📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 47

అబాకాస్ పరీక్షలో పాపన్నపేట శ్రీవిద్య విద్యార్థుల ప్రతిభ.

0

పాపన్నపేట,జనవరి,4,మెదక్ టుడే న్యూస్:ఉమ్మడి జిల్లా స్థాయి అబాకస్ పరీక్ష లో పాపన్న పేట శ్రీ విద్య పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ఐదు క్యాటగిరిలలో జిల్లాస్థాయిలో ఫస్ట్ ర్యాంక్ లు సాధించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో విశ్వం ఎడ్యూ టెక్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షలో ఉమ్మడి జిల్లా నుంచి42స్కూల్స్ కు చెందిన884 విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీ పరీక్షలో పాపన్నపేటలోని శ్రీ విద్య పాఠశాల పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు ఇందులో హార్దిక్ రామ్,హేమాన్,రోహిత్,శ్రీజ,షిజా తనాయి ఉన్నారు. ప్రతిభ కనబరిచిన వారినిప్రిన్సిపాల్ రవీందర్, కరస్పాండెంట్ నీఠలాక్షప్ప,సుమన్,తదితరులు అభినందించారు.

ఏడుపాయల్లో భక్తజనం.

0

పాపన్నపేట,జనవరి,4,మెదక్ టుడే న్యూస్:పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల ఆదివారం భక్తులతో కిక్కిరిసింది , సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఏడుపాయలకు చేరుకొని దుర్గామాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు, నూతన సంవత్సరం ప్రారంభంలో మొదటి ఆదివారం రావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఏడుపాయలకు చేరుకున్నారు, దీంతో ఎక్కడ చూసినా భక్తుల సందడి నెలకొంది, ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఓడి బియ్యం కుంకుమార్చనలు, తల నీలాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు, ఇందులో భాగంగా వేద పండితులు శంకర శర్మ, పార్థివ్ శర్మ, రాము, నాగరాజు, రాజశేఖర్ శర్మ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులకు ఇబ్బందులు రాకుండా ఏడుపాయల ఈవో చంద్రశేఖర్ ఆలయ సిబ్బంది, సూర్య శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, బ్రహ్మచారి, నర్సింలు, బత్తినీ రాజు,వరుణ చారి,నరేష్, తదితరులు ఏర్పాట్లు చేయగా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

బాల సాధన్‌లో పిల్లలతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జిల్లా ఎస్ పి శ్రీనివాసరావు.

0

మెదక్ జనవరి,1,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి) గురువారంమెదక్ పట్టణంలోని బాల సాధన్‌లో పిల్లలతో కలిసి నూతన సంవత్సర వేడుకలను మెదక్ జిల్లా ఎస్ పి శ్రీ డి. వి. శ్రీనివాస రావు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా అక్కడ ఉన్న పిల్లలకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.పిల్లలతో స్నేహపూర్వకంగా ముచ్చటించిన ఎస్ పి వారి చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే భవిష్యత్తులో వారు సాధించాలనుకుంటున్న లక్ష్యాల వివరాలు తెలుసుకొని, మంచి విద్యతో పాటు క్రమశిక్షణ, కష్టపడి చదివే అలవాటు ఉంటే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని పిల్లలకు ప్రోత్సాహం అందించారు.పిల్లల భవిష్యత్తే సమాజ భవిష్యత్తు అని, వారు మంచి పౌరులుగా ఎదగాలంటే విద్యే ప్రధాన ఆయుధమని ఈ సందర్భంగా ఎస్ పితెలిపారు.నూతన సంవత్సరంలో పిల్లలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా చదువులో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్, డీఎస్పీలు శ్రీ ప్రసన్న కుమార్, శ్రీ నరేందర్ గౌడ్, శ్రీ రంగా నాయక్, సీఐలు శ్రీ మహేష్, శ్రీ కృష్ణమూర్తి, శ్రీ శైలేందర్, బాల సాధన్ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జనవరి 01 నుండి 31 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ – 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్ పి. శ్రీనివాస రావు, తెలిపారు.

