📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 50

కొత్తపల్లిలో పోలీసులకవత్తు (ప్లాగ్ మార్చ్)

0

పాపన్నపేట,డిసెంబర్,8,మెదక్ టుడే న్యూస్//స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాపన్నపేట మండలం కొత్తపల్లిలో డి.ఎస్.పి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ప్లగ్ మార్చ్ (అవగాహన కార్యక్రమం) నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొత్తపల్లిలో ఎన్నికల నేపథ్యంలో భద్రత చర్యలు ,శాంతి భద్రత పరిరక్షణ కోసం ప్రజలకు విశ్వాసం కల్పించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించమన్నారు. అనంతరం ఎన్నికలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డిఎస్ పి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాత్రగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని తెలిపారు. ఎన్నికల సందర్భంగా నగదు, మద్యం, బహుమతులు లేదా ఇతర పలోభాలు ఇవ్వడం, తీసుకోవడం చట్టపరంగా నేరమని, ప్రజలు ఎలాంటి ప్రబోవాలకు లొంగకుండా తమ ఓటును సమర్ధవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.అలాగే ఎన్నికల ప్రవర్తన ఉల్లంఘన గురించి వివరించారు.గుంపులుగా తిరగడం, రాత్రివేళ క్యాంపులు నిర్వహించడం, ఓటర్ల పై ఒత్తిడి లేదా ప్రభావం చూపడం ఆఫర్లు, అనాధికారి ప్రచారాలు, పత్యార్థులపై వ్యక్తిగత దూషణాలు చేసే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ జార్జ్, ఎస్ఐలు సారా శ్రీనివాస్ గౌడ్, లింగం, హైమద్, నరేష్ తోపాటు 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తాపాపన్నపేట సర్పంచ్ అభ్యర్థి లింగంపేట పావని నరేందర్ గౌడ్..

0

పాపన్నపేట,డిసెంబర్,8, మెదక్ టుడే న్యూస్: పాపన్నపేటగ్రామపంచాయతీ సర్పంచ్ గా తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పాపన్నపేట సర్పంచ్ అభ్యర్థి లింగంపేట పావని నరేందర్ గౌడ్ అన్నారు.సోమవారం ఆయా వార్డులో ఇంటింటికి వెళ్లి తన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం
నిరంతరం శ్రమిస్తానని వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.వార్డు సభ్యులుగా పంచాయతీ పాలకవర్గంలో గ్రామ ప్రజలకుఅందుబాటులో ఉంటూ వార్డులో మౌలిక సదుపాయాలను కల్పిస్తానని తెలిపారు.గ్రామంలోని వ్యక్తిగతంగా ప్రతి ఓటర్లను కలుస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నారు.తన కు కేటాయించిన బ్యాటు గుర్తుపై ఓటు వేసి విజయాన్ని అందించగలరని ప్రచార జోరు పెంచుతూ వేడుకుంటున్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు కీలకం – జిల్లా ఎస్ పి, శ్రీనివాస రావు..

0

మెదక్,డిసెంబర్,8,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,స్థానిక సంస్థల ఎన్నికలు మెదక్ జిల్లాలో శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రతి ఓటరు మరియు ప్రతి పౌరుడు సహకరించాలని జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఓటర్లకు ముఖ్య సూచనలు జారీ చేశారు.ఓటర్లకు ఎస్పీ సూచనలు:మీ పేరు తాజా ఓటర్ జాబితాలో ఉన్నదో లేదో తప్పనిసరిగా పరిశీలించండి.మీ పోలింగ్ స్టేషన్ వివరాలు ముందుగానే తెలుసుకోండి.పోలింగ్ రోజున EPIC / ఓటర్ ID / ఇతర వ్యాలిడ్ ప్రభుత్వ ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురండి.తెలియని వ్యక్తులకు ఓటర్ ID లేదా ఓటర్ స్లిప్ ఇవ్వకూడదు.పోలింగ్ కేంద్రంలో క్యూలో నిలబడి సిబ్బంది సూచనలు పాటిస్తూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి.పోలింగ్ కేంద్రం పరిసరాల్లో, ముఖ్యంగా 100 మీటర్ల పరిధిలో ప్రచారం పూర్తిగా నిషేధం.ఎవరు ప్రచారం చేసినా, బెదిరించినా,మభ్యపెట్టినా వెంటనే సమీప పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వండి.వికలాంగులు, వృద్ధులు, మహిళలకు ముందుగా ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించండి,వేరొకరి పేరు మీద ఓటు వేయడానికి ప్రయత్నించడం చట్టరీత్యా నేరం; అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద గుమిగూడడం నిషేధం; ఉల్లంఘనలపై చర్యలు తీసుకోబడతాయి.కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి.సౌండ్ సిస్టమ్, బాణాసంచా వినియోగం కోసం కూడా పోలీసు అనుమతి తప్పనిసరి.ఎన్నికలు శాంతియుతంగా జరగేందుకు నియమాలు పాటిస్తూ, ప్రజాస్వామ్య హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఎస్పీ జిల్లా ప్రజలను విజ్ఞప్తి చేశారు.

