📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 49

జిల్లాలో పొగమంచు నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి.వాహనాలను నెమ్మదిగా నడిపి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరాలి:జిల్లా ఎస్ పి. శ్రీనివాస రావు..

0

మెదక్,డిసెంబర్,21,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి  జిల్లాలో పొగమంచు నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి.వాహనాలను నెమ్మదిగా నడిపి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరాలి:జిల్లా ఎస్ పి. శ్రీనివాస రావుజిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వాతావరణంలో దట్టమైన పొగమంచు ఏర్పడుతున్న నేపథ్యంలో వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ ప్రజలకు ఒక ప్రకటనలో తెలిపారు.పొగమంచు తీవ్రత పెరగడం వల్ల రాత్రి మరియు తెల్లవారుజామున రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులు స్పష్టంగా కనిపించక రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీయవచ్చని హెచ్చరించారు. అందువల్ల అత్యవసరమైతే తప్ప ఈ సమయాల్లో ప్రయాణాలు చేయకుండా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అత్యవసరంగా ప్రయాణించాల్సి వచ్చినప్పుడు వాహనాలను నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలని సూచించారు.తక్కువ వీక్షణ సామర్థ్యం కారణంగా మలుపులు, ఇతర వాహనాలు సరిగా కనిపించక ప్రమాదాలు జరగవచ్చని పేర్కొన్నారు.ఈ సమయంలో హెడ్‌లైట్లను లో బీమ్‌లో ఉంచి, ఫాగ్ లైట్లను వినియోగించాలని సూచించారు.ప్రయాణానికి ముందు వాహనాల స్థితిని తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, ముఖ్యంగా బ్రేకులు, లైట్లు, టైర్లు సక్రమంగా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలని తెలిపారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ఆకస్మిక ఓవర్‌టేక్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ఎస్ పి తెలిపారు.
పోలీసుల సూచనలు, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రతి వాహనదారుడు తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవాలని జిల్లా ఎస్ పి వెల్లడించారు.

జర్నలిస్టులంటే చులకనా..! నిర్లక్ష్యమా..?: ఏపీఐజేఏ అధ్యక్షులు యం.రాజా

0

పల్నాడు జిల్లా,డిసెంబర్,17,మెదక్ టుడే న్యూస్:  మాచర్ల పట్టణంలో ఎంఆర్ఆర్ న్యూస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీఐజేఏ అధ్యక్షులు యం. రాజా మాట్లాడుతూ,జర్నలిస్ట్ అక్రిడేషన్ పేరు వింటేనే విరక్తి కలిగించేలా పాలకులు పనితీరు మనసుని కలచి వేస్తుందని,నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని నిరంతరం కష్టపడే జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఎండనక వాననక కలం శ్రామికుడిగా ఎన్నో ఊడిదుడుకులు ఎదుర్కొని తాను సేకరించిన వాస్తవ కథనాలు ఎంతో బాధ్యతగా వ్యవహరించి సమాజాన్ని మేల్కొల్పే దిశగా అడుగులు వేస్తూ కొనసాగుతున్నప్పటికీ జర్నలిస్టులను గుర్తించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి అని ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు యం.రాజా ఆవేదన వ్యక్తం చేశారు.చిన్న పత్రికలు, వార పత్రికలు మాస పత్రికలు, అనుమతి ఉన్న కేబుల్ ఛానెల్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని గుర్తింపులు ఉన్నప్పటికీ కేవలం యూట్యూబ్ ఛానెల్స్, పరిమితం అయ్యారని, అక్రిడేషన్ సమయంలోఎం.ఎస్.ఓలు పూటకు రేటు నిర్ణయించడాన్ని మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు.పోటాపోటిగా ప్రతి అంశాన్ని అద్యాయనం చేస్తూ శాటిలైట్ ఛానెల్స్ కి ధీటుగా ప్రసారాలు చేస్తున్న, వివక్ష ఏంటని ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు యం. రాజా సూటుగా ప్రశ్నించారు.కేబుల్ చానల్స్, యూట్యూబ్ ఛానల్స్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా, సిఫారసు లెటర్స్ చెల్లుబాటులోకి అనుమతించరాదని విజ్ఞప్తి చేశారు, ఎవరో స్వార్ధవాల కోసం ఎవరో మెప్పు పొందడం కోసం అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా కొనసాగితే చూస్తూ ఊరుకోమని ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు యం. రాజా పేర్కొన్నారు.ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ జర్నలిస్టుల బ్రతుకుల్లో ఎటువంటి మార్పు లేదు, జిల్లా అక్రిడేషన్ కమిటీలో సభ్యుడుగా కొనసాగాలంటే,ఈజిల్లా స్థానికుడై ఉండాలి, రాష్ట్ర స్థాయిలో తప్ప జిల్లా స్థాయిలో ఏ నియోజకవర్గంలో అక్రిడేషన్ పొందకూడదని ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు యం. రాజా సూచించారు.కాసులిస్తే పదవులు కట్టబెట్టడం ఒంటి చర్యలకు పాల్పడకూడదని ఎటువంటి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్, భూ పంచాయతీల్లో సివిల్ ఆరోపణలు ఉండకూడదని,ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు యం.రాజా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.మీడియా సంస్థ నిర్మాణాకర్తలకు సైతం ఎడిటర్లకు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇన్ ఫుట్ ఎడిటర్, అవుట్ ఫుట్ ఎడిటర్లకు, స్టేట్ బ్యూరో చీఫ్, రీజనల్ కోఆర్డినేటర్స్ కు, జర్నలిస్టు అక్రిడేషన్ లేని పరిస్థితి ఏర్పడిందంటే, ఇది మీడియా స్వేచ్ఛపై పరోక్షంగా దాడి చేశారని భావించాలని ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు యం.రాజా అభిప్రాయపడ్డారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార & ప్రజాసంబంధాల శాఖ అమలు చేస్తున్న జర్నలిస్టుల అక్రిడేషన్ విధానాలు రాజ్యాంగ విరుద్ధంగా, న్యాయ సూత్రాలకు భిన్నంగా ఉన్నాయని ఏపీఐజేఏ అధ్యక్షులు యం. రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, కేబుల్ చానల్స్, చిన్న పత్రికలు, గ్రామీణ జర్నలిస్టులపై జరుగుతున్నఈ వివక్ష కొనసాగితే హైకోర్టును ఆశ్రయించక తప్పదని ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు యం.రాజా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కుచన్పల్లి గ్రామపంచాయతీ సర్పంచిగా లింగాల భూదేవి పద్మారావు విజయం

