హైదరాబాద్:డిసెంబర్,28, మెదక్ టుడే న్యూస్:(స్టేట్ బ్యూరో)జర్నలిస్టుల సంక్షేమం కోసం గత 70 ఏళ్లుగా పాటుపడుతున్న తమ సంఘం డెస్క్ జర్నలిస్టులకు ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, బస్ పాస్ లతో సహా అన్ని సంక్షేమ పథకాలను వారికి వర్తింపజేసేందుకు తాము ప్రభుత్వంతో చర్చించి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ భరోసా ఇచ్చారు. డెస్క్ జర్నలిస్టులను ఇతర జర్నలిస్టులను తాము వేరుగా చూడడం లేదని, వారికి కూడా బస్ పాస్ లతో సహా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిని తప్పకుండా వర్తింప చేయిస్తామని అన్నారు.ఆదివారం బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ముఖ్యుల సమావేశానంతరం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, రాష్ట్ర నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గత 10 ఏళ్ల కాలంలో డెస్క్ జర్నలిస్టులకు కొంతమందికి మాత్రమే అక్రిడేషన్ కార్డులు ఇచ్చారని, కానీ ఇప్పుడు తాముడెస్క్ లో పనిచేసే జర్నలిస్టులందరికీ మీడియా కార్డులు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డుతో పాటు ఇతర సంక్షేమ పథకాలను వర్తింపజేసేలా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా నానాటికి జర్నలిజంలో అడుగంటుతున్న విలువలను పెంపొందించేందుకే కొన్ని కట్టుదిట్టమైన నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 252 జీవోను తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. ఉనికి చాటుకోవడానికి కొన్ని సంఘాలు, డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందంటూ గగ్గోలు పెట్టడంలో వాస్తవం లేదని, అబద్దాలు, కల్పితాలతో వాళ్ళు చేస్తున్న అపోహలు నమ్మవద్దని ఆయన జర్నలిస్టులను కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జర్నలిస్టులకు ఇచ్చిన అక్రిడేషన్ కార్డులు ఎంతవరకు పని చేశాయో, దానికి కారణం ఎవరన్నది ప్రతి జర్నలిస్ట్ కు తెలుసునన్నారు. జర్నలిస్టులను తీవ్ర నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంఘాలే నేడు జర్నలిస్టులకు మేలు జరుగుతోందంటే ఓర్చుకోలేకనే రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంటే పోరాటం చేసే
ఏ సంస్థలకైనా, ఏ సంఘాల కైనా టియుడబ్ల్యూజే మద్దతు ఉంటుందని, అయితే ఆ పోరాటం సహేతుకమైనది అయి ఉండాలన్నారు. 252 జీవో తో 13వేల అక్రిడేషన్ కార్డులు తగ్గుతున్నట్లు ఆందోళన చేస్తున్న సంఘానికి ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డులు అందేలా చేయడమే టియుడబ్ల్యూజే ప్రధాన ధ్యేయం అన్నారు. 1996 సంవత్సరానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 3 వేల అక్రిడేషన్ కార్డులు మాత్రమే ఉండేవని, అప్పటి తమ సంఘం ప్రభుత్వంతో కొట్లాడి గ్రామీణ విలేకరులందరికీ మండలాల వారీగా అక్రెడిటేషన్లు ఇప్పించిన చరిత్ర తమకు ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 3వేల అక్రెడిటేషన్ లను 12వేలకు పెంచిన ఘనత తమ సంఘానిదేనన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 23 వేల అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చామని గొప్పలు చెబుకుంటున్న మిత్రులు , పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే సంఖ్యలో అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చారన్న విషయాన్ని మర్చిపోతున్నారని గుర్తు చేశారు. కార్డుల సంఖ్య ముఖ్యం కాదని, ఆ కార్డులతో ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేసారో, వాటి కోసం ఎన్ని ఉద్యమాలు చేసారో చెబితే బాగుంటుందన్నారు. 