📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 54

ఇందిరమ్మ రాజ్యం రైతుల పేదల పక్షపాతం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎమ్మెల్యే రోహిత్..

0

•ఇందిరమ్మ రాజ్యం రైతుల పేదల పక్షపాత ప్రభుత్వం…

•మహిళా ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది..

పాపన్నపేట,నవంబర్,25,మెదక్ టుడే న్యూస్:

పాపన్నపేట మండలంలోని మంగళవారం పొడిచాన్ పల్లి
రైతు వేదికలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుఈసందర్భంగా మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యం రైతుల పేదల పక్షపాత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, రాష్ట్ర ప్రభుత్వం మహిళలు అన్ని రకాలుగా అభివృద్ధి సాధించేందుకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు, గ్యాస్ సబ్సిడీ, సన్న బియ్యం, ఉచిత కరెంటు, వడ్డీ లేని రుణాలు ,ఇందిరా మహిళ శక్తి చీరలు,తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నదని, వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ వడ్డీ లేని రుణాలతో మహిళల్లో ఒక ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం ఏర్పడిందని అన్నారు.మహిళలు ఒకేపనికి పరిమితం కాకుండా, అని రంగాల్లో అభివృద్ధి చెందాలని, మహిళల పేరు మీదనే కల్యాణ లక్ష్మి, ఇందిర మహిళా శక్తి చీరల వంటి పథకాలు అందిస్తుందన్నదని తెలిపారు.అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపడుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.వడ్డీ లేని రుణాల రాయితీ కింద 30 కోట్ల 50 లక్షలుచెక్కును అందజేశారు. అనంతరం ప్రత్యేకంగా 11 వేల మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులకు 8.89 కోట్లు వడ్డీరాయితీఅందించామన్నారు.మహాలక్ష్మి పథకం కింద 04 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేయగా 100 కోట్ల రూపాయలు మహిళలు లబ్ధి పొందడం జరిగిందన్నారు.అలాగే గృహ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ సౌకర్యం పై 28 కోట్ల 65 లక్షల రూపాయలు లబ్ధిదారుల జీరో అకౌంట్ లో జమ చేయడం జరిగిందన్నారు.ఈకార్యక్రమంలో పాపన్నపేట ఎంపీడీవో విష్ణువర్ధన్, ఎంపీ ఓ శ్రీశైలం ,ఏపీఎం రాజు, పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవింద నాయక్, ప్రభాకర్ రెడ్డి, నరేందర్ గౌడ్, శ్రీకాంత్ అప్ప, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

వాట్సాప్ ద్వారా క్యాస్ట్, ఇన్‌కం, బర్త్ సర్టిఫికెట్లు పొందొచ్చు..!

0

వాట్సాప్ ద్వారా క్యాస్ట్, ఇన్‌కం, బర్త్ సర్టిఫికెట్లు పొందొచ్చు..!

(స్టేట్ బ్యూరో)నవంబర్,మెదక్ టుడే న్యూస్:

కులం, ఆదాయం, నివాసం వంటి ధ్రువీకరణ పత్రాలను పొందడానికి ఇకపై ప్రజలు రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. మీసేవ కేంద్రాలు లేదా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని అంతకన్నా లేదు. మీ సేవ సర్వీసెస్‌ ఆన్‌ వాట్సప్‌’ ద్వారా ఈ సేవలు ఇంట్లో కూర్చొని ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో పొందొచ్చు.వాట్సాప్‌ నంబరు 80969 58096 ద్వారా సుమారుగా 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా సేవలు ఇకపై పౌరులకు లభించనున్నాయి. ఇది పరిపాలనలో సాంకేతికతను వినియోగించడం ద్వారా పౌరులకు మరింత సౌలభ్యాన్ని అందించే దిశగా తీసుకున్న ముఖ్యమైన ముందడుగు.ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ వాడే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పౌరులు తమ ఇంటివద్ద కూర్చునే ఆదాయం, కులం, నివాసం, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వివాహ రిజిస్ట్రేషన్‌, మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్లు వంటి అన్ని రకాల ధ్రువపత్రాల కోసం ఫోన్ నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా.. విద్యుత్తు, నీటి, ఆస్తి పన్ను చెల్లింపులు, రెవెన్యూ, ఆర్టీఏ, పోలీసు, పౌరసరఫరాలు, పంచాయతీ రాజ్, దేవాలయాల సేవలు సైతం ఈ వేదిక ద్వారా అందించనున్నారు.దరఖాస్తు విధానం..అధికారిక మీ సేవ వాట్సప్‌ నంబరు 80969 58096ను మీ మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి.ఆ నంబరుకు Hi లేదా Menu అనే ఆప్షన్‌ టైప్‌ చేసి పంపిస్తే అందుబాటులో ఉన్న సేవల జాబితా కనిపిస్తుంది.ఆ తర్వాత, ఆధార్‌ ఆధారిత ధ్రువీకరణ (OTP) ప్రక్రియను పూర్తి చేయాలి.అవసరమైన పత్రాలను, స్కాన్‌ చేసిన ప్రతులను నేరుగా వాట్సప్‌లోనే అప్‌లోడ్‌ చేయవచ్చు.దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వే ద్వారా సురక్షితంగా చెల్లించవచ్చు.దరఖాస్తు స్టేటస్, అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశం (SMS) రూపంలో వస్తాయి.సర్టిఫికెట్‌ సిద్ధం కాగానే, దాని డౌన్‌లోడ్‌ లింక్‌ నేరుగా వాట్సప్‌లోకి వస్తుంది.ఈ సరికొత్త సాంకేతిక వేదిక ద్వారా దరఖాస్తు ప్రక్రియ మొత్తం పూర్తిగా పారదర్శకంగా, వేగంగా పూర్తి అవుతుందని ప్రభుత్వం హామీ ఇస్తోంది.

ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య…

0

•ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య…

పాపన్నపేట,నవంబర్,25,మెదక్ టుడే న్యూస్:

మనస్తాపంతో ఉరి వేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన మేరకు వివరాలు…గ్రామానికి చెందిన గడ్డమీది ఉమామహేశ్వర్(23) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.ఇతనికి భార్య దీపికతో గత కొన్ని రోజులుగా సంసార విషయంలో చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి.సోమవారం మధ్యాహ్నం సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.అనంతరం ఇంట్లో నుండి మనస్తాపంతో బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టూ పక్కల వెతికారు మంగళవారం ఉదయం గ్రామంలోని ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు.పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.పంచనామా నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి మృతుడి తండ్రి వెంకటేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు పేర్కొన్నారు.

ఢాకా వేదికగా జరిగిన అంతర్జాతీయ మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025 టైటిల్ సాధించిన భారత మహిళలకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శుభాభినందనలు..

0

(స్టేట్ బ్యూరో)నవంబర్,24,మెదక్ టుడే న్యూస్:

ఢాకా వేదికగా జరిగిన అంతర్జాతీయ మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025 టైటిల్ సాధించిన భారత మహిళలకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు. ఫైనల్స్ లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి చైనీస్ తైపీపై 35-28 పాయింట్ల తేడాతో విజయం సాధించి వరుసగా రెండో ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకుని భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటారని కొనియాడారు.అవకాశం ఇస్తే తమలోని ప్రతిభా పాటవాలని ప్రదర్శించి విజేతలుగా నిలుస్తారనడానికి మన మహిళలు నిదర్శనమని అన్నారు. మహిళల జట్టు విజయం ఉన్నత లక్ష్యాలను సాధించాలనుకునే యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు.

రోడ్డు ప్రమాదం.. నవ వధువు మృతి..

0

•రోడ్డు ప్రమాదం.. నవ వధువు మృతి

(స్టేట్ బ్యూరో)నవంబర్,24,మెదక్ టుడే న్యూస్:

రోడ్డు ప్రమాదం.. నవ వధువు మృతి
తెలంగాణ : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల శివారులో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవ వధువు ప్రణతి (24) మృతి చెందింది. ఉద్యోగ నిమిత్తం సిద్దిపేట నుంచి హైదరాబాద్‌‌కు బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణతి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త సాయికుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతనికి గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో పెద్ద చెప్యాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పంచాయతీ సెక్రెటరీ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఆదుకోండి..

0

•పంచాయతీ సెక్రెటరీ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఆదుకోండి..

చేగుంట,నవంబర్,24,మెదక్ టుడే న్యూస్:

మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చేగుంట మండలం పోలంపల్లి గ్రామపంచాయతీ సెక్రటరీ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న కొండి లక్ష్మి వైఫ్ ఆఫ్ ఆంజనేయులు కుటుంబానికి హామీ ఇచ్చిన ఆర్డీవో,తహసిల్దార్,ఎంపీడీవో, డి ఎల్ పి ఓ,ఒక ఎకరా ప్రభుత్వ భూమి ఇవ్వాలని కలెక్టర్ ను కలవడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండి స్వామి, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి శ్యామల అశోక్,డిపిఎఫ్ నాయకులు సంజు, మాల మహానాడు శంకరంపేట్ మండల అధ్యక్షుడు సంజు,దళిత నాయకులు పాల్గొనడం జరిగింది.

లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడ్డ సహాయ కార్మిక అధికారి కర్నె చందర్..

0

(స్టేట్ బ్యూరో)నవంబర్,24,మెదక్ టుడే న్యూస్:

లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడ్డ సహాయ కార్మిక అధికారి కర్నె చందర్
ఖమ్మం జిల్లాలో అవినీతి మరోసారి వెలుగుచూసింది. ఫిర్యాదుదారుని తండ్రి మరణానికి సంబంధించి తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా మంజూరు చేసే అంత్యక్రియల ఖర్చుల నిధి రూ.1,30,000 ఇవ్వడానికి సహాయ కార్మిక అధికారి కర్నె చందర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారి చేతిలో పట్టుబడ్డారు.
ఎలా జరిగింది?ఫిర్యాదుదారుడు తన తండ్రి మరణానంతరం లబ్ధిదారునిగా నామినేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తును ఉన్నతాధికారులకు పంపి, మంజూరు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం కోసం కర్నె చందర్ రూ.15,000 లంచం డిమాండ్ చేసినట్లు ACB అధికారులు తెలిపారు.
ఫిర్యాదుదారు చేసిన ఫిర్యాదు మేరకు ఏర్పాటు చేసిన ఉచ్చులో, నేరాన్ని అంగీకరించే స్పష్టమైన ఆధారాలతో కర్నె చందర్ రంగేలో పట్టుబడ్డాడు.

సర్పంచ్ ఎన్నికలు.. జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ.

0

సర్పంచ్ ఎన్నికలు.. జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ.

(స్టేట్ బ్యూరో)నవంబర్,24,మెదక్ టుడే న్యూస్:

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జీవో నం.46 ప్రకారం 50% రిజర్వేషన్లతో స్థానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందులో SC, STల పంచాయతీలు యథాతథంగా ఉండగా, 22% రిజర్వేషన్ మాత్రమే అమలు చేస్తుండటంతో పలుచోట్ల BCల రిజర్వు స్థానాలు మారాయి. ఈ వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సైతం పంపారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన చేగుంట బిఆర్ఎస్ నాయకులు..

0

•సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన చేగుంట బిఆర్ఎస్ నాయకులు..

చేగుంట,నవంబర్,24,మెదక్ టుడే న్యూస్:

చేగుంట మండలకేంద్రంలో
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన చేగుంట మండల బిఆర్ఎస్ నాయకులు లబ్ధిదారు లు గోలే రాందాస్ పులిమామిడి 5400, మాదోత్ ధోళి తిమ్మాయపల్లి 1500, కరంతోత్ మోహన్ చెట్ల తిమ్మాయిపల్లి 10500, బ్యాగరీ మైసమ్మ బోనాల కొండాపూర్ 60,000, రెడ్డిపల్లి కనకరాజు మక్కా రాజుపేట 18000, అంబర్ పేట్ నారాయణ చెట్ల తిమ్మాయిపల్లి 13500, కొంగోలి యాదిరెడ్డి చెట్ల తిమ్మాయిపల్లి 16500, ఊరడి నాగలక్ష్మి కరీంనగర్ 15000, అక్కల అనసూయ చేగుంట 60,000, గో గో లోo త్ లలిత అనంతసాగర్ 31000, శంభుని నర్సమ్మ రెడ్డిపల్లి 28500, సాదుల్లా చేగుంట 60,000, 12 మంది లబ్ధిదారులకు సుమారు 3 82,000 రూపాయల చెక్కులను అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, చేగుంట మండల మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మంచికర్ల శ్రీనివాస్ ,బాపు రెడ్డి,చేగుంట మండల బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు అన్నం రవి,డిష్ రాజు,మహమ్మద్ అలీ, మహేష్,సురేష్,మోహన్ నాయక్, అంజిరెడ్డి తదితరులు పాల్గొని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందిన యువకుడు..

0

•ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందిన యువకుడు

చేగుంట,నవంబర్,24,మెదక్ టుడే న్యూస్:

చేగుంట మండలం మక్క రాజుపేట గ్రామంలో హర్షద్ అహ్మద్ వయస్సు 40 సంవత్సరాలు ఒక సంవత్సరం నుండి తన అత్తగారైన మకరాజుపేట గ్రామానికి వచ్చి పెయింటింగ్ పనులు చేసుకుంటూ బ్రతుకు జీవనం సాగించేవాడు ఆదివారం రాత్రి కాలకృత్యాలు కోసమని తన ఇంటి సమీపంలో గల చాన్కాన్ కుంటలో వెళ్ళగా కాలుజారి అందులో పడి చని పోయాడు అతడికి ఒక కుమారుడు ఒక కూతురు కలదు అని భార్య తహే ర బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు