📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 61

ఎర్రకోట పేలుడు ఉగ్రచర్యే.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం..

0

•ఎర్రకోట పేలుడు ఉగ్రచర్యే.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం.

•దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ప్రమేయం.

•అరెస్టయిన డాక్టర్ల ఫోన్లలో పాక్ హ్యాండ్లర్లతో టెలిగ్రామ్ చాట్స్.

•ఫరీదాబాద్ మాడ్యూల్ పట్టుబడటంతోనే పేలుడు జరిగిందన్న అనుమానాలు.

•అరెస్టయిన డాక్టర్లు టర్కీలో పర్యటించినట్లు నిర్ధారించిన అధికారులు.

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనను కేంద్ర ప్రభుత్వం “ఉగ్రచర్య”గా అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 10వ తేదీన జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భద్రతా కమిటీ సమావేశం అనంతరం ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. “నవంబర్ 10వ తేదీ సాయంత్రం ఎర్రకోట వద్ద కారు పేలుడు రూపంలో దేశ వ్యతిరేక శక్తులు ఘోరమైన ఉగ్రదాడికి పాల్పడ్డాయి. ఉగ్రవాదంపై దాని అన్ని రూపాల్లోనూ జీరో టాలెరెన్స్ విధానానికే భారత్ కట్టుబడి ఉందని కేబినెట్ పునరుద్ఘాటిస్తోంది” అని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే యూఏపీఏ, ఉగ్రవాద నిరోధక చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.వెలుగులోకి జైషే కోణంఈ కేసు దర్యాప్తులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమవుతున్నాయి. అరెస్టయిన డాక్టర్ల ఫోన్లలోని టెలిగ్రామ్ చాట్ల ద్వారా ఈ ఘటన వెనుక జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. పాకిస్థాన్‌లోని జైషే హ్యాండ్లర్లతో వీరు టెలిగ్రామ్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు ప్రాథమిక విశ్లేషణలో తేలిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.భయంతోనే పేలుడు జరిగిందా.ఇది ప్రణాళిక ప్రకారం జరిగిన దాడా? లేక భయంతో చేసిన పేలుడా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. ఫరీదాబాద్‌లో ఓ ఉగ్రవాద మాడ్యూల్‌ను పోలీసులు పట్టుకున్న తర్వాత, భయంతోనే ఉగ్రవాదులు ఈ పేలుడుకు పాల్పడి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఫరీదాబాద్‌లో అరెస్టయిన వారికి, ఈ కేసులో అనుమానితుడైన డాక్టర్ ఉమర్‌కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఉన్నత విద్యావంతులైన డాక్టర్లు, తీవ్రవాద భావజాలంతో ప్రభావితమైన నెట్‌వర్క్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు ఛేదించారు.టర్కీ పర్యటన నిర్ధారణ
ఈ క్రమంలోనే, అనుమానితులు డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనాయీ 2022లో టర్కీ వెళ్లినట్లు అధికారులు ధ్రువీకరించారు. అక్కడ తమ హ్యాండ్లర్లతో వీరు సమావేశమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా, అరెస్టయిన డాక్టర్ షాహీన్ షాహిద్ మాజీ భర్త డాక్టర్ జాఫర్ హయత్ మీడియాతో మాట్లాడుతూ… ఆమె జీవితం ఇలా మలుపు తిరుగుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాన్పూర్‌లోని ఓ ఆస్పత్రిలో కంటి వైద్యుడిగా పనిచేస్తున్న ఆయన, తమకు 2003లో వివాహమైందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. “ఆస్ట్రేలియా లేదా యూరప్ వెళ్దామని షాహీన్ పట్టుబట్టేది, కానీ నేను ఇక్కడే ఉండాలనుకున్నాను. ఓ రోజు ఉన్నట్టుండి ఆమె మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది. 2015లో విడాకులు తీసుకున్నాం, ఆ తర్వాత తిరిగి రాలేదు” అని ఆయన వివరించారు.

