📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 57

రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్..

0

•రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,(స్టేట్ బ్యూరో)నవంబర్,17, మెదక్ టుడే న్యూస్:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో తన రేషన్ షాపులో స్టాక్ లేనందుకు, పనివేళ్లలో రేషన్ షాపు మూసివేసినందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు, రేషన్ షాపు యజమాని వద్ద రూ.30 వేలు లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ యాకూబ్ పాషా,డీలర్ల సంఘం అధ్యక్షుడి ద్వారా లంచం తీసుకుంటున్న డిప్యూటీ తహసీల్దార్ యాకూబ్ పాషా, గిరిజన సాంకేతిక సహాయకుడు విజయ్ కుమార్ ను హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

పశు వైద్యశాల భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రోహిత్..

0

పాపన్నపేట,నవంబర్,17,మెదక్ టుడే న్యూస్:

మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు
అందాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలో పాపన్నపేట మండలం చికోడు గ్రామంలో ,20 లక్షల నాగ్సన్ పల్లి గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగానిర్మాణం పూర్తి చేసుకున్న 02 పశువైద్యశాల భవనాలు సోమవారంప్రారంభించారు. నియోజకవర్గంలో పశు వైద్య భవనాలను నిర్మించడంతోపాటు ‌అన్ని వసతులు కల్పించి పశుపక్షాదులకు డాక్టర్లు సిబ్బంది అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పశు పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య,పంచాయతీరాజ్ డి.ఇ పాండురంగారావు, ఎంపీడీవో విష్ణువర్ధన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశాంత్ రెడ్డి,గోవింద నాయక్,ఆకుల శ్రీనివాస్,గౌస్,శ్రీకాంత్ అప్ప, కాంగ్రెస్ పార్టీ నాయకులుతదితరులు పాల్గొన్నారు.

పేదల ప్రజల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయనిధి. ఎమ్మెల్యే..

0

పేదల ప్రజల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయనిధి. ఎమ్మెల్యే..

బాధిత కుటుంబానికి రూ.2,50,000/-ల ఎల్ఓసి కాపీనీ అందజేసిన మెదక్ ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్..

ఆపధకాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కు కృతజ్ఞతలు తెలిపిన మస్కారి లక్ష్మయ్య కుటుంబ సభ్యులు..

పాపన్నపేట,నవంబర్,17,మెదక్ టుడే న్యూస్:

మెదక్ లో సోమవారం పాపన్నపేట మండలం పరిధిలోని యూసుఫ్ పేట గ్రామానికి చెందిన మాస్కారి లక్ష్మయ్య అనారోగ్య సమస్యతో బాధపడుతున్న క్రమంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసి నుంచి రూ.2,50,000 (2లక్షల 50 వేల రూపాయలు) ఎల్ఓసి కాపీనీ మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ మైనాంపల్లి రోహిత్ ప్రత్యేక చొరతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి లో చికిత్స కోసం మాస్కారి లక్ష్మయ్య కుటుంబ సభ్యులకు,ఎల్ ఓ సి,కాపీనీ అందజేశారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు వైద్య విషయంలో అన్ని విధాలుగా అండగా ఉంటుందని, స్థానిక శాసనసభ్యుడిగా నా దృష్టికి వచ్చిన అనారోగ్య సమస్యల పట్ల నా వంతు సహాయ సహకారం అందించే కృషి చేస్తానని తెలిపారు.నా మెదక్ నియోజకవర్గ ప్రజలందరికి విజ్ఞప్తి లక్షల రూపాయలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆసుపత్రిల దోపిడికి గురై అప్పుల పాలు కావద్దు విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వ నిమ్స్ హాస్పిటల్ వెళ్లి నేను ఇచ్చే ఎల్వోసీ ద్వారా ఉచిత చికిత్స పొందాలనీ ఈ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యే రోహిత్ రావు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్బంగా మాస్కార్ లక్ష్మయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే రో హిత్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి, తమ కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశాంత్ రెడ్డి, గోవింద నాయక్, శ్రీకాంత్ అప్ప,ఆకుల శ్రీనివాస్,గౌస్,రాజశేఖర్, తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

రోజుకు మినిమమ్ రూ. 3 నుంచి 5 లక్షలు..!సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి దందా.. ఏసీబీ దాడుల్లో వెలుగులోకి..

