📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 59

అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల..

0

అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి.

అమీన్పూర్,నవంబర్,15,
(మెదక్ టుడే న్యూస్)ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఓడిఎఫ్ కాలనీలో ప్రకాష్ రెడ్డి కన్నె స్వామి,విజయ రాఘవరెడ్డి కన్నె స్వామి, వి. రామ్ రెడ్డి గురు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి. మాజీ చైర్మన్ పాండురంగ రెడ్డి మాట్లాడుతూ ఆర్య పుత్రుడు అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కార్తీక మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మాలవేసి ఆ శబరిమలకు వెళ్తున్న స్వాములందరికీ ధన్యవాదాలు అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కొల్లూరు మల్లేష్, సీనియర్ నాయకులు కొల్లూరు యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కేవల్ కిషన్ విగ్రహం వద్ద నివాళులర్పించిన,జన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత..

0

కేవల్ కిషన్ విగ్రహం వద్ద నివాళులర్పించిన,
జన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత

చేగుంట నవంబర్ 15 మెదక్ టుడే న్యూస్:

మెదక్ జిల్లా చేగుంట మండలం, పొలంపల్లి గ్రామ శివారులోని గల ముదిరాజ్ ముద్దుబిడ్డ కామ్రేడ్ కేవల్ కిషన్ సమాధి వద్ద తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత కేవల్ కిషన్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. అనంతరం కవిత మాట్లాడుతూ. మెదక్ జిల్లాలో ప్రజా విప్లవానికి చేయూతనిచ్చి ప్రజలకు అనుకూలంగా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినవారు కేవల్ కిషన్. ముదిరాజు ముద్దుబిడ్డ కేవల్ కిషన్ అని అన్నారు. వారు బ్రతికి ఉన్నన్ని రోజులు నాకు ప్రజలే ముఖ్యమని అన్న కేవల్ కిషన్,వారి స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ బాటలు వేసేందుకు మేము కూడా సంతోషిస్తున్నాను అన్నారు. ముదిరాజుల్లో పుట్టడం ముదిరాజ్ బిడ్డలు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి అని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో జన జాగృతి నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

స్పెషల్ లోక్-అదాలత్‌లో బాగంగా మెదక్ జిల్లాలో 503 కేసుల రాజీ..

0

•స్పెషల్ లోక్-అదాలత్‌లో బాగంగా మెదక్ జిల్లాలో 503 కేసుల రాజీ..

•జిల్లా ఎస్ పి డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్.

మెదక్,నవంబర్,15,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి

స్పెషల్ లోక్-అదాలత్ కార్యక్రమం లో భాగంగా, మెదక్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన రాజీ పడదగిన 503 కేసులను లోక్-అదాలత్‌లో సమర్థవంతంగా పరిష్కరించడం జరిగింది. ఇరు వర్గాలను సమన్వయం చేస్తూ, పరస్పర రాజీకి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించి కేసులను పరిష్కరించుకోవడం జరిగింది.ప్రత్యేకంగా సైబర్ నేరాలకు సంబంధించిన 41 కేసుల్లో, బాధితులు కోల్పోయిన రూ. 11,44,608/- మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేయునట్లు సంబంధిత బ్యాంకుల నోడల్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ అనేది క్షణికావేశంలో జరిగే చిన్నపాటి వివాదాలు, గొడవలను శాంతియుతంగా పరిష్కరించుకునే అద్భుత వేదిక. కోర్టుల్లో సంవత్సరాల తరబడి నిలిచే కేసులను ఇరు వర్గాల రాజీ ద్వారా పరిష్కరించుకోవడం సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. రాజీ మార్గమే రాజమార్గం అనే భావన ప్రతి ఒక్కరిలో పెరగాలని అన్నారు.జిల్లాలో లోక్-అదాలత్ విజయవంతం కావడంలో పాత్ర వహించిన పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది, సైబర్ క్రైమ్ యూనిట్ సిబ్బందిని ఎస్ పి అభినందించారు.

హై కోర్టు తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు..