పదవ తరగతిలో మెరుగైన ఫలితాలే లక్ష్యం కలెక్టర్..

0

పాపన్నపేట,డిసెంబర్,6, మెదక్ టుడే న్యూస్:

జిల్లాలో పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులు ‌ కష్టపడి చదువుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు.పాపన్నపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో 10వ తరగతి విద్యార్థులతో ‌ కలెక్టర్ ముచ్చటించి విద్యా సామర్థ్యాలను పరీక్షించిన అనతరం పలు సూచనలు సలహాలు అందించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతిలో మెరుగైన ఫలితాలు లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు ప్రతిష్ట ప్రణాళిక ద్వారా చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకుని పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల నియమాలని ఉల్లంఘిస్తే చర్యలు జిల్లా కలెక్టర్..

0

•జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

పాపన్నపేట,డిసెంబర్,6, మెదక్ టుడే న్యూస్:

శనివారం పాపన్నపేట మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించారు.ఈసందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ,జిల్లాలో మొదటి పేజ్ ఎలక్షన్ల కోసం నామినేషన్ పూర్తయ్యాయని,ఆయా గ్రామాల్లో క్యాంపియన్ నడుస్తుందన్నారు.
మొదటి పేజ్ ఎన్నికల కోసం డిసెంబర్ 11 పోలింగ్ ఉన్నందున డిసెంబర్ 10 రోజున ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకోవాలని ఆదేశించారు.
మొదటి ఫేజ్ లో ఆరు మండలాలో సర్పంచి వార్డు సభ్యులకు జరిగే ఎన్నికలను అత్యంత పారదర్శకంగా జరగాలని తెలిపారు.మొదటి పేజ్ లో 14 గ్రామపంచాయతీల సర్పంచి, వార్డు సభ్యుల,ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తయిన కూడా ఆయా గ్రామాల్లో ఎన్నికల నియమావళి కొనసాగుతుందన్నారు.ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందని ఫిర్యాదులు అందితే ఫ్లైయింగ్ స్కాడ్ టీములు దర్యాప్తు చేసి ఎన్నికల నియమాల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో ఎన్నికల నియమాలు పాటించి నిబంధన మేరకే ప్రచారం చేయాలన్నారు.గ్రామాల్లో 100% ఓటింగ్ సాధించాలన్నారు.100% ఓటింగ్ జరిగిన గ్రామపంచాయతీలను ఘనంగా సన్మానించి ,ప్రత్యేక బహుమతులు అందిస్తామని తెలియజేశారు. ఓటింగ్ లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. డబ్బు ,మద్యం లాంటి ప్రలోభాలకు గురికాకుండా గ్రామ ,వార్డు అభివృద్ధికి ఎవరైతే తోడ్పడేవారు ఉంటారో వారిని నిజమైన సర్పంచ్ గా,వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు సిబ్బంది ఉన్నారు.

పేటలో విచిత్ర .. పంచాయితీ .!?

0

పేటలో విచిత్ర .. పంచాయితీ .!?

పాపన్నపేట,డిసెంబర్,5,మెదక్ టుడే న్యూస్:

మండల కేంద్రం పాపన్నపేటలో విచిత్ర గ్రామ పంచాయితీ నెలకొంది .!? కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా ఇద్దరు వ్యక్తులు ఒకే పార్టీ కండువాలతో ప్రచారం నిర్వహించడంతో ప్రజలు అయోమయంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక్కరికీ మాత్రమే కండువాలతో ప్రచారం నిర్వహించే అవకాశం కల్పిస్తే ప్రజల ఈ అయోమయానికి తెర తీసినట్టు అవుతుంది. 14 వార్డులు ఉండగా ఇప్పటికే ఒక వార్డు ఏకగ్రీవం అయింది. మిగిలిన 13 వార్డులతో పాటు సర్పంచ్ స్థానానికి ఈనెల 11 ఎన్నిక జరగనుంది.