252 జీవో తెచ్చి జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని విమర్శించడం సరైంది కాదన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ ఆధ్వర్యంలో ఏడుగురు ప్రముఖులైన పాత్రికేయులతో కమిటీ ఏర్పాటై, ఐదారుసార్లు సమావేశమై మార్గదర్శకాలు రూపొందించిన విషయం గగ్గోలు చేస్తున్న మిత్రులకు తెలియదా? అని విరాహత్ ప్రశ్నించారు. సమాచార శాఖ కమిషనర్ తో పాటు ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు కే.శ్రీనివాస్, ది హిందూ పత్రిక పొలిటికల్ ఎడిటర్ రవికాంత్ రెడ్డి, వి6 వెలుగు పత్రిక సీఈవో అంకం రవి, సియాసత్ ఎడిటర్ ఆమెర్ అలీ ఖాన్, ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ నాయకుడు కె.ఎన్.హరి తదితరులతో వేసిన కమిటీ రూపొందించిన నిబంధనల మేరకే 252 జీవో వచ్చిందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల నియమ నిబంధనలు రూపొందించేందుకు సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ సూచించిన సిఫార్సులను అప్పటి మీడియా అకాడమీ చైర్మన్ ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. రామచంద్ర మూర్తి కమిటీ సిఫార్సులకు భిన్నంగా తీసుకువచ్చిన 239 జీవో తో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంటే అప్పటి మీడియా అకాడమీ చైర్మన్, ఆయన సంఘం ఎందుకు నోరెత్తలేదన్నారు. ఆ జీవోతో చిన్న మధ్య తరహా పత్రికలకు, ఉర్దూ పత్రికలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దాదాపు 4500అక్రెడిటేషన్ కార్డులు తొగించబడ్డాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణకు చెందిన యాజమాన్యాలు స్థాపించిన రెండు ప్రధాన పత్రికలకు అక్రెడిటేషన్లను అడ్డుకున్నది ప్రస్తుతం ఆందోళన చేస్తున్న సంఘమేనని విరాహత్ ఆరోపించారు. ఆ విషయంలో ప్రెస్ కౌన్సిల్ ను ఆశ్రయించి, ఆ పత్రికలకు న్యాయం చేసిన ఘనత తమ సంఘనిదే అని ఆయన గుర్తుచేసారు. అయితే గతంలో రాష్ట్రంలో జారీచేసిన దాదాపు 3 వేల అక్రెడిటేషన్ కార్డులు జర్నలిజం వృత్తితో సంబంధం లేని వారి చేతుల్లో ఉన్నట్లు తమ సంఘానికి అందిన ఫిర్యాదుల్లో తేలిందన్నారు. అడ్డదారుల్లో అక్రెడిటేషన్లు పొందిన వారే జర్నలిస్టులుగా చలామణి అవుతూ, ఇసుక వ్యాపారులను, రైస్ మిల్లర్లను, బిల్డర్లను, ఇతర వ్యాపారులను బెదిరిస్తూ పోలీసులకు చిక్కారని, వారిపై కేసులు నమోదు కావడం జర్నలిజం విలువలను మంటగలిపిందన్నారు. జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందంటూ ఆందోళనకు దిగిన ఆ సంఘం రాష్ట్ర కీలక నాయకుని కుటుంబ సభ్యులు నలుగురు మీడియా ఏజెన్సీ పేరుతో అక్రిడేషన్ కార్డులు పొందారని, అదే సంఘానికి చెందిన మరో రాష్ట్ర నాయకుని కుమారుడు యాదాద్రి భువనగిరి జిల్లా లోని ఓ గ్రామ సర్పంచ్ గా వ్యవహరిస్తున్నప్పటికీ, అతనికి జర్నలిస్టు అక్రిడేషన్ కార్డు ఇవ్వడంపై తమ సంఘం ఆందోళన చేసి ఆ కార్డును రద్దు చేయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పనిచేసే బాయ్ కి కూడా ఓ పత్రికా బ్యూరో కార్డు అందించడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి పద్దతుల్లో అక్రెడిటేషన్ కార్డులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు, వాటికీ గౌరవం దక్కించే ఉద్దేశంతోనే కొన్ని కట్టుదిట్టమైన నిబంధనలతో 252 జీవో ను తెచ్చారని ఆయన పేర్కొన్నారు. అక్రెడిటేషన్ కార్డులతో రిపోర్టర్లకు, డెస్క్ జర్నలిస్టులకు ఇంతకాలం ఏలాంటి ప్రయోజనం చేకూరలేదని, కనీసం ఇప్పుడైనా సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం పై ఒత్తిడి పెంచి, అక్రెడిటేషన్, మీడియా కార్డులు పొందే వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రయోజనాలు చేకూర్చేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 252 జిఓ లో ఉన్న కొన్ని లోటు పాట్లను తాము గుర్తించామని, వాటిని సవరించేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు ఆయన స్పష్టం చేసారు. ఏది ఏమైనా అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు, మీడియా కార్డులు అందించేందుకు తమ సంఘం తీవ్రంగా కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ మాట్లాడుతూ ఇటీవల తమ సంఘం సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం ముందు రెండు వేల మంది జర్నలిస్టులతో నిర్వహించిన మహా ధర్నాతో ప్రభుత్వం దిగివచ్చి యుద్ధప్రాతిపదికన జీవో జారీ చేసిందన్నారు. అయితే ఆస్తిత్వం కోసం, ఉనికిని చాటుకోవడానికి ఒక సంఘం తమ సంఘ జాతీయ నాయకుడిపై దుష్ప్రచారం చేస్తూ అలజడి సృష్టించడం సహించరానిదన్నారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ జర్నలిస్టులకు అందిన సంక్షేమ పథకాలన్నీ తమ సంఘం పోరాట ఫలితమేనన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీయుడబ్ల్యూజే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, ఉపాధ్యక్షుడు గాడిపల్లి మధు, కార్యదర్శులు కె. శ్రీకాంత్ రెడ్డి, వరకాల యాదగిరి, జి. మధు గౌడ్, కోశాధికారి యం.వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ. రాజేష్, తెలంగాణ చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు,ప్రధాన కార్యదర్శి అశోక్, హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
డెస్క్ జర్నలిస్టులందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాం,బస్ పాస్ లతో సహా ఇతర అన్ని సంక్షేమ పథకాలు వారికి వర్తింపజేయిస్తాం,అవాస్తవాలతో కొందరు తప్పుద్రోవ పట్టిస్తున్నారు.-టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ..
రాష్ట్రస్థాయి పోటీలకు మెదక్ కబడ్డీ జట్టు..
మెదక్,డిసెంబర్,26,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,రాష్ట్రస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీలకు మెదక్ జిల్లా క్రీడాకారులు 26,27,28, వ తేదీ లలో ఖమ్మం జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలకు మెదక్ జిల్లా స్థాయిలో పాల్గొని రాష్ట్ర స్థాయికి 12 మంది సీనియర్ కబడ్డీ క్రీడాకారులు పాల్గొంటున్నారని మెదక్ జిల్లా అధ్యక్షుడు బసవరాజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం రాష్ట్రస్థాయిలో మెదక్ జిల్లా మూడో స్థానం సాధించిందని ఈసారి కూడా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించేలా కృషి చేస్తామని తెలిపారు. కోచ్ నర్సింలు,యాకస్వామి క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
సరదా గా ఈత కు వెళ్ళి ప్రమాద వశాత్తూ నీటిలో మునిగి ఓ యువకుడు మృతి..
పాపన్నపేట,డిసెంబర్,26 మెదక్ టుడే న్యూస్:ఘనపూర్ ప్రాజెక్టు రెండవ బ్రిడ్జి వద్ద శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. పాపన్న పేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అందొల్ మండల పరిధిలోని మాన్సాన్ పల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ (16) తన మిత్రులతో కలిసి మెదక్ చర్చ్ కు వెళ్లి తిరుగు ప్రయాణం లో ఏడుపాయల వద్ద ఉన్న ఘనపూర్ ప్రాజెక్టు రెండవ బ్రిడ్జి వద్ద ఈత కొట్టేందుకు మిత్రులతో కలిసి స్నానం ఆచరిస్తుండగా ప్రమాద వశాత్తూ నీటిలో మునిగి పోతుండడంతో అక్కడే ఉన్న మిత్రులు గమనించి ప్రసాద్ ను కాపాడేందుకు వెళ్ళగా భయం తో ప్రసాద్ పెట్టుకోవడంతో కాపాడేందుకు వెళ్ళిన మరో మిత్రుడు నీటిలో మునిగి పోతుండడంతో అక్కడే ఉన్న మత్స్చకారుడు గమనించి ఒకరిని కాపాడగా ప్రసాద్ నీటి లో మునిగి పోయాడు. దీంతో మిత్రులు భయబ్రాంతులై పాపన్న పేట పోలీసులకు సమాచారం అందివ్వడంతో పాపన్న పేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి మిత్రుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

ఏడుపాయలోగుర్తు తెలియని వృద్ధుడు మృతి..
