📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 46

చదువుకున్న మహర్లు చట్టసభల్లో వెళ్ళాలి

0

•అంబేద్కర్ ను మాత్రమే స్పూర్తిగా స్వీకరించండి

  • బుద్ధుని ఆలోచనలను అనుసరించండి
  • సామాజిక విలువలతో బ్రతకండి
  • మహర్ ప్రజా ప్రతినిధుల సభలో సూరన్న

కాగజ్ నగర్,జనవరి,11,మెదక్ టుడే న్యూస్:
కాగజ్ నగర్ పట్టణంలో నిర్వహించిన
మహార్ ప్రజాప్రతినిధుల సభలో సూరన్న మాట్లాడుతూ,కలిసికట్టుగా ఉంటే రాజకీయ పదవులు అనుభవించవచ్చు. ప్రస్తుతం రాజకీయం అంటే దోపిడి దౌర్జన్యాలు అనే రీతిగా మనం చూస్తున్నాం ఇలాంటి తరుణంలో గెలిచిన మనం అభివృద్ధివైపు అడుగులువేసి రానున్న రోజుల్లో మన సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ సమాజాన్ని మార్చే సాధనంగాఉపయోగపడాలన్నారు.బోధించు, సమీకరించు, పోరాడు అని దశాబ్దాలుగా వింటున్నమాటే కానీ కేవలం బోధించడం దాని తర్వాత సమీకరించడం ఆ తర్వాత పోరాడడం మాత్రమే కాకుండా సాధించాలి అనే రీతిగా ప్రయత్నాలు చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.మన సిద్ధాంతం మన ఆలోచనలు మన ప్రవర్తన మన విలువలు ఈ సమాజంలో ప్రతిబింబించాలి అప్పుడే మన కులాన్ని ఇతర కులాలు గౌరవించే అవకాశం ఉంటుందనిఅంబేద్కర్ స్పూర్తి, అంబేద్కర్ లక్ష్యాన్ని మనం అనుసరించి భావి తరాలకు ఆదర్శంగా ఉండేలా జీవన విధానం ఉండాలన్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని వాడుకోవాలి,ప్రాథమిక హక్కుల్ని వాడుకొని మన స్వేచ్ఛను మనం వినియోగించాలి.మహర్లు ఎవరికి బానిసగా పనిచేయకుండా ఎవరికాళ్ళమీద వారు నిలబడాలి.పే బ్యాక్ టు సొసైటీ లో భాగంగా ఒకరిని ఒకరు ప్రోత్సహించి ముందుకు వెళ్ళాలి. ఎందుకు గెలిచాం.? గెలిచి ఏం చేస్తున్నాం.? దేనికోసం మనం ఉన్నాం.? మన సామాజిక వర్గాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్తున్నమా లేదా.? అనే ప్రశ్నలు రోజుకు మూడు సార్లు వేసుకుంటే మనం ఏం చెయ్యాలో మనకు తెలుస్తుంది అని చెప్పుకొచ్చారు.గెలిచిన వార్డు మెంబర్లు,గెలిచిన సర్పంచులను “మీరే రాజులు మీరే ధీరులు మీరే శూరులు ” మీరే వ్యవస్థ మార్పు కొరకు పనిచేయాలి మీ ఆలోచనలే పునాదులవ్వలి అని చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో బహుముఖ మేధావులు రాజకీయ నాయకులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ కి 20% సీట్లు కేటాయించాలి.

0

పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్‌ కు వినతిపత్రం అందజేసిన యువజన నాయకులు.

పటాన్‌చెరు, జనవరి 09:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి,రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తూ 20 శాతం సీట్లు కేటాయించాలని పటాన్‌చెరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పసుల నవీన్ ముదిరాజ్ కోరారు.శుక్రవారం పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ నివాసంలో ఆయనను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పసుల నవీన్ ముదిరాజ్ మాట్లాడుతూ.. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న యువతకు ఎన్నికల్లో తగిన గుర్తింపు లభించినప్పుడే భవిష్యత్తు నాయకత్వం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ వినతిపై కాటా శ్రీనివాస్ సానుకూలంగా స్పందిస్తూ, రానున్న ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు సీట్లు వచ్చేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అదేవిధంగా, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాటా శ్రీనివాస్ సూచించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు: మాజీ వార్డ్ మెంబర్ అమీన్పూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అశోక్,సంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నరేష్ యాదవ్, పటాన్చెరు నియోజవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పసుల నవీన్ ముదిరాజ్,యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ యాదవ్, సాయి గౌడ్,యువజన కాంగ్రెస్ నాయకులు ఉమార్,మరియు ఇతర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.

కొత్తపల్లిలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం..

