📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 60

పశు వైద్యశాల ద్వారా సమర్థవంతమైన సేవలు అందించాలి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

0

పశు వైద్యశాల ద్వారా సమర్థవంతమైన సేవలు అందించాలి,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

పాపన్నపేట,నవంబర్,15,మెదక్ టుడే న్యూస్:

పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామంలోని పశువైద్యశాలను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.
. వైద్య సేవలు, మందుల రికార్డులను పరిశీలించారు. పశు వైద్యశాలకు క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాలని ఆదేశించారు.హాస్పిటల్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని,ఎప్పుడు పాడి రైతులకు అందుబాటులో ఉండి పాడి పశువుల సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు వివరించి వైద్య సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట పశు వైద్య అధికారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో మరో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు..

0

తెలంగాణలో మరో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు?

(స్టేట్ బ్యూరో)హైదరాబాద్,నవంబర్,15,మెదక్ టుడే న్యూస్:

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మంచిజోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదురుకునేం దుకు కాంగ్రెస్ కాబోతుందని తెలుస్తుంది,బీఆర్‌ఎస్, నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్,కడియం శ్రీహరి, లపై త్వరలో స్పీకర్ వేటు వేసే అవకాశం ఉంది,స్పీకర్ నిర్ణయం తీసుకునే లోపు ఇద్దరితో రాజీనామా చేయించాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తుంది దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యం కావచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన పలువురిపై స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతోంది.ఈ విచారణ లో దానం నాగేందర్, కడియం శ్రీహరిల వ్యవహారం కీలక ఘట్టానికి చేరుకుంది. దానం నాగేం దర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. ఈ చర్య ద్వారా ఆయన పార్టీ మారినట్లు స్పష్టంగా రుజువైంది. ఇక కడియం శ్రీహరి సైతం పార్టీ మారినట్లు బహిరం గంగా అంగీకరించారు. దీంతో వీరిపై స్పీకర్ వేటు వేసే అవకాశం ఉందని, తద్వారా వచ్చే ఉప ఎన్నికలో వీరికే టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని 24 వేలకు పైగా మెజార్టీతో గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే గెలుపుపై అత్యంత ధీమాతో ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పాటుగా ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీ పథకాల పట్ల ప్రజల్లో సానుకూలత ఉండటం తమకు అదనపు బలంగా మారుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.గతంలో స్పీకర్లు ఫిరాయింపు కేసులను సాగదీసినప్పటికీ, ప్రస్తుతం రాజ్యాంగబద్ధంగా స్పీకర్లు వేగంగా నిర్ణయం తీసుకునే వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఫిర్యాదులపై స్పీకర్ చర్యలు తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

కాకి చేసిన పనికి కాలిబూడిదైన నాలుగు ఇళ్లు,విజయనగరం జిల్లాలో అగ్ని ప్రమాదం..

0

కాకి చేసిన పనికి కాలిబూడిదైన నాలుగు ఇళ్లు.. విజయనగరం జిల్లాలో అగ్ని ప్రమాదం.

•కార్తిక దీపాన్ని ఎత్తుకొచ్చి ఓ ఇంటిపై పడేసిన కాకి.

•తాటాకు ఇల్లు కావడంతో ఎగసిపడ్డ మంటలు.

•పక్కనే ఉన్న మరో మూడు ఇళ్లు కూడా దగ్ధం.

(స్టేట్ బ్యూరో)ఆంధ్ర ప్రదేశ్,నవంబర్,15,మెదక్ టుడే న్యూస్:

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగు తాటాకు ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదానికి కారణం ఓ కాకి చేసిన పనేనని స్థానికులు చెబుతున్నారు. కార్తిక మాసం నేపథ్యంలో గరివిడి మండలం కోనూరులో ఓ కుటుంబం తమ ఇంటి డాబాపై దీపాలను వెలిగించింది. అయితే ఓ కాకి ఇందులో ఓ దీపాన్ని ఎత్తుకెళ్లి సమీపంలోని ఓ ఇంటిపై పడేసింది. ఆ ఇంటి పైకప్పు తాటాకులతో ఉండడం వల్ల నిప్పంటుకుని మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పేందుకు ప్రయత్నించేలోపే చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు మంటలు విస్తరించాయి.స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు. ఆలోపే నాలుగు తాటాకు ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ఇందులో ఓ ఇల్లు కౌలు రైతు నంబూరి గోపిది. ఇటీవలే ఆయన పెట్టుబడి కోసం రూ.లక్ష అప్పు చేసి తెచ్చాడు. ఇంట్లో దాచిన ఆ సొమ్ముతో పాటు ఇంట్లోని అర తులం బంగారం కూడా ఈ మంటలకు బూడిదైందని వాపోయ.

