మెదక్,ఏప్రిల్,5,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.మెదక్ డివిజన్ పరిధిలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా రాత్రి 11 గంటలలోపు అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు మరియు ఇతర ఎస్టాబ్లిష్మెంట్లు తప్పనిసరిగా మూసివేయాలని మెదక్ డీఎస్పీ శ్రీ ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.రాత్రి 11 గంటల అనంతరం పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారని, ఆ సమయంలో తెరిచి ఉన్న దుకాణాలు లేదా సంస్థలు గుర్తిస్తే సంబంధిత యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదుచేయబడతాయని పేర్కొన్నారు.ప్రజలు, వ్యాపారులు పోలీస్ శాఖతో సహకరించి ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని, అందరూ కలిసి మెదక్ పట్టణంలో శాంతిభద్రతలను కాపాడాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.
చౌక దుకాణాల పనితీరు ఆదర్శం-రేషన్ షాపుల బియ్యం తూకాల పరిశీలన. జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్.
చౌక దుకాణాల పనితీరు ఆదర్శం కలెక్టర్-రేషన్ షాపుల బియ్యం తూకాల పరిశీలన.
నిత్యావసర వస్తువుల పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం
అత్యంత పారదర్శకంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు మూడు నెలల రేషన్
పంపిణీ.

మెదక్, ఏప్రిల్, 5, మెదక్ టుడే న్యూస్, ప్రతినిధి.
జిల్లాలో 520 రేషన్ దుకాణాలు
పిడీఎస్ ప్రయోజనాలు పారదర్శకంగా, సమర్థవంతంగా ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరేలా చూడటం కోసం పటిష్ట చర్యలు.ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మకుండా, గందరగోళానికి లోనుకాకుండా, ప్రశాంతంగా తమకు లభ్యమయ్యే (03) నెలల రేషన్ సరుకులను పొందాలి.ఏప్రిల్, మే, జూన్ (3) నెలల రేషన్ సరఫరా – ఈ నెల 30 వరకు పంపిణి.మెదక్ జిల్లాలో చౌక దుకాణాల పనితీరు ఆదర్శంగా ఉందని నిత్యావసర వస్తువుల పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనంక్షేత్రస్థాయిలో కనపడుతుందని,పిడీఎస్ ప్రయోజనాలు పారదర్శకంగా, సమర్థవంతంగా ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరేలా చూడటం కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు ఎలాంటి వదంతులు అసత్య ప్రచారాలు నమ్మకుండాప్రశాంతంగా తమకు లభ్యమయ్యే మూడు నెలల రేషన్ ఈ నెల 30 వరకు పొందాలని
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు.జిల్లా కేంద్రంలోని పత్తి నగర్ ప్రాంతంలో షాప్ నెంబర్ -04 చౌక ధరల దుకాణాన్నికలెక్టర్ తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, పౌరసరఫరాల ఇన్స్పెక్టర్ నరసింహులు, సిబ్బంది నాగరాజు, తో కలిసి ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్టాక్ ను తూకాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు లబ్ధిదారులతో సంభాషించారు. చౌక ధరల దుకాణాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని లబ్ధిదారులు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువుల పంపిణీ జరగాలని ఆదేశించారు. లబ్ధిదారులు లేవనెత్తిన ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ సిబ్బంది సివిల్ సప్లై సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రామచంద్రపురంలో బావర్చి హౌస్ ఏసీ రెస్టారెంట్ ప్రారంభం.
ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్సీ విజయశాంతి

