📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 43

పి జె ఆర్ ఎన్‌క్లేవ్ దీక్షకు మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల సంఘీభావం..

0

మాజీ కౌన్సిలర్ మహాదేవ రెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష

50 వేల జనాభా ఉన్న ప్రాంతానికి డివిజన్ ఇవ్వాలి – మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ డిమాండ్.

అమీన్‌పూర్,జనవరి,31,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ పరిధిలోని పి జె ఆర్ ఎన్‌క్లేవ్‌ను ప్రత్యేక జిహెచ్ఎంసి డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ చేపట్టిన నిరాహార దీక్షకు రాజకీయ మద్దతు లభించింది. శనివారం జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ హాజరై తమ పూర్తి మద్దతును ప్రకటించారు. పి జె ఆర్ ఎన్‌క్లేవ్ నివాసితులు చేస్తున్న పోరాటం న్యాయమైనదని, దీనికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని తుమ్మల పాండురంగ రెడ్డి మరియు నందారం నరసింహ గౌడ్ తెలిపారు.హైదరాబాద్ సిటీలోని ఇతర ప్రాంతాల్లో 18 వేల నుండి 20 వేల జనాభా ఉన్న చోట కూడా కొత్త డివిజన్లు ఏర్పాటు చేశారని, మరి 50 వేల జనాభా ఉన్న పి జె ఆర్ ఎన్‌క్లేవ్‌ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ప్రశ్నించారు.అమీన్‌పూర్ పరిధిలో సుమారు లక్షా పదిహేను వేల (1.20 లక్షలు) పైగా ఓటింగ్ ఉన్నందున, ప్రజల సౌకర్యార్థం అమీన్‌పూర్‌లో మరో రెండు డివిజన్లను పెంచి మొత్తం నాలుగు డివిజన్లు చేయాలని డిమాండ్ చేశారు.పెరుగుతున్న జనాభా మరియు ఓటర్ల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానంద్, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మాజీ కౌన్సిలర్స్ కృష్ణ, ఉపేందర్ రెడ్డి, స్థానిక మాజీ కౌన్సిలర్ కొత్తపల్లి మహాదేవరెడ్డి, పి జె ఆర్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, వేదిరి, అన్ని కాలనీలా వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ముగిసిన అమీన్‌పూర్ ‘మినీ మేడారం’ జాతర: ఘనంగా అమ్మవార్ల వన ప్రవేశం

0

8 లక్షల మంది భక్తుల రాకతో పులకించిన అమీన్‌పూర్ – సమ్మక్క-సారక్కల ఆశీస్సులు అందరిపై ఉండాలి: ఆలయ చైర్మన్ నీలం బిక్షపతి

అమీన్‌పూర్,జనవరి,31,(మెదక్ టుడే) న్యూస్,ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలో ‘మినీ మేడారం’గా ప్రసిద్ధి చెందిన సమ్మక్క-సారలమ్మ జాతర శనివారం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ముగిసింది. నాలుగు రోజుల పాటు కన్నుల పండుగగా జరిగిన ఈ జాతరలో చివరి రోజైన నేడు అమ్మవార్లను వన ప్రవేశం చేయించడంతో జాతర వేడుకలు ముగిశాయని ఆలయ కమిటీ చైర్మన్ నీలం బిక్షపతి తెలిపారు.ఈ సందర్భంగా చైర్మన్ నీలం బిక్షపతి మాట్లాడుతూ.. గత నాలుగు రోజులుగా అమీన్‌పూర్ సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద భక్తుల రద్దీ అశేషంగా ఉందని తెలిపారు. సుమారు 8 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని, నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చినా, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతరను వైభవంగా నిర్వహించామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.అన్ని శాఖల సహకారం అభినందనీయం:జాతర విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా:
పోలీస్ శాఖ: ట్రాఫిక్ మరియు భద్రత విషయంలో అహర్నిశలు శ్రమించినందుకు.జిహెచ్ఎంసి పారిశుధ్యం మరియు ఇతర మౌలిక వసతుల కల్పనకు.
ఎలక్ట్రికల్ & వాటర్ డిపార్ట్‌మెంట్స్: నిరంతర విద్యుత్ మరియు తాగునీటి సరఫరా అందించినందుకు.
ఈ జాతర మహోత్సవం ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి అమీన్‌పూర్ గ్రామ పెద్దలు, నియోజకవర్గ ప్రజలందరి సంపూర్ణ సహకారం ఉందని ఆయన కొనియాడారు.అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అందరినీ సమ్మక్క-సారలమ్మ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శాస్త్రోక్తంగా అమ్మవార్లను తిరిగి వన ప్రవేశం చేయించాము. మళ్లీ రెండు సంవత్సరాల తర్వాత జరగబోయే మహా జాతరలో మళ్ళీ కలుసుకుందాం” అని నీలం బిక్షపతి ఈ సందర్భంగా భావోద్వేగంతో పలికారు.

