📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 56

భారత్‌కు రూ.824 కోట్ల విలువైన అమెరికా ఆయుధాలు••

0

భారత్‌కు రూ.824 కోట్ల విలువైన అమెరికా ఆయుధాలు

(స్టేట్ బ్యూరో)నవంబర్,21,మెదక్ టుడే న్యూస్:

ట్రంప్‌ సర్కార్‌ పచ్చజెండా
న్యూయార్క్‌ : భారత్‌కు రక్షణ ఎగుమతులపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌జిఎం -148 జావెలిన్‌ యాంటీ-ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్‌ సిస్టమ్‌తో పాటు ఎం982ఏ1 ఎక్స్‌క్యాలిబర్‌ ప్రెసిషన్‌ గైడెడ్‌ ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్‌, వాటి అనుబంధ సామగ్రిని భారత్‌కు విక్రయించనుంది. దాదాపు రూ.824 కోట్ల (93 మిలియన్‌ డాలర్లు) విలువైన ఈ భారీ డీల్‌కు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై అమెరికాకు చెందిన డిఫెన్స్‌ సెక్యూరిటీ కోఆపరేషన్‌ ఏజెన్సీ (డిఎస్‌సిఎ) ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. భారత్‌కు అందించనున్న ఆయుధ సామగ్రి జాబితాలో 100 జావెలిన్‌ మిస్సైళ్లు, 1 ఫ్లైటు బై రౌండ్‌, 25 కమాండ్‌ లాంచ్‌ యూనిట్లు, ట్రైనింగ్‌ ఎయిడ్‌లు, సిమ్యులేషన్‌ రౌండ్లు, ఆయుధ సామగ్రితో ముడిపడిన విడి భాగాలు ఉన్నాయని డీఎస్‌సీఏ తెలిపింది. రూ.417 కోట్ల విలువైన 216 యూనిట్ల ‘ఎం982ఏ1 ప్రొజెక్టైల్స్‌’ను, రూ.405 కోట్ల విలువైన 126 యూనిట్ల జావెలిన్‌ మిస్సైల్‌ సిస్టమ్‌లను భారత్‌కు విక్రయిస్తున్నట్టు పేర్కొంది. ఈ మొత్తం సామగ్రికి అమెరికా సైన్యం వైపు నుంచి పూర్తిస్థాయి జీవితకాల మద్దతు లభిస్తుందని వెల్లడించింది. ఈ ప్రతిపాదిత లావాదేవీకి అవసరమైన సర్టిఫికేషన్‌ను అమెరికా కాంగ్రెస్‌కు డిఎస్‌సిఎ అందజేసింది.ఇండో-పసిఫిక్‌, దక్షిణాసియాల్లో సుస్థిరతే లక్ష్యం
”అమెరికా-భారత్‌ల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, ప్రధాన రక్షణరంగ భాగస్వామి అయిన భారత్‌ భద్రతను మెరుగుపర్చేందుకు ఈ ఆయుధ సామగ్రిని విక్రయిస్తున్నాం. ఈ విక్రయ డీల్‌ అమెరికా విదేశాంగ విధానం, జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతును అందిస్తుంది. దీనివల్ల ఇండో-పసిఫిక్‌, దక్షిణ ఆసియా ప్రాంతాల్లో రాజకీయ సుస్థిరత, శాంతి, ఆర్థిక వికాసానికి ఊతం లభిస్తుంది. ఆ ప్రాంతాల్లో సైనికపరమైన సమతుల్యత కూడా ఏర్పడుతుంది. ఈ ఆయుధ సామగ్రి ప్రస్తుత, భవిష్యత్‌ ముప్పులను అత్యంత కచ్చితత్వంతో ఎదుర్కొనేలా భారత్‌కు ఉపయోగపడుతుంది. కచ్చితత్వంతో దాడులు చేయగల సామర్థ్యం భారత్‌కు లభిస్తుంది. ఈ సామగ్రిని భారత సైన్యం సమర్థవంతంగా వినియోగించగలదు” అని డిఎస్‌సిఎ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికా మెప్పుకోసమే మోడీ భారీగా రక్షణ ఆయుధాలను కొంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇకపై ఆధార్ కార్డుపై ఫోటో, క్యూఆర్ కోడ్‌ మాత్రమే.. UIDAI కొత్త సేఫ్టీ చర్యలు..

0

•ఇకపై ఆధార్ కార్డుపై ఫోటో, క్యూఆర్ కోడ్‌ మాత్రమే.. UIDAI కొత్త సేఫ్టీ చర్యలు..

