•సర్పంచ్ స్థానాలు152 వార్డు సభ్యులు 186 నామినేషన్ స్వీకరణ
•అల్లదుర్గ్ 14 సర్పంచ్,11 వార్డు సభ్యులు
•హవేలీఘనాపూర్ 49 సర్పంచ్,65 వార్డు సభ్యులు
•పాపన్నపేట్ 25 సర్పంచ్,22 వార్డు సభ్యులు
•రేగోడు 18 సర్పంచ్,11 వార్డు సభ్యులు
•శంకరం పేట్ (ఏ) సర్పంచ్ 17, 40 వార్డు సభ్యులు
టేక్మాల్ 29 సర్పంచ్,37 వార్డు సభ్యులకు మొత్తంగా ఈ రోజు సర్పంచ్ స్థానాలకు 152వార్డ్ మెంబర్లకు 186 నామినేషన్లు వేయడం జరిగిందనీ జిల్లా ఎన్నికల అధికారి ,కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మెదక్ జిల్లాలో అతి పెద్ద మండల మైన పాపన్నపేట మండలంలో 40 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాల ఎన్నికలకు గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు గురువారం 13, రెండవ రోజు శుక్రవారం 25 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పాపన్నపేట సర్పంచ్ స్థానానికి పావని నరేందర్ గౌడ్ నామినేషన్ వేశారు. శనివారం చివరి రోజు ఆయా గ్రామాల నుండి అధికంగా నామినేషన్లు రానున్నాయి.
మెదక్ జిల్లాలో అతి పెద్ద మండల మైన పాపన్నపేట మండలంలో 40 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాల ఎన్నికలకు గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు గురువారం 13, రెండవ రోజు శుక్రవారం 25 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పాపన్నపేట సర్పంచ్ స్థానానికి పావని నరేందర్ గౌడ్ నామినేషన్ వేశారు. శనివారం చివరి రోజు ఆయా గ్రామాల నుండి అధికంగా నామినేషన్లు రానున్నాయి.
ఆధ్యాత్మిక కేంద్రం లో..అలజడి చెలరేగింది.ఏడు పాయల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో దోపిడి జరిగింది. రివాల్వర్ తో బెదిరించిన అగంతకులు హల్చల్ చేశారు. విందు ముగించుకొని సరదాగా పేకాట ఆడుతున్న వారిపై దాడికి తెగ బడ్డారు.ఆపై దర్జాగా రెండున్నర లక్షలు దోచుకెళ్లారు. మంగళ వారం రాత్రి జరిగిన సంఘటన కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.అది అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల.దుర్గమ్మ తల్లి సన్నిధి సుమారు 60 మంది భక్తులు హీరాలాల్ షెడ్లో అర్ధరాత్రి సేధా తీరుతున్నారు అర్ధరాత్రి కావడంతో అంతా నిశ్శబ్ద వాతావరణం, అదే సమయంలో వారు సేద తీరుతున్న హీర లాల్ గెస్ట్ హౌస్ గేటు దూకి మూకుమ్మడిగా పదిమంది దుండగులు లోనికి చొరబడ్డారు. కొందరు మొదటి గేటు వద్ద కాపలా ఉండగా మరికొందరు రెండో గేటు కాడ పహార కాచారు, మరో 6 మంది షెడ్లోనికి చొరబడ్డారు, చొరబడ్డ వారి వద్ద రివాల్వర్ ఉండడం కు తోడు దానితో భక్తులను బెదిరించారు. 60 మంది వరకు ఉన్న భక్తులు రివాల్వర్ చూసి కిమ్మనలేక నిచ్చేస్తులయ్యారు, దుండగులు లోనికి ప్రవేశించగానే రివాల్వర్తో బెదిరించి, వారివద్ద ఉన్న సెల్ ఫోన్లన్నీ తమకు అప్పగించాల్సిందిగా హుకుం జారీ చేశారు, భయభ్రాంతులకి గురైన భక్తులు అందరి సెల్ ఫోన్లు తీసి దుండగులకు అప్పగించారు, అందులోనుండి తేరుకున్న మెదక్ పట్టణానికి చెందిన ధర్మాకర్ రాజు అనే యువకుడు వారిని అడ్డగించే ప్రయత్నం చేశాడు వెంటనే, దుండగులు అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు, దీంతో తోటి భక్తుడి పై దాడితో భయ భ్రాంతులకు గురైన మిగతా భక్తులు నిచ్చేస్తుల్లై వారి వద్ద ఉన్న రెండున్నర లక్షలు దుండగులకు అప్పగించారు, అవి అందగానే దుండగులు గోడదుకి పరారయ్యారు, ఏడుపాయలలో ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతున్న ఇవి ఏమాత్రం బయటకు పొక్కడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి,
