యువతలో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించడంలో ఎన్సిసి ప్రముఖ పాత్ర పోషిస్తుందని పాపన్నపేట ఎన్సిసి అధికారి శ్రవణ్ కుమార్ వెల్లడించారు, ఆదివారం మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఎన్సీసీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సిసి క్యాడేట్లతో మార్చ్ ఫాస్ట్, తో పాటు ప్రతిజ్ఞ చేయించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ 20 లక్షల మంది క్యాండెట్లతో ఎన్సిసి ప్రపంచంలోనే అతిపెద్ద యూనిఫామ్ సమస్త గా ఎదిగిందని వెల్లడించారు, 1948లో అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీలో ఎన్సిసి యూనిట్ ప్రారంభించి, ఈ సమావేశానికి అధ్యక్షత వహించినందున ప్రతి నవంబర్ నెల చివరి ఆదివారం ఎన్సిసి డే జరుపుకుంటున్నట్లు ఆయన వివరించారు.
•చేగుంట తాసిల్దార్ శివప్రసాద్, ఎంపీడీవో చిన్నారెడ్డి ఆధ్వర్యంలో *ఇందిరా మహిళా శక్తి చీరాల పంపిణీ
చేగుంట,నవంబర్,23,మెదక్ టుడే న్యూస్:
చేగుంట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఆత్మగౌరవంతో ఉండేలా నాణ్యమైన చీరలను అందించేందుకు ఈ శనివారం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, భారీగా కార్యక్రమాన్ని ప్రారంభించింది.మహిళల గౌరవం, శక్తివంతత, వారి సామాజిక స్థాయిని పెంచే దిశగా ఈ రోజు చేగుంట మండలలో చేగుంట ఎమ్మార్వో ఎంపీడీవో ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ అయిత రఘురాములు,చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, కలిసి ఇందిరమ్మ చీరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు, యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, మహిళ నాయకురాలు, మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
•డ్రా పద్ధతి ద్వారా వార్డ్ మెంబర్లు రిజర్వేషన్లు ఖరారు
చేగుంట,నవంబర్,23,మెదక్ టుడే న్యూస్:
చేగుంట మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా రిజర్వేషన్ను ఖరారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నేపథ్యంలో చేగుంట మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ వార్డుల రిజర్వేషన్ల కోసం డ్రా ప్రక్రియను ఆదివారం నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో చిన్నరెడ్డి ఆధ్వర్యంలో మండల పరిధిలోని 25 గ్రామ పంచాయతీలకు చెందిన ఎస్సీ, ఎస్టీ బీసీ, మహిళా వార్డు స్థానాలను పారదర్శకంగా లాటరీ (డ్రా) ద్వారా ఖరారు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నారాయణరెడ్డి,, బీజేపీ నాయకులు భూపాల్, చంద్రశేఖర్ గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు స్టాలిన్ నర్సింలు, సండ్రుగు శ్రీకాంత్, నదీమ్, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు అలీ, అన్నం రవి, తదితర వివిధ పార్టీల ముఖ్య నాయ కులు పాల్గొని డ్రా ప్రక్రియను పరిశీలించారు.
•ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ ని పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్..