ఆధార్‌లో ఎన్ని రకాల మార్పులు చేసుకోవచ్చు? – పూర్తి వివరాలు..

0

ఆధార్‌లో ఎన్ని రకాల మార్పులు చేసుకోవచ్చు? – పూర్తి వివరాలు.

(స్టేట్ బ్యూరో)నవంబర్,15,మెదక్ టుడే న్యూస్:

ముందుమాట..
ఆధార్ ప్రస్తుతం భారతదేశంలో ప్రతి వ్యక్తికి కీలకమైన గుర్తింపుదాఖలాగా మారింది. ఉద్యోగాలు, బ్యాంక్, పింఛన్, గ్యాస్, స్కాలర్‌షిప్స్—ప్రతి చోటా ఆధార్ అవసరం. అందుకే ఇందులో ఉన్న వివరాలు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. UIDAI అనుమతించిన వివిధ మార్పులు ఏవో తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి ఉపయోగకరం.

1) పేరు మార్పు (Name Update) పేరు తప్పుగా ఉన్నా, పెళ్లి తర్వాత surname మారినా, చిన్న spelling mistake ఉన్నా పేరు మార్చుకునే అవకాశం ఉంది. ఆధార్ సెంటర్‌లో supporting documents తప్పనిసరి. జీవితంలో 2–3 సార్లు మాత్రమే మార్చుకోవచ్చు.

2) ఫోటో అప్‌డేట్ (Photo Update) మీ ఆధార్‌లో ఉన్న ఫోటో పాతదైపోయినా, స్పష్టంగా కనిపించకపోయినా, ఎప్పుడైనా కొత్త ఫోటో తీసుకునే అవకాశం ఉంది. ఇది కేవలం ఆధార్ ఎన్‌రోల్మెంట్ సెంటర్‌లోనే చేయాలి.

3) బయోమెట్రిక్ అప్‌డేట్ (Biometrics Update) వేలిముద్రలు, కంటి ఐరిస్ క్లారిటీ తగ్గినా లేదా పనిచేయకపోయినా అప్‌డేట్ చేయాలి. 5 సంవత్సరాలు, 15 సంవత్సరాల పిల్లల biometrics తప్పనిసరి‌గా రీ-అప్‌డేట్ చేయాలి. పెద్దవాళ్లు కూడా ఎప్పుడైనా అప్‌డేట్ చేసుకోవచ్చు.

4) మొబైల్ నంబర్ మార్పు (Mobile Number Update) బ్యాంక్, LPG, PAN లింకింగ్… అన్ని OTP మీద ఆధారపడతాయి. కాబట్టి మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు. పాత నంబర్ పనిచేయకపోయినా కొత్త నంబర్‌ను సులభంగా అప్‌డేట్ చేయొచ్చు.

5) ఇమెయిల్ ఐడీ అప్‌డేట్ (Email Update) చాలామంది ఆధార్‌లో email ఇవ్వరు. భద్రత కోసం email జోడించడం మంచిది. మార్చుకోవడమూ సులభమే. ఇది సెంటర్‌లో మాత్రమే అప్‌డేట్ చేయాలి.

*6) Date of Birth (జన్మ తేదీ) అప్‌డేట్
DOB తప్పుగా ఉన్నా లేదా ఒక్కసారైనా సరిదిద్దుకోవాల్సి వస్తే అవకాశం ఉంది. కానీ ఇది life-long లో *ఒక్కసారి మాత్రమే* మార్చుకునే facility. Strong documents తప్పనిసరి (Birth certificate / 10th certificate / Passport).*

7) Address Update (చిరునామా మార్పు) ఇల్లు మార్చినప్పుడు, పెళ్లి తర్వాత చిరునామా మారినప్పుడు address అప్‌డేట్ చేయవచ్చు. Online & Offline రెండు మార్గాలు ఉన్నాయి. Address validation letter ద్వారా కూడా మార్చుకోవచ్చు.

8) Gender Update (లింగం మార్పు) Male → Female / Female → Male / Transgender గా మార్చుకోవచ్చు. ఇది 1–2 సార్లు మాత్రమే అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంది.