•రివాల్వర్ చూసి భయపడ్డాం…
•భక్తుడు ధర్మకర్ రాజు, మెదక్
మేము ఏడుపాయల దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం విందు ఏర్పాటు చేసుకున్నాం, అర్ధరాత్రి కొంతమంది సేద తీరుతుండగా మరి కొంతమంది పేకాట ఆడుతున్నారు అదే సమయంలో పది మంది వరకు దుండగులు రివాల్వర్ తో వచ్చారు, వారిని చూసి అందరూ భయపడ్డారు నేనొక్కడిని ఎదుర్కొనే ప్రయత్నం చేశా నాపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాంతో నేను కూడా చేసేది లేక సరెండర్ అయ్యాను. ఆపై దుండగులు మా వద్ద ఉన్న రెండున్నర లక్షల నగదు ఎత్తుకొని పరారయ్యారు,
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పాపన్నపేట, టేక్మాల్ ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడారు.సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 27వ తేదీ ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రామపంచాయతీ ప్రధాన కూడళ్లలో ప్రదర్శింపచేయాలని అన్నారు. అలాగే ఓటరు జాబితా కూడా ప్రదర్శింపజేయాలని సూచించారు. నామినేషన్లు ప్రక్రియ ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని ఈనెల 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించాలని తెలిపారు. 30వ తేదీన నామినేషన్లు పరీశీలన, డిసెంబర్ 1వ తేదీన అప్పీళ్లు, 2వ తేదీన డిస్పోజల్, 3వ తేదీన ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. నామినేషన్లు స్వీకరణకు 147 మంది రిటర్నింగ్ అధికారులను నియమించామని తెలిపారు. ప్రతి రిటర్నింగ్ అధికారుల కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు సెట్లు నామినేషన్ సెట్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. నామినేషన్ లో ఖచ్చితంగా తేదీ, సమయం, క్రమ సంఖ్య నమోదు చేయాలని సూచించారు. నామినేషన్లలో అభ్యర్థి సంతకం, ధ్రువీకరణ ప్రతిపాదకుని సంతకం ఉండాలని తెలిపారు. జిల్లాలో మొదటి విడతలో160 గ్రామపంచాయతీలలో 1402 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు చేసిన హెల్ప్ డెస్క్ లు, ఇతర ఏర్పాట్లను పరిశీలించామని వివరించారు.ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో ఆర్ఓ, ఏఆర్ఓలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని, జోనల్, మండల ఆఫీసర్లు, ఎంసీసీ నోడల్ ఆఫీసర్లు, ఎఫ్ ఎస్ టీ, ఎస్ఎస్ టీ టీంలను నియమించి శిక్షణ పూర్తి చేశామని పేర్కొన్నారు. ఎఫ్ ఎస్ టీ, ఎస్ఎస్ టీ టీంలను విధులు నిర్వర్తిస్తున్నాయని తెలిపారు. అన్ని ఆర్ఓ కార్యాల యాల్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సహాయార్థం హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని, ఎన్నికకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో పెట్టాలని, నామినేషన్ల స్వీకరణ ఇతర వివరాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లాలో మొదటి రెండు, మూడో విడతలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు.కార్యక్రమంలో మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.