•18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి చీరలు అందేలా చూడాలి కలెక్టర్ రాహుల్ రాజ్
చేగుంట నవంబర్ 23 మెదక్ టుడే న్యూస్:
చేగుంట మండల కేంద్రంలోని మండల సముదాయంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు ఆదివారం రోజున ఐకెపి ఎపిఎం దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో 3 సెంటర్ల ఏర్పాటు చేశారు.మహిళా సంఘాల నాయకులతో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మితంగా పరిశీలించి చీరల పంపిణీ విధానం పరిశీలించారు.ఈ సందర్భంగా మహిళా సంఘాల నాయకులతో మాట్లాడి గ్రూపు సభ్యులతో పాటు ఇంట్లో ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి చీరలు అందె ల చూడాలి అన్నారు.గ్రూపులో లేని వారిని గ్రూపులో చేర్చుకొని వారికి కూడా చీరలు ఇవ్వాలని సూచించారు చేగుంట మండలానికి సుమారు పదివేల చీరలు వచ్చాయని అవసరమైతే మరిన్ని చీరలు ఇస్తామని గ్రూపులో ఉన్న తొమ్మిది వేల పై చిలుకు వారికి కాకుండా ఇంకా మిగిలిన వారి పేరు నమోదు చేసుకొని రిపోర్టు ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘ నాయకులు,ఏపిఎం దుర్గాప్రసాద్,సొసైటీ చైర్మన్ అయితే రఘురాములు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సిరిగోజి (స్టాలిన్ )నర్సింహులు యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్,మహిళలు తదితరులు పాల్గొనడం జరిగినది.
చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన గుండ్ల యాదయ్య కుటుంబానికి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కు 19,000 రూపాయల చెక్కును అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంకన్న గారి వెంకట గౌడ్, దుబ్బాక యూత్ వైస్ ప్రెసిడెంట్ అంకన్న గారి సాయికుమార్ గౌడ్, సిరిగిరి ఎల్లం, గుండ్ల నాగరాజు,బోలి రాజు, కొన్నిటి నర్సయ, మరుకు కుల నాగరాజు, బ్యాగరి పోచయ్య, చాకలి అంజయ్య, డప్పు కాశి, తదితరులు పాల్గొన్నారు
•మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి కార్మిక గనుల శాఖ మాత్యులు వివేక్ వెంకటస్వామి
మెదక్,నవంబర్,22,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి
మత్స్య కార్మికులు ఆర్థికంగా ఎదగాలని కార్మిక గనుల శాఖ మాత్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు.నర్సాపూర్ నియోజకవర్గంలోనీ రాయరావ్ చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నర్సాపూర్ శాసన సభ నియోజకవర్గ పరిదిలోని (108) మత్స్య పారిశ్రామిక సహకార సంఘములలో గల (5668) సభ్యులకు జీవనోపాది కలుగుట వలన వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగు పడతాయన్నారు. మత్స్య కార్మికులు ఆర్థికంగా బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ చెరువులో 93,500 ల వేల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
•మెదక్ జిల్లా లో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు
•పండగ వాతావరణం లో ఘనంగా చీరలు పంపిణీ కార్యక్రమం,
•కార్మిక, గనుల శాఖ మంత్రి , మెదక్ ఇన్చార్జి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి
మెదక్,నవంబర్,22,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికంగా ఎదిగేందుకు, సామాజిక శ్రేయస్సు కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, మహిళా సంఘాల సభ్యులకు అందజేస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కార్మిక గనుల శాఖ మాత్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు.నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో సాయి కృష్ణ ఫంక్షన్ హాల్ నందు శనివారం పండుగ వాతావరణం లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో కార్మిక గనులల శాఖ,మెదక్ ఇన్చార్జి మాత్యులు వివేక్ వెంకటస్వామి, నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ,జిల్లాలో 1,27,000 కుటుంబాలకు ఉచిత కరెంటు ఇచ్చామనిలక్ష 26 వేల కుటుంబాలకు 500 గ్యాస్ కనెక్షన్ అందించామని ,900 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టామని దానికి 57 వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాలో జమ అయినట్లు చెప్పారు.