📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 52

గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేద్దాం:జిల్లా ఎస్ పి శ్రీనివాస రావు..

0

•ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి.

మెదక్,డిసెంబర్,1,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి

గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు ప్రతి ఓటరు, ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఎన్నికల నిబంధనలు పాటించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్  విజ్ఞప్తి చేశారు.మెదక్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,గ్రామాల్లో గొడవలు, గుంపుల తగాదాలు, ఉద్రిక్తతలకు దారితీసే చర్యలు పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థులు, పార్టీ చిహ్నాలపై వాదనలు, ప్రేరేపించే వ్యాఖ్యలు చేయరాదని తెలిపారు. ఎవరినైనా బెదిరించి ఓటు వేయమని ఒత్తిడి చేయడం నేరమని, డబ్బు, మద్యం, ఉచితాలు ఇచ్చి ఓటర్లను ప్రభావితం చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఎన్నికల సమయంలో మద్యం నిల్వ, పంపిణీ, వినియోగం కనిపిస్తే వెంటనే కేసులు నమోదు చేయబడుతాయని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రాణహాని కలిగించే ఆయుధాలు తీసుకురావడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం అనుమతి లేకుండా లౌడ్‌స్పీకర్ల వినియోగం, గోడలపై పోస్టర్లు అతికించడం, ప్రభుత్వ లేదా ప్రజల ఆస్తుల ధ్వంసం చేయడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.పోలింగ్ రోజు ఓటర్లు క్యూలో ప్రశాంతంగా నిలబడి ఓటు వేయాలని, పోలింగ్ బూత్‌లో మొబైల్ ఫోన్‌లు తీసుకురావడం పూర్తిగా నిషేధమని తెలిపారు. సోషల్ మీడియాలో పుకార్లు, నకిలీ వార్తలు షేర్ చేయడం ప్రమాదకరమని వారి నిఘా ఉంటుందని అన్నారు. ఏవైనా అక్రమ కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.మీ ఓటు మీ హక్కు, స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయలని ఎస్పీ  ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాల తనిఖీ…

0

పాపన్నపేట,డిసెంబర్,1,మెదక్ టుడే న్యూస్:

సోమవారం మండల కేంద్రం పాపన్నపేటలో  నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాలు సోమవారం పలు చోట్ల తనిఖీలు నిర్వహించాయి.ప్రయాణ ప్రాంగణ ప్రాంతం, ప్రధాన చౌరస్తా, దుకాణాల్లో సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలను గుర్తించేందుకు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.కానిస్టేబుళ్లు, తదితరులున్నారు.

అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో హెల్ప్ డెస్క్ సహకారం తీసుకోవాలి.

0

అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో హెల్ప్ డెస్క్ సహకారం తీసుకోవాలి.

•స్కూటీని నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలి

•ఎన్నికల సాధారణ పరిశీలకులు
భారతి లక్పతి నాయక్

పాపన్నపేట,నవంబర్,30, మెదక్ టుడే న్యూస్:

ఆదివారం పాపన్నపేట మండలం ఎంపీడీవో ‌ కార్యాలయంలో ‌‌అధికారులు నిర్వహిస్తున్న స్కూటీని సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ మెదక్ ఆర్ డి ఓ రమాదేవితో కలిసి పరిశీలించి సమర్థ నిర్వహణకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు భారతీ లక్పతి నాయక్ మాట్లాడుతూ, మొదటి విడత సర్పంచ్ వార్డ్ మెంబర్ స్థానాలకు పాపన్నపేట మండలంలో 40 గ్రామపంచాయతీలుగాను సర్పంచ్-221, వార్డ్ మెంబర్స్-727 నామినేషన్లను స్వీకరించడం జరిగిందని. స్కూటీని ని చేయగా 02 నామినేషన్లు రిజెక్ట్ చేయడం జరిగిందని వార్డ్ మెంబర్స్ ప్రపోజర్స్ వారికి సంబంధించిన వార్డులో లేరు వివరాలు తప్పుగా సమర్పించారు అందువలన వారు వేసిన నామినేషన్స్ రిజెక్ట్ అయినట్టు వివరించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి ‌ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బూత్ స్థాయి కార్యక్రమాల విస్తరణపై ప్రత్యేక దృష్టి

