పాపన్నపేట మండల పరిధిలోని నాగ్సన్ పల్లి వేణు గోపాల స్వామీ దేవాలయం ప్రాంతంలో ఆదివారం రోజు పాపన్నపేట మండల ఆర్యవైశ్య సంఘం,మహిళా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మండల ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ఎన్నుకుని ప్రమాణ స్వీకారం చేశారు.అధ్యక్షులుగా కొత్త వెంకటేశం గుప్తా, ప్రధాన కార్యదర్శిగా బెజగం విఠలేశ్వర్ గుప్తా, కోశాధికారిగా గడ్డం రాజు గుప్తా, మహిళ మండల సంఘం అధ్యక్షురాలు కొత్త సరస్వతి,ప్రధాన కార్యదర్శిగా సిద్ధంశెట్టి స్వప్న,కోశాధికారిగా కొత్త శివ జ్యోతిలు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో మండలంలోని ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్తీక వనభోజనాలు స్వీకరించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
•పోలీస్ జర్నలిస్టుల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జిల్లా ఎస్ పి శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్..
మెదక్,నవంబర్,16,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి
ఆదివారం మెదక్ జిల్లా ఎస్ పి శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు సిబ్బంది మరియు జర్నలిస్టుల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రెండు జట్లూ ఉత్సాహంతో పాల్గొని క్రీడాస్పూర్తిని ప్రదర్శించాయి.మ్యాచ్ ప్రారంభానికి ముందుగా రెండు జట్లు గ్రౌండ్‌కు చేరుకున్నాయి. మొదట టాస్ గెలిచిన జర్నలిస్టుల జట్టు కెప్టెన్ నరేష్ గారు బ్యాటింగ్ ఎంచుకుంన్నారు. ప్రతిభావంతమైన షాట్లతో జర్నలిస్టుల జట్టు 15.5 ఓవర్లలో 101 పరుగులు 10 వికెట్లు కోల్పోయారు.తదుపరి ఇన్నింగ్స్‌లో 102 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా పోలీస్ జట్టు క్రమబద్ధంగా రన్స్ సాధిస్తూ ముందుకు సాగింది. 2 వికెట్లు మాత్రమే కోల్పోయి, 11.4 ఓవర్లలో లక్ష్యాన్ని చెదించగలిగింది. చివరి పరుగును స్వయంగా జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు.
మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన నరేష్ ఆర్‌ఎస్ఐకి “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” బహుమతిని, రన్నరప్‌గా నిలిచిన జర్నలిస్టుల జట్టుకు, విన్నర్‌గా నిలిచిన పోలీస్ జట్టుకు జిల్లా ఎస్ పి శ్రీనివాస రావు ఐపీఎస్ మరియు మెదక్ ఎమ్మెల్యే బహుమతులను అందజేశారు.
జిల్లా ఎస్ పి ఈ సందర్బంగా మాట్లాడుతూ, క్రీడలు శారీరక ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు, జట్టు భావన అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. పోలీస్-మీడియా సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇలాంటి స్నేహపూర్వక కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో మెదక్ పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో అత్యాధునిక ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్నా క్రికెట్ గ్రౌండ్ ను అతి త్వరలో ఒక అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్ తో ప్రారంభింప చేస్తామన్నారు. జిల్లా యువత కు ఉచిత క్రికెట్ కోచింగ్ క్యాంపు లు నిర్వహించే విధంగా కృషి చేస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని స్నేహపూర్వహక మ్యాచ్ లు నిర్వహిస్తామని ఎస్ పి తెలిపారు.ఈ ప్రెండ్లీ మ్యాచ్ కార్యక్రమంలో మెదక్ అదనపు ఎస్ పి శ్రీ. ఎస్ మహేందర్, మెదక్ డియస్ పి ప్రసన్న కుమార్, తూప్రాన్ డియస్ పి నరేందర్ గౌడ్, ఏఆర్ డియస్ పి రంగా నాయక్, సీఐ లు వెంకట రాజా గౌడ్, రాజా శేఖర్ రెడ్డి, జర్జ్, ఆర్ఐ లు శైలందర్, రామకృష్ణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరేష్ గౌడ్, జర్నలిస్ట్ మిత్రులు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
•నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి..