మెదక్ విద్యుత్ శాఖ నూతన డివిజనల్ ఇంజనీర్ (డిఈ)గా రామేశ్వర్ స్వామీ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.సంగారెడ్డి టి ఆర్ఈ ఏడిఈగా విధులు నిర్వహిస్తున్న రామేశ్వర స్వామీ పదోన్నతిపై మెదక్ డివిజన్ డిఈ నియమితులయ్యారు. ఈసందర్భంగా మెదక్ విద్యుత్ అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం రామేశ్వర స్వామీ మాట్లాడుతూ విద్యుత్ అధికారులు,సిబ్బంది సహకారంతో మెదక్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.ఈకార్యక్రమంలో 1104 యూనియన్ నాయకులు నేత ప్రసాద్, విఠల్ , రాంపురం నాగేష్, వరప్రసాద్, కామారం శ్రీనివాస్, వి ఎల్ ఎన్, రెడ్డి, విజయ్ కుమార్, రవీందర్ గౌడ్,మరాఠీ శ్రీనివాస్, ఇబ్రహీం,దుర్గా ప్రసాద్,టేక్మల్ సంగయ్య,బలరాం, తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని తెలిపారు. బుదవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ఆదేశాలు, సూచలను జారీచెశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలను డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండవ విడత, డిసెంబర్ 17న మూడవ విడత పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అప్ డేట్ చేసిన రిజర్వేషన్లు, పోలింగ్దశ, పోలింగ్ కేంద్రాల జియో లోకేషన్ వివరాలు టి-పోల్ వెబ్ సైట్ లో నవీకరించాలని తెలిపారు. టి-పోల్ వెబ్ సైట్ ద్వారా వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదులను మూడు రోజులలో పరిష్కరించాలని అన్నారు. పొలింగ్ క్రేంద్రాల జాబితా,డిజిటల్ వివరాలను టి పోల్ లో నమోదు చేయాలని, పోలింగ్ కేంద్రాలలో లైట్, పవర్, ర్యాంప్, ఫర్నిచర్, భద్రతను చూసుకోవాలని, 2 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న భవనం దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, వెబ్ క్యాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలని, డిస్ట్రిబ్యుషన్ కేంద్రాలు మండల కేంద్రాలో ఉండాలని, ఒట్ల లెక్కంపు కొరకు స్ట్రాంగ్ రూంలను 3 రోజుల ముందుగా సిద్దం చేసుకోని ఏర్పాట్లను పర్యవేక్షించుకోవాలని సూచించారు. నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని. పంచాయతీ ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన,అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా అవసరమైన మార్గదర్శకాల జిల్లా ఎన్నికల అధికారులు జారీ చేయాలని అన్నారు. జిల్లాలో ఉన్న ప్రింటర్లు అనుమతి లేకుండా ఎన్నికల ప్రచార కరపత్రాల ముద్రణ చేయకుండా సెక్షన్ 216 టిపిఆర్ చట్టం కఠినంగా ఆమలు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచారం సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాలను నమోదు చేసేందుకు ధరలను ఖరారు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ లకు ఎన్నికల కమిషనర్ సూచించారు. ప్రతి మండలానికి ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం, ఒక ఏ.ఈ.ఓ (సహాయ వ్యయ వివరాల నమోదు అధికారి), ప్రతి జిల్లాకు ఒక స్టాటిక్ సర్వేలెన్స్ బృందం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తప్పనిసరిగా జరిగేలా పర్యవేక్షించాలని అన్నారు. ప్రతి జిల్లాలో ఎం.సి.ఎం.సి కమిటి, జిల్లా మీడియా సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ వీడియోలకు ముందుగా ఎం.సి.ఎం.సి అనుమతి ఉండాలని అన్నారు. ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించే నేపద్యంలో రైతులు పంట డబ్బులు తీసుకుని వెళ్లే సమయంలో తప్పనిసరిగా రశీదు పెట్టుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఎం.సి.సి అమలులో నిర్వహించే తనిఖీల లో నగదు, బంగారం, ఇతర పరికరాలు సీజ్ చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు అందించాలని, సీజ్ చేసిన పరికరాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు ఏ అధికారి ముందు హాజరు కావాలని వివరాలు ఆ రసీదు లో ఉండాలని అన్నారు. వీసీ అనంతరం ఎన్నికల నిర్వహణ మీద సంబంధిత అధికారులతో *జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ,ఎన్నికల నిర్వహణ సాఫీ గా జరగలన్నారు.
ప్రతీ ఒక్కరికి ఎన్నికల నియమ నిబంధనల పై అవగాహన ఉండాలన్నారు.