0

మెదక్,జనవరి,1,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)

మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జనవరి 01 నుండి 31 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ – 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్ పి. శ్రీనివాస రావు, తెలిపారు.ఈ సమయంలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని జిల్లా ఎస్ పి తెలిపారు.అలాగే ప్రజల,ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక చర్యలు, అశాంతి సృష్టించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. శాంతి భద్రతల నిర్వహణలో ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఈ విషయంలో పోలీసులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని జిల్లా ఎస్ పి విజ్ఞప్తి చేశారు.

అన్నదాతలు ఆందోళన పడొద్దు

0

•మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

పాపన్నపేట,డిసెంబర్,31,మెదక్ టుడేన్యూస్:మండల పరిధి లోని లక్ష్మీనగర్ లోని లక్ష్మీ గ్రోమోర్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.అ కేంద్రంలో నిల్వ ఉన్న ఎరువులు,విత్తనాల స్టాక్ వివరాలను రికార్డులను పరిశీలించారు. ఎరువుల నాణ్యత,నిల్వ విధానం,విక్రయ ధరలు ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఉన్నాయా లేదా అన్న అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఎరువులు సకాలంలో అందించాలని,అక్రమ నిల్వలు,అధిక ధరలకు విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. యూరియా కోసం రైతులు ఎవరు ఆందోళన చెందొద్దనీ,రైతులకు సరిపడా యూరియా ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. అక్టోబర్ 2025..జనవరి 26 సంవత్సరానికి మన జిల్లాకు 12.000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంటుందని రాష్ట్రానికి ప్రతి పాదనలు పంపామన్నారు. డిసెంబర్ 30 నాటికి మెదక్ జిల్లాకు 12.663 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన్నారు. 8.000 మెట్రిక్ టన్నుల యూరియా రైతులు ఇప్పటివరకు కొనుగోలు చేయడం కూడా జరిగిందనీ,ఇంకా జిల్లాలో 4.000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లాలో మన అవసరానికి మించి యూరియా జనవరి కి కూడా రాబోతుందనీ రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఈసందర్బంగా మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస రాజు,విస్తరణ అధికారి జనార్దన్ ఉన్నారు.

జర్నలిస్టుల జాతరకు తప్పకుండా సహకరిస్తాం,జర్నలిస్టు సంఘాల జేఏసీకి హామీ..

0

(స్టేట్ బ్యూరో)డిసెంబర్,31,మెదక్ టుడే న్యూస్:  తెలంగాణలోని అన్ని జర్నలిస్టుల సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే అక్రెడిటేషన్, తదితర వ్యవహారాలపై ముందుకు వెళ్ళాలని భావిస్తునట్లు ముఖ్యమంత్రి ఛీప్ పిఆర్వో మల్సూర్ అన్నారు.రాష్ట్ర సచివాలయంలో బుధవారం తెలంగాణ జర్నలిస్టు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) సభ్యులతో ముఖ్యమంత్రి ఛీప్ పిఆర్వో మల్సూర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టు సంఘాల జేఏసీ మార్చిలో తలపెట్టిన ‘జర్నలిస్టుల జాతర’కు తప్పకుండా సహకరిస్తాని అన్నారు. తమకు అనేక కోణాలలో వివిధ సమస్యలు దృష్టికి వచ్చాయని, ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుందని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) నేతలు కే.కోటేశ్వర్ రావు, అనంచిన్ని వెంకటేశ్వరరావు, బిఎల్ఎన్ చారి, కో-కన్వినర్ సి.హెచ్.వెంకటేశ్వర్లు, రాగుల శ్రవణ్, కో- ఆర్డినేటర్లు మల్లిఖార్జున్, షేక్ అహ్మద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు-మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి-మంత్రిని కలిసిన తెలంగాణ జర్నలిస్టు సంఘాల జేఏసీ..