(స్టేట్ బ్యూరో)హైదరాబాద్,నవంబర్,15,మెదక్ టుడే న్యూస్:

హై కోర్టు తెలంగాణలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 24వ తేదీ లోపు లోకల్ బాడీ ఎన్నికలపై తేల్చాలని సూచించింది.మేంరిజర్వేషన్ల మీదే అభ్యంతరం చెప్పాం కానీ ఎన్నికల నిర్వహణఫై కాదని హైకోర్టు పేర్కొంది. బీసీ రిజర్వేషన్లపై వివాదం లేనిచోట ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ పేర్కొనడంతో.. ఎస్‌ఈసీ తీరుపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విభజించి ఎన్నికలు నిర్వహించడం సరికాదని హైకోర్టు సూచించింది. నవంబర్ 24వ తేదీలోపు ఎన్నికల తేదీలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.గతంలో బీసీ రిజర్వేషన్ల వలన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నిలిచిపోయింది. ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడదల చేయడంతోపాటు ఎన్నికల నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. అయితే, బీసీ రిజర్వేషన్లపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులు జోక్యంతో ఎన్నికలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేసిన విషయం తెలిసిందే. అయితే, అత్యున్నత న్యాయస్థానం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరిస్తూ డిస్మిస్ చేసింది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్పింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. తాజాగా. హైకోర్టులో ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. 24వ తేదీలోపు ఎన్నికల తేదీలు ప్రకటించాలని సూచించింది.

హోమ్ గార్డుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని అదనపు ఎస్ పి సమీక్ష..

0

హోమ్ గార్డుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ సమీక్ష

మెదక్,నవంబర్,15,మెదక్ టుడే న్యూస్:

శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు హోం గార్డ్స్ కు ప్రమాద భీమా, ఆరోగ్య భీమా పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి జిల్లా ఎస్ పి శ్రీ. డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్  ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎ స్ పి శ్రీ. ఎస్ మహేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ, అకౌంట్ హోల్డర్ ప్రమాదంలో మరణిస్తే వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు రూ.40 లక్షలు పొందవచ్చని తెలిపారు.ఈ సందర్భంగా అదనపు ఎస్ పి మాట్లాడుతూ,హోమ్ గార్డులు జిల్లా పోలీస్ వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తూ ప్రజల రక్షణలో ఎల్లప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. ఈ సిబ్బందికి అవసరమైన సహాయం, మార్గదర్శకత మరియు సంక్షేమ కార్యక్రమాలను అందించడం పోలీస్ శాఖ యొక్క ప్రధాన బాధ్యత అని తెలిపారు. ఆర్థిక నిర్వహణ, పొదుపు అలవాట్లు, భవిష్యత్ ప్రణాళికపై సరైన అవగాహన పెంపొందితే కుటుంబాలు మరింత స్థిరతను, భద్రతను పొందగలవని వివరించారు.అకస్మాత్తుగా మరణం సంభవించిన సందర్భంలో కుటుంబాలకు కనీస ఆర్థిక భరోసా అందించడానికి టర్మ్ ఇన్సూరెన్స్ లేదా లైఫ్ కవర్ తప్పనిసరి అని ఆయన సూచించారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే భవిష్యత్తులో పెద్ద ఆర్థిక భారం కావచ్చని, అందువల్ల సరైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కుటుంబాన్ని ఆర్థిక నష్టాల నుండి రక్షిస్తుందని తెలిపారు. పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సేవింగ్స్ ప్లాన్‌లు, విద్యా పాలసీలు వంటి పథకాలలో పెట్టుబడి పెట్టడం ఎంతో మంచిదన్నారు.యాక్సిస్ బ్యాంక్ అందిస్తున్న తక్కువ ప్రీమియంతో కూడిన ప్రత్యేక ఇన్సూరెన్స్ ప్యాకేజీలు, కుటుంబ కవర్, క్యాష్‌లెస్ చికిత్స వంటి ప్రయోజనాలను ప్రతి హోమ్ గార్డ్ సిబ్బంది తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం మరియు ప్రైవేట్ బ్యాంకులు అందిస్తున్న రుణ పథకాలు, పొదుపు పథకాలు, బీమా సేవలు, పెన్షన్ ప్రయోజనాలు వంటి సౌకర్యాలు కూడా సిబ్బంది కుటుంబ భద్రతకు చాలా ఉపయోగకరమని పేర్కొన్నారు.హోమ్ గార్డుల సంక్షేమాన్ని మెరుగుపర్చేందుకు రాబోయే రోజుల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, ఆర్థిక సలహా శిబిరాలను నిర్వహించే దిశగా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని అదనపు ఎస్ పి  తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలంటే సిబ్బంది సంక్షేమం కూడా సమాన ప్రాధాన్యత కలిగి ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీ రంగా నాయక్, ఆర్‌ఐ శ్రీ శైలేందర్, ఆర్‌ఎస్‌ఐ శ్రీ నరేష్,యాక్సిస్ బ్యాంక్ అధికారులు, హోమ్ గార్డ్ రైటర్ శ్రీ శ్రావణ్ మరియు జిల్లా హోమ్ గార్డులు పాల్గొన్నారు.