మెదక్ జిల్లా వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల సబ్సిడీని మహిళల ప్రయాణం ద్వారా ఆర్టీసీ కి అందించామన్నారు.21 కోట్ల వడ్డీలేని రుణాల అందించామని,రాష్ట్రంలో సమర్థవంతంగా 6 గ్యారంటీ అమలైతున్నాయని తెలిపారు.ఒకప్పుడు మహిళలు బ్యాంకులకు వెళ్లాలన్న ఇబ్బంది పడే వారిని, కానీ ఇప్పుడు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఏర్పాటై ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తుండడంతో ఆడపడుచులు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడిందన్నారు.మహిళలు వివిధ వృత్తులు, వ్యాపారాలకు సంబంధించి ప్రావీణ్యం పొందేలా మెదక్ త్వరలోనే మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుచేస్తున్లు పేర్కొన్నారు.మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వారికి ఉచిత బస్సు ప్రయాణ అమలులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళుతున్నట్లు చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మహిళా సంఘాల సభ్యులందరూ వివిధ సమావేశాలు నిర్వహించుకున్న సందర్భాల్లో ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న చీరలను ధరించాలని సూచించారు. మహిళా సంఘాల సభ్యులకే కాక తెల్ల రేషన్ కార్డు కలిగి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుచుకు కూడా ఈ చీరలను అందజేయడం జరుగుతుందన్నారు.నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చెక్కుల కోసం కోసం చాలామంది మహిళలు ఎదురు చూస్తున్నారని, ప్రతినెల మంత్రిగారు నియోజకవర్గంలో వచ్చి ఇస్తే ఇంకా సంతోషంగా ఉంటుందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం వర్షానికి నానిపోయి నల్లగా మారిందని నల్లగా మారిన ధాన్యాన్ని కొని డబ్బులు రైతుల ఖాతాలో వెయ్యాలన్నారు. సన్నాళ్లకు బోనస్ ఇవ్వాలని, కొంతమంది రైస్ మిల్లర్లు దొడ్డి ధాన్యం కొంటలేరని, పంట నష్టం జరిగిన చోట ఎకరానికి 25 వేల రూపాయలు ఇవ్వాలని, నర్సాపూర్ నియోజకవర్గానికి సాగు జలాల కోసం సింగూరు నీరు అందించాలని, గ్రామాల్లో తండాల్లో ఇటీవల కృష్ణ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయని వాటిని మరమ్మతులు చేయించాలని మనం మంత్రి విన్నవించారు.జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తుండడంతో ఆయా గ్రూపులకు బ్యాంకుల ద్వారా లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణాలు అందిస్తుండడం గర్వకారణం అన్నారు. ఈ రుణాలతో ఆయా సంఘాల సభ్యులు వివిధ వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదగడం సంతోషకరమన్నారు.వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించడంతో అక్కడ కూడా వారు సంపాదించుకునే అవకాశం కలిగిందన్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగించే కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించడం, గ్యాస్ సబ్సిడీ చెల్లిస్తుండడం, ఉచిత బస్సు సౌకర్యం వంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో జిల్లాలో వీటి నిర్మాణం వేగవంతం చేసినట్లు చెప్పారు.ఒక్క గుడిసెలేని గ్రామాలే లక్ష్యంగా ప్రభుత్వం పేదలందరికీ పక్కా గృహాలు నిర్మిస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే , కలెక్టర్ తో కలసి పలువురు మహిళలకు ఇందిరమ్మ చీరలను, కళ్యాణ లక్ష్మి చెక్కులను, షాది ముబారక్ చెక్కులను అందజేశారుఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, ఫ్యాక్స్ చేర్మెన్లు, ఆర్డీవో మైపాల్ రెడ్డి, డిఆర్డిఓ శ్రీనివాసరావు, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, కాంగ్రెస్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, తహసిల్దారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
•చేగుంట–వడియారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి..
•ఈమార్గాన్ని ‘జీరో యాక్సిడెంట్ జోన్’గా ప్రకటించే దిశగా చర్యలు – మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు..