0

హైదరాబాద్,డిసెంబర్,30,మెదక్ టుడే న్యూస్:(స్టేట్ బ్యూరో)తెలంగాణలో గతంలో ఇచ్చిన మీడియా అక్రెడిటేషన్ కార్డుల కంటే అధికంగానే ఇస్తామని, నిజమైన జర్నలిస్టులకు తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని రాష్ట్ర సమాచార, పౌరసంబధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అక్రిడిటేషన్ల జీవో 252 విషయంలో జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏదైనా పొరపాట్లు ఉంటే త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశమై సవరిస్తామని అన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ జర్నలిస్టు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ(టీజేఏ జేఏసీ) నాయకులు మంత్రి పొంగులేటిని కలిసి జీవో 252 సవరణతో పాటు జర్నలిస్టుల ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… అతి త్వరలో అన్ని జర్నలిస్టు సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని,అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మరో జీవో తెస్తామని అన్నారు. డెస్క్ లో పనిచేసే వారికి, ఫీల్డ్ లో పనిచేసే జర్నలిస్టులకు అనేక సంక్షేమ పథకాలను అంచెలంచెలుగా అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సమాచార పౌరసంబధాల శాఖ స్పెషల్ కమీషనర్ సీహెచ్ ప్రియాంక లకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 252 మార్గదర్శకాలలోని అభ్యంతరాలను నోటిఫికేషన్‌కు ముందు సవరించాలని, చిన్న పత్రికలు, కేబుల్ ఛానెళ్లతో పాటు ఎంపానల్మెంట్ కాకుండా ఉన్న ఇతర పత్రికలకు సంబంధించిన ప్రతి జర్నలిస్టుకు వారి సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని వారు కోరారు.రెండు కార్డుల వ్యవస్థకు బదులుగా, డెస్క్ జర్నలిస్టులకు కూడా జర్నలిస్టుల మాదిరిగానే ఒకే అక్రిడిటేషన్ కార్డు వ్యవస్థను కొనసాగించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయిందని, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు 15 సంవత్సరాల సీనియారిటీ నిబంధన అసంబద్ధమని, ఈ నిబంధన తొలగించాలని డిమాండ్ చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన వారందరికీ ఎటువంటి షరతులు లేకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, జర్నలిస్టుల కుటుంబాలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలని, ఇందుకు కోసం వెంటనే ఆయా విభాగాలకు అధికారిక ఆదేశాలు జారీ చేయాలని కోరారు.జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు బీమా సౌకర్యం కల్పించాలని,60 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులందరికీ నెలకు రూ. పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని, జర్నలిస్టులకు దేశవ్యాప్తంగా రైల్వే ఫ్రీ పాసులు కల్పించాలని,అదేవిధంగా జర్నలిస్టుల వాహనాలకు టోల్ గేట్ ఫీజు నుంచి మినహాయింపు సదుపాయం కల్పించాలని వారు మంత్రిని కోరారు. మంత్రిని, కమీషనర్ ను కలిసిన వారిలో జేఏసీ కన్వీనర్లు మామిడి సోమయ్య(టీడబ్ల్యూజేఎఫ్), కే.కోటేశ్వర్ రావు(ఏడబ్ల్యూజేఏ), అనంచిన్ని వెంకటేశ్వరరావు(టీజే ఎస్ఎస్), పులిపలుపుల ఆనందం(ఐఎఫ్ డబ్ల్యూజే), రావికంటి శ్రీనివాస్(డబ్ల్యూజేఐ), గౌటి రామకృష్ణ, రాణా ప్రతాప్, కీర్తి సంతోష్ రాజు తదితరులున్నారు.

జర్నలిస్ట్ అక్రిడేషన్ కార్డు ఒక శాపంలా వెంటాడుతుంది.!!ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు యం,రాజా తీవ్రంగా మండిపడ్డారు.