స్నేహ పూర్వకంగా పోటీ తత్వం తో మెలగాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

0

పాపన్నపేట,డిసెంబర్,5,మెదక్ టుడే న్యూస్:

స్నేహ పూర్వకంగా పోటీ తత్వం తో మెలగాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం మండల కేంద్రమైన పాపన్న పేట లోని దుర్గమ్మ గైన్ వద్ద స్థానిక ఎన్నికల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో జరిగేలా కృషి చేయాలే తప్ప గొడవలు సృష్టిస్తే ఎన్నికల కేసులు నమోదు అవుతాయని. సామాన్య కేసుల కన్నా ఎన్నికల సమయంలో కేసులు నమోదు అయితే ప్రతి ఎన్నికల సమయంలో బైండోవర్ చేస్తారని. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగ, పాస్ పోర్ట్ లు రావని. ఎన్నికలు ఐదేండ్ల కొకసారి వస్తాయని. అందరూ కలిసి మెలిసి స్నేహ పూర్వక పోటీ తత్వం తో మెలగాలని సూచించారు. ఎన్నికల నియమావళిని అతిక్రమించకుండా ఉండాలని. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన, ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించిన చట్టరీత్య చర్యలు తీసుకోవాల్సి వస్తుందని. ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వ కుండా స్వేచ్చ తో ఓటు హక్కు ను వినియోగించుకోవాలని సూచించారు. అభ్యర్థులు మద్యం, డబ్బులు పంపిణీ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యత తో ఉంచుతామన్నారు. ఎన్నికల ప్రచారాలు ఈ నెల 9వరకు ముగించాలని. పోలింగ్ కేంద్రం లో ప్రచారాలు నిర్వహించారాదని. పోలింగ్ బూత్ లలోకి చరవాణిలు నిషేధమని, ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వెళ్ళే ప్రతి ఒక్కరూ ఓటరూ స్లిప్పు తోనే వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ జార్జ్, పాపన్న పేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, గ్రామస్థులు పోలీసులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల మహా ధర్నా గ్రాండ్ సక్సెస్..

0

జర్నలిస్టుల మహా ధర్నా గ్రాండ్ సక్సెస్..

(స్టేట్ బ్యూరో)హైదరాబాద్:డిసెంబర్,3,మెదక్ టుడే న్యూస్:

పన్నెండేండ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.
.. మాసాబ్ ట్యాంక్ లోని సమాచార కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం( టి యు డబ్ల్యూ జే )ఆధ్వర్యంలో బుధవారం నాడు జరిగిన మహా ధర్నా అనూహ్యరీతిలో విజయవంతం అయ్యింది. టీయూడబ్ల్యూజే పిలుపుపై స్పందించి, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు రాష్ట్ర నలుమూలల నుండి ఏంతో ఉత్సాహంగా, భారీగా జర్నలిస్టులు తరలి రావడం విశేషం. జర్నలిస్టుల నినాదాలతో మహానగరం రోడ్లన్నీ దద్దరిల్లాయి. సమాచార శాఖ చరిత్రలో, ఆ కార్యాలయం వద్ద ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ధర్నా చేయడం ప్రప్రథమని పోలీసు అధికారులతో సహా పలువురు సీనియర్ పాత్రికేయులు చర్చించుకోవడం విశేషం. ఈ మహా ధర్నాకు యూనియన్ అనుబంధ సంస్థలైన తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ చిన్న, మద్య తరగతి పత్రికల సంఘం, మహిళా జర్నలిస్టుల విభాగం, తెలంగాణ ఉర్దూ జర్నలిస్టుల సమాఖ్యలతో పాటు హైదరాబాద్ ప్రెస్ క్లబ్, జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ, జవహర్ లాల్ హౌసింగ్ సొసైటీ, టీజేఏలు సంపూర్ణ మద్దతును ప్రకటించి మహా ధర్నాలో భాగస్వామ్యమయ్యాయి. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ మహా ధర్నాలో, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, ఎం. ఏ. మాజీద్, జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ,ఉప ప్రధాన కార్యదర్శి కలుకూరి రాములు ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, నగునూరి శేఖర్, చిన్న పత్రికల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసుఫ్ బాబు, అశోక్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
విజయ్ కుమార్ రెడ్డి, రమేష్, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగాధర్, కె.ఎన్.హరి,
వీడియో జర్నలిస్టుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, హరీష్, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గోపరాజు, యూనియన్ రాష్ట్ర నాయకులు వి. యాదగిరి, కె. శ్రీకాంత్ రెడ్డి,మధు గౌడ్, ఫైసల్,
హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు ఏ. రాజేష్, ఈ మహా ధర్నాలో వయోదిక జర్నలిస్టుల సంక్షేమ సంఘం కూడా భాగస్వామ్యం అయ్యింది. ఆ సంఘం నాయకుడు శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఉర్దూ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గౌస్, సీనియర్ మహిళా జర్నలిస్టులు విమల, అత్తలూరి అరుణ, వాకటి మంజుల, కళ్యాణం రాజేశ్వరీ తదితరులు మాట్లాడారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి..