చేగుంట,నవంబర్,22,మెదక్ టుడే న్యూస్:
మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రైల్వే, ఫారెస్ట్, ఆర్&బీ, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు మాట్లాడుతూ,చేగుంట–వడియారం రైల్వే గేటు వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ( ఆర్ ఓ బి) పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైల్వే గేటు మూసివేయబడిన ప్రతి సమయంలో వందలాది వాహనాలు రెండు వైపులా నిలిచిపోవడం వల్ల అంబులెన్స్‌లు, అత్యవసర సేవల వాహనాలు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయన్నారు.రద్దీ సమయాల్లో పాదచారులు రైల్వే ట్రెక్కులను దాటే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడి, పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. రోడ్లు–రైలు సంగమ ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లు మరియు అండర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని ఎంపీ గుర్తుచేశారు.ఎంపీ రఘునందన్ రావు గారు సంబంధిత శాఖల ఇంజనీర్లు, కాంట్రాక్టర్ సమన్వయంతో ఆర్ ఓ బి, పనులను వేగవంతం చేసి తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే సర్వీస్ రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్, సిగ్నలింగ్ వంటి అనుబంధ సదుపాయాలను సమగ్రంగా ఏర్పాటు చేసి ప్రజలకు సురక్షితమైన రవాణా వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.రాబోయే రోజుల్లో చేగుంట–వడియారం రైల్వే మార్గాన్ని “జీరో యాక్సిడెంట్ జోన్” గా తీర్చిదిద్దే లక్ష్యంతో చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.సమన్వయ సమావేశంలో రైల్వే, ఆర్&బీ, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులంతా పాల్గొన్నారు.
13 ఏళ్ల మైనర్ బాలిక వివాహ ఘటనలో వరుడు, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేసిన గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయ.గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో బాలికలు , మహిళల రక్షణ , భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు సౌత్ జోన్ డిఎస్పి భానోదయ మీడియాకు తెలిపారు.మైనర్ బాలిక వివాహానికి కారణమైన ఆమె నాయనమ్మ, వివాహం జరిపించిన చర్చి పాస్టర్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు..నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తురకపాలెం గ్రామంలో ది.09.05.2025 తేదీన జరిగిన మైనర్ బాలిక వివాహ ఘటనకు సంబంధించి చైల్డ్ వెల్ఫేర్ ,ప్రొటెక్షన్ వారికి సమాచారం అందించిన బాధిత మైనర్ బాలిక.బాధిత మైనర్ బాలిక అందించిన సమాచారం ప్రకారం తురకపాలెం గ్రామ పంచాయతీ సెక్రటరీ నక్కా.నాగ బ్రహ్మం నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేపట్టి, మైనర్ వివాహ ఘటనకు కారణమైన నిందితులను గుర్తించి వివాహం చేసుకున్న వ్యక్తిని, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేసినట్లు ఆమె తెలిపారు. కొరివి దానియేలు (బాధిత బాలిక భర్త ),కొరివి శాంసన్ (నిందితుడు A-1 తండ్రి), కొరివి నిర్మల (నిందితురాలు A-1 తల్లి) అరెస్టు చేశామన్నారు. బాధితురాలి నాన్న సుమారు ఐదు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించగా, అప్పటి నుండి