పాపన్నపేట,జనవరి,30,మెదక్ టుడే న్యూస్:సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరం లాంటిదని పాపన్నపేట కాంగ్రెస్ నాయకులు నరేందర్ గౌడ్ అన్నారు. మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు శుక్రవారం పాపన్నపేట గ్రామానికి చెందిన బెస్త శివయ్య,సుంకరి అశోక్ లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,గ్రామాల్లో పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి పథకం ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. నాయకులు ఖలీమ్,కిష్టయ్య,సంగమేశ్వర్, సత్యగౌడ్ తదితరులు ఉన్నారు.
ఏడుపాయల ఈవోగా ఎం వీరేశం..
పాపన్నపేట, జనవరి 28 న్యూస్:మెదక్ జిల్లా లోని ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయ ఈవోగా ఎం. వీరేశం ను నియమిస్తూ దేవాదాయ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఆయన ఏడుపాయల కార్యాలయంలో ఈవో గా బాధ్యతలను స్వీకరించారు. ఇది వరకు ఆయన రంగారెడ్డి జిల్లా, కుషాయిగూడ లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయ బాధ్యతలను నిర్వహించారు.

ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి….
పాపన్నపేట,జనవరి,28,మెదక్ టుడే న్యూస్: ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధి ఎంకేపల్లి గ్రామ శివారులోని మంజీరా నదిలో బుధవారం చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.సంగారెడ్డి జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన అన్నాసాగర్ లక్ష్మయ్య(85) వ్యవసాయం జీవిస్తున్నాడు.ఈనెల 13న ఇంట్లో నుంచి పొలం వద్దకు తిరిగి ఇంటికి రాలేదు.గ్రామ శివారులో మంజీరా నది వద్దకు కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ నదిలో కొట్టుకుపోయాడు.రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోయేసరికి కుటుంబీకులు చుట్టూ పక్కల వెతికారు.ఆచూకీ లభించక పోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో బుధవారం మండల పరిధి లోని ఎంకేపల్లి గ్రామ శివారులో మంజీరా నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్థానికులకు కనిపించగా పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కుటుంబీకులకు సమాచారం అందించారు.ఆనవాళ్లను బట్టి మృతి చెందింది లక్ష్మయ్యగా నిర్ధారించారు.పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించి మృతుడి కొడుకు బేతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
మానవత్వం చాటుకున్న మెదక్ అదనపు ఎస్ పి మహేందర్..
•క్షతగాత్రులను స్వయంగా అంబులెన్సులో ఎక్కించిన అదనపు ఎస్పీ,
మెదక్,జనవరి,28,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి అక్కన్నపేట గ్రామ శివారులోని అక్కన్నపేట ఫారెస్ట్ పార్క్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్వాపూర్ గ్రామం నుంచి పాతూర్ సంతకు వెళ్తున్న ఆటో అదుపు తప్పి ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న తీవ్రతకు వాహనం పూర్తిగా ధ్వంసమై, ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అదే వాహనంలో ఉన్న మరికొందరు తీవ్రంగా గాయపడగా, ప్రమాదంతో రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.
ఇదే సమయంలో రామాయంపేట వైపు వెళ్తున్న మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ గారు ప్రమాదాన్ని గమనించి వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సహాయపడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఆయన తన గన్‌మన్ ప్రశాంత్, డ్రైవర్ గోవర్ధన్, మరియు కాట్రాయల్ సర్పంచ్, సహాయంతో గాయపడిన వారిని స్వయంగా అంబులెన్సులో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడే ఉండి ట్రాఫిక్ నియంత్రణ చేపట్టి వాహనాల రాకపోకలను సజావుగా నిర్వహించారు.అదనపు ఎస్పీ చూపిన మానవత్వం, సేవాభావం అక్కడున్న ప్రజలను ఆకట్టుకుంది. విధి నిర్వహణకే పరిమితం కాకుండా, ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలవడం పోలీస్ శాఖ సేవాతత్వానికి నిదర్శనంగా నిలిచింది

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద బందోబస్తును పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ మహేందర్..
మెదక్,జనవరి,28,మెదక్ టుడే న్యూస్,ప్రతినిధి, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద బందోబస్తును పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ మహేందర్.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా మెదక్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్ద బందోబస్తును జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించారు.ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. నామినేషన్ కేంద్రానికి అభ్యర్థితో పాటు ఒకరు లేదా ఇద్దరు ప్రతిపాదకులు (Proposers) మాత్రమే అనుమతించబడతారని తెలిపారు. అభ్యర్థులు మరియు వారి అనుచరులు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించారు.ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలను దూరంగా పార్క్ చేయాలని, గుంపులుగా రావడం, నినాదాలు చేయడం,ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ, మెటల్ డిటెక్టర్లు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ వంటి భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.జిల్లాలో శాంతియుత, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ పూర్తిగా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్,ఎస్ఐలు లింగం, విఠల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతర జరగాలిజిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..