(స్టేట్ బ్యూరో)నవంబర్,21,మెదక్ టుడే న్యూస్:

త్వరలో ఆధార్ కార్డులు పూర్తిగా కొత్త సేఫ్టీ ఫీచర్లతోఅందుబాటులోకి రాబోతున్నాయి. ఇది ప్రజల వ్యక్తిగత వివరాల దుర్వినియోగాన్ని నివారించడంతో పాటు ఆఫ్‌లైన్ ధృవీకరణను తగ్గించేందుకు ఆధార్ కార్డుపై కేవలం వ్యక్తి ఫోటో, QR కోడ్ మాత్రమే ఉంచే ప్రతిపాదనను UIDAI పరిశీలిస్తోంది. ఫోటో, QR కోడ్ తప్ప మరేమీ అవసరం లేదని భావిస్తున్నట్లు UIDAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భువనేశ్ కుమార్ తెలిపారు. వివరాలు ప్రింట్ చేసి ఉండటం వల్ల అవి దుర్వినియోగానికి గురవుతున్నాయని చెప్పారు భువనేశ్.UIDAI డిసెంబర్ నుంచి వయస్సు ధృవీకరణ విధానాలను బలోపేతం చేయడంతో పాటు హోటళ్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు వంటి వారు ఆధార్ కార్డు కాపీలను తీసుకోవడం లేదా ఆఫ్లైన్ వెరిఫికేషన్ చేయడం నిషేధించే కొత్త నిబంధనలను అమలు చేయబోతోంది. ఆధార్ కేవలం ఆథెంటికేషన్ కోసం మాత్రమేనని కుమార్ చెప్పారు. ప్రస్తుతం ఆధార్ చట్టం ప్రకారం బయోమెట్రిక్ డేటా లేదా ఆధార్ నంబర్‌ను ఆఫ్లైన్ వెరిఫికేషన్ కోసం ఉపయోగించడం, భద్రపరచడం నిషేధించబడింది. అయినప్పటికీ చాలా సంస్థలు ఇంకా ఆధార్ ప్రతులను ఉంచుకుంటున్నాయి. దీనికోసమే ఆధార్ యాప్ రాబోతోంది.కొత్త చర్యలతో ఫోటో కాపీలు ఇవ్వడం లేదా ఫిజికల్ ఆధార్ కాపీలపై ఆధారపడడం తగ్గుతుందని UIDAI డీడీజీ వివేక్ చంద్ర వర్మ వివరించారు. ఈ యాప్‌లో ఒకే ఫ్యామిలీలో ఉన్న ఐదు మంది వరకు ఆధార్ వివరాలను చూడగలిగే అవకాశం, ఏ వివరాలు పంచుకోవాలో వినియోగదారుడి నియంత్రణలో ఉంచే ఫీచర్లు ఉన్నాయి. అందువల్ల ఒక క్లిక్‌తో బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉండనున్నాయి. అలాగే మొబైల్ నంబర్, అడ్రెస్ అప్డేట్ చేయడం కూడా మరింత సులభం కానుంది.

మెదక్ జిల్లాలోని టెక్మల్ ఎస్ఐ రాజేష్ ని ఏసీబీ అధికారులు వేగంగా స్పందించి అరెస్ట్ చేయటంపై ఏసీబీ శాఖను,పోలీస్ శ్రీ బి.శివధర్ రెడ్డి, ఐపీఎస్ అభినందించారు.

0

మెదక్ జిల్లాలోని టెక్మల్ ఎస్ఐ రాజేష్ ని ఏసీబీ అధికారులు వేగంగా స్పందించి అరెస్ట్ చేయటంపై ఏసీబీ శాఖను, ముఖ్యంగా ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి చారు సిన్హా, ఐపీఎస్ ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్ అభినందించారు.

(స్టేట్ బ్యూరో)నవంబర్,20,మెదక్ టుడే న్యూస్:

అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, అధికారులు అత్యున్నత నైతిక ప్రమాణాలను పాటించాలని డీజీపీ అన్నారు. తమ జిల్లాలకు సంబంధించి పర్యవేక్షణాధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.అట్టి అరెస్టుపై ప్రజల స్పందన పారదర్శకమైన, నైతికతతో కూడిన, సేవాభావం ఉన్న పోలీసింగ్‌పై ప్రజల స్పష్టమైన ఆశలను ప్రతిబింబిస్తోందని డీజీపీ పేర్కొన్నారు.

విమర్శల వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు ఏమాత్రం సరికాదు..!

0

•విమర్శల వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు ఏమాత్రం సరికాదు..!

•ఆర్టికల్‌ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి..ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్..!

