📄 ePaper
Saturday, June 6, 2026
ADS
Home Blog Page 41

సామాన్య భక్తులే మాకు వీఐపీలు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

0

•బీరంగూడ గుట్టపై 24 గంటల్లోగా ఆక్రమణలు తొలగించాలి.

  • అన్ని శాఖల సమన్వయంతో మహాశివరాత్రి జాతరను జయప్రదం చేయాలి.
  • 4 నుండి 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం.. పకడ్బందీగా ఏర్పాట్లు.
  • అధికారులతో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే ఆదేశం.

అమీన్‌పూర్,ఫిబ్రవరి,5,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.రాష్ట్రంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.సామాన్య భక్తులకు ప్రథమ ప్రాధాన్యతదర్శనాల విషయంలో వీఐపీ సంస్కృతికి తావు లేకుండా, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. “మా దృష్టిలో సామాన్య భక్తులే వీఐపీలు” అని పేర్కొంటూ, భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫిబ్రవరి 14 నుండి 18 వరకు జరిగే ఈ వేడుకలకు సుమారు 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.దర్శనాల విషయంలో వీఐపీ సంస్కృతికి తావు లేకుండా, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. “మా దృష్టిలో సామాన్య భక్తులే వీఐపీలు” అని పేర్కొంటూ, భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫిబ్రవరి 14 నుండి 18 వరకు జరిగే ఈ వేడుకలకు సుమారు 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.ఆక్రమణలపై ఉక్కుపాదం
బీరంగూడ గుట్ట పైన ఉన్న అక్రమణలను 24 గంటల్లోగా తొలగించాలని తహసీల్దార్ వెంకటేష్‌ను ఎమ్మెల్యే కఠినంగా ఆదేశించారు. గతంలో చెప్పినప్పటికీ నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇకపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.ఆధునిక సాంకేతికత.. నిరంతర నిఘాకంట్రోల్ రూమ్: జాతర సమయంలో మూడు రోజుల పాటు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండాలి.భద్రత: నిఘా కోసం 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, రద్దీ నివారణకు పోలీసు శాఖ ఆధునిక టెక్నాలజీని వాడాలని సూచించారు.
రవాణా: భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించారు.జాతర పనులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకునేందుకు ఈ నెల 12వ తేదీన మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈలోపు అన్ని శాఖలు నిర్దేశించిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్‌పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, తహసీల్దార్ వెంకటేష్, అమీన్‌పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, సీఐ నరేష్, ఈవో శశిధర్, అన్ని శాఖల అధికారులు, మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

పాపన్నపేటలో ఘనంగా హనుమాన్  ఆలయ వార్షికోత్సవం.

0

పాపన్నపేట,ఫిబ్రవరి,5,మెదక్ టుడే న్యూస్:మండల కేంద్రం పాపన్నపేట లోని మర్రి చెట్టు ప్రాంగణం లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని సుందరంగా బంతి పూలతో అలంకరించారు. గణపతి పూజ,సింధూరం విశేష పూజల అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు,గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

మెదక్ మున్సిపాలిటీ 5వాడు అభ్యర్థి మామిళ్ల ఆంజనేయులుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం.

0

మెదక్ మున్సిపాలిటీ,ఫిబ్రవరి,5,మెదక్ టుడే న్యూస్: ప్రతినిధి.మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ పట్టణంలోని 5వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మామిళ్ళ ఆంజనేయులు తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా కారు గుర్తుకు ఓటేసి 5 వ వార్డ్ అభ్యర్థి మామిళ్ల ఆంజనేయులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్ణయ్య జయరాం రెడ్డి అంజా గౌడ్ లింగారెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు బి ఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు

మహాశివరాత్రి ఏడుపాయల వనదుర్గ అమ్మవారి జాతర ఘనంగా జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్.

0

పాపన్నపేట,ఫిబ్రవరి,4,మెదక్ టుడే న్యూస్:ఆధ్యాత్మిక శోభతో ఘనంగా ఏడుపాయల వనదుర్గ అమ్మవారి మహా శివరాత్రి జాతర నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు.మహాశివరాత్రి ఏడుపాయల వనదుర్గ అమ్మవారి జాతర ఘనంగా జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు,గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు.



మహాశివరాత్రి జాతర ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ అమ్మవారి జాతర పరిసర ప్రాంతాలను వనదుర్గ అమ్మవారి పరిసర ప్రాంతాలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు.ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు ఏడుపాయల జాతర వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా జాతర నిర్వహించాల్సి ఉంటుందని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్ధమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ*ఏడుపాయల అమ్మవారి క్షేత్రంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే జాతర ఆధ్యాత్మికంగా, దైవికంగా నిబంధనలు పాటిస్తూ, ఎక్కడ ఎలాంటి లోపాలు జరగకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు.ఏడుపాయల ఆలయంలో జరిగే పూజలలో ఎలాంటి లోపాలు ఉండకుండా చూడాలని, శాస్త్రపరంగా అమ్మవారి పూజలు ఘనంగా జరగాలని, భక్తులకు త్వరగా దర్శనం లభించే విధంగా చర్యలు తీసుకోవాలని, జాతర నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ఏడుపాయల మహాశివరాత్రి జాతర సందర్భంగా ఎక్కువ బస్సు సర్వీసులు నడపాలని, జాతరకు ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తుల రద్దీ ఆధారంగా డిపో మేనేజర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అవసరమైన రోడ్లలో అదనపు సర్వీసులు నడపాలని సూచించారు.జాతర సందర్భంగా వచ్చే భక్తులకు త్రాగునీటి ఇబ్బందులు కలక్కుండా ఎక్కడికక్కడ త్రాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఆలయ పరిసరంలో అపరిశుభ్రత కాకుండా మూడు షిఫ్ట్ లో పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.జాతర సందర్భంగా వైద్య క్యాంపులు ఏర్పాటు చేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యమైన ప్రదేశాలలో అన్ని పందిళ్ళ వద్ద మంటలు ఆర్పే ఫైర్ యంత్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు.జాతరను పర్యవేక్షించేందుకు అన్ని శాఖల అధికారుల నోడల్ ఆఫీసర్ల సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, భక్తుల కోసం ఎక్కడికక్కడ హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని సూచించారు.గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భక్తులు మెచ్చేలా ఏర్పాటు చేసినట్లు వివరించారు.

మత్స్య శాఖ ఆధ్వర్యంలో 150మంది గజ ఈతగాళ్లు

2 ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా అగ్నిమాపక వాహనాలు, ఒక ద్విచక్ర వాహనం అందుబాటులో ఉంచుతున్నారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా 5 ప్రదేశాలలో క్యాంప్ లు, నాలుగు 108 అంబులెన్సు లు,లక్ష వో ఆర్ ఎస్ ప్యాకెట్ లు, మందులు, అంత్యవసర మందులు,28 మంది డాక్టర్లు, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ 4, 80 మంది ఆయుష్ డాక్టర్లు, ఏఎన్ఎంలు100, ఇతర వైద్య సిబ్బంది మొత్తం 300 మంది పనిచేస్తారని తెలిపారు.

ఆర్టీసీ ద్వారా ప్రతి రోజు వివిధ రూట్లలో 140 బస్సులు మూడు రోజుల పాటు మొత్తం 420 బస్సులు నడుస్తాయని తెలిపారు.
టేకుల గడ్డ బస్టాండ్ నుండి 10 ఉచిత మినీ బస్సులు తిరుగుతాయి తెలిపారు.

ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 9 సంచార బృందాలు, 2 చెక్ పోస్టులు,

మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల సమన్వయంతో 144 నల్లాలు, 45 మంది మానిటరింగ్ చేస్తారని,400 మంది కార్మికులు,498 మరుగు దొడ్లు, వాటర్ ట్యాంకర్లు 40, ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.జిల్లా పంచాయతీ శాఖ ద్వారా 18 మంది సెక్టార్ అధికారులు,180 మంది పంచాయతీ కార్యదర్శులు,640 మంది మల్టీ పర్పస్ కార్మికులు,రెండు షిఫ్ట్లలో పని చేయనున్నారు .13 తేదీ నుంచి 18 వ తేదీ వరకు పనులు చేయనున్నారు. డస్ట్ బిన్స్, బ్లీచింగ్ పౌడర్, పాగింగ్ చేయనున్నారు.

పోలీసు బందోబస్తు…

జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు 04 డీఎస్పీలు, 23 మంది సీఐలు, 80మంది ఎస్సైలు, 45మంది ఏఎస్సైలు, 96మంది హెడ్ కానిస్టేబుళ్ళు, 250 మంది కానిస్టేబుళ్లు, 84 మంది మహిళా కానిస్టేబుళ్లు, 234 మంది హోంగార్డులు, 14మంది మహిళా హోంగార్డులు మొత్తం 829 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారని తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవోలు మెదక్ రమాదేవి, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య, నాగ్సన్పల్లి సర్పంచ్ సుశీల, ఆలయ కార్య నిర్వహణ అధికారి, వీరేశం, తాసిల్దార్ సతీష్ కుమార్, కొల్చారం తాసిల్దార్ శ్రీనివాస చారి, వివిధ శాఖల జిల్లా అధికారులుఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సీఎం ఆర్ ఎఫ్ పేదలకు ఒక వరం

0

చేగుంట,ఫిబ్రవరి,2,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం బి. కొండాపూర్ గ్రామానికి చెందిన ముటుకుపల్లి రమాదేవి కి దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చొరవతో వచ్చిన 60000 రూపాయల సి ఎం ఆర్ ఎఫ్ చెక్కును మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్,ఎఎంసి డైరెక్టర్ స్టాలిన్ నర్సింలు, యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, చిన్న శివునూరు ఉపసర్పంచ్ బొల్ల ప్రశాంత్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్,బి.కొండాపూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్,మహిపాల్ పాల్గొన్నారు.