0

రోజుకు మినిమమ్ రూ. 3 నుంచి 5 లక్షలు..! సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి దందా.. ఏసీబీ దాడుల్లో వెలుగులోకి

డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తుల కనుసన్నల్లోనే పనులు
ఒక్కరోజు తనిఖీలతోనే రిజిస్ట్రార్ ఆఫీసుల సిబ్బంది బెంబేలు
ఏసీబీ దాడులు కొనసాగితే మూకుమ్మడిగా సెలవులో వెళ్తామని హెచ్చరికలు

(స్టేట్ బ్యూరో)నవంబర్,17,మెదక్ టుడే న్యూస్:

హైదరాబాద్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమార్కులు ఏకంగా ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ను సృష్టించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారని ఏసీబీ దాడుల్లో వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కేవలం కొన్ని గంటల పాటు జరిగిన తనిఖీల్లోనే అధికారుల అక్రమ సంపాదన చూసి ఏసీబీ అధికారులు సైతం విస్తుపోయినట్టు తెలుస్తున్నది. కొన్ని కీలక ప్రాంతాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోని సిబ్బంది స్థానిక రాజకీయ నాయకులు, దళారులు, డాక్యుమెంట్ రైటర్లతో కలిసి రోజుకు కనీసం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అక్రమంగా ఆర్జిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

భూముల రిజిస్ట్రేషన్, మార్కెట్ విలువ నిర్ధారణ వంటి అత్యవసర పనులకు కూడా సాధారణ ఫీజు కంటే అదనంగా పెద్ద మొత్తంలో ముడుపులు సమర్పించుకోవాల్సి వస్తోందని తేల్చారు. ఈ దందా అంతా కూడా కార్యాలయ సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్ల కనుసన్నల్లోనే అత్యంత పకడ్బందీగా సాగుతోందని తెలుస్తున్నది. ఆఫీసు బయట కూర్చునే కొందరు ప్రైవేట్ వ్యక్తులే లోపల జరిగే ప్రతి లావాదేవీని, రేటును శాసిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్తున్నారు.

లంచం డబ్బులు ఎక్కడా రికార్డుల్లో కనిపించకుండా, కేవలం కోడ్ భాషలో వ్యవహారాలు నడుపుతూ, లంచం మొత్తం సేకరించిన తర్వాతే పత్రాలు ముందుకు కదిలేలా వారు తమదైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని తనిఖీల్లో తేలింది. దీంతో ఆఫీస్ సిబ్బంది, రిజిస్ర్టేషన్తో సంబంధం ఉన్న వ్యక్తులు కాకుండా ఇతరులను రిజిస్ట్రార్ ఆఫీసుల్లోకి రాకుండా నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

•ఏరియాను బట్టి మారుతున్న లంచాల రేటు..

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉన్న ప్రాంతాన్ని బట్టి ఈ లంచాల రేటు కూడా మారుతోందని తెలుస్తోంది. నగరాలు, శివారు ప్రాంతాల్లో ఉన్న విలువైన భూముల రిజిస్ట్రేషన్లలో దోపిడీ మరింత అధికంగా ఉందని చెప్తున్నారు. కొన్నిచోట్ల ఎలాంటి లిటిగేషన్ లేని సాధారణ రిజిస్ట్రేషన్‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు లంచంగా తీసుకుంటున్నారని.. మరికొన్నిచోట్ల ఈ మొత్తం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు కూడా చేరిందని పేర్కొంటున్నారు. అంటే, ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి తన జీవితంలో అతి ముఖ్యమైన ఆస్తిని రిజిస్టర్ చేసుకోవాలంటే, చట్టబద్ధమైన ఫీజుతో పాటు అదనంగా వేల రూపాయలు అక్రమార్కులకు ముట్టజెప్పాల్సిన దుస్థితి ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.

ఏదైనా భూమికి చిన్నపాటి లిటిగేషన్ (వివాదం) ఉన్నా, లేదా నిబంధనల విషయంలో కొంత సడలింపు అవసరమైన పనులు చేయించుకోవాలన్నా పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని.. అలాంటి కేసుల్లో లంచం మొత్తం వేలల్లో కాకుండా ఏకంగా లక్షల రూపాయల్లో ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. అధిక మొత్తంలో లంచం తీసుకుని చట్టాన్ని, నిబంధనలను సైతం పక్కన పెట్టి రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ అండదండలు ఉన్న కొందరు డాక్యుమెంట్ రైటర్లు, దళారులు ఈ లంచాల దందాను నడిపిస్తూ, వసూలు చేసిన మొత్తాన్ని అధికారులు, సిబ్బందికి పంచుతున్నట్లు తెలుస్తోంది.

•అంతా బయట వ్యక్తులు.. డాక్యుమెంట్ రైటర్లతోనే

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది తమ సొంత కార్యకలాపాలు నిర్వహించడం కంటే, ఈ డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ దళారుల మాటే శిరోధార్యంగా పనిచేయడం ఏసీబీ దాడుల్లో గుర్తించింది. రిజిస్ట్రేషన్ పత్రాలను తయారు చేయడం నుంచి, ఆ పత్రాలను సబ్ రిజిస్ట్రార్ వద్దకు తీసుకెళ్లి సంతకాలు చేయించడం వరకు ప్రతి దశలోనూ ఈ ప్రైవేట్ వ్యక్తులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒక డాక్యుమెంట్ రైటర్ ఏకంగా తన రోజువారీ సంపాదన లక్షల్లో ఉందని, ఇందులో అధికారులకు ఇచ్చే వాటాయే అధికమని స్వయంగా ఒప్పుకున్నట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.