రామచంద్రపురం,ఏప్రిల్,3,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘బావర్చి హౌస్’ ఏసీ రెస్టారెంట్ శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ విజయశాంతి రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు.
స్థానికులకు చేరువలో నాణ్యమైన రుచులు:
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విజయశాంతి మాట్లాడుతూ.. రామచంద్రపురం వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించే ఇలాంటి ఆధునిక రెస్టారెంట్లు రావడం శుభపరిణామన్నారు. యువ పారిశ్రామికవేత్తలు కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి వ్యాపార రంగంలో రాణించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.
మెనూ ప్రత్యేకతలు:
రెస్టారెంట్ యాజమాన్యం మాట్లాడుతూ.. వినియోగదారుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, పూర్తి హైజీనిక్ వాతావరణంలో భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. తమ వద్ద ప్రత్యేకంగా:
- హైదరాబాదీ దమ్ బిర్యానీ •నార్త్ ఇండియన్ స్పెషల్స్
- చైనీస్ వంటకాలు అందుబాటులో ఉంటాయని వివరించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ గన్ని, గఫర్, ఏకే ఫౌండేషన్ చైర్మన్ ఖదీర్, సోహెల్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.

ధర్మ రక్షణ: “రాజకీయాలకు అతీతంగా హిందూ శక్తి.. ఆదెల్లి రవీందర్ ఆధ్వర్యంలో వైభవంగా హనుమాన్ విజయోత్సవ ర్యాలీ.
ప్రజానాయకుడు: “పదేళ్ల సంప్రదాయం – పదివేల మంది భక్తులు.. బీరంగూడలో ఆదెల్లి రవీందర్ మార్క్ ఆధ్యాత్మిక ఉత్సవం.”

అమీన్ పూర్,ఏప్రిల్,2,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.బీరంగూడలో అత్యంత వైభవంగా జరిగిన హనుమాన్ జయంతి విజయోత్సవ ర్యాలీ హిందూ సమాజం యొక్క ఐక్యతను చాటిచెప్పిందని బి.జె.పి. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదెల్లి రవీందర్ పేర్కొన్నారు. గత 10 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న భక్తులను ఉద్దేశించి ఆదెల్లి రవీందర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:
1 దశాబ్ద కాలపు సంప్రదాయం:
“బీరంగూడలో గత పదేళ్లుగా ఈ హనుమాన్ విజయోత్సవ యాత్రను జరుపుకుంటున్నాం. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుండటం మన ధర్మం పట్ల ప్రజల్లో ఉన్న అంకితభావానికి నిదర్శనం. ఈ యాత్ర బీరంగూడ మార్కెట్ నుండి ప్రారంభమై ఎంఆర్‌ఓ ఆఫీస్, వందనాపురి కాలనీ మీదుగా గుట్ట కమాన్ వరకు భక్తి పారవశ్యంతో సాగింది.
2 .రాజకీయాలకతీతంగా హిందూ ఐక్యత:
“ఈ కార్యక్రమానికి ఏ ఒక్క రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఇది కేవలం హిందూ సమాజం యొక్క శక్తిని ప్రదర్శించే వేదిక. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా సుమారు 10,000 మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొనడం గర్వకారణం. హిందువులందరూ ఏకతాటిపైకి వచ్చినప్పుడే మన సంస్కృతిని కాపాడుకోగలం.”

3.ధర్మ రక్షణే ధ్యేయం:
“భారతదేశం హిందూ ధర్మానికి పుట్టినిల్లు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొందరు హిందూ సమాజాన్ని విడదీయాలని చూస్తున్నారు. కానీ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మనం అందరం ఒక్కటే అని చాటిచెబుతున్నాం. మన ధర్మాన్ని, మన దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఎంతైనా ఉంది.”
4.ధర్మ రక్షణే ధ్యేయం:
“భారతదేశం హిందూ ధర్మానికి పుట్టినిల్లు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొందరు హిందూ సమాజాన్ని విడదీయాలని చూస్తున్నారు. కానీ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మనం అందరం ఒక్కటే అని చాటిచెబుతున్నాం. మన ధర్మాన్ని, మన దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఎంతైనా ఉంది.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు, బీరంగడ గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, వివిధ కాలనీల అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో భక్తులు మరియు యువత పాల్గొన్నారు.