ప్రతిభావంతులైన క్రీడాకారులకు నెలవు మెదక్ జిల్లా అని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు..

0

మెదక్, నవంబర్, 13, మెదక్ టుడే న్యూస్:

•ప్రతిభావంతులైన క్రీడాకారులకు నెలవు మెదక్ జిల్లా అని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.

క్రీడాకారులకు ఫుట్బాల్ స్పోర్ట్స్ ‌కిట్స్
అందజేసిన దాత శ్రీ హర్ష సేవలను అభినందించిన అదనపు కలెక్టర్ నగేష్,పాఠశాల క్రీడా సమాఖ్య మెదక్ జిల్లా ఆధ్వర్యంలో ఈనెల 14 నుండి 16వ తేదీ వరకు నల్లగొండలో జరగనున్న ఎస్ జి ఎఫ్, రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలలో పాల్గొననున్న 17 సంవత్సరాలలోపు బాలబాలికల ఉమ్మడి మెదక్ జిల్లా జట్టుకు ఫుట్బాల్ కిట్స్ గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నగేష్ అందించారు.
ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ,ప్రతిభావంతులైన క్రీడాకారులకు నెలవు మెదక్ జిల్లా అని ,క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేసిన దాత ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ సర్వీసెస్ ఎం.డి హర్ష సేవా దృక్పథాన్ని కొనియాడారు. ఫుట్బాల్ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ఫుట్‌బాల్ పట్ల మీకున్న మక్కువ మైదానాన్ని మరింత ఉత్తేజపరుస్తూనే ఉండనివ్వండి! చివరి నిమిషంలో గెలిచిన గోల్‌తో ఉత్సాహంగా గడపాలని కోరుకుంటున్నాను! ఈ సంవత్సరం ఆనందం, విజయం మరియు ప్రేమతో హ్యాట్రిక్ సాధించండి!
అని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా విద్యాధికారి విజయ, పాఠశాల క్రీడా సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్ నాగరాజు. పీడీలు జి మాధవరెడ్డి, జట్టు కోచ్ స్వాతి పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతకు పోటీ పరీక్షల ఉచిత కోచింగ్ క్యాంపు జిల్లా ఎస్ పి డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్..

0

మెదక్, నవంబర్, 13, మెదక్ టుడే న్యూస్:

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతకు పోటీ పరీక్షల ఉచిత కోచింగ్ క్యాంపు జిల్లా ఎస్ పి డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్..

మెదక్ జిల్లా ఎస్ పి శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఒక ప్రకటనలో మాట్లాడుతూ, మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుపేద మరియు గ్రామీణ యువతకు వివిధ పోటీ పరీక్షల నిమిత్తం ప్రత్యేక ఉచిత కోచింగ్ క్యాంపు ఏర్పాటు చేయబడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు సరైన మార్గదర్శకత్వం, శిక్షణ మరియు మానసిక ప్రేరణ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టబడినదని ఎస్ పి పేర్కొన్నారు.ఈ కోచింగ్ క్యాంపులో అభ్యర్థులకు పోలీస్, ఆర్మీ, రైల్వే, బీఎస్ఎఫ్, సిఐఎస్‌ఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్ మరియు ఇతర ప్రభుత్వ రంగ పోటీ పరీక్షలకు అవసరమైన పాఠ్యబోధన, ఫిజికల్ ట్రైనింగ్, మాక్ టెస్టులు, కౌన్సెలింగ్ మరియు ప్రేరణాత్మక సదస్సులు నిర్వహించబడతాయి. అనుభవజ్ఞులైన పోలీసు అధికారులు, ట్రైనర్లు మరియు అతిథి లెక్చరర్లు ఈ కోచింగ్‌లో భాగంగా పాల్గొంటారని తెలిపారు.జిల్లాలోని గ్రామీణ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్ పి తెలిపారు. దరఖాస్తులు రేపటి నుండి ఈ నెల 19వ తేదీ వరకు స్వీకరించబడతాయని, ఎంపికైన అభ్యర్థుల కోసం శిక్షణ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ నుండి ప్రారంభమవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం ఒక ఇన్స్పెక్టర్‌ నిరంతర పర్యవేక్షణలో కొనసాగనుందని, అభ్యర్థులు క్రమశిక్షణ, కృషి మరియు పట్టుదలతో పాల్గొని తమ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఎస్ పి సూచించారు. జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ యువత అభివృద్ధికి మరియు సామాజిక సేవకు అంకితభావంతో పనిచేస్తుందని తెలిపారు.పోటీ పరీక్షల ద్వారా గ్రామీణ యువత ఎదుగుదలకు, ప్రభుత్వ సేవల్లో స్థానం సంపాదించడానికి ఈ కోచింగ్ క్యాంపు కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా ఎస్ పి శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ పేర్కొన్నారు.వివరాల కోసం సంప్రదించవలసిన నంబర్లు: 87125 29742, 78939 24601.

బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి..

0

(స్టేట్ బ్యూరో), నవంబర్ 13 మెదక్ టుడే న్యూస్:

•బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి.

•బెట్టింగ్ లో లక్షల రూపాయలు కోల్పోయి, ఆత్మహత్య చేసుకున్న యువకుడు.

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న ఏపీలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన అఖిల్(31) అనే యువకుడు.ఏలూరు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి, పట్టణంలోని ఒక హోటల్లో గది తీసుకున్న అఖిల్.తన తండ్రికి ఫోన్ చేసి బెట్టింగ్ వల్ల నష్టపోయానని, ఇప్పుడు వాళ్లు నన్ను ఇబ్బంది పెడుతున్నారని తెలిపిన యువకుడు.ఇంటికి వస్తే అన్నీ మాట్లాడుకుందామని, బాధపడొద్దని చెప్పిన అఖిల్ తండ్రి.ఒక గదిలో ఉన్న యువకుడు చాలా సేపటి నుండి తలుపులు తీయడం లేదని పోలీసులకు సమాచారం అందించిన హోటల్ సిబ్బంది.తలుపులు పగలగొట్టి చూడగా, అఖిల్ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించిన పోలీస్ సిబ్బంది.తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

భారత్‌లో డీఎన్ఏపై ప్రత్యేక యానిమేటెడ్ డూడుల్‌ను ప్రదర్శించిన గూగుల్..

0

(స్టేట్ బ్యూరో)నవంబర్,13,మెదక్ టుడే న్యూస్:

•భారత్‌లో డీఎన్ఏపై ప్రత్యేక యానిమేటెడ్ డూడుల్‌ను ప్రదర్శించిన గూగుల్.
•డబుల్ హెలిక్స్ నిర్మాణంతో ఆకట్టుకుంటున్న డూడుల్.
•దీనిపై క్లిక్ చేస్తే గూగుల్ జెమినీ ఏఐ పేజీ ఓపెన్ అవుతున్న వైనం.
•డీఎన్ఏ బేస్ పెయిరింగ్ గురించి వివరిస్తున్న జెమినీ.
•గతంలో అమెరికా, యూరప్‌లలోనూ ఈ డూడుల్‌ ప్రదర్శన‌.ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ గురువారం భారత్‌లో తన హోమ్‌పేజీపై ఒక ప్రత్యేక డూడుల్‌ను ప్రదర్శించింది. జీవశాస్త్రంలో అత్యంత కీలకమైన, ఎక్కువగా శోధించే అంశాల్లో ఒకటైన డీఎన్ఏ (డీఆక్సీరైబోన్యూక్లియిక్ యాసిడ్)కు నివాళిగా ఈ యానిమేటెడ్ డూడుల్‌ను రూపొందించింది. డీఎన్ఏ డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని చూపుతూ, జీవుల మనుగడకు ఆధారం ఇదేనని ఈ డూడుల్ ద్వారా గూగుల్ వివరిస్తోంది.”డీఆక్సీరైబోన్యూక్లియిక్ యాసిడ్ గురించి ఈ డూడుల్ వివరిస్తుంది. ఇది అన్ని జీవుల పెరుగుదల, పునరుత్పత్తి, ఇతర విధులకు అవసరమైన జన్యుపరమైన సూచనలను మోసే ఒక మాలిక్యులర్ పాలిమర్. రెండు గొలుసులు కలిసి డబుల్ హెలిక్స్‌గా ఏర్పడతాయి” అని ఈ డూడుల్ గురించి గూగుల్ ఒక ప్రకటనలో పేర్కొంది. సాధారణంగా స్కూల్స్ నడిచే సమయంలో డీఎన్ఏకు సంబంధించిన సెర్చ్‌లు ఎక్కువగా ఉంటాయని గూగుల్ తెలిపింది.ఈ డూడుల్ కేవలం యానిమేషన్‌కే పరిమితం కాలేదు. దానిపై క్లిక్ చేయగానే యూజర్లను గూగుల్ జెమినీ ఏఐ (AI) మోడ్‌లోకి తీసుకెళ్తుంది. అక్కడ డీఎన్ఏలోని రసాయన బేస్‌లైన అడెనిన్ (A), థైమిన్ (T), సైటోసిన్ (C), గ్వానిన్ (G) వాటి క్రమం గురించి ఒక ప్రశ్న అడుగుతుంది. దీనికి సమాధానంగా జెమినీ ఏఐ “డీఎన్ఏలోని బేస్‌ల క్రమం కచ్చితమైన నియమాలను పాటిస్తుంది. A ఎల్లప్పుడూ Tతో, C ఎల్లప్పుడూ Gతో జతకడుతుంది. ఈ క్రమంలో ఏవైనా పొరపాట్లు జరిగితే ఉత్పరివర్తనాలకు దారితీయవచ్చు” అని వివరిస్తుంది.ఈ డీఎన్ఏ డూడుల్‌ను గూగుల్ తొలిసారిగా ఈ ఏడాది సెప్టెంబర్ 10న అమెరికాలో ప్రదర్శించింది. ఆ తర్వాత యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలోని పలు దేశాల్లో కూడా అందుబాటులోకి తెచ్చింది.గూగుల్ డూడుల్స్ చరిత్ర
గూగుల్ డూడుల్ అనేది పండుగలు, చారిత్రక సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జయంతులు, వార్షికోత్సవాలు, శాస్త్రీయ ఆవిష్కరణలను పురస్కరించుకుని గూగుల్ తన హోమ్‌పేజీ లోగోను తాత్కాలికంగా మార్చడం. తొలి గూగుల్ డూడుల్‌ను 1998లో ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ రూపొందించారు. తాము ‘బర్నింగ్ మ్యాన్’ ఫెస్టివల్‌కు వెళ్తున్నామని యూజర్లకు తెలియజేయడమే దాని ఉద్దేశం. ఇక 2000వ సంవత్సరంలో ఫ్రాన్స్‌లో బాస్టిల్ డే సందర్భంగా తొలి అంతర్జాతీయ డూడుల్‌ను ప్రారంభించారు. 2010లో ప్రముఖ గేమ్ ‘ప్యాక్-మ్యాన్’ 30వ వార్షికోత్సవం సందర్భంగా తొలి ఇంటరాక్టివ్ గేమ్ డూడుల్‌ను ప్రవేశపెట్టారు.

ప్రాణాన్ని కాపాడిన స్ఫూర్తిదాయక పోలీస్ జి. నవ్య..

0

(స్టేట్ బ్యూరో)కృష్ణాజిల్లా, నవంబర్ 13 మెదక్ టుడే న్యూస్:

•ప్రాణాన్ని కాపాడిన స్ఫూర్తిదాయక పోలీస్ జి. నవ్య..

కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఉన్న ఒక మహిళ కుటుంబ సమస్యల కారణంగా కృష్ణానదీ  బ్యారేజ్ పై దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న మహిళా ట్రాఫిక్ పోలీస్ 3250 జి. నవ్య గారు, పరిస్థితిని గమనించి అప్రమత్తమై  మానవతా భావంతో వెంటనే స్పందించి, ఆ మహిళను వెనుకనుండి పట్టుకుని కిందకు దింపి ప్రాణాలను కాపాడారు.తర్వాత ఆమెను వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు, అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐ.పి.ఎస్. ట్రాఫిక్ డీసీపీ శ్రీమతి షిరీన్ బేగం, ఐ.పి.ఎస్. మరియు ప్రోత్సహిస్తుంది మహిళా కానిస్టేబుల్ జి. నవ్య ని, మానవత్వానికి ప్రతీకగా ధైర్యం చెప్పారు.

గుడ్‌న్యూస్..48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ..

0

TS(స్టేట్ బ్యూరో) నవంబర్ 13 మెదక్ టుడే న్యూస్:

గుడ్‌న్యూస్..48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.

తెలంగాణ రాష్ట్ర రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసి, ప్రకృతి వైపరీత్యాల భారిన పడ్డ రైతాంగానికి బాసటగా ఉంటాం అని రాష్ట్ర పౌరసరఫరాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు నమోదు చేసిన 48 గంటల వ్యవధిలో చెల్లింపులు జరుపాలని అధికారులను ఆదేశించారు.కొనుగోలు కేంద్రాలలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణా కొత్త రికార్డ్ నెలకొల్పిందని, స్వతంత్ర భారత దేశంలో ఇంతటి ఉత్పత్తి ఇదే ప్రధమం అని, ముందెన్నడూ లేని రీతిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం ఇదే ప్రప్రథమం అని ఉత్తమ్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ప్రజాప్రతినిధులు విధిగా బాగాస్వామ్యం కావాలని సూచించారు. భారతదేశ చరిత్రలోనే ఒక్క సీజన్ లో 150 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని మంత్రి తెలిపారు.

వీధి కుక్కల దాడిలో చూపు కోల్పోయిన మూడేళ్ల చిన్నారి..

0

(స్టేట్ బ్యూరో)రంగారెడ్డి జిల్లా,నవంబర్,13,మెదక్ టుడే న్యూస్:

వీధి కుక్కల దాడిలో చూపు కోల్పోయిన మూడేళ్ల చిన్నారి

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం నాగులపల్లి గ్రామంలో పాఠశాల నుండి వస్తున్న జ్యోతి, జనార్దన్ దంపతుల కొడుకు రిత్విక్(3) అనే బాలుడిపై దాడి చేసిన వీధి కుక్కలు.ఈ దాడిలో రిత్విక్ ఎడమ కన్ను తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం హైదరాబాద్ నగరంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.బాలుడి కన్ను పరీక్షించి కంటి చూపు పోయినట్టు నిర్ధారించిన వైద్యులు, దీంతో తీవ్ర ఆవేదనకు గురైన చిన్నారి తల్లిదండ్రులు.రిత్విక్‌పై దాడి చేసిన రోజే వీధి కుక్కలు మరో చిన్నారిపైన కూడా చేశాయని, ఇప్పటికైనా ప్రభుత్వం వీధి కుక్కల నియంత్రణను చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్న గ్రామస్తులు..

ఆర్డర్‌ అమలు చేయకపోతే కోర్టుకు రండి..