తెలంగాణ,(స్టేట్ బ్యూరో)నవంబర్,19,మెదక్ టుడే న్యూస్:

ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాసిన జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెట్టటం ఎంత మాత్రమూ సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది..విమర్శనాత్మక వార్తలు రాసిన సదరు జర్నలిస్టును అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణను దేశ అత్యున్నత న్యాయస్థానం మంజూరు చేసింది..తనపై ప్రభుత్వం నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన జర్నలిస్ట్‌ అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ఈపిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టితో కూడిన ధర్మాసనం విచారించి..ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛను అందరూ గౌరవించాలి..రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి’ అని సుప్రీంకోర్టు పేర్కొన్నది….?

సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన..

0

సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన..!!

(స్టేట్ బ్యూరో)తెలంగాణ,నవంబర్,19,మెదక్ టుడే న్యూస్:

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా సవరణకు మరోసారి షెడ్యూల్ ప్రకటించింది.నవంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది.

స్పెషల్ డ్రైవ్

నవంబర్ 20న ఓటర్ల దరఖాస్తులు,అభ్యంతరాల స్వీకరణ,తప్పుల సవరణ
నవంబర్ 22న ఓటర్ల దరఖాస్తులు,అభ్యంతరాల పరిష్కారం
నవంబర్ 23న తుది ఓటర్ల జాబితా,పోలింగ్ కేంద్రాల ప్రచురణ
3 విడతల్లో సర్పంచ్‌ ఎన్నికలు

మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించేలా సర్కారు ప్లాన్‌ చేస్తున్నది. దీంతో ఒక్కో విడత పోలింగ్‌కు ఐదు రోజులలోపే గ్యాప్ ఉండనున్నది. ఈ లెక్కన డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ముగించనున్నట్లు తెలుస్తున్నది. డెడికేటెడ్ కమిషన్ పంచాయతీ ఎన్నికల కోసం గతంలోనే రెండు విధాలుగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఇందులో ఒకటి బీసీలకు 42 శాతం ఉండగా.. ఇంకో దాంట్లో అన్ని రిజర్వేషన్లు కలిపి 50 శాతం లోపు ఉండేలా రెడీ చేసింది. అయితే ఇప్పటికే సిద్ధంగా ఉన్న 50 శాతంలోపు రిజర్వేషన్ల జాబితాను మరోసారి పరిశీలించి. ప్రభుత్వానికి నివేదించనున్నది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తుపై జరగవు. ఆయా అభ్యర్థులకు పార్టీలు మద్దతు మాత్రమే ఇస్తాయి.ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసే స్థానాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది.మిగతా పార్టీలపై ప్రభావం.బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం మిగతా పార్టీలన్నింటిపై ప్రభావం చూపనున్నది. అనివార్యంగా ఇతర రాజకీయ పార్టీలు కూడా అదే మార్గాన్ని అనుసరించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ల సందర్భంగా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి. ఇప్పుడు ఆ రకంగా అమలు చేయపోతే .. ఆ పార్టీలకు బీసీలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. బీసీలకు స్థానిక సంస్థల్లో చట్ట ప్రకారం ఇప్పటికే 22-23 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. దీనిని చట్టపరంగా 42 శాతంకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. చివరకు హైకోర్టు స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ప్రకారం నడుచుకోవాలని సూచన చేసింది. ఈ క్రమంలో వచ్చే మార్చిలోగా పంచాయతీల్లో పాలక వర్గాలు కొలువుదీరకపోతే ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన దాదాపు రూ.3 వేల కోట్లు ల్యాప్స్ కానున్నాయి. ఫలితంగా పంచాయతీ ఎన్నికల్లో 50 శాతంలోపే రిజర్వేషన్లతో ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తున్నది.

వచ్చే రెండ్రోజులు మరింత చలిగాలులు..బీ కేర్‌ఫుల్..!

0

వచ్చే రెండ్రోజులు మరింత చలిగాలులు..బీ కేర్‌ఫుల్..!

హైదరాబాద్‌,నవంబర్‌,19, మెదక్ టుడే న్యూస్:

రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వచ్చే రెండు రోజులు తీవ్రమైన చలి గాలులు వీస్తాయని వాతావరణశాఖ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది.సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌లో ఎల్లో అలర్ట్‌ జారీ చేసినట్టు పేర్కొన్నది. ఆదిలాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, కుమ్రంభీం, నిర్మల్‌ జిల్లాలతోపాటు మరో ఐదు జిల్లాలలో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉన్నదని తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ వరకు తగ్గే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌-యూలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6.8 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.8 డిగ్రీలు, రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 8.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్టు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 14 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, చలిగాలుల తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు.

•బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 19నాటికి దక్షిణ అండమాన్‌ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నదని ప్రకటించింది. దీని ప్రభావంతో ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 24 నుంచి 27వరకు తెలంగాణ, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. చలికి వర్షాలు తోడైతే ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలుంటాయని.. చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

0

రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

•పారిపోతున్న ఎస్సైను వ్యవసాయ పొలాల వద్ద పట్టుకున్న అధికారులు

•టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్న స్థానికులు

మెదక్ జిల్లా టేక్మాల్,నవంబర్,18,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి

మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి, రూ.30 వేలు లంచం తీసుకుంటున్న ఎస్ఐ రాజేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.ఏసీబీ అధికారుల నుండి తప్పించుకుని పారిపోతున్న రాజేష్‌ను, చేజ్ చేసి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ పొలాల వద్ద పట్టుకున్న అధికారులు.ఎస్ఐ రాజేష్ ఏసీబీ అధికారులకు చిక్కడంతో టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్న గ్రామ ప్రజలు

రోడ్లపై ధాన్యం ఆరబోయద్దూ…

0

రోడ్లపై ధాన్యం ఆరబోయద్దూ…

పాపన్నపేట,నవంబర్,18,మెదక్ టుడే న్యూస్:

పాపన్నపేట మండలంలో రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణమైతే చర్యలు తప్పవని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ అన్నారు.మంగళవారం ఆయన మిన్ పూర్, యూసుఫ్ పేట, కొత్తపల్లి గ్రామాల శివార్లలో రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడుతూ మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.ధాన్యం కుప్పల పక్కన రాళ్లు, కర్రలు పెడుతున్నారని రాత్రివేళ అవి వాహనదారులకు కనిపించక పెద్ద ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు.వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వేరే చోట ధాన్యం ఆరబోసుకోవాలన్నారు.ధాన్యం కుప్పల వద్ద ప్రమాదాలు జరిగితే చర్యలు తప్పవన్నారు.ప్రజల ప్రయోజనార్థం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.రైతులు సహకరించాలని సూచించారు.పలువురికి నోటీసీలు జారీ చేశారు.ఏఎస్సై దేవీదాస్, పోలీసు కానిస్టేబుళ్లు ప్రవీణ్, తదితరులున్నారు.

TG వెదర్ | తెలంగాణలో మరింత పెరగనున్న చలితీవ్రత.ఏడు జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని హెచ్చరించిన ఐఎండీ

0

TG వెదర్ | తెలంగాణలో మరింత పెరగనున్న చలితీవ్రత.ఏడు జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని హెచ్చరించిన ఐఎండీ..!

తెలంగాణ,(స్టేట్ బ్యూరో)నవంబర్,18,మెదక్ టుడే న్యూస్

తెలంగాణ వెదర్ తెలంగాణవ్యాప్తంగా చలితీవ్రత పెరిగింది. ఎముకలు కొరికే చలికి జనం తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఉదయం వేళల్లో భారీగా పొగమంచు కురుస్తున్నది.దానికి తోడు చలిగాలులు వీస్తుండడంతో జనం అల్లాడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల రెండురోజులు తెలంగాణలో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. సోమవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ చలిగాలులు వీస్తాయని హెచ్చరించింది. మంగళవారం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో శీతలగాలులు వీచే ఛాన్స్‌ ఉందని హెచ్చరించింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పించింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో పలుచోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయి. ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో అత్యల్పంగా 7.4 డిగ్రీ సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణశాఖ తెలిపింది. రాగల రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. అదే సమయంలో హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం ఉదయం ఈ సీజన్‌లోనే ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయని వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్‌ యూనివర్సిటీ పరిధిలో 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది. రాజేంద్రనగర్‌లో 10, కంటోన్మెంట్‌లో 11.2, మారేడ్‌పల్లిలో 11.5, కుత్బుల్లాపూర్‌లో 12, గచ్చిబౌలిలో 12 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయని.. సోమవారం రాత్రి సైతం చలి కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం ఉదయం సైతం ఇలాంటి పరిస్థితులే ఏర్పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

తిరుమల శ్రీవారికి బంగారం, వజ్రాలతో చేసిన యజ్ఞోపవీతం సమర్పించిన నిలోఫర్ కేఫ్ యజమాని..

0

(స్టేట్ బ్యూరో)నవంబర్,17,మెదక్ టుడే న్యూస్:

తిరుమల శ్రీవారికి బంగారం, వజ్రాలతో చేసిన యజ్ఞోపవీతం సమర్పించిన నిలోఫర్ కేఫ్ యజమాని బాబురావు,దాదాపు కిలో బంగారం, రూ.కోటి రూపాయల వజ్రాలతో చేయించిన యజ్ఞోపవీతాన్ని టీటీడీకి అందజేసిన బాబురావు కుటుంబం,గతంలో దర్శనానికి వెళ్లినప్పుడు నాకు యజ్ఞోపవీతం ఇస్తావా అని దేవుడు అడిగినట్టు అనిపించిందని, అందుకే సమర్పించానని తెలిపిన బాబురావు