మెదక్,జనవరి,28,మెదక్ టుడే న్యూస్:ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతర జరగాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..పవిత్ర ఏడుపాయల వరదుర్గా మాత జాతర ఎల్లలు దాటేలా ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, నర్సాపూర్ ఆర్డీవో మైపాల్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. పవిత్ర ఏడుపాయల వనదుర్గా మాత జాతరను ఘనంగా నిర్వహించాలని, జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, పార్కింగ్, విద్యుత్ ,తాగునీరు బార్కెట్స్ లను ఏర్పాటు చేయాలన్నారు.జాతర పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, మరుగుదొడ్లు, చిత్త సేకరణ, బ్లీచింగ్ పౌడర్ , దోమల నివారణకు ఫాగు లాంటివి ఎప్పటికప్పుడు నిర్వహించాలన్నారు.వివిధ సైన్ బోర్డులు, అంబులెన్స్, మందులు, అంటూ వ్యాధులు రాకుండా చర్యలు, కోవిడ్ 19 కు ముందస్తు చర్యలుచేపట్టాలన్నారు.రవాణా,బస్సులు, వాహనాలు,గజ ఈతగాళ్లు, అన్ని చోట్ల సీసీ కెమెరాలు, పోలీస్ కంట్రోల్ రూమ్, వివిధ స్టాల్స్, పకడ్బందీగా దర్శనానికి క్యూలైన్ ఏర్పాటు, అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక యంత్రాలు, స్వయం సహాయక మహిళల ఉత్పత్తుల కోసం ప్రత్యేక స్టాల్స్ లను ఏర్పాటు చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.జాతరలో ఏ వస్తువులైన ఎక్కువ ధరలకు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని, జాతరలో అమ్మే తినుబండారాలలో ఎలాంటి రంగులు కలపకుండా చూడాలని, జాతరలో 18 సంవత్సరాల వయస్సు నిండని వారికి ఎలాంటిమత్తుపదార్థాలువిక్రయించరాదన్నారు.అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జాతరను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.అధికారులు క్షేత్రస్థాయిలో ఏడుపాయలకు వెళ్లిశనివారం వరకు జాతరకు సంబంధించి యాక్షన్ ప్లాన్ తయారుచేసి ఇవ్వాలన్నారు.ఈకార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదవశాత్తూ నీట మునిగి ఒకరు మృతి…
పాపన్నపేట,జనవరి,24,మెదక్ టుడే న్యూస్: ప్రమాదవశాత్తూ నీట మునిగి ఒకరు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చీకోడ్ గ్రామంలో చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం…గ్రామానికి చెందిన బోయిని సత్యనారాయణ(43) బతుకు దెరువు కోసం కుటుంబంతో కలసి హైదరాబాద్ లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు.కాగా మూడు రోజుల క్రితం కుమార్తె సీమంతం కోసం గ్రామానికి వచ్చారు.శుక్రవారం మధ్యాహ్నం సమయంలో సత్యనారాయణ కాలకృత్యాల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోయేసరికి కుటుంబీకులు చుట్టూ పక్కల వెతికారు.గ్రామ శివారులోని చెరువు వద్ద సత్యనారాయణ చెప్పులు కనిపించగా అనుమానంతో చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది.మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి జన్మదిన వేడుకలు ఘనంగాజరిగాయి..