9) Document Update (పత్రాల అప్‌డేట్) ఒకే document repeatedగా ఉన్నా, పాత ఐడీ outdated అయిపోయినా, కొత్త valid documents ఆధార్‌లో అప్‌డేట్ చేయొచ్చు. UIDAI ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి documents re-validate చేయమని సూచిస్తుంది.

10) Head of Family / Relationship Update కుటుంబంలో Head name మారినా, relationship details తప్పుగా ఉన్నా సరిచేసుకునే అవకాశం ఉంది. ఇది address update సమయంలో ఎక్కువగా వాడతారు.

ముగింపు
ఆధార్‌లో మొత్తం 10 రకాల ముఖ్యమైన మార్పులు UIDAI అనుమతిస్తుంది. వీటిలో కొన్నింటిని ఆన్‌లైన్‌లో, కొన్నింటిని ఆధార్ సెంటర్‌లో మాత్రమే చేయాలి. జీవితం మొత్తం లో కొన్ని updates (పేరు, DOB, లింగం) పరిమితుల‌తో ఉండగా, biometrics, photo లాంటివి ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఆధార్ వివరాలు సరిగా ఉండడం అంటే భవిష్యత్తులో ఏ ప్రభుత్వ సేవలైనా సులభంగా పొందగలగడం.

ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్..

0

ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్..

(స్టేట్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్,15,మెదక్ టుడే న్యూస్:

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. నిన్న ఫ్రాన్స్ నుంచి వచ్చిన అతడిని హైదరాబాద్ కూకట్పల్లిలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి కరీబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.సినిమాలను విడుదలైన రోజే పైరసీ ద్వారా వెబ్సైట్లో పెట్టడంపై నిర్మాతలు పలుమార్లు ఐ బొమ్మ పై కంప్లైంట్లు ఇచ్చారు.

టాటా మోటార్స్‌కు రూ.867 కోట్ల నష్టాలు

0

న్యూఢిల్లీ, నవంబర్14 : టాటా మోటార్స్‌ భారీ నష్టాలను చవి చూసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.867 కోట్ల నికర నష్టాలు నమోదు చేసింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.498 కోట్ల లాభాలు ప్రకటించింది. ఇటీవల టాటా క్యాపిటల్‌ లిస్టింగ్‌కు వచ్చిన సమయంలో అందులో పెట్టుబడులు పెట్టగా.. ఆ సంస్థ షేర్లు ఒత్తిడి పెరగడంతో మార్కెట్‌లో టాటా మోటార్స్‌కు నష్టాలు వచ్చాయని వెల్లడించింది. గడిచిన క్యూ2లో కంపెనీ రెవెన్యూ రూ.18,585 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే క్యూ2లో రూ.17,535 కోట్ల రెవెన్యూ ప్రకటించింది. ఏడాదికేడాదితో పోల్చితే కంపెనీ విక్రయాల్లో 12 శాతం పెరుగుదల నమోదు చేసిందని టాటా మోటార్స్‌ ఎండీ, సీఈఓ గిరీస్‌ వాఫ్‌ు పేర్కొన్నారు. పండగ సీజన్‌లో జీఎస్టీ శ్లాబుల తగ్గింపునతో అన్ని సెగ్మెంట్లలో డిమాండ్‌ పెరిగిందన్నారు.

బాలల దినోత్సవం భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14న జరుపుకుంటారు.

0

బాలల దినోత్సవం (చిల్డ్రన్స్ డే) భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14న జరుపుకుంటారు.

(స్టేట్ బ్యూరో)నవంబర్,14,మెదక్ టుడే న్యూస్:

ఇది భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు. నెహ్రూ బాలలపై అపారమైన ప్రేమ కలిగి ఉండేవారు, వారిని “చాచా నెహ్రూ” అని పిలుచుకుంటారు. ఈ రోజు బాలల హక్కులు, విద్య, సంక్షేమం గురించి అవగాహన కల్పించడానికి మరియు వారిని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది.