ఇది కేవలం ఒక కార్యాలయం పరిస్థితి మాత్రమే కాదని, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల శాఖలో ఇదే తరహా వ్యవస్థ పాతుకుపోయిందని తాజా దాడుల ద్వారా స్పష్టమైంది. అయితే, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో, సబ్ రిజిస్ట్రార్ ఇండ్లలో ఏసీబీ దాడులు, తనిఖీలు ఇలాగే కొనసాగితే విధులకు హాజరుకాకుండా మూకుమ్మడిగా సెలవుపై వెళ్తామని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఉద్యోగులు, సిబ్బంది ఏకంగా ప్రభుత్వానికే హెచ్చరికలు చేస్తుండటం గమనించదగ్గ విషయం.

•అన్నీ సక్రమంగా ఉన్నా ఇచ్చుకోవాల్సిందే..

చట్టబద్ధంగా, ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా.. లంచం ఇవ్వనిదే అడుగు ముందుకు పడని పరిస్థితి రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నెలకొందని చెప్తున్నారు. భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా ఉన్నా, భూమికి ఎలాంటి లిటిగేషన్ లేకపోయినా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముందుగానే లంచం రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారని తెలుస్తున్నది. రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చిన వారు దీని గురించి డాక్యుమెంట్ రైటర్లను అడిగితే, “అన్నీ సరిగ్గా ఉన్నాయి కదా? అని అనుకోవడానికి లేదు.

అన్ని పత్రాలు ఉన్నా, ప్రతి రిజిస్ట్రేషన్‌కు కొంత మొత్తం ఇచ్చుకోవాల్సిందే” అనే సమాధానం వస్తోందని అంటున్నారు. ఈ ‘కప్పం’ కట్టకపోతే ఫైలు ముందుకు కదలదని, చిన్న చిన్న అభ్యంతరాలు పెట్టి రిజిస్ట్రేషన్‌ను రోజుల తరబడి నిలిపివేసే ప్రమాదం ఉందని వారు ముందే హెచ్చరిస్తున్నారని.. పద్ధతి ప్రకారం అంతా ముందే చెప్పి, లంచాన్ని వసూలు చేసి, ఆ తర్వాతే పని మొదలుపెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రామోజీ గ్రూపు సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి

0

హైదరాబాద్,(స్టేట్ బ్యూరో)నవంబర్,16,మెదక్ టుడే న్యూస్:

రామోజీ గ్రూపు సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలో చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ వరుసలో నాలుగవ అద్బుతంగా రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు.

పత్రికా రంగంలో తనదైన ముద్ర వేసిన రామోజీ రావు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రోత్సహించిన రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారిని గుర్తించి రామోజీ ఎక్సలెన్స్ అవార్డులను బహూకరించింది. రామోజీ రావు 89 వ జయంతిని పురస్కరించుకుని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ అవార్డుల బహూకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ గారు పాల్గొన్నారు. వారితో పాటు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

✳️ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రామోజీ రావు ఏ విలువలు, సంప్రదాయాలను తెలుగు ప్రజలకు అందించారో ఆ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని గుర్తించి ఎక్సలెన్స్ అవార్డులను అందించడం అభినందనీయమని అన్నారు.

✳️ తెలుగు చలనచిత్ర రంగం నంది అవార్డుల నుంచి ఆస్కార్ అవార్డుల వరకు ఎదగడంలో రామోజీ ఫిల్మ్ సిటీ ఎంతో తోడ్పాటును అందించిందని అన్నారు. టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా హాలీవుడ్ సహా స్క్రిప్ట్ తో రామోజీ ఫిల్మ్ సిటీలోకి ప్రవేశిస్తే ప్రింట్ తీసుకుని వెళ్లొచ్చేలా అద్భుతమైన కళాఖండాన్ని ఏర్పాటు చేశారని అన్నారు.

✳️ రామోజీ రావు  ఏ రంగంలో ప్రవేశించినా అందులో తనదైన ముద్ర వేశారని చెప్పారు. వయసు పైబడినప్పటికీ నిత్యం పనిలోనే సంతృప్తి ఉంటుందని చెప్పేవారని, రామోజీ రావు ఒక నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. రామోజీ ఒక పేరు కాదని, అదొక బ్రాండ్ అని ఆ బ్రాండ్ ను కొనసాగించే విషయంలో గ్రూపు సంస్థలకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు.