0

పాపన్నపేట,జనవరి,8,మెదక్ టుడే న్యూస్:మండల పరిధి లోని కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం కంప్యూటర్ ల్యాబ్ ను గ్రామ సర్పంచ్ కుమ్మరి పద్మ జగన్ ప్రారంభించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ .. విద్యార్థులకు డిజిటల్ విద్య ను అందించేందుకు తొడ్పడుతుందన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భుజాత,ఉపసర్పంచ్ రాము,వార్డు సభ్యులు రామకృష్ణ,దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు .

బీరంగూడ గుట్టలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో 118 రోజుల హుండీ లెక్కింపు..

0

అమీన్పూర్,జనవరి,7,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా బీరంగూడ జిహెచ్ఎంసి పరిధిలోని బీరంగూడ గుట్టపై వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో 118 రోజుల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం పరిశీలకులు ఈఓ శ్రీనివాస్ సమక్షంలో చైర్మన్ సుధాకర్ యాదవ్, ఆలయ ఈవో శశిధర్ గుప్త ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హుండీ లెక్కింపులో సహకరించారు.హుండీ లెక్కింపులో మొత్తం రూ.10,04,280 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శశిధర్ గుప్త తెలిపారు. ఈ మొత్తాన్ని ఆలయ ఖాతాలో జమ చేసి, రాబోయే శివరాత్రి మరియు జాతర ఉత్సవాలకు వినియోగించనున్నట్లు తెలిపారు.చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, భక్తుల సహకారంతో పారదర్శకంగా హుండీ లెక్కింపు నిర్వహించామని చెప్పారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, ఉత్సవాల నిర్వహణకు ఈ నిధులను ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు దండు రమేష్, చంద్రశేఖర్, లక్ష్మీకాంత్ రావు, దీపక్ గౌడ్, శ్రీనివాస్ జె, ఎల్లయ్య, మహేష్, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సమ్మక్క సారక్క జాతరకు సహకరించాలని అమీన్ పూర్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన ఆలయ చైర్మన్ నీలం భిక్షపతి

0

అమీన్ పూర్,జనవరి,6,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్ పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని అమీన్పూర్ గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ సమ్మక్క-సారలమ్మ దేవాలయ గద్దెలపై ఈ ఏడాది నిర్వహించబోయే జాతరను పురస్కరించుకుని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆలయ చైర్మన్ నీలం భిక్షపతి జిహెచ్ఎంసి అధికారులను కోరారు. ఈ మేరకు మంగళవారం జి.హెచ్.ఎం.సి. అమీన్ పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నీలం బిక్షపతి మాట్లాడుతూ, గత 22 సంవత్సరాలుగా ఈ జాతరను లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఒక ఆచారంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామస్తులు గ్రామ పెద్దలు పటాన్చెరు నియోజకవర్గ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి సహకారంతోటే సమ్మక్క సారక్క జాతర ఇంత గ్రాండ్గా జరపడం జరుగుతుందని ఆయన అన్నారు.ఈ ఏడాది జాతర జనవరి 28 నుండి జనవరి 31 వరకు అత్యంత వైభవంగా జరగనుందని పేర్కొన్నారు. గతంలో మున్సిపల్ సిబ్బంది అందించిన పారిశుద్ధ్య సేవల వల్ల భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొక్కులు చెల్లించుకున్నారని గుర్తుచేశారు.ఈ ఏడాది కూడా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిహెచ్ఎంసి శాఖ తరపున పూర్తి సహకారం అందించాలని, ముఖ్యంగా శుభ్రత (పారిశుద్ధ్యం) విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. భక్తులు అసౌకర్యానికి గురికాకుండా జాతరను విజయవంతం చేయడంలో యంత్రాంగం తోడ్పడాలని కోరారు.

మెదక్ జిల్లా పరిధిలో చైనా మంజా పూర్తిగా నిషేధంఎస్ పి..

0

•నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినా, వినియోగించినా కఠిన చట్టపరమైన చర్యలు.

•కరెంట్ స్థంభాలకు దూరంగా, సురక్షితమైన మైదానాల్లోనే గాలిపటాలు ఎగురవేయాలి.

•జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు.