వైభవంగా మాణిక్ యాదవ్ జన్మదిన వేడుకలు: హరీష్ రావు, మహిపాల్ రెడ్డి ఆశీస్సులు.
పటాన్ చెరు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడమే లక్ష్యం: బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఐలాపుర్ మాణిక్ యాదవ్
అమీన్‌పూర్,ఏప్రిల్,2,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఐలాపుర్ మాణిక్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ని మరియు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఘన సత్కారం:
మాణిక్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని హరీష్ రావు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి, మాజీ జడ్పిటిసి బాల్ రెడ్డి కూడా పాల్గొని మాణిక్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు:
అనంతరం ఐలాపుర్ మాణిక్ యాదవ్ మాట్లాడుతూ.. తన పుట్టినరోజు సందర్భంగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు మరియు అభిమానులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
మాణిక్ యాదవ్ మాటల్లో ముఖ్య అంశాలు:
సేవా కార్యక్రమాలు:
- “అమీన్‌పూర్ డివిజన్ అభివృద్ధిలో నా వంతు పాత్ర పోషిస్తున్నాను. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాను, మున్ముందు హరీష్ రావు , స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరియు ఆదర్శ్ రెడ్డి సహకారంతో మరిన్ని ప్రజాహిత పనులు చేస్తాను.”
- రాజకీయ లక్ష్యం: “రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న అన్ని కార్పొరేటర్ స్థానాల్లో బిఆర్ఎస్ జెండా ఎగరవేయడమే మా లక్ష్యం. నాయకులందరి సమన్వయంతో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం.”
- కృతజ్ఞత: తనపై చూపిస్తున్న అభిమానానికి రుణపడి ఉంటానని, అందరి ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధిలో చురుగ్గా పాల్గొంటానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ వేడుకల్లో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్,కార్యకర్తలు మరియు అమీన్‌పూర్ డివిజన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బంధంకొమ్ము శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ విజయోత్సవాలు.
•ముప్పై ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం..
- ఘనంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు
- భక్తులకు భారీగా ప్రసాద వితరణ
అమీన్‌పూర్,ఏప్రిల్,2,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బంధంకొమ్ము గ్రామంలో వెలసిన శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ విజయోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలు:
విజయోత్సవాలను పురస్కరించుకుని ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకరణలు గావించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాలతో బంధంకొమ్ము గ్రామం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.
ప్రసాద వితరణ:
ఆలయానికి విచ్చేసిన భక్తులకు కమిటీ సభ్యులు ప్రసాద వితరణ చేశారు. పులిహోర, దద్దోజనంతో పాటు ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన పానకాన్ని భక్తులకు అందజేశారు. వేసవి తాపాన్ని తట్టుకునేలా చల్లని పానకాన్ని ప్రసాదంగా ఇవ్వడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
30 ఏళ్ల భక్తి ప్రస్థానం:
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. “మా గ్రామంలో ఈ ఆలయం వెలసి సుమారు 30 సంవత్సరాలు అవుతోంది. గ్రామస్తులందరూ ఐకమత్యంతో కలిసికట్టుగా స్వామివారి వేడుకలను నిర్వహించుకోవడం మా ఆచారం. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, ఉగాది వంటి పండుగలను ప్రతి ఏడాది అత్యంత వైభవంగా జరుపుకుంటాం. స్వామివారి కృపతో గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నాం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు బంధంకొమ్ము భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