0

తుక్కుగూడలో బీజేపీ రాష్ట్ర స్థాయి సంస్థాగత కార్యశాల ప్రారంభం

  • పార్టీ బలోపేతంపై రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సూచనలు
  • సంస్థాగత నిర్మాణంపై జాతీయ నాయకుల దిశానిర్దేశం

తుక్కుగూడ,నవంబర్,30,మెదక్ టుడే న్యూస్:(స్టేట్ బ్యూరో)

తుక్కుగూడలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి సంస్థాగత కార్యశాల శనివారం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శక్తిని విస్తరించేందుకు, కార్యకర్తలకు మార్గదర్శకాన్ని అందించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యశాలకు నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభోత్సవంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సమావేశానికి ఉద్దేశించి మాట్లాడుతూ, పార్టీ బలోపేతమే రాబోయే కాలంలో అత్యంత ప్రాధాన్యతనందుకునే అంశమని పేర్కొన్నారు. కార్యకర్తలు ప్రజల సమస్యల్లో నేరుగా జోక్యం చేసుకుని పార్టీ పట్ల విశ్వాసం పెంపొందించాలని సూచించారు.
రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాల విస్తరణకు స్పష్టమైన కార్యాచరణను రూపొందించాల్సిన అవసరాన్ని తెలుపుతూ జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ సమావేశానికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయివరకు ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని, గ్రామ స్థాయిలో పార్టీ ఆలోచనలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని ఆయన సూచించారు. సంస్థాగత నిర్మాణం బలపడితే పార్టీ శక్తి సహజంగానే పెరుగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ అంతర్గత వ్యవస్థను మరింత శ్రేణిగా మార్చేందుకు చేపట్టాల్సిన పనులను వివరించారు.
కార్యశాల సందర్భంగా జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్.‌సంతోష్ మాట్లాడుతూ పార్టీ భవిష్యత్ వ్యూహాలను స్పష్టంగా వివరించారు. రాష్ట్రానికి కొత్త శక్తి అందించాలంటే బూత్ స్థాయి కమిటీలను మరింత బలపరచాల్సిన అవసరాన్ని ఎత్తిచూపారు. తెలంగాణ బాధ్యతల ఇంచార్జ్ అభయ్ పటిల్, జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ సమ్బిత్ పట్రా వంటి ప్రముఖులు కూడా మాట్లాడి కార్యకర్తలకు స్పూర్తినిచ్చారు. ప్రజలతో నేరుగా మమేకమవడం పార్టీ ఎదుగుదలకు కీలకమని వారు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యశాలలో మహబూబ్ నగర్ ఎంపీ అరుణ కూడా పాల్గొని బీజేపీ తెలంగాణ భవిష్యత్ దిశపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ ప్రభావాన్ని పెంచేందుకు ప్రతి నాయకుడు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తుక్కుగూడలో జరిగిన ఈ సమావేశం రాబోయే నెలల్లో పార్టీ ఉద్యమాలకు దిశానిర్దేశం చేసే కీలక వేదికగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలు వేగం పుంజే సూచనలు కనిపిస్తున్నాయి.

హుస్నాబాద్ పర్యటనకు సీఎం రేవంత్ సిద్ధం – సర్పంచ్ ఎన్నికల ముందస్తు వ్యూహాలపై కీలక సమీక్ష

0

  • ఎమ్మెల్యే కార్యాలయంలో నేతలతో విస్తృత సమీక్ష
  • శంకుస్థాపన కార్యక్రమాలు, బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చలు
  • సర్పంచ్ ఎన్నికలకు దిశానిర్దేశం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్,30,నవంబర్,మెదక్ టుడే న్యూస్:(స్టేట్ బ్యూరో)

