్యూస్

చేగుంట పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, పుట్టినరోజు సందర్భంగా చేగుంట మండల కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి వడ్ల నవీన్ కుమార్ ని మర్యాదపూర్వకంగా శాలువతో సత్కరించి, కేక్ కట్ చేయించడం జరిగింది, అనంతరం వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని వారు కాంగ్రెస్ పార్టీలో నిత్యం చురుకుగా పనిచేయాలని దినదినం ఉన్నంత స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరారు,ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు, మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరీ శ్రీనివాస్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్,దుబ్బాక నియోజవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బొల్ల ప్రశాంత్, కన్యారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు విఠల్ నాయక్,జెల్సింగ్ నాయక్,మండల యూత్ కాంగ్రెస్ ఎస్ ఎం కోఆర్డినేటర్ నవీన్ నాయక్,రాజేందర్ నాయక్,హరిచంద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

కిక్ ఇస్తున్న బెల్ట్ షాపులు..

0

మెదక్, నవంబర్ 12 మెదక్ టుడే న్యూస్:

కిక్ ఇస్తున్న బెల్ట్ షాపులు

ముడుపుల మత్తులో కన్నెత్తి చూడని ఆబ్కారి అధికారులు

మద్యం ఏరులై పారుతున్న గ్రామాలు పట్టణాలు చోద్యం చూస్తున్న అధికారులు

మత్తు పదార్థాలకు బానిస అవుతున్న నేటి తరం యువత

బెల్ట్ షాపులపై నాజర్ వెయ్యని అధికారులు రాజకీయ నాయకులు

పట్టణాల్లో పల్లెల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతుంది

పుట్టగొడుగుల వెలుస్తున్న బెల్ట్ షాపులు

ప్రతి కిరాణా కొట్టు ప్రత్యామ్నాయ బెల్టు షాపే

ఎనీ టైం కిక్ ఇస్తున్న బెల్ట్ షాపులు

బెల్ట్ షాపులపై జిల్లా కలెక్టర్ అబ్కారి అధికారులు ప్రత్యేకంగా నిఘ ఏర్పాటు చేయాలని ప్రజల ఆవేదన

వైన్ షాపులను తలదన్నేలా బెల్ట్ షాప్ ల అడ్డగోలు దందాలు

ఎమ్మార్పీకి మించిన ధరలు

బెల్ట్ షాపులది అదనపు భారం

మెదక్, నవంబర్, 12, మెదక్ టుడే న్యూస్: ప్రతినిధి.

