మెదక్ జిల్లా రామాయంపేట జనవరి 30 మెదక్ టుడే న్యూస్: ప్రతినిధి:నామినేషన్ దరఖాస్తుల్లో తప్పులు లేకుండా నింపాలని, నామినేషన్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ జరగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్అధికారులకుసూచించారు.రామాయంపేట మున్సిపాలిటీకి ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియను శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో సాధారణ పరిశీలకులు రవి కిరణ్ గారితో కలిసి పరిశీలించారు.నామినేషన్ పత్రాలను, వివిధ రిజిస్టర్లను పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి పలు సలహాలు సూచనలు అందించారు.ఎన్ని వార్డు ఉన్నాయీ? ఎన్ని నామినేషన్ వచ్చాయని ? సాధారణ పరిశీలకులు ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. తప్పులు లేకుండా నామినేషన్ ప్రక్రియ జరగాలని,నామినేషన్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలని,మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఎన్నికల సంఘం నియమానిబంధనను తూచా తప్పకుండా అనుసరించి నామినేషన్ ప్రక్రియ కొనసాగాలన్నారు. నామినేషన్ పత్రాలతో పాటు జతచేసే జిరాక్స్లను సరిచూసి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో మైపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, తదితరులు ఉన్నారు.
మెదక్ జిల్లా నిజాంపేట మండలం జనవరి 30 మెదక్ టుడే న్యూస్, ప్రతినిధి:నిజాంపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో 10వ తరగతి ప్రత్యేక తరగతులను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.వార్షిక పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచే లక్ష్యంతో, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, వారికి అదనపు తరగతులు నిర్వహించలని తెలిపారు.ప్రత్యేక తరగతుల నిర్వహణ వల్ల నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు.అనంతరం కలెక్టర్ ఉపాధ్యాయుల బోధన శైలిని పరిశీలిస్తూ విద్యార్థుల సామర్ధ్యాలను పరీక్షించారు.గణితం, సైన్స్, ఇంగ్లీష్ వంటి ముఖ్యమైన సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు పెట్టాలని ఆదేశించడం జరిగిందని అన్నారు.ప్రతి విద్యార్థి మంచి మార్కులు సాధించేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు , విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి.
మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి..
మెదక్ జనవరి 30 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి:మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పట్టణంలోని పలు వార్డులకు చెందిన కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ లో చేరారు. ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హస్తకాల బాలరాజు వార్డ్ నెంబర్ 10 నుండి కాంగ్రెస్ నాయకులు చింతల శ్రీను, కిషన్, మంద శేఖర్ తో పాటు 20 మంది కార్యకర్తలు,మహిళలు కూడ అలాగే వార్డు నెం 27 నుండి పల్లె రాణి బాలరాజ్ లంతోపాటు 20 మంది కార్యకర్తలు, వార్డ్ నెంబర్ 31 ఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వరాల. రాములు, రణధీర్ , కంచర్ల శ్రీధర్, యాదగిరి, నరేష్ మంగలి మహేష్, ఆకుల రాహుల్ పాటు 30 మంది కార్యకర్తలు పద్మ దేవేందర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.వీరికి పద్మ దేవేందర్ రెడ్డి, మెదక్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్,మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ గులాభి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ..బిఆర్ఎస్ లో చేరిన వారిని అభినందించి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు తప్ప ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు. రానున్న కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రావాలని, మళ్లీ కేసిఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పార్టీలో యువకుల చేరికతో భవిష్యత్ రాజకీయాలకు శుభ పరిమాణమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల. మల్లికార్జున్ గౌడ్,పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ.ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ ఆర్కే.శ్రీనివాస్, నాయకులు లింగా రెడ్డి,కండేల. నర్సింలు,కసాపురం మధు, శ్రీనివాస్ గౌడ్, కృష్ణ, కిరణ్,రవి భువన్,చంద్ పాషా తదితరులు ఉన్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట జనవరి 30 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి
మున్సిపల్ ఎన్నికల వేళ హస్తం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ..
కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి హరీష్ రావు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం: మాజీ మంత్రి హరీష్ రావు
ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై ఎగిరేది గులాబీ జెండానే
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సి. సుప్రభాత్ రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి, బీఆర్ఎస్ లో చేరారు.సుప్రభాత్ రావు గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్ ఎస్ యు ఐ నుంచి పీసీసీ సెక్రటరీ వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు నివాసంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది.మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి,మెదక్ సీనియర్ నాయకులు కంఠరెడ్డి.తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సుప్రభాత్ రావు తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరారు. వారికి హరీష్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లోనే కాదు, ఆ పార్టీ సొంత నాయకుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు.రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చేతులెత్తేశారని విమర్శించారు.అందుకే అభివృద్ధిని కాంక్షించే కరుడుగట్టిన కాంగ్రెస్ వాది సుప్రభాత్ రావు లాంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరుతన్నారు పేర్కొన్నారు.రామాయంపేటలో సుప్రభాత్ రావు చేరికతో పార్టీ మరింత బలోపేతం అయ్యిందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రామాయంపేటలో ఎగిరేది గులాబీ జెండానే అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని వచ్చిన వారికి సముచిత స్థానం, గౌరవం ఉంటాయని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.కేసీఆర్ హయాంలో పట్టణ ప్రగతి తో మన పట్టణాలు, మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు.పచ్చదనం, పరిశుభ్రత, మెరుగైన సౌకర్యాలతో కళకళలాడిన పట్టణాలు.. నేడు కాంగ్రెస్ పాలనలో నిధులు లేక, నిర్వహణ లేక పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వచ్చాక ప్రగతి పూర్తిగా పడకేసిందని, మళ్ళీ మంచినీటి సమస్యలు, పారిశుధ్య సమస్యలు మొదలయ్యాయని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని హరీష్ రావు అన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరిట రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేశారు ఉన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, ఉమ్మడి మెదక్ జిల్లాలో జరగబోయే అన్ని మున్సిపాలిటీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయబోయేది, విజయ ఢంకా మోగించేది బీఆర్ఎస్ పార్టీనే అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, వైఫల్యాలను గడప గడపకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సుప్రభాత్ రావు గారి రాకతో రామాయంపేటలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారిందని, కార్యకర్తలంతా ఐకమత్యంతో పనిచేసి మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కేసీఆర్ కి కానుకగా ఇవ్వాలని కోరారు.పార్టీని నమ్ముకుని వచ్చిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి బీఆర్ఎస్ కుటుంబం అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని హరీష్ రావు గారు భరోసా ఇచ్చారు. సుప్రభాత్ రావు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు, నాయకులకు సరైన గుర్తింపు లేదని, కేవలం గ్రూపు రాజకీయాలకే పరిమితమైందని సుప్రభాత్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.మెదక్ జిల్లా అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యమని, కేసీఆర్ గారు,హరీష్ రావు గారి నాయకత్వంపై నమ్మకంతోనే తాను బీఆర్ఎస్ లో చేరానని స్పష్టం చేశారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రామాయంపేటలో గులాబీ జెండా ఎగురవేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మెదక్ జనవరి 30 మెదక్ టు డే న్యూస్: మెదక్ ప్రతినిధి:
తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం రోజు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బందోబస్తును జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా మరియు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని అవసరమైన భద్రతా చర్యలను చేపట్టిందని తెలిపారు.ఈ ఎన్నికలలో మొత్తం 92 మంది ఓటర్లు (మెదక్, నర్సాపూర్, అల్లదుర్గ్ ) చెందిన వారు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు కోర్టు పరిసరాల్లో తగిన బందోబస్తు ఏర్పాటు చేయబడిందని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అదనపు ఎస్పీ పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గ్రామ పాలకవర్గం
చేగుంట, జనవరి, 30, మెదక్ టుడే న్యూస్,చేగుంట మండలo వడియారం గ్రామంలో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించిన ఉప సర్పంచ్ బండారి నాగరాజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంకన్న గారి వెంకట గౌడ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ వల్లనే మనకు స్వాతంత్రం వచ్చిందని అహింసా మార్గం ద్వారా తెచ్చాడని స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు కూడా చేశారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంకన్న గారి వెంకట గౌడ్, ఉపసర్పంచ్ బండారి నాగరాజు వార్డ్ మెంబర్లు గయా సుద్దీన్, శ్రావణ్ కుమార్, అనిల్ కుమార్, జనార్దన్ గౌడ్, గ్రామ ప్రజలు మామిండ్ల నరేష్ , డప్పు మహేష్, రాజు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
చేగుంట జనవరి 30 మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని 14 వ వార్డులో గత 15 సంవత్సరాలుగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నాయి ,రోడ్లు చూడటానికి కనీసం నడవడానికి కూడా సరిగా లేక ప్రజలు చాలా రోజులగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎన్నోసార్లు అధికారులకు చెప్పుకున్న పట్టించుకోలేదు. ఇప్పుడు నూతన పాలకవర్గంలో సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, వార్డు సభ్యుడు ఆకుల సుఖేందర్ కలిసి రోడ్లును మొరంతో బాగు చేసి ప్రజలకే గాక వెహికల్స్ పోవడానికి రోడ్లన్నీ బాగు చేయడం జరిగింది.అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్ మహ్మద్ రఫీ,వార్డు సభ్యులు ఉదయ్ రాజు,సాయిబాబా, గ్రామస్తులు కట్ట శ్రీనివాస్, శశి కుమార్, తలారి లింగం, నాగేష్ సేటు, సురేందర్ ,సతీష్ శివ కుమార్ సార్, గణేష్ సార్ ,యాదగిరి ,రామకృష్ణ సార్,కిషన్ సార్, లక్ష్మణ్ సార్, రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.
మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ.
చేగుంట, జనవరి, 30, మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చౌరస్తాలో పూలమాల వేసి నివాళులర్పించిన ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీక్, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ వల్లనే మనకు స్వాతంత్రం వచ్చిందని అహింసా మార్గం ద్వారా తెచ్చాడని స్వతంత్రం కోసం ఎన్నో త్యాగాలు కూడా చేశారని వారు అన్నారు.ఉపాధి హామీ పథకం పై గాంధీ పేరు మార్పిడిపై ప్రధానమంత్రి ఒకసారి పునరాలోచించాలని గాంధీ అంటే గుండె చప్పుడు అని కరెన్సీ పై కూడా మనం మహాత్మా గాంధీ ఫోటోనే కనపడుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సండ్రు గు సతీష్, చేగుంట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్,ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, వార్డు మెంబర్లు ఆకుల సుఖేందర్, బక్క సాయి బాబా,హమాలీ సంఘం అధ్యక్షులు సోమ వెంకటేష్, కర్రె పోశెట్టి, తలారి లింగం, మహమ్మద్ రహీముద్దీన్,కట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటి 14 వ వార్డు,15 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థులు
మెదక్ టౌన్ జనవరి 30 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి,మెదక్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ 14 వ వార్డు అభ్యర్థిగా దొంతి లక్ష్మి 15వ వార్డు అభ్యర్థి దొంతి నరేష్ గౌడ్ నామినేషన్ వేశారు అనంతరం వారుమాట్లాడుతూ పట్టణంలోని 14వ వార్డు 15వ వార్డు ఓటర్ మహాశయులందరికి దొంతి లక్ష్మి రెండవసారి 14వ వార్డు కౌన్సిల్గా గెలుపొందారు మళ్ళీ మూడవ సరి మీ ముందుకు వస్తున్నాను వార్డు ఓటర్ మహాశయులకు నన్ను రెండు పర్యాయాలు గెలుపొందించి మూడవసారి కూడా తన అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించగలరని దొంతి లక్ష్మి 14 వ వార్డు ఓటర్లను కోరారు 15వ వార్డు అభ్యర్థి దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సహకారంతో కౌన్సిలర్ గా పోటీ చేస్తూ మీ ముందుకి వస్తున్నాము అని తెలిపారు. మెదక్ పట్టణంలో 15వ గతంలో కౌన్సిలర్ గా పని చేసిన వారు అభివృద్ధిలో వెనుకబడ్డారు అని అన్నారు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అవకాశం ఇవ్వండి అని కోరారు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో ఎమ్మెల్యే నుంచి వచ్చే నిధులు 14వ వార్డ్ 15వ వార్డు లలో ప్రతి పైసా జవాబుదారితనముగా ఉపయోగిస్తాము అని తెలిపారు. ఉన్న ప్రతి సమస్యను తీర్చడంలో ముందుంటాము అని తెలిపారు. ఉన్న ఓటరు మహాశయులకు విన్నవించేది ఒక్కసారి ఆలోచించండి, మీరు వేసే ఓటు ప్రగతికి బాటగా నిలుస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పట్టణాలు పల్లెలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి మన పట్టణాన్ని కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేద్దాం. కాంగ్రెస్ పార్టీ పట్టణాలను వేగంగా అభివృద్ధి చేస్తుంది మన మెదక్ పట్టణం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ కి మీ ఓటు వేయండి అభివృద్ధిలో భాగస్వాములు కండి ఉన్న ప్రతి సమస్యను తీర్చడంలో మీ ముందుంటాము. పారిశుద్ధ సమస్య, నీటి సమస్య మౌలిక వసతులు కరెంటు సమస్య గృహము లేని వారికి గృహాలు అందివ్వడం, నిస్వార్ధంగా పనిచేసే వారికి పట్టం కట్టండి ప్రజాసేవకి అంకితం అవుతామని అన్నారు ఒకసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధిని చేసి చూపిస్తాముఅని కాంగ్రెస్ అభ్యర్థులు దొంతి లక్ష్మి, దొంతి నరేష్ గౌడ్ ఓటర్లను కోరారు
పాపన్నపేట,జనవరి,30,మెదక్ టుడే న్యూస్:సీఎం కప్ పోటీల్లో భాగంగా పాపన్నపేట మండల స్థాయిలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో మహిళా విభాగం లో పాపన్నపేట, పురుష విభాగం లో యూసుఫ్ పేట విజేతలుగా నిలిచారు. క్రీడాకారులకు ఎంపీడీవో విష్ణువర్ధన్,తహసీల్దార్ సతీష్ కుమార్,పాపన్నపేట సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ చేతుల మీదుగా వారికీ బహుమతులుప్రధానంచేశారు.ఈసందర్బంగా గ్రామ ఉపసర్పంచ్ సద్దామ్ హుస్సేన్,మాజీ ఉప సర్పంచ్ ఎండి ఖలీమ్ మియా,పీడీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.