హుస్నాబాద్ పట్టణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశం నియోజకవర్గం మొత్తానికి ప్రాధాన్యతను చాటింది. పట్టణ మరియు గ్రామీణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరై ముఖ్యమంత్రిపై పర్యటన వివరాలను తెలుసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధిని వేగవంతం చేయడంలో సీఎం పర్యటన కీలకమని నేతలు అభిప్రాయపడ్డారు.
డిసెంబర్ 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గానికి రానున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రహదారులు, పట్టణ పురోభివృద్ధి, నీటి సరఫరా, ప్రజా సేవలకు సంబంధించిన అనేక పనులు ప్రారంభంకానుండటంతో ప్రజలలో భారీ ఆసక్తి నెలకొంది. శంకుస్థాపన అనంతరం పట్టణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఆ సభ విజయవంతం కావడంపై నేతల అంతా ఏకగ్రీవంగా వ్యూహాలు రూపొందించారు.ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు తలుపుతట్టుతున్న నేపథ్యంలో గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ప్రజలకు చేరుకున్న సేవలను వివరించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన వల్ల నియోజకవర్గంలో పార్టీకి భారీ ఉత్సాహం వచ్చినట్టు నేతలు అభిప్రాయపడ్డారు.బహిరంగ సభ ఏర్పాట్లు, ప్రజలకు చేరే సూచనలు, అభివృద్ధి కార్యక్రమాల వివరణ—ప్రతి అంశంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ద్వారా అభివృద్ధి ప్రవాహం మరింత బలపడుతుందని నాయకులు నమ్ముతున్నారు. నియోజకవర్గ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులకు అవగాహన కల్పించే అంశాలుజిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

0

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులకు అవగాహన కల్పించే అంశాలు
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతులు

వివిధ రాజకీయ పార్టీ ల ప్రతినిధులు అలాగే పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారం కోసం పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడానికి, ర్యాలీ లు నిర్వహించడానికి, మైకులు పెట్టుకోవడానికి సంబంధిత మండల తహసీల్దార్ కి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవలిసి ఉంటుంది.. అప్పుడు ఆ తహసీల్దార్ స్థానిక SHO ద్వారా వారికి అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

పోలింగ్ పరిసమాప్తం కావడానికి నిర్ణయించిన సమయానికి ముందు 44 గంటల నుండి బహిరంగ సభలను నిర్వహించటం, ఊరేగింపులు చేయడం నిషిద్ధం అని అన్నారు.

అనుమతి పొందిన బహిరంగ సమావేశాలు అలాగే రోడ్ షో ల వద్ద లౌడ్ స్పీకర్లు ఉదయం 6 గంటల నుండి రాత్రి పది గంటల మధ్య మాత్రమే ఉపయోగించాలన్నారు.

ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే పోలీస్ అధికారులు లౌడ్ స్పీకర్ లను జప్తు చేయడానికి అధికారం కలిగి ఉంటారని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారానికి వాహనాల వినియోగం

సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు గ్రామపంచాయతీ పరిధిలో తమ ప్రచారానికి ఒక వాహనాన్ని ఉపయోగించడానికి అనుమతి ఇస్తారని తెలిపారు.

అట్టి అభ్యర్థులు ప్రచారానికి వినియోగించేందుకు ప్రతిపాదించిన వాహనాల వివరాలను సంబంధిత తాసిల్దార్లకు ముందుగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు.

వార్డు సభ్యుని పదవికి పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం కోసం ఎలాంటి వాహనాన్ని ఉపయోగించకూడదు అని వివరించారు.

పోలింగ్ రోజున వాహనాల వినియోగం

పోలింగ్ రోజున గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు ఒక వాహనాన్ని ఉపయోగించేందుకు మాత్రమే అనుమతిస్తారు అని తెలిపారు.

పోలింగ్ రోజున ఇతర వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు అని అన్నారు.

వార్డు విస్తీర్ణం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వార్డు మెంబర్ పదవికి పోటీ చేసే అభ్యర్థులకు వాహన అనుమతి ఉండదు
అని చెప్పారు.

వాహన అనుమతులు

సంబంధిత తహసిల్దార్లు నిర్ణిత నమూనాలో గ్రామపంచాయతీ సర్పంచ్ పదవులకు పోటీ చేసే అభ్యర్థులకు మాత్రమే వాహన పర్మిట్లను జారీ చేస్తారు
అని అన్నారు.

వాహన పర్మిట్ అసలు ప్రతి వాహనం ముందు వైపు అద్దంపై అభ్యర్థులు అతికించాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు.

ముగిసిన నామినేషన్ల పర్వం..