పాపన్నపేట,నవంబర్,16,మెదక్ టుడే న్యూస్:
పాపన్నపేట మండల పరిధిలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు అట్కరి గోపాల్ రావు కుమారుడు రాజాశేఖర్ వివాహం కీర్తనతో ఇటీవల జరిగింది, మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి లు ఆదివారం ఆరేపల్లిలో నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ,సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు కుమ్మరి జగన్, బాల గౌడ్ తాజా మాజీ సర్పంచ్ లు శ్రీనాథ్ రావు, మల్లేశం, మాజీ ఏడుపాయల డైరెక్టర్ కాశమల.శ్రీనివాసరావు,మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్,మాజీ కౌన్సిలర్లు మామిళ్ళ ఆంజనేయులు ఆర్కే. శ్రీనివాస్ గడ్డమీద కృష్ణ గౌడ్, ఆరెపల్లి బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు, నాయకులు అట్కరి బాలాజీ రావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్ఎస్ఎస్ క్యాంప్ సమాజసేవకు ఎంతగానో ఉపయోగపడుతుందని మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేటలో ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎన్ఎస్ఎస్ క్యాడేట్ గా 13 శిబిరాల్లో పాల్గొని ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానని వెల్లడించారు, ఈ క్యాంప్ ఎన్ఎస్ఎస్ క్యాడెట్లకు ఎన్నో విషయాలను నేర్పుతుందన్నారు, ఎన్ఎస్ఎస్ శిబిరం ద్వారా క్యాడెట్లు సమాజానికి సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు, ఇందులో భాగంగా మొదటి రోజు ర్యాలీ నిర్వహించారు, ఈ కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగుతుందని ఎన్ఎస్ఎస్ చైర్మన్ నర్సింలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జూలకంటి శ్రీనివాస్ , కళాశాల స్టూడెంట్ కౌన్సిలర్ ఎస్ .సంతోష్ కుమార్ జువాలజీ లెక్చరర్ బి.ప్రవీణ్ , అధ్యాపక అధ్యాపకేతర బృందం, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.
నవంబర్ 17న న్యూ ఢిల్లీ,జంతర్ మంతర్ లో జరగనున్న దళితులఆత్మ గౌరవ ప్రదర్శన వేదిక ప్రాంతం పరిశీలన చేసిన ఎం ఎం.ఆర్.పి.ఎస్, వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ,ఆత్మగౌరవ ప్రదర్శన ఏర్పాట్లుకుసంబందించి టెంట్ హౌస్. సౌండ్ సిస్టం వర్కర్స్ కు సూచనలు చేయడం జరిగింది,కార్యక్రమం ప్రశాంతంగా జరగడానికి మా ఎం ఆర్ పి ఎస్ నాయకులు,కార్యకర్తల నుండి సంపూర్ణ సహకారం అందిస్తామని, పోలీస్ వారు కూడా అందుకు సహకారం అందించాలని,పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ అధికారి మనోజ్ భాటియా కి, ధర్నా చౌక్ ఇంచార్జి పోలీస్ అధికారి జితేంద్ర కి విజ్ఞప్తి చేశారు.
న్యూడిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లిఖార్జున ఖర్గేని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్,జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఉప ఎన్నికలో గెలుపొందిన శ్రీ నవీన్ యాదవ్ ని శ్రీ ఖర్గే కి పరిచయం చేశారు.
చేగుంట మండలంలోని చేగుంట కాంప్లెక్స్ తపస్ కన్వీనర్ గా కొండ చరణ్ (ఎంపీపీఎస్ చేగుంట బాయ్స్ స్కూల్),కో కన్వీనర్ గా కే.విజయలత (ఎంపీపీఎస్ చేగుంట గర్ల్స్ స్కూల్) బోనాల కాంప్లెక్స్ కన్వీనర్ గా శ్రీనివాస్ (ఎంపీపీఎస్ రుక్మాపూర్),కో కన్వీనర్ గా స్వరూపరాణి, (ఎంపీపీ ఎస్ కిష్టాపూర్) మక్కరాజ్ పేట్ కాంప్లెక్స్ కన్వీనర్ గా సంగీత (ఎంపీపీఎస్ కసాన్ పల్లి),కో కన్వీనర్ గాఎం నరేష్ (ఎంపీపీఎస్ చందాయి పేట్), ఎన్నికైనట్టు తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం చల్లా లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తపస్ చేగుంట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రావుల వెంకటేష్, తంగేళ్లపల్లి కృష్ణమూర్తి, జిల్లా బాధ్యులు మల్లారెడ్డి, బాలిశెట్టి రేఖ, దేశపతి కృష్ణమూర్తి, ప్రభాకర్, పట్లూరి యాదగిరి, తిరుపతి, సుమతి, మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్, అమరేశ్వరి, మండల బాధ్యులు రాధా,సరస్వతి,ఎం శ్రీనివాస్,భూపాల్, నరసింహారెడ్డి, బంగారయ్య,వీణ, మంజులత,సంధ్యారాణి, ఉమాదేవి, వనిత, శ్రీలత,తదితరులు పాల్గొన్నారు.
టిఆర్ టిఎఫ్ చేగుంట మండల అధ్యక్షులుగా కే జగన్ లాల్, ఎస్ఏ(హిందీ) జెడ్పిహెచ్ఎస్ కరీంనగర్ మండల ప్రధాన కార్యదర్శిగా దేవరాజ్, ఎస్ జి టి యుపిఎస్ పులిమామిడి, ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల టిఆర్ టిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు మెంగర్తి ప్రణీద్ కుమార్ అభినందనలు తెలియజేశారు. ప్రణీద్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉద్యమ స్పూర్తితో ముందుకు నడుస్తుంది. ఉపాధ్యాయ మిత్రులంతా, టిఆర్ టిఎఫ్ ను అందరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నూతన మండల కమిటీ సంఘ్ కార్యక్రమాలను ఉపాధ్యాయులకు చేరవేస్తూ, వారికి చేరువ కావాలని సూచించారు.నూతన కమిటీ మాట్లాడుతూ మాపై నమ్మకముంచి భాద్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ,ఉపాధ్యాయుల శ్రేయస్సుకై తమ వంతు భాద్యత నెరవేరుస్తామని హామీ ఇచ్చారు జిల్లా కౌన్సిలర్ లుగా వి వెంకన్న, పిఎస్ హెచ్ఎం బోనాల అబ్దుల్ రషీద్, ఎస్ఏ(బయో), శ్రీనివాస్, ఎస్జిటి లు ఎన్నికయ్యారు.
బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో లక్ష బిల్వర్చన కార్యక్రమం ఘనంగా
అమీన్పూర్,నవంబర్,15,మెదక్ టుడేన్యూస్: ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా భక్తుల సందడి నడుమ లక్ష బిల్వర్చన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆలయ ప్రధాన అర్చకులు ప్రహ్లాద్ వేదమంత్రోచ్ఛారణలతో పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి సంవత్సరం మోహన్‌రావు కుటుంబ సభ్యులు విశేష భక్తితో లక్ష బిల్వర్చన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఈవో శశిధర్ గుప్త, జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జున రెడ్డి, లక్ష్మీకాంతరావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొని ఏర్పాటు చేసిన సేవలను పర్యవేక్షించారు.శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని కూడా ఈ సందర్భంగా ఘనంగా నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.
జాతీయ రహదారి 44 హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన భార్య మృతిచెందగా, భర్త, కుమారుడు ఇద్దరికి గాయాలైన సంఘటన ఇస్లాంపూర్ గ్రామంలో విషాదాయ ఛాయలు అలుముకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.తన కుమారుని స్కూల్ ఫీజు కట్టి ఇంటికి వస్తుండగా దంపతులు ప్రయాణిస్తున్న బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొన్న ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందిన దుర్ఘటన శనివారం చోటుచేసుకుంది.తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన పాటి చందూ, తన భార్య పాటి లక్ష్మీ, కుమారుడు తనయ్ (6) తో కలిసి మాసాయిపేట మండలం రామంతాపూర్ లోని జాన్సన్ అకాడమీ స్కూల్‌కు వెళ్లి ఫీజు కట్టి తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఇదే సమయంలో వెనుకనుంచి వచ్చిన కంటైనర్ లారీ బైక్‌ను ఢీకొనడంతో పాటి లక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందింది. పాటి చందూకు తలకు తీవ్రమైన గాయాలు, చిన్నారి తనయ్‌కు కూడా గాయాల య్యాయి వెంటనే 108 అంబులెన్స్ పైలెట్ భాను సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఇస్లాంపూర్ మాజీ సర్పంచ్ జంగం రమేష్ మాట్లాడుతూ ఈ ప్రమాదం గ్రామంలో తీవ్ర విషాదాన్ని కలిగించిందని, గాయపడిన వారి చికిత్స కోసం అవసరమైన సహాయం అందిస్తున్నామని తెలిపారు.