పల్లెలో పట్టణాల్లో రాత్రింబవళ్లు కిక్కు ఎక్కిస్తున్న బెల్ట్ షాప్ లు పల్లెల్లో బెల్ట్ షాప్ ల దందా జోరుగా సాగుతుంది తాగేందుకు గుక్కెడు నీరు లేని మారుమూరు ప్రాంతాల్లో మందు ఏరులై పారుతుంది ముడుపుల మత్తులో కన్నెత్తి చూడని ఎక్సైజ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా గ్రామాల్లో పట్టణాల్లో పుట్టగొడుగుల పెరుగుతున్న బెల్టు షాపులు పల్లెలు పట్టణాలు గల్లిగల్లి లో మత్తులో జరుగుతున్నాయి నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు అనేకమంది బెల్ట్ షాపులు మద్యం కొనుగోలు చేసి జేబులో చేసుకుంటున్నారు అప్పులు చేసి తాగడంతో కుటుంబాలు వీధుల పాలవుతున్నాయి మద్యం ఏరులై పారుతున్న గ్రామాలు పట్టణాలు
గ్రామాలు పట్టణాలు మన తేడా లేకుండా పుట్టగొడుగుల బెల్ట్ షాపులు పెరగడంతో మద్యం ఏరులై పారుతున్న పట్టించుకోని ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకుల నిర్లక్ష్య వైఖరికి ఇది కూడా కారణమే వైన్ షాపులో సమయ వేళలు పాటించడం వల్ల కొంత కట్టడికి దారి ఉంటుంది కానీ బెల్ట్ షాపులు 24 గంటలు ప్రజాసేవలో ఉండటం వలన మందుబాబులకు కిక్కు కరువు లేకపోలేదు పల్లె ప్రాంతాల్లో బెల్ట్ షాపుల పోటీ తత్వం రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతుంది బెల్ట్ షాపులపై నాజర్ వెయ్యని అధికారులు రాజకీయ నేతలు
గ్రామాల్లో పట్టణాల్లో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల పుట్టుక రావడంతో యువత మత్తుకు బానిసవుతున్నారు వైన్ షాపుల యాజమాన్యం కూడా బెల్టు షాపులకు జోరుగా నడిపించేందుకు అండదండగా ఉంటున్నారు మండలానికి రెండు వైన్ షాపులు ఉన్నట్టయితే మండలం మొత్తం మీద గ్రామాల్లో కలిపి 200కు పైగా బెల్ట్ షాపులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి బెల్ట్ షాప్ లపై ఎక్సైజ్ అధికారులు కొరడా జులిపించాల్సిన అవసరం ఉంది సుమారుగా ఒక్కొక్క గ్రామానికి మూడో నుంచి 4 బెల్ట్ షాపులు దర్జాగా దందాలు చేసుకుంటున్నారు స్థానిక నాయకులు కూడా చర్యలు తీసుకోకుండా అధికార దాహంతో యువత భవిష్యత్తు గురించి ఆలోచించకుండా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న మరికొందరు నాయకులు మద్యపానం నిషేధం అని చెప్పాల్సిన నాయకులే మద్యానికి యువతను బానిసను చేస్తున్నారు ప్రతి కిరాణా దుకాణం ప్రత్యామ్నాయ బెల్ట్ షాపే పల్లెల్లో సుమారుగా అన్ని కిరణం దుకాణాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువయ్యాయి మరికొన్ని కిరాణా దుకాణాల్లో నామమాత్రంగా కిరాణా వ్యాపారం చేస్తూనే అక్రమంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయి లాభాల గాడిలో ఉండాలన్న లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తున్న బెల్ట్ షాపులు మందుబాబులు కూడా నియంత్రణ నివారణ మార్గమని ఆత్మ విమర్శ చేసుకున్నప్పుడే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోగలుగుతారు
ఎనీ టైం కిక్ ఇస్తున్న బెల్ట్ షాపులు రాత్రింబవళ్లు తేడా లేకుండా కిక్కు ఇస్తున్న బెల్ట్ షాపులు వైన్ షాపులను తలదన్నేలా బెల్ట్ షాపులు అడ్డగోలుగా అక్రమంగా మాద్యం విక్రయిస్తూ మందు బాబుల నుండి నిలువు దోపిడి నిర్భయంగా జరుగుతుంది ఆంక్షలు విధించేవారు అడ్డు చెప్పేవారు కరువు వైన్ షాపుల విక్రయాల కంటే బెల్ట్ జోరు గా పరుగులు పెడుతుంది పల్లెల్లో బెల్ట్ షాపుల పై సూక్ష్మంగా నిఘా లేదంటున్న ప్రజలు
బెల్ట్ షాపులది అదనపు భారం
బెల్ట్ షాపుల్లో మందుబాబులపై అదన భారం మోపుతుంది వైన్ షాపులో ఎమ్మార్పీ ధరల కంటే ఒక క్వార్టర్ పైన 30 నుండి 40% వరకు సొమ్ము చేసుకుంటున్నా వైనం దండుకోవడం ఒకవైపు అయితే గల్లీలో బెల్టుల క్రేజ్ రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది బెల్ట్ షాప్ ల వారు అదనంగా 20 రూపాయలు పెంచి కస్టమర్లకు విక్రయిస్తున్నారు విచ్చలవిడిగా పెరుగుతున్న బెల్ట్ షాపు నిర్వాహకులు ఎవరికి నచ్చిన విధంగా వారు ధర నిర్ణయించుకొని క్వార్టర్ పైన 30 రూపాయలు ఫుల్ కనీసం 120 రూపాయలు బీరు పైన 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు వైన్ షాప్ లో ఉండే ప్రతి బ్రాండ్ మద్యం బెల్ట్ షాపుల్లో ఉండటం గమనార్హం ప్రతి ఒక్క గ్రామంలో గల్లి గల్లి కి బెల్ట్ షాపులు వెలగటంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి పుట్టగొడుగుల్లా బెల్ట్ దుకాణాలు వెలుస్తున్నాయి నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసిన అధిక ధరలకు విక్రయిస్తున్నారు అధిక ధరలే కాకుండా ఖాతా బుక్కు పెట్టి వడ్డీ వసూలు కూడా చేస్తున్నారు అని కుటుంబ సభ్యులు వాపోతున్నారు దీనివలన అనేకమంది బెల్ట్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి జోబులు గుల్ల చేసుకుంటున్నారు అప్పులు చేసి తాగటం వల్ల కుటుంబాలు రోడ్డున పాలవుతున్నాయి ఇప్పటికైనా జిల్లా ఉన్నత స్థాయి అధికారులు గ్రామాల్లో బెల్ట్ షాపుల మూసివేత దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో పూర్తిగా మద్యం విక్రయించకుండా ఆంక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