0

ముగిసిన నామినేషన్ల పర్వం

పాపన్నపేట,నవంబర్,29,మెదక్ టుడే న్యూస్:

పాపన్నపేట మండల పరిధి లోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్,వార్డ్ మెంబర్ స్థానాలు ఆశిస్తున్న ఆశావాహులతో మండల కేంద్రమైన పాపన్నపేట నామినేషన్ల పర్వం తో కిటకిటలాడింది. మెదక్ జిల్లా లోనే అతిపెద్ద మండలం గా పేరుగాంచిన పాపన్నపేటలో 40 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 348 వార్డులు ఉన్నాయి. శనివారం నామినేషన్ల ముగింపుకు తుదిఘట్టం కావడంతో మండల పరిధిలోని దాదాపు అన్ని గ్రామాలకు చెందిన సర్పంచ్ వార్డ్ మెంబర్ ఆశిస్తున్న ఆశావహులు తమ అనుచరాగణంతో చేరుకొని నామినేషన్లు వేశారు. అయితే ఆశావాహులు పెద్ద సంఖ్యలో రావడంతో రాత్రి అయినప్పటికీ నామినేషన్లను దరఖాస్తు చేసుకోవడానికి సమయం సరిపోలేదు. దీంతో వారికి టోకెన్లను ఇచ్చారు,రాత్రి అయిన నామినేషన్లు తీసుకుంటామని సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే సుమారు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడానికి సమయం పట్టవచ్చు అని సంబంధిత అధికారులు వెల్లడించారు. దీంతో వివిధ గ్రామాల నుంచి డప్పు చప్పులు బాజా బాజన్త్రీలతో పాపన్నపేటకు చేరుకున్న పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు అభిమానులతో పాపన్నపేట సందడిగా మారింది.

జర్నలిస్టుల హక్కుల కోసం పోరుబాట-డిసెంబర్ 3న జర్నలిస్టుల మహాధర్నా..

0

(స్టేట్ బ్యూరో)హైదరాబాద్,నవంబర్,29, మెదక్ టుడే న్యూస్:

తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమం తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, తమ హక్కుల సాధన కోసం పోరుబాటే ఏకైక మార్గమైపోయిందని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి అశోక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం సమాచార శాఖ కార్యాలయం వద్ద జరగనున్న మహాధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ,ఉమ్మడి రాష్ట్రంలో అమలైన జర్నలిస్టుల సంక్షేమ పథకాలు తెలంగాణలో పూర్తిగా గల్లంతయ్యాయని, ప్రభుత్వాల నిర్లక్ష్యం మరింత పెరిగిందని మండిపడ్డారు.జర్నలిస్టుల కోసం అత్యవసరమైన ఆరోగ్య భద్రత, అక్రిడిటేషన్, సంక్షేమ నిధి, రక్షణ కమిటీలు నిలిచిపోయి సంవత్సరాలు గడిచినా, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదని వారు విమర్శించారు. ముఖ్యంగా చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న అప్గ్రేడేషన్ సమస్యలు, 16 నెలలుగా ప్రకటన బిల్లుల విడుదలలో జాప్యం పై ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడం బాధాకరమన్నారు.జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు కూడా ఇంతవరకు అమలుకాలేదని, దీనివల్ల వేలాది మంది జర్నలిస్టులు నిరాశలో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3న మాసాబ్‌ట్యాంక్‌లోని సమాచార శాఖ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న పత్రికల సంపాదకులు, జర్నలిస్టులు భారీ ఎత్తున ధర్నాలో పాల్గొని తమ న్యాయమైన డిమాండ్లను వినిపించాలని పిలుపునిచ్చారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హితవు పలికారు.టీయూడబ్ల్యూజే అధ్యక్షులు విరహత్ అలీ పిలుపు మేరకు, అనుబంధ సంఘమైన చిన్న మధ్యతరగతి పత్రికల సంఘం కూడా ఈ మహాధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. చిన్న పత్రికల సమస్యల పరిష్కారానికి ఈ మహాధర్నానే పెద్ద వేదిక కానుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐజెయూ సభ్యులు మాతంగి దాస్, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర కోశాధికారి అజాం ఖాన్, రాష్ట్ర నాయకులు ఇక్బాల్, ఉస్మాన్ రషీద్, బాలకృష్ణ, అహ్మద్ అలీ, మురళి, వెంకటయ్య, అఫ్రోజ్, అమాన్, మోసిన్ అలీ, గౌస్, రియాసత్, ఇలియాజ్, అంజాద్, అన్వార్, శ్రీనివాస్, జాన్ షహీద్, ఖాసీం, ప్రకాష్, అసద్‌తో పాటు ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు పత్రికల సంపాదకులు పాల్గొన్నారు.