మెదక్,జనవరి,15,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,మున్నూరు కాపు ముద్దు బిడ్డ, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ బట్టి జగపతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం వారి స్వగృహం నందు మెదక్ పట్టణ మున్నూరు కాపు సంఘ సభ్యులు కేక్ కట్ చేయించి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కొంగోటి గట్టేష్ మాట్లాడుతూ జగపతి అన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు.ఈకార్యక్రమం లో మున్నూరు కాపు పట్టణ నాయకులు ఆకారం యాదగిరి, కుల్ల నర్సింలు, నింగమైల మల్లేశం, కొంగోటి యాదగిరి, కొంగోటి మల్లేశం, భూషణం , సంగాయిపేట నర్సింలు, ఆకుల బిక్షపతి, సింగంశెట్టి తిరుపతి, అశోక్, కొంగోటి శ్రీనివాస్, గందె అనిల్, దశరథం, మోహన్, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రమాదాలను నివారించాలి
•శిరోధారం… ప్రాణ దారం
మెదక్ డీఎస్ పి ప్రసన్న కుమార్
పాపన్న పేట,జనవరి,13,మెదక్ టుడే న్యూస్:రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలనిమెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “అర్రేవ్ అ లీవ్” కార్యక్రమం ద్వారా ప్రజలకు రోడ్డు భద్రత, నియమాలు, నిబంధనల పై నేటి నుండి పది రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలన్న తలంపుతో చేపట్టిన వారోత్సవాల్లో బాగంగా మెదక్ ఎస్పీ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు మంగళవారం మండల కేంద్రమైన పాపన్న పేట గ్రామ పంచాయతీ వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలకు రక్షణ కవచంల ఉంటుందని అందువల్ల ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ తోపాటు సీటు బెల్టు ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం,అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం,హెల్మెట్,సీటుబెల్టుఉపయోగించకపోవడంవల్లజరుగుతున్నాయన్నారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని ప్రతి వాహనదారుడుప్రతిపౌరుడుబాధ్యతగావ్యవహరించినప్పుడే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చునని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు రాంగ్ రూట్లో నడపకూడదని తెలియజేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్లను ఉప యోగించొద్దని, సెల్ ఫోన్ లోఇతరులతో మాట్లాడకుండా డ్రైవింగ్ చేయాలని సూచించారు. చలికాలంలో మంచు కారణంగా ఓవర్‌టేక్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పావని నరేందర్ గౌడ్, మెదక్ రూరల్ సీఐ జార్జ్, పాపన్న పేట ,ఉప సర్పంచ్ సద్దాం హుసేన్, మాజీ ఉప సర్పంచ్ ఖళీం,వార్డు సభ్యులు, పోలీసు సిబ్బంది, వాహన చోదకులు, ప్రజలు పాల్గొన్నారు.

ఫ్లెక్సీలు: మా నాయకుడు మహిపాల్ రెడ్డి ఫోటోపై విమర్శలు చేస్తే సహించం: కోటే హరీష్ ధ్వజం
•తెల్లాపూర్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో బరిలో ఉంటానని కోటే హరీష్..
రామచంద్రపురం జనవరి,13,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి,సంక్రాంతి శుభాకాంక్షల ఫ్లెక్సీలలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఫోటోను ఉపయోగించడంపై అనవసర రాద్ధాంతం చేస్తున్న వారికి బీఆర్ఎస్ యువజన విభాగం పటాన్‌చెరు.నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కోటే హరీష్ ఘాటుగాసమాధానమిచ్చారు. మంగళవారం తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఫోటో వినియోగంపై స్పష్టత:ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ బిడ్డ. ఆయన ఈ పార్టీ గుర్తుపైనే ప్రజల మద్దతుతో గెలిచారు. సాంకేతిక కారణాల వల్ల లేదా వ్యక్తిగత కారణాల వల్ల కొద్దిరోజులు పార్టీకి దూరంగా ఉన్నంత మాత్రాన ఆయనకు, పార్టీకి ఉన్న బంధం తెగిపోదు. మా నాయకుడి ఫోటోను మా ఫ్లెక్సీలలో వేసుకునే పూర్తి హక్కు మాకు ఉంది. దీనిపైవిమర్శలుచేయడంచూస్తుంటే,వారిఅజ్ఞానంబయటపడుతోంది”అని హరీష్ విమర్శించారు.పార్టీ అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని, ఎమ్మెల్యే నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి తాము నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే ప్రతి పార్టీ కార్యక్రమంలోనూ ఎమ్మెల్యే ఫోటోను గర్వంగా వాడుకుంటామని స్పష్టం చేశారు.వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాను పోటీకి సిద్ధంగా ఉన్నట్లు హరీష్ ప్రకటించారు.”బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తున్నారు.తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధిలో పార్టీ బలోపేతానికి నేను నిరంతరం ప్రజల్లో ఉంటున్నాను. అధిష్టానం ఆశీస్సులు ఉంటే తప్పకుండా పోటీ చేసి తెల్లాపూర్‌లోగులాబీజెండానురెపరెపలాడిస్తాను”అనిధీమావ్యక్తంచేశారు.నియోజకవర్గ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ విభాగం సభ్యులు సురేష్, అభినవ్, జాఫర్, అరవింద్, శ్రీపల్, సాకేత్ మరియు ఇతర ముఖ్య నాయకులు కె.హెచ్. వై. యువసేన సభ్యులు పాల్గొన్నారు.