0

హవేలిఘనపూర్ మండలం,డిసెంబర్,12,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి:మెదక్ జిల్లా హవేలిఘన్పూర్ మండలం కూచంపల్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన లింగాల భూదేవి పద్మారావు సమీప బి ఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిపై లింగాల భూదేవి 456 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు గత 15 సంవత్సరాల క్రితం ఈ లింగాల భూదేవి కుచంపల్లి సర్పంచిగా పనిచేసిన అనుభవం ఉన్నది ఇది రెండవసారిగా గెలుపొందారు మెదక్ ఉమ్మడి మండల మాజీ ఎంపీపీ లింగ పద్మారావు సతీమణి గత ఉమ్మడి మెదక్ మండలం ఎంపీపీగా లింగాల పద్మారావు పనిచేశారు మండలాన్ని మరియు కుచన్ పల్లి గ్రామాన్నిఅభివృద్ధి పథంలో నడిపించారు గత 25 సంవత్సరాలుగా కరుగట్టిన బి ఆర్ఎస్ నేత కురుమ యాదవ సంఘం మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు రేఖ మయ గత రెండు పర్యాయలుగా పదో వార్డ్ నెంబర్ గా పని చేశారు ఈ సర్పంచి ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ లో చేరారు మళ్లీ పదో వార్డ్ నెంబర్ గా పోటీ చేసి గెలుపొందిఉప సర్పంచ్ పదవిని పొందారు లింగాల భూదేవి సర్పంచ్గా ఆమె రెండవ కుమారుడు లింగాల సంతోష్ ఎనిమిదో వాడు నెంబర్ గా గెలుపొందారు సర్పంచి గా గెలిచినా లింగాల భూదేవికి మరియు ఉపసర్పంచిగా గెల్పొందిన రేఖమయ్య కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

పాపన్నపేటలో పావని నరేందర్ గౌడ్ గెలుపు..

0

పాపన్నపేట,డిసెంబర్,11,మెదక్ టుడే న్యూస్: పాపన్నపేట గ్రామ సర్పంచ్‌గా పావని నరేందర్ గౌడ్ గురువారం జరిగిన స్థానిక ఎన్నికల్లో గెలుపొందారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, మెదక్ ఎమ్మెల్యే సహకారంతో పాపన్నపేట గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో 14 వార్డులు ఉన్నాయి. హస్తం కార్యకర్తల సందడి నెలకొంది.