చరిత్ర (History)
భారతదేశంలో బాలల దినోత్సవం మొదటి సారి 1948లో “ఫ్లవర్ డే”గా జరిగింది, ఇది ఐక్యరాష్ట్ర సమితి కోసం నిధులు సేకరించడానికి ఏర్పాటు చేయబడింది. 1949లో దీనిని “బాలల దినోత్సవం”గా విస్తృతంగా జరుపుకున్నారు. 1951లో, ఐక్యరాష్ట్ర సమితి సామాజిక సంక్షేమ ఫెలో అయిన వి.ఎం. కుల్కర్ని సూచన మేరకు, నెహ్రూ జన్మదినాన్ని ఫ్లాగ్ డేగా జరుపుకోవాలని నిర్ణయించారు. 1954లో మొదటి సారి అధికారికంగా బాలల దినోత్సవంగా జరిగింది, దాదాపు 50,000 మంది పిల్లలు దిల్లీలోని నేషనల్ స్టేడియంలో పాల్గొన్నారు. 1957లో ప్రభుత్వం దీనిని అధికారికంగా ప్రకటించింది మరియు మూడు స్మారక స్టాంపులు విడుదల చేసింది. నెహ్రూ మరణం తర్వాత 1964లో, పార్లమెంటు దీనిని బాలల దినోత్సవంగా ఏకగ్రీవంగా ఆమోదించింది.

ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ చిల్డ్రన్స్ డే నవంబర్ 20న జరుగుతుంది, కానీ భారతదేశం నెహ్రూ జన్మదినాన్ని ఎంచుకుంది.

ప్రాముఖ్యత (Significance)
బాలల దినోత్సవం బాలల హక్కులు, విద్య, ఆరోగ్యం మరియు సంక్షేమం పట్ల దృష్టి సారిస్తుంది. ఇది నెహ్రూ లెగసీని గౌరవిస్తుంది, ఆయన బాలలను దేశం యొక్క భవిష్యత్తుగా భావించారు. బాలలు సమాజంలోని ముఖ్యమైన భాగం, వారి సంరక్షణ మరియు అభివృద్ధి దేశ పురోగతికి కీలకం. ఇది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాలకులకు బాలల సంక్షేమాన్ని ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తుచేస్తుంది. ఇది బాల కార్మికులు, అసమానతలు వంటి సమస్యలపై అవగాహన కల్పిస్తుంది.

2025లో థీమ్: “ప్రతి బాలుడికి, ప్రతి హక్కు” (For Every Child, Every Right). ఇది బాలల విద్య, ఆరోగ్యం మరియు సమానత్వాన్ని నొక్కి చెబుతుంది.

జవహర్‌లాల్ నెహ్రూ సంబంధం (Jawaharlal Nehru’s Connection)
జవహర్‌లాల్ నెహ్రూ (1889-1964) బాలలపై అపారమైన ప్రేమ కలిగి ఉండేవారు. ఆయన బాలల ముఖాల్లోని నిర్మలత్వం మరియు కళ్ళలోని మెరుపును దేశ భవిష్యత్తుగా భావించారు. 1955లో చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించారు, బాలలు తమను తాము సినిమాల్లో చూసుకోవడానికి. ఆయన తన కుమార్తె ఇందిరా గాంధీకి రాసిన లేఖలు (Letters from a Father to His Daughter, Glimpses of World History) బాలలకు అందుబాటులో ఉండేలా మానవతా విలువలను వివరిస్తాయి. నెహ్రూ బాలల సంక్షేమానికి ఎంత ఖర్చు అయినా దేశానికి మంచి పెట్టుబడి అని భావించారు.

కొన్ని ప్రసిద్ధ కోట్స్:

  • “నేటి బాలలు రేపటి భారతదేశాన్ని తీర్చిదిద్దుతారు. మనం వారిని ఎలా పెంచుతామో అది దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.”
  • “మనం జీవిస్తున్న ఈ ప్రపంచం అద్భుతమైనది, అందులో అందం, ఆకర్షణ మరియు సాహసాలు నిండి ఉన్నాయి. మన కళ్ళు తెరచి చూస్తే ఆ సాహసాలకు అంతు ఉండదు.”
  • “అతి జాగ్రత్తగా ఉండే విధానం అతి పెద్ద ప్రమాదం.”.

జరుపుకునే విధానం (Celebrations)
భారతదేశంలో బాలల దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటారు:

  • పాఠశాలల్లో: సాంస్కృతిక కార్యక్రమాలు, గానం, నాట్యం, నాటకాలు, డ్రాయింగ్, ఎస్సే రచన పోటీలు. బాలల హక్కులు, భవిష్యత్ గురించి థీమ్‌లు.
  • పబ్లిక్ ఈవెంట్‌లు: ఆటలు, బహుమతుల పంపిణీ, మిఠాయిలు. కొన్ని పాఠశాలలు హాలిడే ఇస్తాయి, మరికొన్ని ఫెయిర్‌లు నిర్వహిస్తాయి.
  • సమాజంలో: లెక్చర్లు, స్పీచ్‌లు ద్వారా బాలల విద్య మరియు సంక్షేమం గురించి అవగాహన.
  • 1957లో దిల్లీలో తెల్ల గువ్వలు విడుదల చేశారు, ఒకటి నెహ్రూ తలపై వాలింది.