మెదక్,జనవరి,6,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,జిల్లా పరిధిలో చైనా మంజాను పూర్తిగా నిషేధించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తూ చైనా మంజాను విక్రయించినా, వినియోగించినా లేదా దాని వల్ల ఎవరికైనా ప్రమాదం సంభవించినట్లయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని, జిల్లా వ్యాప్తంగా సీసీఎస్ పోలీసుల, స్థానిక పోలీస్ల ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నైలాన్, సింథటిక్ దారాలతో తయారయ్యే చైనా మంజా పర్యావరణానికి తీవ్ర హాని కలిగించడంతో పాటు, ప్రజలు, వాహనదారులు, పక్షులకు ప్రాణాపాయం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.గతంలో చైనా మంజాతో గాలిపటాలు ఎగురవేసే సమయంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, కొన్నిసార్లు గాలిపటాలు ఎగురవేసే వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడిన ఘటనలు నమోదయ్యాయని తెలిపారు. ఈ కారణాల దృష్ట్యానే చైనా మంజాపై సంపూర్ణ నిషేధం విధించబడిందని జిల్లా ఎస్పీ వివరించారు.చైనా మంజా విక్రయాలు, వినియోగంపై పర్యావరణ పరిరక్షణ చట్టం–1986 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలో ఎక్కడా చైనా మంజా విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజలు చైనా మంజాను ఉపయోగించకుండా, ఎవరికీ హాని కలగని సాధారణ దారాలతో గాలిపటాలు ఎగురవేయాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.గాలిపటాలు ఎగురవేసే వారు తప్పనిసరిగా కరెంట్ స్థంభాలకు దూరంగా, మైదానాలు వంటి సురక్షితమైన ప్రదేశాల్లోనే గాలిపటాలు ఎగురవేయాలని సూచించారు. అలాగే బిల్డింగులపై నుంచి గాలిపటాలు ఎగురవేసే వారు తగిన భద్రతా చర్యలు పాటించి అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.ఎవరైనా చైనా మంజా విక్రయాలు లేదా వినియోగం గమనించినట్లయితే వెంటనే డయల్–100కు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు.

తండ్రిని హత్య చేసిన కొడుకు…

0

పాపన్నపేట,జనవరి,6,మెదక్ టుడే న్యూస్:తండ్రిని ఓ కొడుకు హత్య చేసిన సంఘటన మండల పరిధిలోని సీతానగర్ గ్రామంలో చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.గ్రామానికి చెందిన లంగాడి లక్ష్మయ్య(48) వ్యవసాయంతో పాటు ఓ లైన్ మెన్ వద్ద విద్యుత్ పనుల కోసం ప్రైవేటు సహాయకుడిగా పని చేస్తున్నాడు.ఇతనికి భార్య శేఖమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.పెద్ద కొడుకు శ్రీకాంత్ వివాహానికి, వ్యవసాయానికి కొంత అప్పులు అయ్యాయి.పెద్ద కొడుకు శ్రీకాంత్ కు,లక్ష్మయ్యకు తరచూ డబ్బుల కోసం గొడవ జరిగేది.డబ్బులు ఇవ్వకపోతే చంపుతా అంటూ తరచూ శ్రీకాంత్ తండ్రిని బెదిరించేవాడు.సోమవారం రాత్రి లక్ష్మయ్య ఇంటికి రాగానే శ్రీకాంత్ మళ్లీ డబ్బులు అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.శ్రీకాంత్ ఆవేశంలో ముందుగా సుత్తేతో తండ్రిపై దాడి చేయగా తల్లి శేఖమ్మ అతని వద్ద నుంచి సుత్తిని లాక్కోవడంతో శ్రీకాంత్ మళ్లీ అక్కడే ఉన్న కర్రతో లక్ష్మయ్య తలపై దాడి చేయడంతో తీవ్ర గాయమైంది.వెంటనే కుటుంబీకులు మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు.తన భర్త మృతికి కారణమైన కొడుకు శ్రీకాంత్ పై చర్యలు తీసుకోవాలని లక్ష్మయ్య భార్య శేఖమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

పోచారం మల్లన్న జాతరలో కార్పొరేటర్ మెట్టు కుమార్,బి ఆర్ ఎస్ నాయకుడు మాణిక్ యాదవ్.

0

పటాన్‌చెరు,జనవరి,5,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.పటాన్‌చెరు నియోజవర్గం పరిధిలోని ముత్తంగి డివిజన్ పోచారం గ్రామంలో వెలిసిన మల్లన్న స్వామి జాతర మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఆలయానికి చేరుకున్న వారికి గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు.పూజా కార్యక్రమాల అనంతరం జాతర ప్రాంగణమంతా కలియతిరుగుతూ భక్తులతో కలిసి మెట్టు కుమార్, మాణిక్ యాదవ్ సందడి చేశారు. గ్రామ ప్రజలతో స్నేహపూర్వకంగా ముచ్చటించి, వారి యోగక్షేమాలను, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాతరను ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఈ సందర్భంగా వారు అభినందించారు.భక్తులకు జాతర శుభాకాంక్షలు తెలుపుతూ.. మల్లన్న స్వామి కృపాకటాక్షాలతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీశైలం యాదవ్, పోచారం మాజీ సర్పంచ్, జగన్, పోచారం మాజీ సర్పంచ్ బిక్షపతి,స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

లింగాయపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్ – రూ.26,183 నగదు స్వాధీనం•జిల్లా ఎస్ పి.శ్రీనివాసరావు.