పటిష్ట.బందోబస్తు అమలు.మెదక్ జిల్లా ఎస్ పి శ్రీనివాస రావు..

0

పాపన్నపేట,డిసెంబర్,10,న్యూస్:గురువారం జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పాక్షపాతంగా నిర్వహించేందుకు మెదక్ జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు వెల్లడించారు. ఎన్నికల పోలింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా,పూర్తిస్థాయి భద్రతా ప్రణాళికను రూపొందించి పటిష్ట బందోబస్తు అమలు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం పాపన్నపేట జడ్పీ పాఠశాల మైదానంలో పోలీస్ స్టేషన్‌లో పోలింగ్ బందోబస్తు,రూట్ మొబైల్ బందోబస్తు,పోలింగ్ స్టేషన్ భద్రత,సెక్టార్ మొబైల్,స్ట్రైకింగ్ ఫోర్స్ వంటి విభాగాల సిబ్బందికీ ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.ఈసందర్బంగా ఎస్పీ మాట్లాడారు. పోలీస్ సిబ్బంది చేపట్టాల్సిన బాధ్యతలు,అనుసరించాల్సిన విధి విధానాలు,తక్షణ స్పందన చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలను ఈ సమావేశంలో వివరించారు. ఎన్నికల సమయంలో చిన్న చిన్న వివాదాలే పెద్ద సంఘటనలకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే ముందస్తు భద్రతా చర్యలు తీసుకొని ప్రతి గ్రామంలో,ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. అధికారులు,సిబ్బంది అందరూ అప్పగించిన బాధ్యతలను పూర్తి నిబద్ధతతో నిర్వహించి,ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను విజయవంతం చేయాలని సూచించారు. ఎన్నికల పర్యవేక్షణ అధికారుల సమన్వయంతో వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో ఏ చిన్న ఉద్రిక్తత అనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకూ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు,ప్రదర్శనలు,బాణసంచా పేల్చడం వంటి కార్యకలాపాలకు పూర్తిగా నిషేధమని ఎస్పీ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఐ లు రాజశేఖర్ రెడ్డి,వెంకటేశ్వర్లు,శైలెందర్, సందీప్ రెడ్డి,ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు.

సజావుగా ఎన్నికల నిర్వహణ,చెక్ లిస్ట్ చూసుకోవాలి,జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ రాహుల్ రాజు..

0

పాపన్నపేట,డిసెంబర్,10,మెదక్ టుడే న్యూస్:  సజావుగా ఎన్నికల నిర్వహణ,చెక్ లిస్ట్ చూసుకోవాలి,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజు..గురువారం,జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగావ్యవహరించాలని ,
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్
రాహుల్ రాజ్ తెలిపారు.పాపన్నపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో తూప్రాన్ ఆర్డీవో జై చంద్రారెడ్డి, తాసిల్దార్ ఎన్నికల విధులు నిర్వహించి సిబ్బందితో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఎలక్షన్ మెటీరియల్ పంపిణి ని పరిశీలించారు.ముందుగా పాపన్నపేట మండలంలో లోని జడ్పీ పాఠశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి… పోలింగ్ అధికారులకు ఇచ్చిన మెటీరియల్ ని చెక్ చేశారు.డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.పీ.ఓ, ఓ.పీ.ఓలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు.పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పా ట్లను అడిగి తెలుసుకున్నారు.పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని,మైక్రో అబ్సర్వర్ లతో మాట్లాడి పలు సూచనలు చేసారు.ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామాగ్రిని పోలింగ్ కేంద్రం వారి గా వేరు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు.బ్యాలెట్ పత్రాలు జాగ్రత్త గా చెక్ చేసి ప్యాక్ చేయాలని తెలి పారు.డిస్ట్రి బ్యూ షన్ కేంద్రం నుండి పోలింగ్ కేంద్రం చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు.సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏ ర్పాట్లు చేయాలని, వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజ నం కల్పించాలని.విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా చూడా లన్నారు.పోలింగ్ సామాగ్రి, ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలని అన్నారు.ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని, త్రాగునీరు, లైటింగ్, పా ర్కింగ్ ప్రదేశాలు,వచ్చిపోయేదారులలో ఎలాం టి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలో మొదటి విడత స్థానిక ఎన్నికలలో 160 గ్రామ పంచాయతీలు ఉండగా ,16 గ్రామ పంచాయతీలు సర్పంచలు ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన 144 గ్రామ పంచాయతీలకు గాను 411 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారన్నారు.1402 వార్డులకు గాను , 332 ఏకగ్రీవంగా అవ్వగా, పాపన్నపేట మండలంలోని అరికెల గ్రామంలో రెండు వార్డులకు ఎలాంటి నామినేషన్లు రాలేదని తెలిపారు.
1068 వార్డులకు గాను 2426 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారని తెలియజేశారు. ఆరు మండలాలకు గాను 1292 పోలింగ్ కేంద్రాలు, 14 21 పిఓ లు, 1529 ఓపిఓలు, 155 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధితఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శత శాతం ఓటింగ్ లక్ష్యంగా పనిచేయాలి,ప్రజలు వంద శాతం ఓటింగ్ లో పాల్గొనాలి. జిల్లా కలెక్టర్..