పాపన్నపేట,డిసెంబర్,26,మెదక్ టుడే న్యూస్:ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల ఆలయ పరిసర ప్రాంతాల్లో ఓ గుర్తు తెలియని యాచక (73) సంవత్సరాల వృద్ధుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. పాపన్న పేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా యాచకుడి గా ఓ వృద్ధుడు సంచారం చేస్తూ ఆలయ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూన్న యాచకుడుచలి తీవ్రత ను తట్టుకోక.శుక్రవారం పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పాపన్న పేట పోలీసులకు సమాచారం అందివ్వడంతో సమాచారం అందుకున్న పాపన్న పేట పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా వృద్ధుడు మృతి చెందినట్లు గుర్తించి. ఆచూకీ కోసం పరిశీలించగా ఎలాంటి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మృతుడి శరీరంపై నీలం రంగు చొక్క ధరించి తెల్లని గడ్డం కలిగి ఉన్నాడని. మృతుడి నీ గుర్తించిన సంబంధికులు పాపన్న పేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ 8712657920, మెదక్ రూరల్ సీఐ కార్యాలయం లో సంప్రదించాలని కోరారు.
ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ కలెక్టర్, పాపన్నపేట మండల కేంద్రంలోనిపీ.హెచ్.సీ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..
పాపన్నపేట డిసెంబర్ 26 మెదక్ టుడే న్యూస్: ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ కలెక్టర్, పాపన్నపేట మండల కేంద్రంలోనిపీ.హెచ్.సీ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్,ఆసుపత్రి లోని అన్ని విభాగాల పరిశీలన,మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,పాపన్నపేట మండలం పీ.హెచ్.సీ ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్ సీ లోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది, ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ ను పరిశీలించారు.ప్రతి రోజూ హాస్పిటల్ కు ఎంత మంది రోగులు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.ఈ నెలలో ఎన్ని డెలివరీల లక్ష్యం ఉందని, ఇప్పటిదాకా ఎన్ని చేశారని సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృశ్య సారించాలని లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు.అనంతరం కలెక్టర్ మాట్లాడారు.
ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని జిల్లాలో ఆరోగ్య సేవలు మరింత మెరుగుపడినాయని తెలిపారు. హాస్పిటల్ కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత , పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని సూచించారు.ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హవేలిఘన్పూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా శ్వేత కిరణ్ గౌడ్..
మెదక్,హవేలీ ఘన్పూర్ మండలం డిసెంబర్,23 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి: హవేలీ ఘన్పూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా ముత్తయ్య కోట గ్రామానికి చెందిన శ్వేతా కిరణ్ గౌడ్ ను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా గోపాల్ నాయక్ ప్రధాన కార్యదర్శిగా గుడాల పోశెట్టి ఎన్నికయ్యారు మండలంలో 30 మంది సర్పంచులు ఉండగా అందులో 26 మంది సర్పంచులు శ్వేత కిరణ్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండలంలోని సర్పంచులు నా మీద నమ్మకంతో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే మైనాంపల్లి రోహిత్ రావు మరియు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో మండలంలోని గ్రామపంచాయతీల నిధులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి పథకంలో నడిపిస్తానని 26 మంది సర్పంచుల మద్దతు ఎల్లప్పుడూ ఉండాలని ఇందుకు సహకరించిన మండల అధ్యక్షుడు లక్కర్ శ్రీనివాస్ యూత్ అధ్యక్షుడు పరశురామ్ గౌడ్ సేరి మహేందర్ రెడ్డి బాలకిషన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే సహాయంతో పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని నన్ను నమ్మి ఎన్నుకున్న సర్పంచుల గ్రామాలకు నిధులు తీసుకువచ్చి హవేలీ ఘన్పూర్ మండల గ్రామాలను తెలంగాణలో నెంబర్ వన్ గ్రామపంచాయతీ లా మండలం గా ముందుకు తీసుక వెళ్తానని తెలిపారు నా భర్త యువ నాయకుడు ప్రముఖ సంఘ సేవకుడు యువ న్యాయవాది ఇంతకుముందు సర్పంచ్ చేసిన అనుభవం గల వ్యక్తి కాబట్టి వారి అనుభవంతో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారి సహకారంతో హవేలి ఘనపూర్ మండలంలోని 30 గ్రామాలను అభివృద్ధి పథకంలో నడిపిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో హవేలీ ఘన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్కర్ శ్రీనివాస్ మెదక్ జిల్లా యూత్ అధ్యక్షుడు పరశురామ్ గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు శేరి మహేందర్ రెడ్డి బాలకిషన్ రావు సిరిమల్లె శ్రీనివాస్ వినోద్ వంశీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

నూతనంగా ఎన్నికైన సర్పంచు మరియు వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం..