ఈ రోజు బాలలకు సంతోషం, సృజనాత్మకత మరియు సమాజ విలువలను నేర్పుతుంది. 2025లో కూడా సాంప్రదాయకంగా జరుపుకుంటున్నారు, థీమ్ ప్రకారం బాలల హక్కులపై దృష్టి సారిస్తున్నారు.

ఇకపై పోలీసులు ఎవర్ని అరెస్టు చేసిన. లికిత పూర్వకంగా కారణం తెలపాల్సిందే..! సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

0

(స్టేట్ బ్యూరో)నవంబర్,13,మెదక్ టుడే న్యూస్:

ఇకపై పోలీసులు ఎవర్ని అరెస్టు చేసిన. లికిత పూర్వకంగా కారణం తెలపాల్సిందే..! సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అరెస్టు అయిన నిందితుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించే దిశగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం.. ఎలాంటి నేరం కింద అరెస్టు చేసినా సరే, ఎలాంటి మినహాయింపులు లేకుండా అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా, నిందితుడికి అర్థమయ్యే భాషలోనే తెలియజేయాలని స్పష్టం చేసింది.

రాజ్యాంగంలోని అధికరణం 22(1) ప్రకారం.. అరెస్టు చేసిన వ్యక్తికి అరెస్టు కారణాలు సాధ్యమైనంత త్వరగా తెలియజేయాలనే అంశాన్ని ఈ తీర్పు బలంగా సమర్థించింది.

జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ 52 పేజీల తీర్పులో.. “ఇది ఏదో లాంఛనప్రాయంగా పాటించాల్సిన విధానం కాదు. ఇది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక రక్షణ” అని స్పష్టం చేశారు. ముఖ్యంగా తనను ఎందుకు అరెస్టు చేశారో, తనపై మోపిన నేరారోపణల స్వభావం ఏమిటో నిందితుడికి తెలియాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది.

ఈ జ్ఞానం మాత్రమే నిందితుడు న్యాయ సహాయం కోసం ప్రయత్నించడానికి, తనపై వచ్చిన ఆరోపణలకు తగిన విధంగా ప్రతిస్పందించడానికి వీలు కల్పిస్తుంది.

రిమాండ్‌కు 2 గంటల ముందు గడువు

సాధారణంగా అరెస్టు సమయంలోనే లిఖితపూర్వక కారణాలు ఇవ్వడం తప్పనిసరి. అయితే ప్రత్యేక పరిస్థితుల కారణంగా అరెస్టు సమయంలో కారణాలు తెలియజేయడం సాధ్యం కాకపోతే.. వాటిని రిమాండ్‌ కోసం న్యాయమూర్తి ఎదుట నిందితుడిని హాజరు పరచడానికి కనీసం రెండు గంటల ముందుగానైనా లిఖిత పూర్వకంగా అందజేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.ఈ గడువును పాటించడంలో విఫలం అయితే.. ఆ అరెస్టును, నిందితుడి రిమాండ్‌ను చట్టవిరుద్ధ చర్యగా పరిగణించే అవకాశం ఉంటుందని పేర్కొంది.ఈ తీర్పు ముంబయిలో 2024లో జరిగిన బీఎండబ్ల్యూ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నిందితుడు మిహిర్‌ రాజేశ్‌ షా దాఖలు చేసిన అప్పీలుపై వెలువడింది. తన అరెస్టుకు గల కారణాలను రాతపూర్వకంగా ఇవ్వలేదనే కారణంపై షా తన అరెస్టు చట్టబద్ధతను సవాలు చేశారు.సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ చారిత్రక తీర్పు అమలు కోసం, దీని ప్రతులను అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరళ్లకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

ఎవరెస్ట్ గిరిపుత్రిక మలావత్ పూర్ణకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పరామర్శ..

