📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 51

గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలి: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు,

0

మెదక్. హవేలి ఘనపూర్ మండలం డిసెంబర్ 1 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి

గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రతి ఓటరు, ప్రతి గ్రామస్థుడు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, తెలిపారు. హవేలీ ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజిరెడ్డిపల్లి, గాజిరెడ్డిపల్లి తండా, బూర్గుపల్లి, గ్రామలకు చెందిన ప్రజలకు ఈ రోజు నిర్వహించిన ఎన్నికల అవగాహన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, గ్రూపు దాడులు, అల్లర్లు, అనవసర ర్యాలీలు జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని, గత ఎన్నికల మాదిరిగా ఉల్లంఘనలకు పాల్పడినవారిని బైండోవర్ చేసే ప్రక్రియను కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీ పూర్తిగా నిషేధం అని స్పష్టం చేశారు.ప్రతి ఓటరు తన ఇష్టమైన అభ్యర్థికి ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని, ఓటర్లను బెదిరించడం, ప్రలోభపెట్టడం, బలవంతం చేయడం నేరమని చెప్పారు. ప్రచారం సంబంధిత అధికారుల అనుమతి తీసుకొని మాత్రమే నిర్వహించాలని, స్పీకర్లు, మైకులు, పోస్టర్లు, ర్యాలీలు అన్నీ అనుమతి తీసుకొని నిర్వహించాల్సిందిగా సూచించారు.పోలింగ్ స్టేషన్ వద్ద మొబైల్ ఫోన్లు, పార్టీ చిహ్నాలు, తీసుకురావడం నిషేధం. ఓటర్లు శాంతియుతంగా క్యూలో నిలబడి ఓటు వేయాలని, ఓటర్ ఐడి లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని చెప్పారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించేవారి గురించి లేదా అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులను సమాచారం ఇవ్వాలని కోరారు. ఎన్నికల ఫలితాల అనంతరం జరుపుకునే సంబరాలు, బాణసంచా, ర్యాలీలు పోలీసుల అనుమతి లేకుండా నిర్వహించరాదని తెలిపారు.ప్రజలందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించి, ఎన్నికలను పూర్తిగా ప్రశాంతంగా నిర్వహించేలా ముందుకురావాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ మెదక్ రూలర్ సిఐ జార్జ్ ఎస్సై నరేష్ సంబంధిత అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసిని అందజేసిన ఎమ్మెల్యే

0

పటాన్చెరు డిసెంబర్ 01
మెదక్ టుడేన్యూస్ ప్రతినిధి

ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరంబండ వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన పాలొత్ రఘు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక శాసనసభ్యులు జిఎంఆర్ ద్వారా ఎల్ ఓ సి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసిని ఎమ్మెల్యే జిఎంఆర్ సోమవారం పటాన్చెరు లోని తన కార్యాలయంలో రఘు కుటుంబ సభ్యులకు అందజేశారు.

పోలీస్ కిష్టయ్య త్యాగం మరువలేనిది: నీలం మధు ముదిరాజ్..ఘనంగా కిష్టయ్య వర్ధంతి..

0

పటాన్చెరు డిసెంబర్ 01
మెదక్ టుడేన్యూస్ ప్రతినిధి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన పోలిస్ కిష్టయ్య త్యాగం మరువలేనిదని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ కొనియాడారు.సోమవారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ ఎన్ఎంఆర్ కార్యాలయంలో పోలీస్ కిష్టయ్య వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కిష్టయ్య చిత్రపటానికి నీలం మధు ముదిరాజ్ పూలమాలలు వేసి ఘన నివాళులను అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా తనని తాను కాల్చుకుని ప్రాణాలు అర్పించిన వీరుడు కిష్టయ్యేనని ఆయన అన్నారు. పోలీస్ కిష్టయ్య త్యాగాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరువలేరని, వారి గుండెల్లో చిరస్మరణియుడిగా చెదరని ముద్ర వేసుకున్నారని ఆయన అన్నారు. కిష్టయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఆశయాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందన్నారు..

క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యంవిద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

0

•బీరంగూడలో ఘనంగా ముగిసిన 4వ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు

•విజేతలకు సొంత నిధులచే రెండు లక్షల రూపాయల నగదు బహుమతులు అందజేత..

అమీన్పూర్ డిసెంబర్ 01
మెదక్ టుడే  న్యూస్ ప్రతినిధి

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని, ఇందుకు తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ బాలాజీ ఫంక్షన్ హాలులో వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 4వ ఓపెన్ స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విజేతలకు రెండు లక్షల రూపాయల సొంత నగదు తో నగదు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీలకు పటాన్చెరు వేదికగా నిలవడం సంతోషకరమన్నారు. నేటితరం యువత మొబైల్ ఫోన్లు, డ్రగ్స్, బెట్టింగ్లు, రీల్స్ అంటూ తమ విలువైన యవ్వనాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్యం నుండే పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించడంతోపాటు.. నిరుపేద క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఐదు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని.. పటాన్చెరులో ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలతో మైత్రి స్టేడియం ఆధునికరించడం జరిగిందని గుర్తు చేశారు. స్వతహాగా క్రీడాకారుడైన తాను.. క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. క్రీడ పోటీల నిర్వహకురాలు ఇంటూరి రేఖను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ దేవానంద్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

వ్యాయమం పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి కనబరచాలి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు

0

అమీన్పూర్, డిసెంబర్, 01
మెదక్ టుడే న్యూస్: ప్రతినిధి

వ్యక్తిగత జీవితంలో భాగంగా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాయామంపై దృష్టి సారించాలని అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని కావున ప్రజలందరూ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం నాడు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ కమాన్ నుండి కృష్ణారెడ్డిపేటకు వెళ్లే ప్రధాన రహదారిలోని రాఘవేంద్ర కాలనీ నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాయామశాలను స్థానిక మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి, బాల్ రెడ్డి, పటాన్చెరు నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ కౌన్సిలర్లు జిమ్ నిర్వాహకులు పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంటఎయిడ్స్ అవగాహన సదస్సు_

0

చేగుంట,డిసెంబర్,1,మెదక్ టుడే న్యూస్:

లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట ఆధ్వర్యంలో తేదీ 01డిసెంబర్ 2025 రోజున ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా చేగుంట లోని స్థానిక శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్, విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ..ఈ సదస్సులో ఎయిడ్స్ సంక్రమించే మార్గాలు వాటిని నిర్మూలించే విధానాలు విద్యార్థి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించడం జరిగింది .అలాగే విద్యార్థులు కూడా ఈ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారి ఉపన్యాసాలతో వివరించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శంభుని శ్రీనివాస్ క్లబ్ సెక్రటరీ పులబోయిన నాగరాజు ,క్లబ్ డి.ఎస్ ద్యావ లింగమూర్తి, పాఠశాల ప్రిన్సిపాల్ ద్యావ రేణుక లింగమూర్తి మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

వడియారం గ్రామ సర్పంచ్ గా నామినేషన్ వేసిన అంకన్న గారి సాయికుమార్ గౌడ్

0

చేగుంట,డిసెంబర్,1,మెదక్ టుడే న్యూస్:

చేగుంట స్థానిక సంస్థలు ఎన్నికల భాగంగా ఎంపీడీవో
కార్యాలయంలో నామినేషన్ పత్రాన్ని దాఖలు చేసిన అంకన్న గారి సాయికుమార్ గౌడ్ వారు మా వడియారం గ్రామాని అభివృద్ధి పథంలో ముందు వస్తానన్నారు. గవడియారం గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ వన్ గ్రామ పంచాయితీ గా తీర్చిదిద్దటమే తమ కర్తవ్యమన్నారు. గ్రామ అభివృద్ధికి విశ్వాస సేవలు అందిస్తానని, గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను అతి తొందరలోనే తీరుస్తానని, గ్రామం లో ఉన్న యువతకు, ఉపాధి సౌకర్యాలు కల్పిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు తదితరులు పాల్గొన్నారు

చేగుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సండ్రుగు స్రవంతి

0

చేగుంట,డిసెంబర్,1,మెదక్ టుడే న్యూస్:

చేగుంట గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపించాలని వారు కోరుతూ సోమవారం నాడు సర్పంచ్ రిజర్వేషన్లలో భాగంగా బిసి మహిళా రిజర్వ్ స్థానం కావడంతో సర్పంచ్ అభ్యర్థిగా చేగుంట పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సండ్రుగు సతీష్ సతీమణి సండ్రుగు
స్రవంతి సోమవారం నాడు
నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నన్ను చేగుంట సర్పంచ్ గా గెలిపిస్తే దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఆశీస్సులతో చేగుంట అభివృద్ధికోసం కృషి చేస్తాను చేగుంట పట్టణాన్ని అభివృద్ధి చేయాలి అంటే కష్టపడే వ్యక్తి కావాలి కాబట్టి నన్ను గెలిపిస్తే ప్రజల సంక్షేమం కోసం పాటుపడతాను ప్రతి వ్యక్తీ సమస్యను నాసమస్యగా తీసుకొని పరిష్కరిస్తారని సమాజ సేవకురాలుగా ప్రజలతో మమేకమై నీతి నిజాయితీతో పనిచేసి చేగుంట పట్టణాన్ని అభివృద్ధి చేసిచూపిస్త అని అన్నారు. చేగుంట ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తానని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో చేగుంట మండల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ చేగుంట మాజీ పిఎసీఎస్ చైర్మన్ సండ్రగు స్వామి, యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్, అవసుల బ్రహ్మం,సిద్ది రెడ్డి,సోమ పెద్ద వెంకటేష్,సండ్రగు రవి, రాజు రమేష్ చేగుంట ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి. ఎస్సై శ్రీనివాస్ గౌడ్..

0

పాపన్నపేట, డిసెంబర్, 1, మెదక్ టుడే న్యూస్:

పాపన్నపేట మండలంలో ఈనెల 11న జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో  తెలిపారు. ఎన్నికలలో ఎవరైనా కోడ్ ను ఉల్లంఘించిన, అధికారుల విధులకు ఆటంకాలు కలిగించిన చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు . ప్రజలు అధికారులకు సహకరించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా యువత ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. ప్రజలు ఇరు పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ సార శ్రీనివాస్ గౌడ్ కోరారు. అలాగే ఓటర్లను మభ్య పెట్టేందుకు అభ్యర్థులు డబ్బులు, మద్యం పంపిణీ చేసే చట్టరితే నేరమని అన్నారు. ప్రజలు తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

నామినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలి అదనపు కలెక్టర్ నగేష్..

0

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్

మెదక్,డిసెంబర్,1,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి

రామాయంపేట,నర్సింగి, నిజాంపేట్ ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్ లను ఏ రోజుకు ఆ రోజు నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తూ, జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, పై అధికారులను సంప్రదించాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.