0

ఆర్డర్‌ అమలు చేయకపోతే కోర్టుకు రండి

ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశం

(స్టేట్ బ్యూరో)హైదరాబాద్‌, నవంబర్‌ 13, మెదక్ టుడే న్యూస్ :

చేప పిల్లలు పంపిణీ చేసిన వారికి నగదు చెల్లించాలంటూ గతంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకపోతే కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాకు హైకోర్టు తేల్చి చెప్పింది.తమ ఆదేశాలు అమలు చేస్తారా? లేక కోర్టుకు హాజరవుతారా? అని ప్రశ్నించింది. ఈ కేసులో ఫిబ్రవరిలోనే ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎందుకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది.చివరిసారిగా నాలుగు వారాలు గడువు ఇస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 5కు వాయిదా వేసింది. 2023-24 సంవత్సరానికి తాము అందజేసిన ఫిష్‌ సీడ్స్‌కు సంబంధించిన నగదు చెల్లింపులో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ ఆరే ఫిషరీస్‌ ట్రేడర్స్‌ అండ్‌ సీడ్‌ సప్లయర్స్‌ యజమాని రాజ్‌కుమార్‌, ఇతరులు వేర్వేరుగా పిటిషన్లు వేశారు. వీటిని జస్టిస్‌ కాజ శరత్‌ బుధవారం విచారించి కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని ఆదేశించింది.

మండల వ్యాప్తంగా జోరుగా కల్తీ కల్లు దందా..

0

మండల వ్యాప్తంగా జోరుగా కల్తీ కల్లు దందా.

•కల్తీ కల్లుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం.

•మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ….

•చోద్యం చూస్తున్న పోలీసులు….

పాపన్నపేట,నవంబర్,13, మెదక్ టుడే న్యూస్:

మత్తు పానీయాలను విక్రయిస్తూ సంపాదనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైనం ఇది. పాపన్నపేట  మండలంలో కల్తీకల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. స్వచ్ఛమైన కల్లుకు బదులు ప్రాణాంతకమైన మత్తు పదార్థాలను కలుపుతూ కృత్రిమ కల్లును తయారు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ధనవర్జనే లక్ష్యంగా కొందరు వ్యాపారులు కల్తీ కళ్ళు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. గీత కార్మికులకు శిక్షణ లేకుండా లైసెన్సులు ఇవ్వడం వల్ల నిజమైన కార్మికులకు అన్యాయం జరుగుతుందని విమర్శలు ఉన్నాయి. మండలంలోని, పాపన్నపేట, కుర్తివాడ, నార్సింగ్,ఎనకపల్లి, కొడపాక, యూసు పేట్, మల్లంపేట్,తదితర గ్రామాలలో కల్తీకల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయని స్వచ్ఛమైన కల్లుకు బదులు చెట్ల నుండి తీసిన కొద్దిపాటి కల్లులో, కృత్రిమ ప్రాణానంతక మత్తు పదార్థలు కలుపుతూ గ్రామీణ ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేయడం తప్ప చర్యలు తీసుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజల విమర్శలు వినిపిస్తున్నాయి. ఆల్ఫోజలం, డైజోఫామ్ లాంటి రసాయనతో కల్లు తయారు చేయడం వల్ల సేవించేవారు మత్తులోకి వెళ్లిపోవడం, అనారోగ్య సమస్యల కు గురికావడం, కాకుండా ప్రమాదాలకు కూడా గురవుతున్న సందర్భాలు ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు, బుద్ధి మందగించడం, బిపి షుగర్ లాంటి, వ్యాధుల దరిచేరి ఆస్కారం ఉండడమే కాకుండా, మత్తులో ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి, కల్తీ కల్లు తో ఎన్నో నష్టాలు జరుగుతున్న సందర్భాలు అనేకం. కళ్ళు సేవించే వారికి పైనుండి డైజోఫామ్, క్లోరోఫాములు అధికంగా వేయడంతో మత్తులో రోడ్డు జరుగుతున్న సందర్భాలు అనేకం.ఇంట్లో గొడవలు పడి ఆత్మ హత్య లు సైతం జరుగుతున్నాయి. దీంతో పలు కుటుంబాలు చిన్నభిన్నమవుతున్నాయి. ఎక్సైజ్ అధికారులు ఆయా ప్రాంతాల్లో తూతూ మంత్రంగా కల్లు దుకాణాలు తనిఖీ చేస్తూ మామూళ్లు తీసుకుంటూ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు, నిఘా విభాగం వారు స్పందించి కల్తీకల్లు పై నిగా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.