పోలింగ్ నుండి కౌంటింగ్ వరకు జరిగే ప్రతీ ప్రక్రియ పైన సమగ్ర అవగాహన కల్పించాలన్నారు.
ఎన్నికల నిర్వహణ లో విధులు నిర్వర్తించే ప్రతీ ఒక్క అధికారి తమ విధుల పట్ల జాగ్రత్త గా ఉండాలన్నారు
ఎన్నికల ప్రవర్తన నియమావళి జిల్లాలో పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు.
ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు.. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను తూచా తప్పకుండా అనుసరించాలన్నారు.ఈ వీసీ లో జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య, అడిషనల్ ఎస్పీ మహేందర్, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.
భారత్ అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన గణతంత్ర రాజ్యం దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపమే మన రాజ్యాం గం పౌరులు పాలకులు, పాలన యంత్రాంగం, పాటించవలసిన అత్యున్నత చట్టంగా దీన్ని పేర్కొంటారు. ఇందులో ప్రభుత్వ విభాగాలు వాటి స్వరూపం స్వభావం లక్ష్యాలు ఆశయాలు వివరించారు. ప్రతి వ్యక్తి స్వేచ్ఛకు సర్వతో ముఖాభి వృద్ధికి రాజ్యాంగం హామీ ఇస్తుంది.భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీకి గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 26న ఇండియా… రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దీన్నే సంవిధాన్ దివస్ అని కూడా అంటారు. ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవం గా కూడా జరుపుకుంటారు. 1949 నవంబర్ 26న భారత దేశం… రాజ్యాంగాన్ని దత్తత చేసుకుంది. అంటే భారత రాజ్యాంగ అసెంబ్లీ… రాజ్యాంగాన్ని స్వీకరించింది.ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి భారత్‌లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఐతే… ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం, జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని మాత్రమే దేశ ప్రజలు ఎక్కు వగా జరుపుకుంటున్నారు. ఈ రాజ్యాంగ దినోత్సవం కొత్తది కావడంతో… దీనికి అంతగా ప్రాచుర్యం కలగలేదు.2015 నవంబర్ 19న… కేంద్ర ప్రభుత్వం… నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ… గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… 2015 అక్టోబర్ 11న ముంబైలో… సమానత్వ జ్ఞాపిక దగ్గర డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పునాది రాయి వేస్తూ… ఈ ప్రకటన చేశారు. 2021లో… అంబేద్కర్ 131వ జయంతి జరిగింది. భారత రాజ్యాంగ ప్రతిని రూపొందించిన రాజ్యాంగ కమిటీకి అంబేద్కర్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇది వరకు నవంబర్ 26న లా డే గా జరుపుకునేవారు. నవంబర్ 26న… రాజ్యాంగం ప్రాధాన్యం, అంబేద్కర్ ఆశయాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. 2015 నుంచే ఎందుకు? 2015లో భారత రాజ్యాంగ పితగా పిలుచుకునే డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 125వ జయంతి జరిగింది.ఆయన 1891 ఏప్రిల్ 14న జన్మించగా… 1956 డిసెం బర్ 6న కన్నుమూశారు. 125వ జయంతి ఉత్స వాల్ని ఘనంగా జరపాలని నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేక కమిటీని వేసింది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.ఆ కమిటీ… ఏడాది పాటూ ఉత్సవాలు నిర్వహించింది. అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగా… రకరకాల కార్యక్రమాల్ని నిర్వహించారు. ఆ క్రమం లో… 2015 అక్టోబర్‌లో.. ముంబైలోని… అంబేద్కర్ జ్ఞాపిక దగ్గర… పునాది రాయి వేస్తూ… ప్రధాన మంత్రి నరేంద్రమోదీ… రాజ్యాంగ దినోత్సవ ప్రకటన చేశారు. అలా 2015 నుంచి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుగుతోంది.