0

•జిల్లా ఎస్ పి శ్రీనివాస రావు.

పాపన్నపేట,జనవరి,5,మెదక్ టుడే న్యూస్:మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లింగాయపల్లి గ్రామంలోపేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు, జిల్లా ఎస్ పి శ్రీనివాస రావు,ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, పాపన్నపేట పోలీస్ సిబ్బంది కలిసి జూదంపై ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈదాడిలో ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది:దాదిగారి కృష్ణగౌడ్, పుట్టి బాగయ్య, వగ్గు యాదయ్య, మెగావత్ కిషన్, నీరుడి లక్ష్మణ్.అదేవిధంగా పేకాటలో పాల్గొని పరారైన వ్యక్తులు:గుండమ్మ సాయిలు,పుట్టి బండాల సత్యనారాయణ,బెస్త వెంకటేశం,బుద్ధి సాయమ్మ,కర్రె సాయమ్మ సాయిలు,కోలా ధన్సింగ్.జూదం ఆడుతున్న ప్రదేశం నుండి మొత్తం రూ.26,183/- నగదును స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన నిందితులను సంబంధిత పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారి పై చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు. పరారైన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.ఈసందర్భంగా జిల్లా ఎస్ పి శ్రీడి.వి.శ్రీనివాసరావు,మాట్లాడుతూ,జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.పేకాట,బెట్టింగ్ వంటి కార్యకలాపాల వలన ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయని, ముఖ్యంగాయువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో చెడు మార్గాలను ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు. కష్టపడానీదే ఏదీ ఊరికే రాదని, ప్రజలు కూడా ఇలాంటి సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించి సహకరించాలని జిల్లా ఎస్ పి సూచించారు.

అభివృద్ధి అడ్డుకునేలా బిఆర్ఎస్ నాయకుల తీరు – తెల్లాపూర్ కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం.

0

బిఆర్ఎస్ “డ్రామా” దీక్షలను ఎండగట్టిన కాంగ్రెస్ నేతలు

రామచంద్రపురం,జనవరి,5(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి(ఎం.ఐ.జి విద్యుత్) ట్యాంక్ సెంటర్‌లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, బిఆర్ఎస్ నాయకుల తీరును ఎండగట్టారు.రాజకీయ లబ్ధి కోసమే దీక్షలు:బిఆర్ఎస్ నాయకులు ఎం.ఐ.జి విద్యుత్ నగర్‌ను భారతీ నగర్ డివిజన్‌లో కలిపేందుకు వ్యతిరేకంగా, దానిని తెల్లాపూర్‌లోనే కొనసాగించాలనే డిమాండ్‌తో చేస్తున్న దీక్షలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని కాంగ్రెస్ పార్టీ విమర్శించారు. తొలుత ఈ పోరాటం పార్టీలకు అతీతంగా జరుగుతుందని తాము భావించామని, కాలనీ ప్రయోజనాల దృష్ట్యా తాము దీనిపై ఎలాంటి విమర్శలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.నిరాధారమైన ఆరోపణలు – స్థానిక నేతల అసహనం:గత మూడు రోజులుగా దీక్షల పేరుతో బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై మరియు స్థానిక నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి సహకరించాల్సింది పోయి, కేవలం కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం:
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని, కాలనీ వాసుల సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే, సమస్యను రాజకీయీకరించి లబ్ధి పొందాలని చూస్తే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ సమావేశంలో ఇతర ముఖ్య నాయకులు కూడా పాల్గొని, బిఆర్ఎస్ నాయకుల వైఖరిని ఖండించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి, తెల్లాపూర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లెలిజాల రవీందర్ , డీసీసీ వైస్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ గౌడ్, మరియు విద్యుత్ నగర్ ప్రెసిడెంట్ అజీమ్, విద్యుత్ నగర్ ఎం. ఐ.జి. ఫేజ్-2 మాజీ అధ్యక్షులు, డైరెక్టర్లు, కాలనీ నివాసితులు మరియు భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.ఉప్పరపల్లి సుధాకర్ రెడ్డి,మాధవ్ రెడ్డి,తూర్పు శ్రీను,మహమ్మద్ వాజీద్ అహ్మద్,బాబు గౌడ్,దిలీప్ రాయ్,ఎల్లయ్య,మురళి బోరెడ,మహమ్మద్ అక్రమ్,ఆశీర్వాదం,జీవన్,ప్రవీణ్ కుమార్,శ్రీమతి రోహిణి గౌడ్,సలీం షేక్,అరవింద్, ఆనంద్, ప్రవీణ్,నరేందర్ రెడ్డి,అరుణ్ రెడ్డి ,యువజన నాయకులు జావేద్,మహేష్ బిట్టా, పాల్గొన్నారు..