0

పాపన్నపేట,డిసెంబర్,9,మెదక్ టుడే న్యూస్//   గ్రామాల్లో ప్రశాంతంగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలిజిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,గ్రామాల్లో ప్రశాంతంగా స్థానిక ఎన్నిక నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, శత శాతం ఓటింగ్ ఎలక్షన్ గా పని చేయాలన్నారు.ప్రజలు వంద శాతం ఓటింగ్ లోపాల్గొనాలన్నారు.జిల్లాలో మొదటి విడత స్థానిక ఎన్నికలలో 160 గ్రామ పంచాయతీలు ఉండగా , 16 గ్రామ పంచాయతీలు సర్పంచలు ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన 144 గ్రామ పంచాయతీలకు గాను 411 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారన్నారు.1402 వార్డులకు గాను , 332 ఏకగ్రీవంగా అవ్వగా, పాపన్నపేట మండలంలోని అరికెల గ్రామంలో రెండు వార్డులకు ఎలాంటి నామినేషన్లు రాలేదని తెలిపారు.
1068 వార్డులకు గాను 2426 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారని తెలియజేశారు. ఆరు మండలాలకు గాను 1292 పోలింగ్ కేంద్రాలు, 14 21 పిఓ లు, 1529 ఓపిఓలు, 155 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించినట్టు తెలిపారు.
మండలాల వారీగా ఓటర్ల వివరాలు
అల్లాదుర్ మండలంలో
పురుష ఓటర్లు 11,296
మహిళా ఓటర్లు 12,259
మొత్తం……….23,555

హవేలీ ఘనపూర్
పురుష ఓటర్లు 13,987
మహిళా ఓటర్లు 15,876
మొత్తం………. 29,863

పాపన్నపేట
పురుష ఓటర్లు 19,986
మహిళా ఓటర్లు 22,416
ఇతరులు……….01
మొత్తం…………42,403

రేగోడు
పురుష ఓటర్లు 9,192
మహిళా ఓటర్లు 9,555
మొత్తం………….18,747

శంకరంపేట ( ఏ)
పురుష ఓటర్లు 15,001
మహిళా ఓటర్లు 15,953
ఇతరులు………..01
మొత్తం………30,955

టేక్మాల్
పురుష ఓటర్లు 13,844
మహిళా ఓటర్లు 14,989
మొత్తం…………28,833
మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌కు 44 గంటల ముందు నుండి సైలెంట్ పీరియడ్ అమలు.ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు పటిష్ఠ బందోబస్తు.ఎన్నికలు పూర్తయ్యే వరకు 163బి,ఎన్,ఎస్,ఎస్ (144 సెక్షన్) అమల్లో