అమీన్‌పూర్ చెరువును రక్షించుకుందాం- పర్యావరణాన్ని కాపాడుకుందాం-ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం.

0

అమీన్‌పూర్,ఫిబ్రవరి,2,(మెదక్ టుడే) న్యూస్,ప్రతినిధి.ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర జీవవైవిధ్య మండలి ఆధ్వర్యంలో అమీన్‌పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణలోనే మొట్టమొదటి పట్టణ ప్రాంత జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన అమీన్‌పూర్ చెరువు విశిష్టతను విద్యార్థులకు వివరించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.కార్యక్రమ ముఖ్యాంశాలు:అవగాహన కల్పన: చిత్తడి నేలలు భూమికి ‘కిడ్నీలు’ వంటివని, నీటి శుద్ధికి మరియు భూగర్భ జలాల పెరుగుదలకు ఇవి ఎంతగానో దోహదపడతాయని అధికారులు విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా అమీన్‌పూర్ చెరువుకు వచ్చే వలస పక్షులు మరియు అక్కడి జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు.వివిధ పోటీలు: విద్యార్థులకు చిత్తడి నేలల సంరక్షణపై వ్యాసరచన, చిత్రలేఖనం మరియు క్విజ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు.బహుమతి ప్రదానం: పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో జీవవైవిధ్య మండలి రీజినల్ కోఆర్డినేటర్ డా. శిల్పి శర్మ, సాంకేతిక అధికారులు, అమీన్‌పూర్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమీషనర్, ఇతర మున్సిపల్ అధికారులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. సుమారు 250 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.ఈ సందర్భంగా డా. శిల్పి శర్మ మాట్లాడుతూ, “భావి భారత పౌరులైన విద్యార్థులకు ప్రకృతి పట్ల మక్కువ, పర్యావరణం పట్ల బాధ్యత కలిగించడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.

అమీన్‌పూర్ సమ్మక్క-సారలమ్మ జాతరపై అపోహలు వద్దు: ఆలయ చైర్మన్ నీలం భిక్షపతి వివరణ

0

అమీన్‌పూర్,ఫిబ్రవరి,2(మెదక్ టుడే) న్యూస్,ప్రతినిధిఅమీన్‌పూర్‌లో గత 20 ఏళ్లుగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న మినీ మేడారం జాతర విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నీలం భిక్షపతి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనపై వస్తున్న కొన్ని ఆరోపణలను తిప్పికొడుతూ, వాస్తవాలను భక్తుల ముందు ఉంచారు.న్యాయపోరాటం మరియు భూమి కేటాయింపు”అమీన్‌పూర్‌లో అమ్మవారి ఆలయం కోసం హైకోర్టు నుండి ఆర్డర్ కాపీని తెచ్చుకోవడం జరిగింది. ప్రభుత్వం మరియు న్యాయస్థానం ద్వారా ఆలయానికి జాగా కేటాయించబడింది. ఇది నా వ్యక్తిగత విజయం కాదు, అమ్మవారి కృప మరియు భక్తుల నమ్మకం.గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ జాతర నిర్వహిస్తున్నాను. అమీన్‌పూర్ గ్రామ పెద్దలకు, పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలకు మరియు స్థానిక ఎమ్మెల్యే గారికి ఈ ఆలయం కోసం ఎవరు కష్టపడ్డారో, ఎవరు నిలబడ్డారో అందరికీ తెలుసు. అప్పుడు లేని వారు ఇప్పుడు వచ్చి పాత్ర లేదని ఆరోపించడం హాస్యాస్పదం.నాపై వస్తున్న ఆరోపణలకు జాతర ప్రారంభమైన రోజే (జనవరి 28న) సమాధానం చెప్పాలని అనుకున్నాను. కానీ, పవిత్రమైన జాతర మహోత్సవానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాను. జాతర విజయవంతంగా ముగిసిన తర్వాతే ఈ వివరణ ఇస్తున్నాను.”ప్రచారం కోసం కాదు.. సేవ కోసం:”ప్రచారం కోసం పాకులాడే మనస్తత్వం నాది కాదు. కష్టపడి ఆలయాన్ని నిర్మించాం, అమ్మవారి సాక్షిగా అందరికీ నిజాలు తెలుసు. సరైన సమయం వచ్చినప్పుడు మరిన్ని పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచుతాను. నన్ను నమ్ముకున్న ప్రజలందరికీ, భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి.ఎవరో ఏదో అన్నారని కంగారు పడాల్సిన పనిలేదు. అమీన్‌పూర్ ప్రజలకు, మీడియా మిత్రులకు ఈ ఆలయ ప్రస్థానం గురించి పూర్తి అవగాహన ఉంది. ఆరోపణలు చేసే వారు చేస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరుగా ఉన్నాయి.”— నీలం భిక్షపతి (ఆలయ చైర్మన్)

మంబోజీపల్లి గ్రామంలో బిఆర్ఎస్ నాయకుడు గంజి నవీన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం.

0

మెదక్ రూరల్,ఫిబ్రవరి,1,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొదలైన నిరసనలు.కేసీఆర్ ని ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి హెచ్చరించిన గులాబీ సైన్యంపాలన చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్ గారిపై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంకేసీఆర్ గారి జోలికి వస్తే రేవంత్ రెడ్డిని, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉన్నది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు గంజి నవీన్ కుమ్మరి రమేష్ ,గంజి శ్రీకాంత్,మ్యకల శేఖర్,గోపని సాయి, చిట్యాల శేఖర్, మహేందర్ ,నాగరాజు,వంశీ, సాయినందు,సురేందర్, జితూ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా మెదక్ మున్సిపాలిటీ 8 వ వార్డు బిజెపి అభ్యర్థి లావణ్య నర్సింగరావు.

0

మెదక్,ఫిబ్రవరి,1,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.మెదక్ పట్టణంలోని రామ్ నగర్ కాలనీ వాసవి నగర్ కాలని 8వ వార్డు ఓటర్ మహాశయులందరికి నమస్కారములతో భారతీయ జనతా పార్టీ సహకారంతో కౌన్సిలర్ గా పోటీ చేస్తూ మీ ముందుకి వస్తున్నాను. మెదక్ పట్టణంలో రాంనగర్ మరియు వాసవి నగర్ ఎనిమిదో వార్డులో గతంలో కౌన్సిలర్ గా పని చేసిన వారు అభివృద్ధిలో వెనుకబడ్డారు కాంగ్రెస్ టిఆర్ఎస్లకు అవకాశం ఇచ్చారు ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రాంనగర్ మన వార్డులో ప్రతి పైసా జవాబుదారితనముగా ఉపయోగిస్తాము. రామ్ నగర్ వాసవినగర్ లో ఉన్న ప్రతి సమస్యను తీర్చడంలో ముందుంటాము. రామ్ నగర్ లో ఉన్న ఓటరు మహాశయులకు విన్నవించేది ఒక్కసారి ఆలోచించండి, మీరు వేసే ఓటు ప్రగతికి బాటగా నిలుస్తుంది .దేశంలో మోడీ నాయకత్వంలో పట్టణాలు పల్లెలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. వికసితభారత్ దిశగా అడుగులు వేస్తున్నాయి మన పట్టణాన్ని కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేద్దాం. భారతీయ జనతా పార్టీ పట్టణాలను వేగంగా అభివృద్ధి చేస్తుంది మన మెదక్ పట్టణం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే బిజెపికి మీ ఓటు వేయండి అభివృద్ధిలో భాగస్వాములు కండి రామ్ నగర్ లో వాసవి నగర్ లో ఉన్న ప్రతి సమస్యను తీర్చడంలో మీ ముందుంటాము. పారిశుద్ధ సమస్య, నీటి సమస్య సమస్య మౌలిక వసతులు కరెంటు సమస్య గృహము లేని వారికి గృహాలు అందివ్వడం, నిస్వార్ధంగా పనిచేసే వారికి పట్టం కట్టండి ప్రజాసేవకి అంకితం అవుతామని ఒకసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధిని చేసి చూపిస్తాముఅని
లావణ్య నర్సింగ్ రావు తెలిపారు.8వ వార్డ్ కౌన్సిలర్ బీజేపీ అభ్యర్థిరాంనగర్ కాలని,మరియు వాసవి నగర్ కాలని,

బిజెపి పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో  22 మంది కౌన్సిలర్ బి ఫామ్.

0

మెదక్,ఫిబ్రవరి,1,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.ఆదివారం రోజు మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మరియు మెదక్ మున్సిపల్ ఎన్నికల ప్రబారి సంగమేశ్వర్ ఆధ్వర్యంలో మెదక్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బిజెపి అభ్యర్థుల మొదటి లిస్టు విడుదల చేయడం జరిగింది ఇట్టి బీఫాం లిస్టు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి మెదక్ మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ ఎం ఎల్ ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.