మెదక్ టుడే’ కథనానికి స్పందన: అమీన్‌పూర్ ప్రధాన రహదారిపై ఆక్రమణల తొలగింపు.

0

ఆక్రమణలపై జిహెచ్ఎంసి అధికారుల ఉక్కుపాదం – నరే గూడెం నుండి కిష్టారెడ్డిపేట వరకు స్పెషల్ డ్రైవ్

అమీన్‌పూర్ జనవరి 31:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలో ప్రధాన రహదారుల వెంట అక్రమంగా వెలిసిన షెడ్లు, తడకల తొలగింపునకు అధికారులు భారీ ఎత్తున చర్యలు చేపట్టారు. నరేగూడెం నుండి కిష్టారెడ్డిపేట వెళ్లే ప్రధాన రహదారిపై ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న ఆక్రమణలపై జిహెచ్ఎంసి అధికారులు శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఇటీవల ‘మెదక్ టుడే’ పత్రికలో రహదారి ఆక్రమణలు మరియు అపరిశుభ్రతపై వచ్చిన ప్రత్యేక కథనానికి జిహెచ్ఎంసి అధికారులు తక్షణమే స్పందించారు. పత్రికా కథనంతో అప్రమత్తమైన అధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే మెయిన్ రోడ్డు వెంబడి ఉన్న చెట్ల పొదలను, అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించి శుభ్రపరిచే పనులు చేపట్టారు.జిహెచ్ఎంసి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సిబ్బంది జెసిబి యంత్రాలతో రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించారు.ఆక్రమణల తొలగింపు: రహదారిని ఆక్రమిస్తూ ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా నిర్మించిన తాత్కాలిక షెడ్లను, కర్రలతో వేసిన తడకలను పూర్తిగా తొలగించారు.పెద్ద చెట్ల తొలగింపునకు నోటీసులు: రోడ్డు విస్తరణకు మరియు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న పెద్ద ఎత్తున ఉన్న చెట్లను గుర్తించిన అధికారులు, వాటిని తొలగించేందుకు ఇప్పటికే సంబంధిత వారికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. అతి త్వరలోనే ఆ చెట్లను కూడా తొలగించి రహదారిని క్లియర్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.రహదారులు వెడల్పుగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా రహదారిని ఆక్రమించిన వ్యాపారులు మరియు వ్యక్తులపై అధికారులు కొరడా ఝుళిపించారు. అధికారుల బృందం జెసిబిలతో క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేస్తోంది.ప్రజల సమస్యలపై స్పందిస్తూ కథనాన్ని ప్రచురించిన ‘మెదక్ టుడే’ పత్రికను మరియు తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్న జిహెచ్ఎంసి అధికారులను స్థానికులు అభినందిస్తున్నారు.

ఆపరేషన్ స్మైల్ నిరంతర ప్రక్రియ..

0

నెల రోజుల వ్యవధిలో 81 మంది బాలల రక్షణ

69 మందిని తల్లిదండ్రులకు అప్పగింపు 12 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలింపు

6గురు బాలలకు పాఠశాలల్లో ప్రవేశం కల్పించడం అభినందనీయం

జిల్లా వ్యాప్తంగా 52 కేసుల నమోదు

మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్

మెదక్ జనవరి 31 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి

రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1వ తేదీన ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం, నెల రోజుల వ్యవధిలో మెదక్ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా కొనసాగిందని జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ తెలిపారు.ఈ సందర్భంగా శెనివారం రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన ఆపరేషన్ స్మైల్ ముగింపు సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.జిల్లాలోని హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాలు తదితర ప్రాంతాలలో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి, వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచడం జరిగిందన్నారు.నెల రోజుల వ్యవధిలో మొత్తం 81 మంది బాలలను రక్షించగా, అందులో 69 మందిని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించగా, మిగిలిన 12 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 52 కేసులు నమోదు చేయడం జరిగిందని, బాల కార్మికులను పనిలో ఉంచుకుంటున్న యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా వ్యాప్తంగా 6 గురిని పాఠశాలల్లో చేర్పించడం అభినందనీయమని, ఇందులో జడ్పీహెచ్‌ఎస్ టేక్మాల్‌లో ఇద్దరు, నాగసన్‌పల్లి పాఠశాలలో ఇద్దరు, మెదక్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఇద్దరు బాలలను చేర్పించడం జరిగిందని తెలిపారు.ఈ బాలలలో చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన పిల్లలు కూడా ఉన్నారని పేర్కొన్నారు.
పిల్లల బాల్యం బడులకు అంకితం కావాలని, బాలలు కార్మికులుగా మారకుండా విద్యాబాటలో నడవాలన్నదే ఈ కార్యక్రమ లక్ష్యమని జిల్లా అదనపు ఎస్పీ తెలిపారు. సిబ్బందికి ఎదురైన అనేక వత్తిడులను అధిగమించి, అన్ని శాఖల సమిష్టి కృషితో ఈ ఆపరేషన్ విజయవంతంగా కొనసాగిందన్నారు.భవిష్యత్తులో కూడా బాల కార్మికుల నిర్మూలన దిశగా నిరంతర చర్యలు చేపడుతూ, బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ తెలిపారు.
మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ నిర్ములనకు, మహిళల పై జరిగే అక్రమాలను నిరోధించుడానికి యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ పని చేస్తుందని మెదక్ జిల్లాలో ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పని చేస్తుందిని ప్రజలకు ఏమైనా సమాచారం ఉంటే తెలియజేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో ఏ హెచ్ టి యు ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, సిడబ్లుసి ఉప్పలయ్య,లేబర్ డిపార్ట్మెంట్ నాగరాజు, ఏల్ఓ మెదక్ సత్యేంద్ర ప్రసాద్, ఏల్ఓ రామాయంపేట్ రాజు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రాజు ,వీషన్ ఎన్‌జీవో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రాజు, సిఎస్ యం ఎన్జిఓ సంజీవ్, యాదగిరి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

నేటి నుంచి 28 వరకు పోలీస్ యాక్ట్ అమలు జిల్లా ఎస్ పి

0

మెదక్ జనవరి 31 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి.మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఫిబ్రవరి 01 నుండి 28 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30 ఎ పోలీసు యాక్ట్ – 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, తెలిపారు.ఈ సమయంలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని జిల్లా ఎస్పీ తెలిపారు.అలాగే ప్రజల/ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక చర్యలు, అశాంతి సృష్టించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. శాంతి భద్రతల నిర్వహణలో ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఈ విషయంలో పోలీసులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

రాత్రి 8.00 గంటల వరకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్ స్కూళ్ళ పై చర్యలు తీసుకోవాలి

0

స్టడీ అవర్స్ పేరుతో విద్యార్థులను ఒత్తిడులకు గురిచేస్తున్న ప్రైవేట్ స్కూళ్ళు

మెదక్, తూప్రాన్, నర్సాపూర్ పెద్దశంకరం పేట్ మండలాల్లో ప్రైవేట్ స్కూల్స్ పర్యవేక్షణా చేయాలి యు ఎస్ ఎస్ ఐ జిల్లా అధ్యక్షులు జగన్ మెదక్ జనవరి 31 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి మెదక్ జిల్లా లో విద్యా హక్కు చట్టన్నీ నిర్వర్యం చేస్తు విద్యార్థులను ఒత్తిడులకు గురిచేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలనీ యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు జగన్ అన్నారు
ఈ సందర్భంగా ఆయన మెదక్ కలెక్టర్ కార్యాలయంలో డి ఈ ఓ మేడం కి వినతి పత్రం అందజేసీ జగన్ మాట్లాడుతూ..మెదక్ జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో సాయంత్రం 5.30 వరకు స్టడీ అవర్స్ జరుగుతున్నాయని అయన అన్నారు విద్యకు హక్కు చట్టానికి విరుద్ధంగా ప్రైవేట్ స్కూల్స్ రాత్రి 8 గంటల వరకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాత్రి 9 గంటల వరకు ప్రైవేట్ స్కూల్స్ బస్సులు రోడ్ల పై నిత్యం కనబడుతున్నాయని ఆయన మండిపడ్డారు వాళ్ల గుర్తింపు కోసం మంచి ర్యాంక్ కోసం రాత్రి వరకు విద్యార్థులను ఒత్తిడి లకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు మండల,జిల్లా విద్యాధికారులు వెంటనే మెదక్, నర్సాపూర్ తూప్రాన్, పెద్దశంకరం పేట్ మండలాల్లో ప్రైవేట్ స్కూల్స్ పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకోవాలని డిఇఓ కి వినతి పత్రం జిల్లా నాయకత్వం అందించడం జరిగిందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాజేష్, నితీన్ పాల్గొన్నారు

    11వ వార్డు బిజెపి అభ్యర్థి వారే వనిత..ముమ్మర ప్రచారం

    0

    మెదక్ టౌన్,జనవరి,31,మెదక్ టుడే న్యూస్,ప్రతినిధి:కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ అభివృద్ధి కార్యక్రమాన్ని అమృత్ సిటీ లో భాగంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుండి అత్యధిక నిధులు ఇచ్చి అమృత్ సిటీలను తయారు చేయడానికి నరేంద్ర మోడీ నాయకత్వంలో కంకణం కట్టుకొని భారత ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తున్న భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని.. మెదక్ మున్సిపల్ పట్టణ 11వ వార్డు బిజెపి అభ్యర్థిని వారే నవిత తెలిపారు.. 11వ వార్డులో అనేక భవంతులు ఉన్నాయని వాటిపైన అత్యధికంగా టాక్సులు వసూలు చేయడం సరికాదని ఆమె తెలిపారు .అదే విధంగా అధిక టాక్సీలు చెల్లిస్తున్న వార్డులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నాటి కౌన్సిల్ విఫలం అయిందన్నారు.బిజెపి తరఫున మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో అన్ని వార్డులను
    అమృత్ సిటీ జాబితాలో కలుపుతూ త్రాగునీరు మురికి కాలువల క్రమబద్ధీకరణ మౌలిక వసతులు పారిశుద్ధ్యము పై ప్రణాళికలు.ప్లాస్టిక్ కవర్ నిషేధం. పార్క్. పచ్చదనం
    వార్డులో అనుసరిస్తామని.మెదక్ పట్టణాన్ని నందనవనంగా చేయడం బిజెపి లక్ష్యం అని వనిత తెలిపారు. మెదక్ పట్టణంలోస్మశాన వాటికల పరిస్థితిని ప్రజలు గమనించాలని సూచించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్ధినీ గెలిపించండి అని అభ్యర్థించారు.
    ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వడ్ల జనార్దన్ కృష్ణారెడ్డి వారె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

    కాంగ్రెస్ ప్రభుత్వం తోనే మెదక్ పట్టణం అభివృద్ధి చెందుతుంది

    0

    మెదక్ మున్సిపాలిటి 14 వ వార్డు,15 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థులు