0

మెదక్,డిసెంబర్,9,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,   స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌కు 44 గంటల ముందు నుండి సైలెంట్ పీరియడ్ అమలు.
ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు పటిష్ఠ బందోబస్తు.
ఎన్నికలు పూర్తయ్యే వరకు 163బి,ఎన్,ఎస్,ఎస్ (144 సెక్షన్) అమల్లో
శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు,జిల్లా ఎస్పీ. శ్రీ. డి. వి. శ్రీనివాస రావు.స్థానిక సంస్థల ఎన్నికలు మొదటి విడతగా రేగోడ్, హవెలిఘణపూర్,టేక్మాల్, అల్లాదుర్గ్,పాపన్నపేట,పెద్ద శంకరంపేట్ మండలాల్లో 11-12-2025 న జరగనున్న నేపథ్యంలో,ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరగేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పోలింగ్ కేంద్రాలు సీసీ కెమెరాల నిఘా లో ఉంటాయని తెలిపారు.
పోలింగ్‌కు44 గంటల ముందు నుండి 09-12-2025 సాయంత్రం 5 గంటల నుండి పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్ అమల్లో ఉంటుందని తెలిపారు.ఈసమయంలో సభలు, సమావేశాలు, ఇంటింటా ప్రచారం పూర్తిగా నిషేధమని తెలిపారు.
ఎంసీసీ (Model Code of Conduct) ఉల్లంఘనలు జరిగితే ఎన్నిక రద్దు అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.ఎన్నికల సమయంలో మద్యం, డబ్బుల పంపిణీ చేసినా,గొడవలు లేదా అల్లర్లు సృష్టించినా వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మొదటి విడత ఎన్నికల నిర్వహణ కోసం మూడు అంచెల భద్రతా వ్యవస్థతో మొత్తం 750 మంది పోలీసు సిబ్బందిని నియమించి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ పి పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ బందోబస్తు కొనసాగుతుందని అన్నారు.ఎన్నికలు ముగిసే వరకు 163 బి.ఎన్.ఎస్.ఎస్ (144 సెక్షన్) అమల్లో ఉంటుందని, ముగ్గురికి మించి గుంపులుగా ఉండడం నిషేదమని తెలిపారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, అసత్య సమాచారం,వదంతులు వ్యాప్తి చేసే వారి పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే విధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరిగితే సంబంధిత వ్యక్తులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.పోలింగ్‌కు 44 గంటల ముందు నుండి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సమావేశాలు, ర్యాలీలు లేదా ఏ విధమైన ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు.ఇతర ప్రాంతాల నుండి ప్రచారానికొచ్చిన వారు స్థానికంగా ఉండకూడదని, 09-12-2025 సాయంత్రం 5 గంటలులోపు ఖాళీ చేయాలని ఆదేశించారు.

సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి..

0

పాపన్నపేట,డిసెంబర్,9,మెదక్ టుడే న్యూస్// మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని గాందారిపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి తరపున మంగళవారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మాజీ డిప్యూటీ స్పీకర్ మెదక్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఏం పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెంకట్రాంరెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించాలని ప్రజలను కోరారు. వీరితోపాటు మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో వైన్ షాపులు బంద్ – మూడు విడతల్లో మద్యం నిషేధం..

0

(స్టేట్ బ్యూరో)డిసెంబర్,9,మెదక్ టుడే న్యూస్:    తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలపై అధికారులు కఠిన నిషేధం విధించారు. పోలింగ్ ప్రక్రియలో ఎటువంటి ఉద్రిక్తతలు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.

మొదటి విడత: డిసెంబర్ 9 నుంచి నిషేధం

డిసెంబర్ 11న జరగనున్న తొలి విడత ఎన్నికలకు సంబంధించి,
డిసెంబర్ 9 సాయంత్రం 5 గంటల నుంచి
పోలింగ్ ముగిసి, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు తొలి విడత ప్రాంతాల్లోని అన్ని మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4,236 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది.

రెండవ విడత: డిసెంబర్ 12–14

డిసెంబర్ 14న జరిగే రెండవ విడత పోలింగ్ కోసం
డిసెంబర్ 12 సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 14 ఫలితాలు వచ్చేంత వరకు
ఆయా గ్రామాల్లో మద్యం నిషేధం అమలు ఉంటుంది.

మూడవ విడత: డిసెంబర్ 15–17

మూడవ విడత ఎన్నికలు డిసెంబర్ 17న జరుగుతాయి.
దీంతో సంబంధించి,
డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 17 ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు
ప్రాంతంలోని అన్ని వైన్ షాపులు, బార్లు పూర్తిగా మూసివేయాలని అధికారులు స్పష్టం చేశారు.

బార్లు, రెస్టారెంట్ల మీద కూడా ఆంక్షలు

ఈ నిషేధం కేవలం వైన్ షాపులకే పరిమితం కాదు.

బార్లు

మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు

ఈ నిషేధానికి లోబడి ఉంటాయని కలెక్టర్లు స్పష్టంగా తెలియజేశారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఎవరైనా దుకాణాలు దొంగచాటుగా మద్యం విక్రయించినా, లేదా నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. ఎన్నికల ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచినట్లు వెల్లడించారు.

ఎన్నికలకు ఉత్సాహం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు, అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికలతో గ్రామాల భవిష్యత్తు రూపుదిద్దుకోనుంది.
పోలింగ్ జరిగిన రోజే సాయంత్రం ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.