మెదక్,డిసెంబర్,22,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,మెదక్ మండలములోని పాతూర్ గ్రామంలో ఇటివలే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందిన సర్పంచ్ విఠల్ నాగలక్ష్మి పెంటయ్య, ఉప సర్పంచ్ యాశోద ఏసుదాస్,మరియు వార్డు సభ్యులు సోమవారం రోజున స్పెషల్ ఆఫీసర్ ఆర్.ఐ.కిషోర్ మరియు గ్రామ సెక్రెటరీ పాతిమా,ఎన్నికయిన వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ విఠల్ నాగలక్ష్మి మాట్లాడుతూ మా యొక్క గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పారదర్శకంగా ప్రజలకు సేవచేస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యంగా గ్రామంలో అందరి సహాయ సహకారాలు తో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.ఈయొక్క కార్యక్రమములో నాయకులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గోన్నారు.
దళితుల జర్నలిస్టుపై దాడి-కలెక్టర్ కు వినతి పత్రం..
(స్టేట్ బ్యూరో)ప్రకాశం జిల్లా,డిసెంబర్,22,మెదక్ టుడే న్యూస్: అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో న్యాయం చేయమని వెళ్తే మాదిగ జర్నలిస్టుపై దాడి.కాకర్ల గ్రామం మాజీ సర్పంచ్ కోటపాటి వెంకటేశ్వర్ రెడ్డి ఫోన్ చేసి పిలిపించి మద్యం మత్తులో ఉండి ఆయనతో ఉన్న వాళ్లకు మద్యం తాపీ నన్ను రప్పించి నాపై దౌర్జన్యం చేసి కడుపులో తన్ని, చెంపపై కొట్టడం జరిగింది.మాదిగ జర్నలిస్టుగా నాకే రక్షణ లేనప్పుడు దళిత సమాజానికి ఎక్కడ రక్షణ ఉంటుంది.దళితులు అంటే పల్లెలలో ఇంత చులకనగా చూస్తారా.ప్రశ్నిస్తే నీ అంత చూస్తామంటారా.ఎక్కడ దళితులకు న్యాయం జరుగుతుంది దళితులు వాళ్ళ హక్కుల ప్రకారం వాళ్లు స్వేచ్ఛగా బతకనివ్వరా.న్యాయం చేయమని వెళ్తే కొట్టేస్తారా కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు. దళితులు వాళ్ళ ఆత్మగౌరవంతో బతకడం వాళ్లకు ఇష్టం లేదా వాళ్ళ దగ్గరికి వెళ్లి వంగి వంగి దండాలు పెడితే వాళ్లకు దళితులు నచ్చుతారా.ఆధునిక సమాజంలో ఇంకా దళితులపై దౌర్జన్యం సమ సమాజ స్థాపన జరగాలని ప్రజా ప్రతినిధులు వక్తలు చెబుతారు కానీ ఇప్పటికీ గ్రామాలలో గ్రామాలలో అనగారిన పీడిత వర్గాలపై ఉక్కు పాదం మోపుతూ రాజకీయ ఆర్థిక అండదండలు కలిగినటువంటి వారి చేతులలో దళితులు ఇంకా బలహీనులుగా ఉండాలా.
మెదక్ పట్టణంలోని సాయి దత్తా సినిమా థియేటర్ సమీపంలో కొనసాగుతున్న వంతెన నిర్మాణం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ప్రజల నుంచి వస్తున్న ఆందోళనను తాను గమనించినట్లు ఎమ్మెల్యే మినంపల్లి రోహిత్ అన్న తెలిపారు.
మెదక్,డిసెంబర్,22,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,మెదక్ పట్టణంలోని సాయి దత్తా సినిమా థియేటర్ సమీపంలో కొనసాగుతున్న వంతెన నిర్మాణం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ప్రజల నుంచి వస్తున్న ఆందోళనను తాను గమనించినట్లు ఎమ్మెల్యే మినంపల్లి రోహిత్ అన్న తెలిపారు.ఈప్రాంతంలో సరైన భద్రతా చర్యలు లేకపోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవడం బాధాకరమని ఆయన అన్నారు.ఈవిషయంపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ శాఖ మరియు పోలీసు అధికారులతో తక్షణమే సమావేశం నిర్వహించి, సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వంతెన నిర్మాణ ప్రాంతంలో తగిన భద్రతా సూచికలు, బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, రాత్రివేళ తగిన లైటింగ్ ఏర్పాటు చేయడం మరియు ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశిస్తామని అన్నారు.ఇప్పటికే జరిగిన ప్రమాదాల్లో గాయపడిన వారందరికీ సరైన వైద్య సహాయం అందేలా చూస్తామని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే మినంపల్లి రోహిత్ అన్న భరోసా ఇచ్చారు. ప్రజల ప్రాణాల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలుతీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.మెదక్ ప్రజలుఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తానే ఈ అంశాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ పూర్తిస్థాయి పరిష్కారం జరిగే వరకు చర్యలు కొనసాగిస్తానని ఎమ్మెల్యే మినంపల్లి రోహిత్ అన్న తెలిపారు.
కుచంపల్లి సర్పంచిగా ప్రమాణస్వీకారం చేసిన లింగాల భూదేవి పద్మారావు..
మెదక్,హవేలీఘన్పూర్ మండలం డిసెంబర్ 22 మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,హవేలి ఘనపూర్ మండలం కుచన్ పల్లి గ్రామ సర్పంచిగా లింగాల భూదేవి పద్మారావు కుచన్ పల్లి స్పెషల్ ఆఫీసర్ మధుమోహన్ మరియు పంచాయతీ సెక్రెటరీ హేమలత నూతన పాలకవర్గాన్ని చే ప్రమాణస్వీకారం చేయించారు సర్పంచ్ లింగాల భూదేవి ఉపసర్పంచ్ రేఖ కమయ్య వాడు సభ్యులు తోగిట సత్యనారాయణ మన్నే అనల్ప శివ కుమార్ వీరప్ప గారి వెంక గౌడ్ దుర్గారి శ్యామల ప్రసాద్ లింగంపల్లి శ్రీనివాస్ మన్నే శోభ బిక్షపతి లింగాల సంతోష్ మంగలి చంద్రమ్మ ప్రమాణం చేశారు అనంతరం సర్పంచ్ లింగాల భూదేవి మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో నా మీద ఉంచిన బాధ్యతను పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని అందుకు మీరు సహకారం అందించాలని ఆమె గ్రామ ప్రజలను వాడు నెంబర్లను కోరారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మధుమోహన్ సెక్రెటరీ హేమలత సేరి మహేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ జండాకాడి గౌడ్ చినూరి రాంరెడ్డి ఈర్ల లక్ష్మీనారాయణ ఈర్ల రమేష్ లింగాల సుధాకర్ లింగాల సిద్దయ్య ఆకుల యాదగిరి దమ్ము వెంకట్ కొజ్జా పురం సిద్ది రాములు దుర్గారి రవి కర్రె పద్మారావు ఆదిల్ పాషా దుర్గారి ప్రసాద్ అల్లం వెంకటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు గ్రామపంచా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