✳️ రాష్ట్రంలో తెలుగు భాష అభివృద్ధికి కొన్ని చర్యలు తీసుకున్నామని, కొంత సమయం పట్టినప్పటికీ తెలుగు భాషలో పరిపాలనా వ్యవహారాలను కొనసాగించే విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

✳️ వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ఏడుగురు ప్రముఖులకు ఈ సందర్భంగా రామోజీ పేరిట స్థాపించిన ఎక్సలెన్స్ అవార్డులను బహూకరించారు. జర్నలిజంలో ఇండిపెండెంట్ జర్నలిస్టు, రచయిత జైదీప్ హర్దీకర్ కి, మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సామాజిక కార్యకర్త, (Impact And Dialogue Foundation) వ్యవస్థాకురాలు పల్లబి ఘోష్ (Pallabi Ghosh)కి, ప్రముఖ పర్యావరణ వేత్త, ఆకార్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ అమలా అశోక్ రూయా (Amla Ashok Ruia)కి ఎక్సలెన్స్ అవార్డులను అందించారు.

✳️ అలాగే, సామాజిక విద్యావేత్త, పెహచాన్ స్కూల్ (Pehchaan School) వ్యవస్థాపకుడు ఆకాశ్ టాండన్ కి, ఆదివాసీ భాషలను పరిరక్షించడంలో విశేష కృషి చేసిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్, ప్రొఫెసర్ సత్తుపతి ప్రసన్న శ్రీ కి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ మధవీ లతకి, అంధుడైన పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్లాకి ఎక్సలెన్స్ అవార్డులను అందజేశారు.

✳️ ఈ కార్యక్రమంలో రామోజీ గ్రూపు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరితో పాటు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ పత్రిక దినోత్సవం

0

జాతీయ పత్రిక దినోత్సవం.

భారత ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం – నేటి పరిస్థితి

నేడు జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా భారతదేశంలో జర్నలిజం, మీడియా వ్యవస్థ, రిపోర్టర్ల ప్రస్తుత పరిస్థితులపై ఒక సమగ్ర దృష్టి వేసుకోవాల్సిన అవసరం ఉంది.

  1. నాలుగో స్తంభం – ప్రజాస్వామ్యానికి నాడి

(స్టేట్ బ్యూరో)నవంబర్,16,మెదక్ టుడే న్యూస్:

భారత ప్రజాస్వామ్యంలో మీడియా ఒక కీలక శక్తి.
ఇది కేవలం వార్తల వాహకం కాదు,
అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం, సమాజాన్ని దిశా నిర్ధేశం చేసే శక్తి, ప్రజల బాధలను ప్రభుత్వానికి వినిపించే గళం.

ఒకప్పుడు పత్రికలు — ప్రజా స్వరం.
కానీ నేడు పరిస్థితులు కొత్త సవాళ్లతో మారిపోతున్నాయి.

  1. జాతీయ మీడియా నేటి పరిస్థితి

జాతీయ మీడియా మొత్తం గత దశాబ్దంలో భారీ మార్పులను చూసింది.

‣ TRPలు vs నిజం

వాస్తవాలకు ప్రాధాన్యత తగ్గి TRPలు, సెన్సేషనలిజం, కార్పొరేట్/రాజకీయ ఒత్తిడులు పెరిగాయి.

‣ శబ్దం పెరిగింది – సమాచారం తగ్గింది

డిబేట్ షోలు సమాచారం కంటే గొడవలు, ఆరోపణలు, డ్రామాతో నిండి ఉన్నాయి.

‣ కార్పొరేట్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది

ఏ వార్త బలంగా వెళ్లాలి? ఏది మౌనం పాటించాలి? అన్నది చాలాసార్లు యజమాని ప్రయోజనాల ఆధారమే.

  1. రిపోర్టర్ల ప్రస్తుత పరిస్థితులు

భారత జర్నలిజంలో అత్యంత కష్టాల్లో ఉన్నవారు —
గ్రౌండ్ రిపోర్టర్లు.

‣ తక్కువ జీతం, ఎక్కువ పని

రోజుకు 10–12 గంటలు పరుగులు, ప్రమాదాలు, ఒత్తిడి —
అయినా పారితోషికం మాత్రం చాలా తక్కువ.

‣ ప్రతిరోజూ ఎదుర్కొనే ఇబ్బందులు

ట్రావెల్ అలవెన్స్ లేకపోవడం

మొబైల్‌తోనే షూట్–ఎడిట్–ఫైల్

రాజకీయ ఒత్తిడులు

అధికారుల అప్రత्यक्ष బెదిరింపులు

లీగల్ కేసుల ప్రమాదం

సోషల్ మీడియాలో విమర్శల దాడులు

‣ ఉద్యోగ భద్రత లేకపోవడం

కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరిగి, ఎప్పుడు తొలగిస్తారో తెలియని అస్థిరత.