బాధితురాలు, ఆమె తల్లి మరియు మిగిలిన తోబుట్టువులతో కలిసి పెదకాకానిలోని ఆమె అమ్మమ్మ ఇంటిదగ్గర ఉంటున్నది. ఈ క్రమంలో బాధితురాలు తండ్రి స్వగ్రామమైన వట్టిచెరుకూరు మండలం కోర్నెపాడు గ్రామంలో తన తండ్రి తరపున వాటాగా వచ్చే ఆస్తిని ఇవ్వడానికి బాధితురాలికి 13 సంవత్సరాలు వయస్సు అని తెలిసి కూడా 26 సంవత్సరాల వయస్సు కలిగిన ఆమె మేనత్త కొడుకుని వివాహం చేసుకోవాలని, ఆమె మేనత్త, మేనత్త భర్త తరచుగా పెదకాకానిలోని బాధితురాలు ఉండే నివాసానికి వెళ్లి పదేపదే అడుగుతూ ఒత్తిడి చేస్తున్నట్లు, వివాహనానంతరం కూడా బాలిక చదువును కొనసాగిస్తామని చెప్పి మేనత్త, ఆమె భర్త మరియు నానమ్మలు బాధితురాలి తల్లిపై కూడా ఒత్తిడి తీసుకురాగా, బాధితురాలి తల్లి వారి బాధను భరించలేక బాధితురాలిని మేనత్త కొడుకుకి ఇచ్చి వివాహం జరిపించుటకు అంగీకరించడం జరిగింది. ఈ క్రమంలో ది.09.05.2025 తేదీన తురకపాలెం గ్రామంలోని చర్చిలో బాధితురాలికి ఆమె మేనత్త కొడుకుతో ఆమె మేనత్త, మేనత్త భర్త మరియు బాధితురాలు తల్లి, బంధువుల సమక్షంలో చర్చి పాస్టర్ వివాహం జరిపించడం జరిగింది. వివాహానంతరం నిద్రలకు తిరుగుతూ ఉన్న సమయంలో మరియు కాపురానికి వెళ్లిన సమయంలో తురక పాలెం గ్రామంలోని బాధితురాలి మేనత్త ఇంటిలో బాధితురాలని ఆమె భర్త పలు మార్లు లైంగికంగా అనుభవించినట్లు, అదే విధంగా బాధితురాలైన మైనర్ బాలికను చదువుకోవడానికి బడికి పంపించకుండా, ఇంటి దగ్గరే ఉండమని వేధిస్తున్నట్లు, వారి బాధలు భరించలేక బాధితురాలు ఆమె అమ్మకు ఫోన్ చేసి చెప్పగా ఒక నెల క్రితం బాధితురాలి అమ్మ ఆమెను తన అమ్మమ్మ ఇంటికి తీసుకుని వెళ్ళగా, సుమారు వారం క్రితం బాధితురాలు మేనత్త మేనత్త భర్త ఇద్దరు బాధితురాలు ఇంటికి వెళ్లి ఆమెను కాపురానికి పంపించమని అడగగా అంతటా బాధితులు భయపడి చైల్డ్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి సంప్రదించి, ది.08.11.2025 తేదీన వారికి ఫోన్ ద్వారా జరిగిన విషయాలు చెప్పడం జరిగింది. ఈ క్రమంలో తురకపాలెం గ్రామ సచివాలయం నందు సెక్రటరీగా పనిచేస్తున్న నక్కా. రామ బ్రహ్మనాయుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉండటం వలన తనకు చైల్డ్ హెల్ప్ లైన్ అధికారుల నుండి రాబడిన వాట్సాప్ మెసేజ్ ద్వారా బాధితురాలికి బాల్య వివాహం జరిగినట్లు తెలుసుకొని ఈ విషయం గురించి తన తోటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో అందరు సభ్యులతో కలసి, మైనర్ బాలికను ఆమె అమ్మను పిలిపించి విచారించి ఆ విచారణలో మైనర్ బాలిక వెల్లడించిన విషయాలను బట్టి తగు చర్య నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగినది. సదరు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, సౌత్ డిఎస్పి బానోదయ సమగ్ర విచారణ జరిపి ఈ మైనర్ బాలిక వివాహ ఘటనకు కారణమైన వరుడుని, బాధితురాలి మేనత్త, మేనత్త భర్తలను నిన్న(19.11.2025) సాయంత్రం సుమారు 06:00 గంటల సమయంలో గుంటూరు రూరల్ మండలం పెదపలకలూరు గ్రామము జేఎల్ఈ సినిమా హాల్స్ దగ్గరలో అరెస్టు చేయడం జరిగింది.ఈ మైనర్ బాలిక వివాహానికి కారణమైన మైనర్ బాలిక నాయనమ్మను, వివాహం జరిపించిన చర్చి పాస్టర్ను, సంఘ పెద్దలను, హాజరైన బంధువులపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది డిఎస్పీ తెలిపారు.