0

పల్నాడు జిల్లా డిసెంబర్ 29 మెదక్ టుడే న్యూస్:(స్టేట్ బ్యూరో)మాచర్ల పట్టణంలోని ఎం ఆర్ ఆర్ న్యూస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ఐజేఏ అధ్యక్షులు యం,రాజా మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన ప్రతిసారి జర్నలిస్టు సోదరులకు అన్యాయం జరుగుతూనే ఉందని వాపోయారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న మధ్య వార మాస, పత్రికలంటూ వివక్ష చూపుతూనే ఉన్నారు.కేబుల్ యూట్యూబ్ చానల్స్ అంటూ వివక్ష చూపటం పరిపాటగా మారింది, కేవలం సాటిలైట్ చానల్స్ మాత్రమే మీ వార్తను ప్రసారం చేస్తున్నాయా అని ప్రశ్నించారు.?? ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమే ఐ&పిఆర్ లో ఉన్న కొంతమంది అవగాహన లోపమే అని చెప్పుకోవచ్చు, ఎవరో చేసిన తప్పులకు మేము బాధ్యులం కాదు అని ఏపీఐజేఏ అధ్యక్షులు యం, రాజా తీవ్రంగా ఖండించారు,

మెదక్ జిల్లా పరిధిలో చైనా మంజా పూర్తిగా నిషేధం,సంక్రాంతి నేపథ్యంలో చైనా మంజాపై ప్రత్యేక తనిఖీలు,నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినా, వినియోగించినా కఠిన చట్టపరమైన చర్యలు,జిల్లా ఎస్ పి శ్రీనివాస రావు..

0

మెదక్ డిసెంబర్ 29 మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)  మెదక్ జిల్లా పరిధిలో చైనా మంజా పూర్తిగా నిషేధం,సంక్రాంతి నేపథ్యంలో చైనా మంజాపై ప్రత్యేక తనిఖీలు,నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినా, వినియోగించినా కఠిన చట్టపరమైన చర్యలు,జిల్లా ఎస్ పి శ్రీనివాస రావు.మెదక్ జిల్లా పరిధిలో చైనా మంజాను పూర్తిగా నిషేధించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం చైనా మంజాపై నిషేధం విధించిన నేపథ్యంలో, నిబంధనలకు విరుద్ధంగా చైనా మంజాను విక్రయించినా, వినియోగించినా లేదా దాని వల్ల ఎవరికైనా ప్రమాదం సంభవించినట్లయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని, జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేస్తారని తెలిపారు. నైలాన్, సింథటిక్ దారాలతో తయారయ్యే చైనా మంజా పర్యావరణానికి తీవ్ర హాని కలిగించడంతో పాటు, సాధారణ ప్రజలు, వాహనదారులు మరియు పక్షులకు ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.చైనా మంజాతో గాలిపటాలు ఎగురవేసే సమయంలో గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, గాలిపటాలు ఎగురవేసే వ్యక్తులు సైతం తీవ్రంగా గాయపడిన ఘటనలు ఉన్నాయని తెలిపారు. ఈ కారణాల వల్లనే చైనా మంజాపై పూర్తిస్థాయి నిషేధం విధించబడిందని జిల్లా ఎస్పీ వివరించారు.చైనా మంజా విక్రయాలు, వినియోగంపై పర్యావరణ పరిరక్షణ చట్టం – 1986 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలో ఎక్కడా చైనా మంజా విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజలు చైనా మంజాను ఉపయోగించకుండా, ఎవరికీ హాని కలగని సాధారణ దారాలతో గాలిపటాలు ఎగురవేయాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా చైనా మంజా విక్రయిస్తున్నట్లు లేదా వినియోగిస్తున్నట్లు గమనించినట్లయితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

రోడ్డు ప్రమాద మరణాలు 29 శాతం తగ్గుదల,డీడీ కేసులు, గేమింగ్ యాక్ట్ కేసుల్లో కఠిన చర్యలు.డయల్–100 స్పందన సమయం గణనీయంగా మెరుగుదల,మెదక్ జిల్లా ఎస్ పి. శ్రీనివాస రావు.2025 సంవత్సరంలో మెదక్ జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాద మరణాలు సుమారు 29 శాతం తగ్గినట్లు జిల్లా ఎస్ పి శ్రీనివాసరావువెల్లడించారు.