  1. డిజిటల్ యుగం – పత్రికలపై ప్రభావం

డిజిటల్ మీడియా పెరుగుతుండడంతో సంప్రదాయ పత్రికలు పెద్ద ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
ఫేక్ న్యూస్ పెరగడంతో అసలు రిపోర్టర్ల నమ్మకం, విశ్వసనీయత సవాలు ఎదుర్కొంటోంది.

  1. ఎందుకు ఇంకా మీడియా కీలకం?

సవాళ్లు ఉన్నా కూడా:

అవినీతి బట్టబయలు చేస్తోంది

ప్రజల సమస్యలు ప్రభుత్వానికి చేరుస్తోంది

అధికారాన్ని ప్రశ్నిస్తోంది

సమాజానికి దిక్సూచి లా మారుతోంది

ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది — స్వతంత్ర మీడియానే.

  1. ముందుకు వెళ్లే మార్గం

మీడియా స్వేచ్ఛకు చట్టపరమైన రక్షణ

రిపోర్టర్లకు కనీస వేతన హామీ

ప్రొఫెషనల్ జర్నలిజం బలోపేతం

ఫేక్ న్యూస్‌పై కఠిన చర్యలు

ప్రజల్లో మీడియా అవగాహన పెంపు

—సమాప్తి

జాతీయ పత్రిక దినోత్సవం మనకు గుర్తు చేసే విషయం —
మనం దేశంలో జర్నలిజం లేకుండా ప్రజాస్వామ్యం బలంగా ఉండదు.
సత్యం కోసం, ప్రజల కోసం శ్రమిస్తున్న ప్రతి జర్నలిస్టుకీ ఈ రోజు గౌరవం అర్పించాల్సిన సమయం…

బుద్ధుడు చూపిన మార్గంలో నడవాలి -బైంసా బుద్దావిహార్ కమిటీ సభ్యులు.

0

బుద్ధ విహార్ ప్రాంగణంలో తొలిసారిగా జాడే పరివార్ పెళ్లి

బుద్ధుడు చూపిన మార్గంలో నడవాలి -బైంసా బుద్దావిహార్ కమిటీ సభ్యులు.

లోకేశ్వరం,నవంబర్,16,మెదక్ టుడే న్యూస్:

భైంసా: పట్టణంలోని బుద్ధ విహార్ (టెక్డి) ప్రాంగణంలో మెట్ట మొదటిసారిగా నిగ్వ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుడు, ప్రశ్నించే గొంతు జాడే లక్ష్మణ్ తో,దేగాం గ్రామానికి చెందిన పుగ్లె విద్యషిలకు ఈ నెల 13న వివాహం జరిగింది.ఈ బుద్ధ విహార్ లో మొట్ట మొదటి పెళ్ళికాగ,ఈ సందర్భంగా బుద్ధ విహార్ నిర్మాణం కొరకు రూ.10 వేలు విరాళంగా విహార్ టీం సభ్యులకు ఆదివారం అందచేశారు.దీంతో విహార్ టీం సభ్యులు నూతన వధూవరులకు బుద్ధుడు,అంబేద్కర్, చిత్రపటాలు అందచేసి జై భీమ్ లు తెలియజేశారు. అలాగే ఈ అవకాశం కల్పించిన బుద్ధ విహార్ కమిటి సభ్యులకు జాడే లక్ష్మణ్ కుటుంబ సభ్యులు, మరియు పుగ్లె పరివార్ కుటుంబ సభ్యులు, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుద్ధ విహార్ కమిటీ, నూతన వధూవరుల దంపతుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ( FIR ) ప్రథమ సమాచార నివేదిక నమోదు చేయడమెలా వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ కింది విధంగా చూద్దాం..

0

•Legal awerness :

•ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ( FIR ) ప్రథమ సమాచార నివేదిక నమోదు చేయడమెలా వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ కింది విధంగా చూద్దాం

(స్టేట్ బ్యూరో)నవంబర్,16,మెదక్ టుడే న్యూస్:

పోలీస్ స్టేషన్.. పోలీసులు అంటేనే.. ఒక రకమైన భయం.. చదువుకున్న వారు సైతం పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తులు ఇవ్వడానికి తటపటాయిస్తారు
నలుగురు పెద్ద మనుషుల సాయం లేనిదే పోలీస్ స్టేషన్ మెట్లెక్కడానికి వెనుక ముందుఅవుతారు ఏదైనా అవాంఛనీయ సంఘటన మూలంగా తాము గాని, తమ చుట్టూరా ఉన్నవారు గాని ఎవరైనా నష్టానికి, హానికి గురైనపుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం కనీస బాధ్యత అయితే అత్యవసరమైన ఈ విషయంపై చదువురాని వారికే కాదు.. విద్యావంతులకు సైతం సరైన అవగాహన ఉండదు పోలీసులు, పోలీస్ స్టేషన్ అంటేనే మనసులో అంతర్లీనంగా ఉన్న భయం వల్ల కూడా చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సందేహిస్తుంటారు
ఎఫ్‌ఐఆర్ గురించి విపులంగా తెలిసి ఉంటే అవసరమైన సందర్భాల్లో అనవసరమైన భయాలు, అనుమానాలు లేకుండా మనకున్న రక్షణ హక్కులను వినియోగించుకోవచ్చు