•నూతన ‘లేబర్ కోడ్’లనుతెలంగాణ రాష్ట్రంలో అమలుచేయవద్దు
•టియుడబ్ల్యుజె రౌండ్‌టేబుల్ సమావేశంలో తీర్మానం
(స్టేట్ బ్యూరో)నవంబర్,25, మెదక్ టుడే న్యూస్:
కేంద్ర ప్రభుత్వం అమలులోనికి తీసుకొచ్చిన నూతన ‘లేబర్ కోడ్’లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేయాలని టియుడబ్ల్యుజె-ఐజెయు, కేంద్ర కార్మిక సంఘాలు తీర్మానించాయి. నూతన లేబర్ కోడ్‌లను రద్ధు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ధర్నాలతో పాటు ఇందిరాపార్క్ వద్ద ‘కార్మికుల తలపెట్టనున్న నిరసన గళం’ కార్యక్రమంలో పాల్గొని, విజయవంతం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) అధ్యక్షుడు కె.విరాహత్ అలీ అధ్యక్షతన బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో మంగళవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమి చైర్మన్, ఐజెయు జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లతో కార్మికులతో పాటు వైట్ కాలర్ ఉద్యోగులు పరోక్షంగా తమ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ కనీసం కార్మిక సంఘాల నేతలతో చర్చించకుండానే నూతన లేబర్ కోడ్‌లను అమలు చేయడం ఆశ్చర్యకరమన్నారు. నూతన లేబర్ కోడ్‌లపై ప్రధాన మీడియాలు చర్చలు పెట్టకపోవడం విడ్డూరమని, కార్పొరేట్ శక్తుల చేతుల్లో మీడియా బంది అయిపోయిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో న్యాయవ్యవస్థ కూడా రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోవడం ఖామమనే అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. జాతీయ మీడియాతో పాటు తెలుగు ప్రధాన పత్రికలు సైతం ప్రస్తుతం అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్‌ల కారణంగా కార్మికులు, ఉద్యోగులకు కలిగే లాభ, నష్టాలను వివరించకపోవడం బాధకరమని చెప్పారు. ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలతో వర్కింగ్ జర్నలిస్టు అంటే మెడికల్ రిప్రజెంటివ్ ఉద్యోగంతో సమానంగా చూస్తున్నారని శ్రీనివాస రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు 26 మందితో కమిటి వేసి 1955లో మొదటి న్యూస్ పేపర్ యాక్ట్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. దాని ఫలితమే ప్రస్తుత ఆర్‌ఎన్‌ఐ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పిసిఐ) ఏర్పాటు, జర్నలిస్ట్‌ల అపాయింట్‌మెంట్స్, 6 గంటల పని, మహిళ రక్షణ, సెలవులు తదితరవి జర్నలిస్టులకు రక్షణగా నిలుస్తున్నాయని ఆయన వివరించారు. మొదట్లో వేతన సవరణ ప్రతి సంవత్సరం అమలు చేసేవారని, కాలక్రమేణ 3 నుంచి 5 సంవత్సరాలకు పెరిగిందని, ప్రస్తుతం వేతన సవరణ అమలు 15 సంవత్సరాలు దాటినప్పటికీ చేయడం లేదన్నారు. అల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు పివి.కృష్ణ రావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారం చెపట్టినప్పటీ నుంచి బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతోందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ బ్యాంకులను ప్రోత్సహించడం, మెర్జ్ పేరుతో బ్యాంకుల విలీనం తదితర లాంటివి బ్యాంకు ఉద్యోగుల శ్రమదోపిడీ చేయడమేనని స్పష్టం చేశారు. కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపి ప్రైవేటైజెషన్ పేరుతో బ్యాంకులను విదేశీ సంస్థలకు అప్పగించడంతో పాటు మనీలెండర్స్ చేతుల్లోకి దేశ ప్రజలను నెట్టివేసేలా మోడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందన్నారు. ఐఎన్‌టియుసి ప్రధాన కార్యదర్శి ఆర్.డి. చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్రం అమల్లోకి తెచ్చిన నూతన లేబర్ కోడ్‌లతో ‘కంపెనీలకు లాభం, కార్మికులకు నష్టం’ అని అన్నారు. ఐటి ఎంప్లాయిస్, స్పెషల్ జోన్(ఆధిభట్ల) ప్రాంతాలలో ఉద్యోగులకు యూనియన్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నూతన లేబర్ కోడ్‌ల రద్దు కోసం సుప్రీం కోర్టుకు వెళ్లడంతో పాటు.