0

మెదక్ డిసెంబర్ 29 మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి) రోడ్డు ప్రమాద మరణాలు 29 శాతం తగ్గుదల,డీడీ కేసులు, గేమింగ్ యాక్ట్ కేసుల్లో కఠిన చర్యలు.డయల్–100 స్పందన సమయం గణనీయంగా మెరుగుదల,మెదక్ జిల్లా ఎస్ పి. శ్రీనివాస రావు.2025 సంవత్సరంలో మెదక్ జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాద మరణాలు సుమారు 29 శాతం తగ్గినట్లు జిల్లా ఎస్ పి. డి. వి. శ్రీనివాస రావు వెల్లడించారు.అలాగే ఆర్థిక లాభం కోసం జరిగిన దోపిడీలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో జరిగిన హత్యలు, రాత్రి సమయాల్లో ఇళ్లలో జరిగిన దొంగతనాలు, చైన్ స్నాచింగ్, మోసాలు, హత్యాయత్నాలు వంటి ప్రధాన నేరాలు 2024 సంవత్సరంతో పోల్చితే 2025లో గణనీయంగా తగ్గినట్లు తెలిపారు.ఈవిజయాలు సమర్థవంతమైన ముందస్తు పోలీసింగ్, పటిష్టమైన నిఘా చర్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, అలాగే వివిధ శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం వల్ల సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. నిరంతర పర్యవేక్షణ, పోలీసుల దృశ్యమానత పెంపు, ప్రజల భాగస్వామ్యంతో కూడిన కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాల ద్వారా నేరాల గుర్తింపు, విచారణ, స్పందన మరింత బలపడిందని తెలిపారు. ఫలితంగా ప్రజా భద్రత మెరుగుపడి, పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరిగిందని చెప్పారు.2024తో పోల్చితే 2025లో రోడ్డు ప్రమాదాలు 29 శాతం తగ్గుదల నమోదు కావడం సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం 2 గంటల పాటు వాహన తనిఖీలు చేయడం వలనే రోడ్డు ప్రమాద మరణాలు ఘననీయంగా తగ్గిందని స్పష్టం చేశారు.అలాగే 2024తో 6500 కేసులు నమోదు చేయగా 2025 సంవత్సరంలో మొత్తం 11,800 డీడీ (డిడి) కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.గేమింగ్ యాక్ట్ కేసుల వివరాలు:2024 సంవత్సరంలో గేమింగ్ యాక్ట్ కింద 38 కేసులు నమోదు కాగా, 265 మంది అరెస్టు చేయడం జరిగిదని, రూ.9 లక్షల 70 వేల నగదు సీజ్ చేయడం జరిగింది.2025 సంవత్సరంలో గేమింగ్ యాక్ట్ కింద 73 కేసులు నమోదు కాగా, 472 మంది అరెస్టు చేయడం జరిగి, రూ.18 లక్షల 18 వేల నగదు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.డయల్–100 కాల్స్ వివరాలు:
2024 సంవత్సరంలో డయల్–100కు సుమారు 38,000 కాల్స్ రాగా, సగటు స్పందన సమయం 8 నిమిషాలుగా ఉండేదని తెలిపారు.2025 సంవత్సరంలో 37,872 కాల్స్ అందగా, సగటు స్పందన సమయం 4.33 నిమిషాలకు తగ్గిందని వెల్లడించారు.అలాగే గ్రామపంచాయితీ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో కీలక పాత్ర పోషించామని, ఎన్నికల సమయంలోఎలాంటిఅవాంఛనీయసంఘటనలుజరగలేదని వెల్లడించారు.ప్రజలు పోలీస్ శాఖతో కలిసి పనిచేసినప్పుడే శాంతియుత, సురక్షిత సమాజం సాధ్యమవుతుందని పేర్కొంటూ, ఏ చిన్న సమాచారం అయినా పోలీసులకు అందించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.