కేంద్ర మంత్రి సంతకం ఫోర్జరీ చేసి నకిలీ అరెస్ట్ వారెంట్.. రూ.99 లక్షలు కొట్టేసిన కేటుగాడు..

0

(స్టేట్ బ్యూరో) పూణే, నవంబర్ 12 మెదక్ టుడే న్యూస్:

•కేంద్ర మంత్రి సంతకం ఫోర్జరీ చేసి నకిలీ అరెస్ట్ వారెంట్.. రూ.99 లక్షలు కొట్టేసిన కేటుగాడు

•పుణే వృద్ధురాలికి డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులు

•నిర్మలా సీతారామన్ సంతకంతో కూడిన వారెంట్ పంపిన సైబర్ నేరస్థులు

•బ్యాంకు ఖాతాలోని సొమ్మంతా బదలాయించుకుని ఫోన్ స్విచ్చాఫ్ చేసిన వైనం

•పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

సైబర్ నేరస్థులు రోజురోజుకూ తెలివిమీరిపోతున్నారు. సరికొత్త ఎత్తులతో ఉన్నత విద్యావంతులనూ మోసం చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో మరో కొత్త వ్యూహంతో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా పుణేకు చెందిన ఓ వృద్ధురాలిని డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి రూ.99 లక్షలు కాజేశారు. ఇందుకోసం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఓ అరెస్ట్ వారెంట్ ను సృష్టించారు. దీంతో ఉన్నతవిద్యావంతురాలు, ఎల్ఐసీ మాజీ ఉన్నతాధికారి అయిన ఆ వృద్ధురాలు నమ్మి మోసపోయారు. పుణే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.పూణేకు చెందిన 62 ఏళ్ల మహిళ ఎల్ఐసీలో ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. ఇటీవల ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ఆధార్ కార్డ్ తో లింక్ అయిన ఓ ఫోన్ నెంబర్ తో దుండగులు ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని అవతలి వ్యక్తి బెదిరింపులకు గురిచేశాడు. ఈ విషయంపై సీనియర్ ఆఫీసర్ వీడియో కాల్ లో మాట్లాడతారంటూ ఫోన్ పెట్టేశాడు. కాసేపటి తర్వాత సీనియర్ పోలీస్ ఆఫీసర్ జార్జ్ మాథ్యూ పేరుతో మరో దుండగుడు వాట్సాప్ వీడియో కాల్ చేశాడు. ఆమె ఆధార్ కార్డ్ తో లింక్ అయిన ఫోన్ నెంబర్ తో ఆర్థిక మోసాలు జరిగాయని, ఈ కారణంగా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని చెప్పాడు.ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంతకంతో జారీ అయిన ఓ నకిలీ అరెస్ట్ వారెంట్ ను వాట్సాప్ చేశాడు. మనీలాండరింగ్ కేసు కావడంతో దర్యాప్తు కోసం బ్యాంకులో ఉన్న నగదు మొత్తం తాము సూచించిన ఖాతాకు బదిలీ చేయాలని, ఆర్బీఐ తనిఖీ తర్వాత ఆ మొత్తం తిరిగి ఆమె ఖాతాలో జమ అవుతుందని నమ్మబలికాడు. నిధులు బదిలీ చేయకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించడంతో భయాందోళనకు గురైన బాధితురాలు దుండగుడు చెప్పిన బ్యాంకు ఖాతాలకు రూ.99 లక్షలు బదిలీ చేసింది. ఆ తర్వాత దుండగుడికి ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది. పుణే సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

భూటాన్ నుంచి నేరుగా ఆసుపత్రికి ప్రధాని మోదీ…

0

(స్టేట్ బ్యూరో) నవంబర్ 12 మెదక్ టుడే న్యూస్:

భూటాన్ నుంచి నేరుగా ఆసుపత్రికి ప్రధాని మోదీ…

•ఎర్రకోట పేలుడు బాధితులకు పరామర్శ

•భూటాన్ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన ప్రధాని మోదీ

•ఢిల్లీలోని లోక్ నాయక్ జైప్రకాశ్ ఆసుపత్రిలో బాధితులతో మాట్లాడిన వైనం

•త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

భూటాన్ పర్యటన ముగించుకుని నేడు దేశానికి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీలోని లోక్‌నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి వెళ్లారు. ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడులో గాయపడి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.రెండు రోజుల భూటాన్ పర్యటన అనంతరం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న ప్రధాని, ఆసుపత్రిలో బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను, బాధితులకు అందుతున్న వైద్యాన్ని గురించి వైద్యులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు.అంతకుముందు భూటాన్‌ పర్యటనలో ఉండగానే ప్రధాని మోదీ ఢిల్లీ పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.”ఢిల్లీలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆప్తులను కోల్పోయిన కుటుంబాల బాధను నేను అర్థం చేసుకోగలను. ఎంతో భారమైన హృదయంతో ఇక్కడికి వచ్చాను. ఈ దుఃఖ సమయంలో దేశం మొత్తం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుంది. మన ఏజెన్సీలు ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తాయి. బాధ్యులైన వారందరినీ చట్టం ముందు నిలబెడతాం” అని భూటాన్ రాజధాని థింఫులో ప్రధాని వ్యాఖ్యానించారు.

•దర్యాప్తు ముమ్మరం చేసిన ఎన్ఐఏ

మరోవైపు, ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ పేలుడు ఘటన దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముమ్మరం చేసింది. కేసు విచారణ కోసం 10 మంది అధికారులతో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎన్ఐఏ ఏడీజీ విజయ్ సఖారే నేతృత్వంలోని ఈ బృందంలో ఒక ఐజీ, ఇద్దరు డీఐజీలు, ముగ్గురు ఎస్పీలు, మిగిలిన వారు డీఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏకి అప్పగించిన విషయం తెలిసిందే.కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఉన్నతస్థాయి భద్రతాధికారులతో సమావేశమై దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. కుట్ర వెనుక ఉన్న సూత్రధారులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. “దోషులను పట్టుకోవడంలో ఏ ఒక్క అంశాన్నీ విడిచిపెట్టం” అని ఆయన స్పష్టం చేశారు. ఎన్ఐఏ, ఐబీ, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు.ఇది గరిష్ఠ నష్టం కలిగించే లక్ష్యంతో జరిపిన ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. వెయ్యికి పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా పర్యవేక్షిస్తున్నామని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. పేలుడు జరిగిన ప్రాంతంలోని మొబైల్ ఫోన్ డంప్ డేటాను సేకరించి విశ్లేషిస్తున్నారు.ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, ముంబై నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, ప్రార్థనా స్థలాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు కలెక్టర్..

0

మెదక్, నవంబర్, 12, మెదక్ టుడే న్యూస్:

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు కలెక్టర్.

•అన్ని సెంటర్లలో టార్పాలిన్స్ అందుబాటులో ఉంచాలి.

•అన్ని మీల్స్ వద్ద ఒక రెవెన్యూ అధికారి ద్వారా పర్యవేక్షణ.

•కలెక్టరేట్లో కొనుగోలు కేంద్ర నిర్వాహణపై అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి సివిల్ సప్లై మార్కెటింగ్, వ్యవసాయ, సహకార శాఖ, డి ఆర్ డి ఏ, అధికారులతో కలెక్టర్ సమీక్ష

జిల్లాలో కొనుగోలు కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు చేస్తూ ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించాలని, జిల్లాలో
ప్రస్తుతం వాతావరణ అనుకూల ప్రభావంగా ఉన్నందున కొనుగోలు వేగం పుంజుకుని రైతులకు లబ్ధి చేకూర్చాలన్నారు. 69 రైస్ మిల్లుల వద్ద ఒక రెవెన్యూ ఆఫీసర్ నియమించి లారీల దిగుమతి పర్యవేక్షణ చేసే విధంగా కార్యాచరణ తయారు చేయాలన్నారు..
అన్ని కొనుగోలు కేంద్రాలలో ప్రస్తుతం
స్టాక్ ఉన్న టార్పలిన్ వివరాలను సమగ్ర సమాచారంతో ఫార్మాట్ రూపొందించాలన్నారు కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీలను పెంచి వేగంగా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆటోమేటిక్ ప్యాడి క్లీనర్స్ ఉన్న మండలాలలో రైతులు ధాన్యం శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా లారీల విషయంలో సంబంధిత ట్రాన్స్పోర్ట్ అధికారులతో సమన్వయంతో ముందుకు పోవాలన్నారు. సీఎంఆర్ పెండింగ్ విషయంలో పౌరసరఫరాల అధికారులు దృష్టి సారించాలన్నారు.ఈ సమావేశంలో డి ఆర్ డి ఎ పి డి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా పౌర సరఫరాధికారి నిత్యానంద్, డిఎం సివిల్ సప్లై జగదీష్, మార్కెటింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వ‌డ్లు అమ్మిన రైతుకు ఇబ్బందులు లేకుండా స‌కాలంలో డ‌బ్బులు అందేలా చ‌ర్య‌లు కలెక్టర్..

0

మెదక్, నవంబర్, 12, మెదక్ టుడే న్యూస్:

•వ‌డ్లు అమ్మిన రైతుకు ఇబ్బందులు లేకుండా స‌కాలంలో డ‌బ్బులు అందేలా చ‌ర్య‌లు కలెక్టర్

•ధాన్యం దిగుమతి చేయడంలో ‌ మిల్లర్లు వేగం పెంచాలి.

•తాసిల్దార్లు తరచూ ‌ రైస్ మిల్లును తనిఖీ చేయాలి.

•కొల్చారం మండలంలో సత్య సాయి రైస్ మిల్, వరిగుంతం ఫ్యాక్స్ కొనుగోలు కేంద్ర పరిశీలనలో కలెక్టర్ వెల్లడి

•జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

వడ్లు అమ్మిన రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో డబ్బులు జమ అయ్యేవిధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.కొల్చారం మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ ముందుగా సత్యసాయి రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల ధాన్యం పంపించారు, వాటిని ఎప్పుడు దిగుమతి చేసుకున్నారు వంటి అంశాలను ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ తనిఖీలో ధాన్యం సేకరణ, నిల్వ ప్రక్రియలపై ఆయన ఆరా తీశారు.రైస్ మిల్లులో ధాన్యం దించుకుంటున్న విధానాన్ని పరిశీలించారు.ఏ లారీ కూడా 24గంటలకు మించివెయిటింగ్ లో ఉండకూడదని అందుకు తగ్గట్టు గా రైస్ మిల్లర్లు హమాలీలని ఏర్పాటు చేసుకోవాలన్నారు.
అనంతరం ‌ వరిగుంతం ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి కొనుగోలు నిర్వహణ తీరు సంబంధిత వివరాలను ‌ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
ఇప్పటివరకు జిల్లాలో 82 వేల 481 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని21,277
మంది రైతులకు గాను 54 కోట్ల 52 లక్షల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు.
రైతులు అహర్నిశలు కాయ కష్టం చేసి
పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొంది ‌ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించడం జరుగుతుందని మిల్లర్లు సహకరించిత్వరితగతిన ధాన్యాన్ని దిగుమతి చేసుకొని వెంటనే లారీలను పంపించాలని ‌ సూచించారు.
వ‌డ్లు అమ్మిన రైతుకు ఇబ్బందులు లేకుండా స‌కాలంలో డ‌బ్బులు అందేలా చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. రైతు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చాక నిబంధనల ప్రకారం.. తేమ, తాలు చూసుకొని వెంటనే తూకం చేయాలని సూచించారు. అంతేకాకుండా రైతులు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని వివరాలు సేకరించి వాటి ఆధారంగా రైతుకు సంబంధించిన ధాన్యం వివరాలు ఆన్లైన్ లో అప్లోడ్ చేసి త్వరగా డబ్బులు అకౌంట్ లో పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.రైతులకు నాణ్యమైన ధాన్యం విషయంలో అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో , డిప్యూటీ తాసిల్దార్ నాగవర్ధన్, రెవెన్యూ సిబ్బంది, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.