హనుమాన్ జయంతి వేడుకల్లో విశాల శ్రావణ్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు.
(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,ఏప్రిల్,2,మెదక్ టుడే న్యూస్:అచంచలమైన భక్తి, అపారమైన శక్తి, అజేయమైన ధైర్యానికి ప్రతీకగా నిలిచే భగవాన్ శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా కేశంపేట్ మాజీ జడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా షాద్‌నగర్ పట్టణంలోని 15వ వార్డు ఆంజనేయస్వామి ఆలయంలో విశాల శ్రావణ్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ హనుమంతుడిలా ధైర్యసాహసాలు, నిస్వార్థ సేవాభావం, అపార సహనంతో జీవించాలని సూచించారు. మనిషిలోని భయాలను జయించి సత్యం, ధర్మ మార్గంలో ముందుకు సాగేందుకు హనుమంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ భర్త సాదిక్, సీనియర్ నాయకులు జమృద్ ఖాన్, ప్రాంతీయ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మా వలూర్ గ్రామ ని చేగుంట మండలం లో కలపండి.
చేగుంట,మర్చి,31,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో దుబ్బాక మ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు వచ్చిన సందర్బంగా మ్మెల్యే ను కలసి నా వల్లూరు గ్రామస్తులు,వల్లూరు గ్రామo ఇంత కు ముందు చేగుంట మండలంలో ఉండేది. మా గ్రామని నర్సిoగ్ మండలం లో కలిపారు. మాకు అక్కడికి వెళ్లడానికి చాలా ఇబ్బందికరంగా కావున మా గ్రామాన్ని చేగుంట మండలం లో కలపాలని, అలాగే వల్లూరు గ్రామ స్టేజి వద్ద గ్రామo లో నికి పోవడానికి ఇబ్బంది గా ఉన్నది యక్సడెంట్లు చాలా జరుగుతుయని,యన్ హె చ్ 44 రోడ్డు మీద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని వినతి పత్రం ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమంలో వల్లూరు సర్పంచ్ పిప్పిరి వినోద్ కుమార్, ఉప సర్పంచ్ రేఖ మధు, మరియు వార్డు సభ్యులు గ్రామస్థులు పాల్గొనా రు.
కాటా.. నీ బట్టేబాజ్ మాటలు బంద్ చేయ్.. ఒక గజం కబ్జా నిరూపించినా ఏ శిక్షకైనా సిద్ధం!
హరీష్ రావు ని విమర్శించే స్థాయి నీకు లేదు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం
జిల్లా మంత్రి ఒత్తిడితోనే అక్రమ కేసులు.. సొంత కుటుంబానికే న్యాయం చేయని నువ్వా మాకు చెప్పేది?
పటాన్‌చెరు,మార్చి,31,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పై మరియు తనపై కాంగ్రెస్ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న నిరాధార ఆరోపణలపై పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాటా శ్రీనివాస్ గౌడ్ తీరును ఎండగట్టారు.
వార్తలోని ముఖ్యాంశాలు:
- నీ స్థాయి తెలుసుకో: “రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన నీకు.. మూడుసార్లు ప్రజల మద్దతుతో గెలిచిన నాపై, ఉద్యమ నేత హరీష్ రావు పై మాట్లాడే అర్హత లేదు. ఐదు మున్సిపాలిటీల్లో ప్రజలు చెంప చెళ్లుమనిపించినా నీకు సిగ్గు రాలేదా?” అని ఎమ్మెల్యే నిలదీశారు.
- వసూళ్ల పర్వం – టికెట్ల అమ్మకం: ఎన్నికల సమయంలో కార్యకర్తలకు బి-ఫామ్ లు అమ్ముకోవడం కాటా నీచ చరిత్ర అని, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని రూ. 40 లక్షలకు అమ్ముకున్నాడని ఆరోపించారు. జిల్లా మంత్రి కూతురు పెళ్లి పేరుతో బిల్డర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడింది నిజం కాదా అని ప్రశ్నించారు.
- మైనింగ్ కేసు వెనుక రాజకీయ కుట్ర: జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ ఒత్తిడితోనే తన సోదరుడిపై అక్రమ మైనింగ్ కేసులు పెట్టించారని ఆరోపించారు. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే తాము క్రషర్ నడిపామని, గతంలో వేరే కంపెనీ చేసిన మైనింగ్‌ను కూడా తమ ఖాతాలో వేసి తప్పుడు పెనాల్టీలు వేశారని వివరించారు. కోర్టు రీ-సర్వేకు ఆదేశించినా, మంత్రి ఒత్తిడితో అధికారులు సర్వే చేయకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.
- కబ్జా ఆరోపణలు నిరూపించు: పోచారం, అన్నారం భూములపై కాటా చేస్తున్న ఆరోపణలు కేవలం అజ్ఞానమేనని కొట్టిపారేశారు. “నేను ఒక గజం భూమి కబ్జా చేసినట్టు నిరూపించినా ఏ శిక్షకైనా సిద్ధం. 2001 నుండి నా సొంత ఆస్తులు అమ్ముకుని ప్రజా సేవ చేస్తున్నానే తప్ప.. నీలా కబ్జాలు చేయలేదు” అని స్పష్టం చేశారు.
- కుటుంబ ద్రోహివి నువ్వు: “సొంత తల్లికి తిండి పెట్టక, తోబుట్టువులను మోసం చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే నువ్వు ప్రజలకు ఏం సేవ చేస్తావు? సొంత కుటుంబానికే న్యాయం చేయలేని వ్యక్తివి పటాన్‌చెరు ప్రజల గురించి మాట్లాడటం హాస్యాస్పదం” అని ఎద్దేవా చేశారు.
హెచ్చరిక:
ఇప్పటికైనా బట్టేబాజ్ మాటలు బంద్ చేసి, ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, లేనిపక్షంలో ప్రజలే నీకు తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు.ఈ సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కాటా సునీత రాజేష్ గౌడ్, పటాన్‌చెరు బిఆర్ఎస్ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్స్, మాజీ కౌన్సిలర్స్, మాజీ కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, నవీన్, శంకర్ యాదవ్ మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