డిసెంబర్ 1నసమాచార భవన్ ఎదుట జర్నలిస్టుల ధర్నా

0

(స్టేట్ బ్యూరో)హైదరాబాద్,నవంబర్,29,మెదక్ టుడే న్యూస్:

దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ ఒకటిన “ఛలో సమాచార భవన్” హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార శాఖ కమీషనరేట్(సమాచారభవన్) ఎదుట జర్నలిస్టుల ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు,రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ మామిడి సోమయ్య తెలిపారు.శనివారం ఆయన ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కో-కన్వీనర్లు వల్లాల జగన్, బండి విజయ్ కుమార్, తన్నీరు శ్రీనివాస్ తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నప్పటికీ జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని, కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని అన్నారు.ఇక జర్నలిస్టులకు ఇస్తామన్న ఇళ్లస్థలాల ఊసే లేదని, ఆరోగ్య భీమా పథకం అటకెక్కిందని, చిన్న మధ్య తరహా పత్రికలు సంక్షోభంలో పడ్డాయని మామిడి సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు గత ప్రభుత్వమే తీరని అన్యాయం చేసిందంటే…ఈ ప్రభుత్వం కూడా మరింత అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. జర్నలిస్టుల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామంటూ ముఖ్యమంత్రి, సమాచార శాఖ మంత్రి పలు మార్లు హామీలిటచ్చారే తప్ప ఆచరణలో పెట్టలేదని, చివరికి జర్నలిస్టుల ప్రతినిధిగా ఉన్న మీడియా అకాడమీ ఛైర్మన్ కూడా కమిటీ పేరుతో కాలయాపన చేసి చివరికి చేతులెత్తేసినట్లు తెలుస్తోందని అన్నారు. సుప్రీకోర్టు తీర్పును సాకుగా చూపుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం లేదని, ఇది చాలా అన్యాయమని, మనసుంటే మార్గం ఉంటుందన్న ఆలోచనతో ప్రత్యామ్నాయ జీవో ద్వారా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల ఇవ్వొచ్చని అన్నారు.జర్నలిస్టుల సమస్యలలో ప్రధానమైన ఇండ్ల స్థలాలు, అక్రెడిటేషన్ కార్డులు,హెల్త్ కార్డులతో పాటు జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళలో ఉచిత విధ్య, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్, మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక సదుపాయాలు, చనిపోయిన జర్నలిస్టు కుటుంబానికి ప్రభుత్వం ఇస్తున్న లక్ష రూపాయల సహాయాన్ని రూ.10లక్షలకు పెంచడం తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకై డిసెంబర్ ఒకటిన తలపెట్టిన ”ఛలో సమాచారభవన్” కార్యక్రమంలో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవతం చేయాలని మామిడి సోమయ్య పిలుపునిచ్చారు.

మెదక్ జిల్లా/నామినేషన్ల చివరి రోజు అధికారుల అప్రమత్తంగా ఉండాలి-జిల్లా ఎన్నికల అధికారి ,కలెక్టర్ రాహుల్ రాజ్..

0

పాపన్నపేట,నవంబర్,29,మెదక్ టుడే న్యూస్:

శనివారం నామినేషన్ల చివరి రోజు అధికారుల అప్రమత్తంగా ఉండాలి,జిల్లా ఎన్నికల అధికారి ,కలెక్టర్ రాహుల్ రాజ్..గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశ నామినేషన్ల స్వీకరణకు ఇవాళే (29.11.2025) చివరి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరణకు నామినేషన్ పత్రాలు, హెల్ప్ డెస్క్ లతో సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.కలెక్టర్ క్యాంపస్ నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు పలు సలహాలు సూచనలు అందించారు.ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరణకు సమయం ఉందని, అభ్యర్థులు నిర్దేశించిన సమయంలోగా నామినేషన్లు వేసుకోవాలని సూచించారు.నామినేషన్ కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు, మార్గదర్శకాలు, రద్దీ నియంత్రణ చర్యలకు అన్ని ఏర్పాట్లుతో సిద్ధంగా ఉంచాలని ఆయన సూచించారు.టెలికాన్ఫరెన్స్లో ఆర్డీవోలు ఎంపీడీవోలు ఆర్వోలు ఏఆర్వోలు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.