    మెదక్ టౌన్,జనవరి,30,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,మెదక్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ 14 వ వార్డు అభ్యర్థిగా దొంతి లక్ష్మి 15వ వార్డు అభ్యర్థి దొంతి నరేష్ గౌడ్ నామినేషన్ వేశారు అనంతరం వారుమాట్లాడుతూ పట్టణంలోని 14వ వార్డు 15వ వార్డు ఓటర్ మహాశయులందరికి దొంతి లక్ష్మి రెండవసారి 14వ వార్డు కౌన్సిల్గా గెలుపొందారు మళ్ళీ మూడవ సరి మీ ముందుకు వస్తున్నాను వార్డు ఓటర్ మహాశయులకు నన్ను రెండు పర్యాయాలు గెలుపొందించి మూడవసారి కూడా తన అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించగలరని దొంతి లక్ష్మి 14 వ వార్డు ఓటర్లను కోరారు 15వ వార్డు అభ్యర్థి దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సహకారంతో కౌన్సిలర్ గా పోటీ చేస్తూ మీ ముందుకి వస్తున్నాము అని తెలిపారు. మెదక్ పట్టణంలో 15వ గతంలో కౌన్సిలర్ గా పని చేసిన వారు అభివృద్ధిలో వెనుకబడ్డారు అని అన్నారు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అవకాశం ఇవ్వండి అని కోరారు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో ఎమ్మెల్యే నుంచి వచ్చే నిధులు 14వ వార్డ్ 15వ వార్డు లలో ప్రతి పైసా జవాబుదారితనముగా ఉపయోగిస్తాము అని తెలిపారు. ఉన్న ప్రతి సమస్యను తీర్చడంలో ముందుంటాము అని తెలిపారు. ఉన్న ఓటరు మహాశయులకు విన్నవించేది ఒక్కసారి ఆలోచించండి, మీరు వేసే ఓటు ప్రగతికి బాటగా నిలుస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పట్టణాలు పల్లెలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి మన పట్టణాన్ని కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేద్దాం. కాంగ్రెస్ పార్టీ పట్టణాలను వేగంగా అభివృద్ధి చేస్తుంది మన మెదక్ పట్టణం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ కి మీ ఓటు వేయండి అభివృద్ధిలో భాగస్వాములు కండి ఉన్న ప్రతి సమస్యను తీర్చడంలో మీ ముందుంటాము. పారిశుద్ధ సమస్య, నీటి సమస్య మౌలిక వసతులు కరెంటు సమస్య గృహము లేని వారికి గృహాలు అందివ్వడం, నిస్వార్ధంగా పనిచేసే వారికి పట్టం కట్టండి ప్రజాసేవకి అంకితం అవుతామని అన్నారు ఒకసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధిని చేసి చూపిస్తాముఅని కాంగ్రెస్ అభ్యర్థులు దొంతి లక్ష్మి, దొంతి నరేష్ గౌడ్ ఓటర్లను కోరారు

    ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా మెదక్ మున్సిపాలిటి 27 వ వార్డు బి ఆర్ ఎస్ అభ్యర్థి అస్తగల బాలరాజ్..

    0

    మెదక్ జనవరి 30 మెదక్ టుడే న్యూస్, ప్రతినిధి:గురువారం బి ఆర్ ఎస్ పార్టీ 27 వాడు అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేశారు అనంతరం బాలరాజు మాట్లాడుతూ పట్టణంలోని 27వ వార్డు ఓటర్ మహాశయులందరికి నమస్కారములతో బిఆర్ఎస్ పార్టీ సహకారంతో కౌన్సిలర్ గా పోటీ చేస్తూ మీ ముందుకి వస్తున్నాను. మెదక్ పట్టణంలో మరియు 27వ వార్డులో గతంలో కౌన్సిలర్ గా పని చేసిన వారు అభివృద్ధిలో వెనుకబడ్డారు బిఆర్ఎస్ నాకు అవకాశం ఇచ్చారు ఒకసారి బి ఆర్ ఎస్ పార్టీకి ఓటు వేసి 27వ మన వార్డులో ప్రతి పైసా జవాబుదారితనముగా ఉపయోగిస్తాము. ఉన్న ప్రతి సమస్యను తీర్చడంలో ముందుంటాము. 27వ వార్డ్ ఉన్న ఓటరు మహాశయులకు విన్నవించేది ఒక్కసారి ఆలోచించండి, మీరు వేసే ఓటు ప్రగతికి బాటగా నిలుస్తుంది . రాష్ట్రంలో కెసిఆర్ నాయకత్వంలో పట్టణాలు పల్లెలు ఎంతో అభివృద్ధి చెందాయి మన పట్టణాన్ని కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేద్దాం. బి ఆర్ ఎస్ పార్టీ పట్టణాలను వేగంగా అభివృద్ధి చేస్తుంది మన మెదక్ పట్టణం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే బి ఆర్ ఎస్ కి మీ ఓటు వేయండి అభివృద్ధిలో భాగస్వాములు కండి ఉన్న ప్రతి సమస్యను తీర్చడంలో మీ ముందుంటాము. పారిశుద్ధ సమస్య, నీటి సమస్య సమస్య మౌలిక వసతులు కరెంటు సమస్య గృహము లేని వారికి గృహాలు అందివ్వడం, నిస్వార్ధంగా పనిచేసే వారికి పట్టం కట్టండి ప్రజాసేవకి అంకితం అవుతామని ఒకసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధిని చేసి చూపిస్తాముఅని,బి ఆర్ఎస్
    అస్తగల బాలరాజ్ మాదిగ తెలిపారు
    27వ వార్డ్ కౌన్సిలర్ బి ఆర్ ఎస్ అభ్యర్థి

    ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తాం మెదక్ మున్సిపాలిటి 14 వ వార్డు15 వ బిజెపి..

    0

    మెదక్ జనవరి 30 మెదక్ టుడే న్యూస్, ప్రతినిధి:శుక్రవారం మెదక్ మున్సిపాలిటీ బిజెపి పార్టీ 14 వాడు అభ్యర్థిగా నాయిని యశోద ప్రసాద్15వ వాడు అభ్యర్థి గుప్తా నర్సింలు నామినేషన్ వేశారు అనంతరం వారుమాట్లాడుతూ పట్టణంలోని 14వ వార్డు 15వ వాడు ఓటర్ మహాశయులందరికి నమస్కారములతో భారతీయ జనతా పార్టీ సహకారంతో కౌన్సిలర్ గా పోటీ చేస్తూ మీ ముందుకి వస్తున్నాము. మెదక్ పట్టణంలో 14వ వార్డ్ మరియు 15వ గతంలో కౌన్సిలర్ గా పని చేసిన వారు అభివృద్ధిలో వెనుకబడ్డారు కాంగ్రెస్ టిఆర్ఎస్లకు అవకాశం ఇచ్చారు ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు 14వ మరియు 15వ మన వార్డు లలో ప్రతి పైసా జవాబుదారితనముగా ఉపయోగిస్తాము. ఉన్న ప్రతి సమస్యను తీర్చడంలో ముందుంటాము. ఉన్న ఓటరు మహాశయులకు విన్నవించేది ఒక్కసారి ఆలోచించండి, మీరు వేసే ఓటు ప్రగతికి బాటగా నిలుస్తుంది .దేశంలో మోడీ నాయకత్వంలో పట్టణాలు పల్లెలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. వికసితభారత్ దిశగా అడుగులు వేస్తున్నాయి మన పట్టణాన్ని కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేద్దాం. భారతీయ జనతా పార్టీ పట్టణాలను వేగంగా అభివృద్ధి చేస్తుంది మన మెదక్ పట్టణం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే బిజెపికి మీ ఓటు వేయండి అభివృద్ధిలో భాగస్వాములు కండి ఉన్న ప్రతి సమస్యను తీర్చడంలో మీ ముందుంటాము. పారిశుద్ధ సమస్య, నీటి సమస్య మౌలిక వసతులు కరెంటు సమస్య గృహము లేని వారికి గృహాలు అందివ్వడం, నిస్వార్ధంగా పనిచేసే వారికి పట్టం కట్టండి ప్రజాసేవకి అంకితం అవుతామని ఒకసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధిని చేసి చూపిస్తాముఅని బిజెపి అభ్యర్థి అభ్యర్థులు నాయిని యశోద ప్రసాద్ గుప్తా నర్సింలు వాళ్లు ఓటర్లను కోరారు