0

(స్టేట్ బ్యూరో)నిజామాబాద్ జిల్లా,నవంబర్,13,మెదక్ టుడే న్యూస్:

•ఎవరెస్ట్ గిరిపుత్రిక మలావత్ పూర్ణకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పరామర్శ

బీ కుటిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం కుటి ఎవరెస్ట్ అధిరోహకురాలు మలావత్ పూర్ణకు ఫోన్ చేసి మాట్లాడారు. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గిరిపుత్రికగా పేరు తెచ్చుకున్న మలావత్ పూర్ణ తండ్రి దేవీదాస్ కన్నుమూయడంతో, కేటీఆర్ ఆమెను ఓదార్చారు.కేటీఆర్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల బిజీలో ఉన్నప్పటికీ, ఈ విషాద వార్త తెలుసుకుని వెంటనే నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలం, పాకాల గ్రామంలో ఉన్న పూర్ణకు కాల్ చేశారు. పూర్ణ తండ్రి మరణం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పూర్ణకు ధైర్యం చెప్పిన కేటీఆర్, త్వరలోనే స్వయంగా వచ్చి ఆమె కుటుంబాన్ని కలవనున్నట్లు హామీ ఇచ్చారు.

డిసెంబర్ 6న ఢిల్లీలో 6 చోట్ల పేలుళ్లకు జైషే కుట్ర..పట్టుబడ్డ ఉగ్రవాదుల వెల్లడి,,బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకార దాడులకు ప్లాన్..

0

(స్టేట్ బ్యూరో)ఢిల్లీ నవంబర్,13,మెదక్ టుడే న్యూస్:

•డిసెంబర్ 6న ఢిల్లీలో 6 చోట్ల పేలుళ్లకు జైషే కుట్ర.. పట్టుబడ్డ ఉగ్రవాదుల వెల్లడి,బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకార దాడులకు ప్లాన్

•సహచరులు పట్టుబడడంతోనే డాక్టర్ ఉమర్ ఆత్మాహుతి దాడి

•1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేసిన కరసేవకులు

•ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై వెనక ఉగ్రవాదుల భారీ కుట్ర తాజాగా వెలుగులోకి వచ్చింది.

బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా వచ్చే నెల 6న ఢిల్లీ– ఎన్సీఆర్ పరిధిలో ఆరేడు చోట్ల పేలుళ్లు జరపాలని ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు తేలింది. ఈ కుట్రను అమలు పరిచే క్రమంలో కారులో అసాల్ట్ రైఫిల్ తో ఓ డాక్టర్ పట్టుబడడం, మిగతా ఉగ్రవాదులనూ పోలీసులు అరెస్టు చేయడంతో పేలుళ్ల ప్లాన్ బెడిసికొట్టింది. సహచరులంతా పట్టుబడడంతో డాక్టర్ ఉమర్ మొహమ్మద్ ఎర్రకోట వద్ద కారులో ఆత్మాహుతి దాడి చేశాడని అధికారులు తెలిపారు.1992 డిసెంబర్ 6న ఢిల్లీలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేసిన విషయం తెలిసిందే. రామజన్మభూమిలో మసీదు నిర్మించారనే ఆరోపణలతో కరసేవకులు ఈ కూల్చివేతకు పాల్పడ్డారు. దీనిపై పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న జైషే మహ్మద్ సంస్థ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. బాబ్రీ కూల్చివేతకు ప్రతీకారంగా భారత్ లో పేలుళ్లకు పాల్పడతామని తెలిపింది. తాజాగా వచ్చే నెల 6వ తేదీన ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో పేలుళ్లకు ప్లాన్ చేసింది.పోలీసులకు పట్టుబడక ముందు ఉగ్రవాదులు ఢిల్లీలోని పలు ప్రాంతాలలో రెక్కీ నిర్వహించినట్లు తేలింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ మహ్మద్ ఎరుపు రంగు కారులో ఎర్రకోటతో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించాడని పట్టుబడిన ఉగ్రవాదులు వెల్లడించినట్లు సమాచారం. డాక్టర్లు కావడంతో వారిని ఎవరూ అనుమానించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పేలుళ్లకు అవసరమైన ఐఈడీ సహా ఇతరత్రా ఏర్పాట్లను ఉగ్రవాదులు పకడ్బందీగా చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కారులో అసాల్ట్ రైఫిల్ తో డాక్టర్ పట్టుబడడంతో ఈ ఉగ్రవాద డొంక కదిలిందని, మిగతా ఉగ్రవాదులు పట్టుబడడంతో పేలుళ్ల కుట్ర భగ్నమైందని అధికారులు వెల్లడించారు.