పాఠశాల, కళాశాల విద్యార్థులకు సైతం నూతన లేబర్ కోడ్‌ల వలన కలిగే నష్టాలను వివరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్మిక సంఘాలన్ని కలిసి 10 రోజులు నిర్విరామంగా సమ్మె చేస్తే కేంద్రం దిగివస్తుందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఏండి. యూసుఫ్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై పోరాడే యూనియన్లను లేకుండా చేయడమే లక్ష్యంగా మోడి ప్రభుత్వం నూతన లేబర్ చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు. శ్రామికులను నష్ట పరిచి పరిశ్రమలకు లాభం చేకూర్చేలా మోడి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కార్మికులందరూ ఏకమై తమ నిరసన గళంతో నూతన లేబర్ కోడ్‌లు రద్దు చేసేలా మోడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. టియుసిఐ నాయకుడు సూర్యం మాట్లాడుతూ నూతన లేబర్ చట్టాల ద్వారా గిగ్ వర్కర్లకు మేలు జరుగుతుందని ప్రధాని మోడి చెప్పడం హాస్యాస్పదమన్నారు. కంపెనీలకు వచ్చే లాభాల నుంచి కాకుండా గిగ్ వర్కర్లకు వచ్చే వేతనంలో కొద్ది మొత్తం పన్నుల రూపంలో వసూలు చేసి, వారి ప్రొటెక్షన్ కోసమని గొప్పలు చెప్పుకొవడం విడ్డూరమని దుయ్యబట్టారు. దేశ వ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది కార్మికులు ఉంటే, అందులో కేవలం 7 కోట్ల మందికి మాత్రమే పిఎఫ్, 3 కోట్ల మందికి ఇఎస్‌ఐ అమలవుతుందని శోచనీయమన్నారు. నూతన లేబర్ కోడ్‌లతో కలిగే నష్టాలను ప్రతి కార్మికుని వద్దకు చేరే విధంగా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఐఎఫ్‌టియు ప్రధాన కార్యదర్శి ఎస్.ఎల్. పద్మ మాట్లాడుతూ సత్యమేవ జయతే-శ్రమయేవ జయతే అని మోడి ప్రభుత్వం కార్మికుల శ్రమను దొపిడీ చేస్తుందన్నారు. మహిళ ఉద్యోగులకు పట్టపగలే రక్షణ లేని పరిస్థితులు కనిపిస్తుంటే, రాత్రి సమయాల్లో కూడా మహిళలు ఉద్యోగం చేసుకొవచ్చనే హక్కు కల్పించడం బాధకరమని మండిపడ్డారు. ఐజెయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన లేబర్ కోడ్‌లు శుస్క ప్రియులు- శూన్య హస్తాలు అనే సామేత చందంగా ఉందని ఎద్దేవా చేశారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు పేరును శాశ్వతంగా రూపుమాపడానికే ఆయన అమలు చేసిన లేబర్ చట్టాలను ప్రస్తుత ప్రధాని మోడి రద్దు చేసి, వాటి స్థానాల్లో నూతన చట్టాలను తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఎప్పుడు లేని విధంగా ప్రధాని మోడి తన ట్విట్టర్ ఖాతా ద్వారా నూతన లేబర్ కోడ్‌ల గురించి క్లుప్తంగా వివరించడం విడ్డూరమన్నారు. ఈ సమావేశంలో టియుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామనారాయణ, ఐజేయు జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టియుడబ్ల్యుజె ఉప ప్రధాన కార్యదర్శి కే.రాములు, రాష్ట్ర కార్యదర్శి వి.యాదగిరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ.రాజేష్, హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి అశోక్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజ్, కార్యదర్శి బి. వెంకటేశం, ఐ.ఎఫ్.టి.యు నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రమైన పాపన్నపేటలోనీ గురువారం సాయిబాబా ఆలయ 16వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి చెరువుపల్లి విశ్వనాథ శర్మ ఓక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 08.00గం.కు గణపతి పూజ, పాలతో అభిషేకం అనంతరం రమ సమెత సత్యనాయణ స్వామీ వ్రతం, మధ్యానం హారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.అనంతరం రామారపు వీరేశం గుప్తా దంపతులచే అన్న ప్రసాదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈకార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.