ఎఫ్‌ఐఆర్ అంటే ?
ప్రాథమిక సమాచార నివేదిక (ఫస్ట్ ఇన్పర్మేషన్ రిపోర్టు-ఎఫ్‌ఐఆర్) కాగ్నిజబుల్ అఫెన్స్ (ఎలాంటి ముందస్తు వారెంట్ లేకుండా అదుపులోకి తీసుకునే నేరం) కు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు రాసుకునే సమాచార పత్రం. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 154 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు.
సంఘటన జరిగిన తర్వాత పోలీసులకు అందే మొదటి సమాచారం ఇదే

కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే..
కేసు తీవ్రతను బట్టి పోలీసులు వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్టు చేయవచ్చు

కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే ఇలాంటి కేసుల్లో పోలీసులు సొంతంగా పరిశోదన ప్రారంభించవచ్చు. ఉదాహరణకు హత్యాయత్నం, హత్య, ఇంటిని కూల్చివేయడం, దోపిడీలు, డెకాయిటీ, మోసం, ట్రెస్‌పాస్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ మొదలైనవి

ఎఫ్‌ఐఆర్ ఎక్కడ ఫైల్ చేయాలి..? సంఘటన జరిగిన ప్రదేశం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందో అక్కడే ఫిర్యాదు చేయాలి

ఒకవేళ మీకు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలియక పోతే, అక్కడికి వెళ్లడానికి మీకు ఏదైనా సమస్యలు ఉంటే.. సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు

దేశంలో ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. తర్వాత నమోదు చేసిన కేసు ఏ ప్రాంతంలో జరిగిందో కనుక్కొని ఆ ప్రాంత పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేసే బాధ్యత పోలీసులదే

ఇటీవల మీసేవలో సైతం పోలీస్ స్టేషన్‌లకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు

ఎఫ్‌ఐఆర్ చేసే విధానం.. క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ నేర శిక్షాస్మృతి 1973లోని సెక్షన్ 154 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. మీరు మౌఖికంగా ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు తప్పని సరిగా రాసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏమి రాసుకున్నారో మీకు తప్పక చదివి వినిపించాల్సి ఉంటుంది. చదివి వినిపించమని అడిగే హక్కు మీకుంటుంది అయితే చాలా సందర్భాల్లో పోలీసులు మాత్రం ఫిర్యాదు ఇవ్వండి..కేసు చేస్తాం వెళ్ళండి అంటారు కానీ పోలీసులు రాయరు..అలాగే బాధితుడు రాసిన ఫిర్యాదును యథాతదంగా తీసుకోక తమకు అనుకూలంగా మలుచుకొని ఫిర్యాదు తీసుకోవడం జరుగుతుంది

సమాచారాన్ని ఇచ్చే వ్యక్తి ఎఫ్‌ఐఆర్‌లో తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉంటుంది. సంతకం చేసే ముందు ఫిర్యాదులో తప్పు ఒప్పులను చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే. చదవడం, రాయడం రానివారు తమ ఎడమ చేతి బొటన వేలి ముద్రను సంతకం చేయాల్సిన స్థానంలో వేయాల్సి ఉంటుంది

ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత దాని నకలును పోలీసులను అడిగి తీసుకోండి. దీని కోసం ఎలాంటి రుసుం చెల్లించికుండా కాపీ తీసుకునే హక్కు ఫిర్యాదు దారునికి ఉంటుంది

ఎవరు ఫైల్ చేయాలంటే.. సంఘటన మూలంగా నష్టపోయిన బాధితులు ఫిర్యాదు చేయాలి. వారు అందుబాటులో లేని పక్షంలో వారి తాలూకూ కుటుంబీకులు కూడా ఫిర్యాదు చేయవచ్చు

నేరం ఎలా జరిగింది.. ఎవరు చేశారు.. నేరం జరగడానికి గల కారణాలు తెలిసిన వ్యక్తులు, ఇలాంటి సందర్భాల్లో సమాచారం ఎలా తెలిసిందో పేర్కొంటూ ఫిర్యాదుదారుడు ఎఫ్‌ఐఆర్‌లో సంతకం చేయాల్సి ఉంటుంది

నేరం జరిగినపుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు కూడా ఫిర్యాదు చేయవచ్చు

ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరిస్తే
మీ ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించిన అధికారి పేర ఫిర్యాదు జత చేసి జిల్లా ఎస్పీకి పంపాలి. ఇలా పంపేందుకు కొరియర్‌లో కాకుండా రిజిస్టర్ పోస్టులో పంపితే ఫిర్యాదు అందిన తర్వాత మీకు అక్‌నాలెడ్జ్‌మెంట్ కార్డు రావడం వల్ల ఫిర్యాదు చేరిందన్న నమ్మకం కలుగుతుంది

మీరు స్వయంగా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను గానీ ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదును వారి దృష్టికి తీసుకెళ్లవచ్చు

ఉన్నతాధికారులు మీ ఫిర్యాదును నమ్మినైట్లెతే వారే స్వయంగా కేసును పరిశోధించడం గానీ, లేదా కేసులో పరిశోధన జరిగేలా కింది స్థాయి అధికారులను ఆదేశించవచ్చు

జరిగిన నేరం ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో అక్కడ వ్యక్తిగతంగా మీరు ప్రైవేటు కంప్లైంటు ద్వారా ఫిర్యాదు నమోదు కు ఆదేశం పోందవచ్చు

పోలీసులు మీ ఫిర్యాదు విషయంలో ఏ కారణాల వల్లనైనా నిర్లక్ష్యం చేస్తే మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర శాఖకు, జాతీయ శాఖకు కూడా ఫిర్యాదు చేయవచ్చు

నేర శిక్షాస్మృతి సెక్షన్ 161 ప్రకారం మీ స్టేట్‌మెంట్‌ను పోలీసులు తప్పని సరిగా నమోదు చేయాల్సి ఉంటుంది

ఫిర్యాదును నమోదు చేసుకున్న తర్వాత కేసులో పరిశోధన జరగకపోతే జరగకపోవడానికి గల కారణాలను పోలీసులు తప్పని సరిగా రికార్డు చేయాల్సి ఉంటుంది

నేర శిక్షాస్మృతిలోని 1973లోని సెక్షన్ 157 ప్రకారం ఫిర్యాదుదారులకు పోలీసులు కేసులో పరిశోధన జరపకపోవడానికి గల కారణాలను కచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది

ఎఫ్‌ఐఆర్‌లో ఉండాల్సిన వివరాలు.. మీ పేరు.. చిరునామా, బాధితుల సమాచారం, ఫిర్యాదు చేయడానికి మీకు ఉన్న హోదా లేదా అధికారం, సంఘటనకు సంబంధించిన సమయం, రోజు, స్థలం లాంటి వివరాలు. నేరం ఎలా జరిగింది.. ఎందుకు చేశారు లాంటి పక్కా సమాచారం. నేరంలో పాల్గొన్న వ్యక్తుల పేర్లు, ఒకవేళ తెలిస్తే, లేకపోతే వారిని గుర్తించడానికి వీలైన పోలికలు దొంగతనం లాంటి కేసుల్లో వీలైతే పోయిన వస్తువుల విలువ, వాటి వివరాలు నేరస్తులు సంఘటనకు సంబంధించి వదిలి వెళ్లిన ఆధారాలు ఉంటే అవి సంఘటనలో మీరు గాయపడితే మీరు దవాఖానలో చికిత్స తీసుకున్నారో అక్కడి మెడికల్ సర్టిఫికెట్ జత చేయాలి

చేయ కూడనవి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల భారతీయ శిక్షాస్మృతి 1860 ప్రకారం సెక్షన్ 203 కింద పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు గాను శిక్షపడే అవకాశం ఉంది నేరానికి సంబంధించిన సమాచారాన్ని దాచడం, నిజాలను పక్కదారి పట్టించడం, ఆధారాలను నాశనం చేయడం లాంటివి చేయకూడదు
ఇలా చేయడం వల్ల మీరు దోషులుగా గుర్తించబడుతారు. నేరానికి సంబంధించిన అసంపూర్ణమైన, అస్పష్టమైన సమాచారం ఇవ్వకూడదు

రాత పూర్వకంగానే ఇవ్వాలి.. ఫిర్యాదు రాతపూర్వకంగా గాని, మౌఖికంగా గానీ ఇవ్వవచ్చు. ఫోన్ ద్వారా అందించిన సమాచారాన్ని కూడా ఎఫ్‌ఐఆర్‌గా పరిగణించబడుతుంది

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 154 ప్రకారం ఎఫ్‌ఐఆర్ రాతపూర్వకంగానే ఉండాలన్న నిబంధన లేదు. మౌఖికంగా చెప్పిన సమాచారాన్ని పోలీసులు రాసుకోవాలి. తర్వాత సమాచారం అందించిన వ్యక్తికి చదివి వినిపించి వారి సంతకాన్ని తీసుకోవాల్సి ఉంటుంది