హరీష్ రావు ని విమర్శించే స్థాయి నీకు లేదు.. కాటా శ్రీనివాస్ గౌడ్ కు సోయి లేదా?

- ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నేతపై విరుచుకుపడ్డ బిఆర్ఎస్ శ్రేణులు
- ఘాటుగా సమాధానం ఇచ్చిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కాటా సునీత రాజేష్ గౌడ్
పటాన్‌చెరు,మార్చి,31,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పై కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం పటాన్‌చెరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి కాటా సునీత రాజేష్ గౌడ్, పటాన్‌చెరు బిఆర్ఎస్ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు కాంగ్రెస్ వైఖరిపై నిప్పులు చెరిగారు.
మీడియా సమావేశంలో ముఖ్య అంశాలు:
- స్థాయి మరిచి మాట్లాడొద్దు: “హరీష్ రావు తెలంగాణ ఉద్యమ నాయకుడు, అభివృద్ధి ప్రదాత. అటువంటి వ్యక్తిని విమర్శించే స్థాయి, అర్హత కాటా శ్రీనివాస్ గౌడ్‌కు లేదు. రాజకీయాల్లో నీ అడ్రస్ ఎక్కడ?” అని సునీత రాజేష్ గౌడ్ నిలదీశారు.
- మున్సిపల్ ఎన్నికల గుణపాఠం: గత మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, నీకు గట్టిగా బుద్ధి చెప్పినా ఇంకా సోయి రాలేదా? అని ధ్వజమెత్తారు. ప్రజలు తిరస్కరించినా ఇంకా అబద్ధాలతో పబ్బం గడుపుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
- కుటుంబ నైతికతపై ప్రశ్న: సొంత అన్నదమ్ములను, కుటుంబ సభ్యులను గౌరవించలేని వ్యక్తి, ప్రజల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ మీడియా సమావేశంలో పటాన్‌చెరు బిఆర్ఎస్ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ నవీన్, శంకర్ యాదవ్, మాజీ చైర్మన్స్, మాజీ కౌన్సిలర్స్, మరియు నియోజకవర్గ స్థాయి బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