పాపన్నపేట మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాసిల్దార్ తో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్..

0

పాపన్నపేట,నవంబర్,15,మెదక్ టుడే న్యూస్:

ధాన్యం డబ్బులు చెల్లింపులో మరింత వేగం పెంచాలి కలెక్టర్

జిల్లాలో ఇప్పటివరకు
1,14,077.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 102.84 కోట్ల చెల్లింపులు

కొనుగోళ్లల్లో ఇంకా వేగం పెరగాలి

ట్యాగ్ చేసిన మిల్లులకే ధాన్యం తరలించాలి

•కొనుగోళ్ల పర్యవేక్షణ కై పటిష్ట చర్యలు

•జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ధాన్యం డబ్బులు చెల్లింపులలో మరింత వేగం పెంచాలని ‌ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.పాపన్నపేట మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాసిల్దార్ తో కలిసి పరిశీలించారు.ముందుగా కేంద్రానికి ఇప్పటివరకు వచ్చిన ధాన్యం ఎంత, అందులో ఎంత మేరకు కొనుగోలు చేసారు… ఇంకా తేమ శాతం రావాల్సిన ధాన్యం ఎంత ఉంది, కొనుగోలు పూర్తి అయిన ధాన్యం వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసారా లేదా, అలాగే కొనుగోలు అయిన ధాన్యంట్యాగ్ చేసిన మిల్లులకి తరలిస్తున్నారా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,ఈ ఖరీఫ్ సీజన్ కి సంబందించి…ధాన్యం డబ్బుల చెల్లింపులలో మరింత వేగం పెంచి ముందుకు పోవాలని తెలిపారు.గత సంవత్సరం ఇదే నెలలో 10,185 మంది రైతుల నుంచి 61,231.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 4.71 కోట్ల రూపాయలను చెల్లించగా,ప్రస్తుత సీజన్ కి… ఇప్పటివరకు 27,252 మంది రైతుల నుండి 1,14,077.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 102.84 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు.తేమ శాతం వచ్చి కొనుగోలు కి సిద్ధంగా ఉన్న ధాన్యం కొనుగోలు వేగవంతం గా జరగాలన్నారు.అదే విధంగా కొనుగోలు కి సంబందించిన
రిజిస్టర్ లన్ని పక్కాగా నిర్వహించాలన్నారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా.
స్పెషల్ ఇన్స్పెక్షన్ టీం ను నియమించి పర్యవేక్షణ చేసేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసీ సమాజానికి మార్గదర్శి బిర్సా ముండాజిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

0

మెదక్,నవంబర్,15,మెదక్ టుడే న్యూస్:

ఆదివాసీ సమాజానికి మార్గదర్శి బిర్సా ముండాజిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ,అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలు వేసి, జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ,
భారత దేశాలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన హక్కుల కోసం పోరాడిన మహానాయకుడు బిర్సా ముండా త్యాగాలను, ఆదర్శాలను గుర్తుచేశారు.
ఆయన జీవితమే ఆదివాసీ హక్కుల సాధనకు, స్వాతంత్ర్య పోరాటానికి స్పూర్తి దాయకం అన్నారు.
బిర్సా ముండా పోరాటం భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒక వినూత్న ఘట్టంగా చరిత్రలో నిలిచిపొతరన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిసిఓ ఎల్లయ్య ట్రైబల్ వెల్ఫేర్ అధికారి నీలిమ, విద్యార్థులు, సిబ్బంది దళితులు పాల్గొన్నారు.