రాతపూర్వకంగానే ఫిర్యాదు ఇవ్వాలన్న డిమాండ్ చేసే అధికారం పోలీసులకు లేదు

నేరం జరిగిన తర్వాత ఎంత కాలంలో ఫిర్యాదు చేయాలి
ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి కాలపరిమితి అంటూ ఏమీ లేదు. కాని ఫిర్యాదు ఆలస్యమైన కొద్దీ కేసులో సాక్షాధారాలు బలహీనపడే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు నేరం జరిగిన కొన్ని గంటల్లోపే ఫిర్యాదు నమోదు చేయాలి

ఎఫ్‌ఐఆర్ నమోదు తర్వాత
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత పోలీసులు కేసుకు సంబంధించిన పరిశోధన మొదలు పెడతారు

ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన రోజు నుంచి 90 రోజు లోగా చార్జిషీట్ నింపాలి. ఆరు నెలల్లో విచారణ ప్రారంభించాల్సి ఉంటుంది.

ఆరు నెలల తర్వాత కేసులో విచారణ మందకోడిగా సాగుతుందనిపిస్తే మీరు జిల్లా కోర్టులో కేసు వేయవచ్చు

ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఆరు నెలలకు సైతం చార్జిషీట్ వేయకపోతే జిల్లా ఎస్పీకి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మీరు రాతపూర్వకంగా విన్నవించవచ్చు.

ఎఫ్‌ఐఆర్‌ను మార్చవచ్చా..!
చార్జ్‌షీట్‌ను నింపకముందు
ఏ సమయంలోనైనా ఎఫ్‌ఐఆర్‌ను మార్చడానికి
వీలవుతుంది. కేసుల తీవ్రతను బట్టి తగ్గించడానికి వీల్లేదు
కానీ కేసును బలంగా తయారు చేయడానికి కొత్త సెక్షన్‌లను కలుపడానికి వీలవుతుంది.

కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు వేగంగా జరగాలి కలెక్టర్..

0

కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు వేగంగా జరగాలి కలెక్టర్

అక్రమాలకు తావు లేకుండా ధాన్యం కొనుగోలు

27,993 మంది రైతుల నుండి 1,19,461.560 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 102.84 కోట్ల చెల్లింపులు

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్,శంకరంపేట,(ఆర్)నవంబర్,16,మెదక్ టుడే న్యూస్: ప్రతినిధి

జిల్లా పరిధిలోని శంకరంపేట్ (ఆర్) మండలంలోని అంబాజీపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుందో లేదో స్వయంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు వేగంగా జరగాలని
గత సంవత్సరం ఇదే నెలలో 11,865 మంది రైతుల నుంచి 68,669.640 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 4.71 కోట్ల రూపాయలను చెల్లించగా…
ప్రస్తుత సీజన్ కి… ఇప్పటివరకు 27,993 మంది రైతుల నుండి 1,19,461.560 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 102.84 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు.రైతులకు ప్రభుత్వం మద్దతు ధర కింద ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతోందని, తేమ శాతం నిర్దేశిత ప్రమాణాలకు లోబడి ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అలాగే ధాన్యం తూకాలు సక్రమంగా జరుగుతున్నాయా, గోదాముల్లో నిల్వలు గన్ని బ్యాగ్ లు పూర్తిగా ఉన్నాయన్నారు.అధికారులు రైతులకు సకాలంలో చెల్లింపులు జరగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య సేవలు మెరుగుదల కలెక్టర్..

0

జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య సేవలు మెరుగుదల కలెక్టర్

24/7 నిరంతర వైద్య సేవలు

ఆరోగ్య సేవలు పటిష్ట పర్యవేక్షణకు
కలెక్టరేట్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్,శంకరంపేట,(ఆర్)నవంబర్,16,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి

జిల్లావ్యాప్తంగా రోగులకు మెరుగైన వైద్య సేవలు దిశగా వైద్యాధికారులు పనిచేస్తున్నారని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.ఆదివారం శంకరపేట (ఆర్) మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.హాజర పుస్తకాలు, మందులు, స్టాక్ బోర్డులను నిషితంగా పరిశీలించారు. వైద్య సేవలపై రోగులను ఆరా తీశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ పేదలందరికీ ఉచిత నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని, వైద్యాధికారులు
సమయపాలన కచ్చితంగా పాటిస్తూ
విధులకు హాజరవుతున్నారని తద్వారా రోగులకు వైద్య సేవలు అందించగలుగుతున్నామన్నారు.
జిల్లాలో ఆస్పత్రులు సిబ్బంది మెరుగయ్యాయని తెలిపారు.జిల్లాలో ఉన్న అన్ని ఆసుపత్రులు, వైద్య ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సీసీటీవీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా వైద్య వృత్తి పేరిట నకిలీలు ఉంటే తట్టరీత్యా శిక్షిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.