0

•మద్యం, డబ్బులు పంపిణీ చేస్తే సమాచారం అందివ్వండి

•గొడవలు సృష్టిస్తే కటిన చర్యలు

•మెదక్ ఎస్ పి డివి శ్రీనివాస్ రావు

పాపన్నపేట,డిసెంబర్,2,మెదక్ టుడే న్యూస్:

ఈ నెల 11న జరుగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని . మెదక్ ఎస్పీ శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు.మంగళవారం మండల పరిధిలోని అనంతుని కొత్తపల్లి లోని అనంత పద్మనాభ ఫంక్షన్ హాల్ లో స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలైన శాబాద్ తాండ, సిఎం తాండ, ఎల్లిపేట్, ఎల్పుగొండ గ్రామాలకు చెందిన ప్రజలకు మరియు కొత్తపల్లి, అబ్లపూర్,అన్నారం గ్రామాలకు చెందిన ప్రజలకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.ఎన్నికలలో ఎవరైనా ఎన్నిక ప్రక్రియ కోడ్ ను ఉల్లంఘించిన, అధికారుల విధులకు ఆటంకాలు కలిగించిన చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.గ్రామాల్లో ఎలాంటి విభేదాలు, వర్గపోరు సృష్టించకుండా కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు.ఓటు హక్కును ప్రశాంతంగా, స్వేచ్ఛగావినియోగించుకోవాలని సూచించారు.గత ఎన్నికల్లో గొడవలకు కారణమైన వారిని ఇప్పటికే బైండోవర్ చేయడం జరిగిందని, వారి‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరిగి ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.అభ్యర్థులు మద్యం, డబ్బులు,ప్రోత్చకాలతో ఓటర్లను మభ్యపెడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యత తో ఉంచుతామన్నారు. ఎన్నికల లో ఎలాంటి గొడవలకు తావివ్వకుండా చూడాలని. ఎన్నికల సమయంలో కేసులు నమోదు కావడం మూలంగా భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కునువినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా యువత ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. ప్రజలు ఇరు పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని, అలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఉందని ఎస్పీ  హెచ్చరించారు. యువత అనవసర గొడవలకు వెళ్లి కేసుల్లో ఇరుక్కోకూడదని, ఒక కేసు నమోదైనా భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావని సూచించారు. ఓటు వేసేటప్పుడు ప్రతి ఓటరు క్యూ లైన్‌ను కచ్చితంగా పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్,రూరల్ సీఐ జార్జ్, ఎస్బి సీఐ సందీప్ రెడ్డి, సిసిఎస్ సీఐ రాజశేఖర్ రెడ్డి, స్థానిక ఎస్ఐ సార శ్రీనివాస్ గౌడ్ వివిధ గ్రామాల నాయకులు, ప్రజలు తదితరులుఉన్నారు.

మెదక్ మున్సిపాలిటీ నీ సుందరనందనవనంగా తీర్చిదిద్దే బాధ్యత నాదేమెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావ్

0

మెదక్ డిసెంబర్ 1 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే
మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావ్ తెలిపారు. సోమవారం మెదక్ పట్టణంలోని 7,8,20 వార్డులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదక్ పట్టణాన్ని సుందరనందనవనంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనా
న్నారు.ఇటీవల పట్టణాభివృద్ధి కోసం రూ టియూఎఫ్ఐడిసి ద్వారా రూ 55కోట్లు వచ్చాయని, వాటిని సైతం త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఏలాంటి రాజీలేదని, నియోజకవర్గ అభివృద్ధియే తన ఆకాంక్ష అని ఎమ్మెల్యే తెలిపారు. రెండేళ్ల తమ ప్రభుత్వ పాలనలో నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తెచ్చి మెదక్ మున్సిపాలిటీ నీ అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ మాజీ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడి మధుసూదన్ రావ్ మాజీ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ గౌడ్, మమత, శ్రీధర్ యాదవ్,దొంతి ముత్యం గౌడ్, లింగం హంజాద్, గంగాధర్,శివరామ కృష్ణ, పురం వెంకట నారాయణ హరిత నర్సింగ్ రావ్, బట్టి సులోచన, గోదల జ్యోతి, స్వరూప, దయా సాగర్, భానీ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిఈ మహేష్ తదితరులు పాల్గొన్నారు.