📄 ePaper
Saturday, June 6, 2026
ADS
Home Blog Page 40

బండ్ల ఊరేగింపు సందర్భంగా పోలీస్ బందోబస్తు పరిశీలన-ఏడుపాయల వన దుర్గామాత జాతరకు భారీగా తరలివస్తున్న భక్తులు.

0

తొక్కిసలాటలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు

ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి

జాతర ప్రాంతమంతటా నిరంతర నిఘా, కట్టుదిట్టమైన భద్రత

మెదక్ అదనపు ఎస్పీ మహేందర్.

పాపన్నపేట,ఫిబ్రవరి,16 మెదక్ టుడే న్యూస్:  సోమవారం జరుగుతున్న రెండవ రోజు ఏడుపాయల వన దుర్గామాత జాతర సందర్భంగా నిర్వహిస్తున్న బండ్ల ఊరేగింపును పురస్కరించుకొని అదనపు ఎస్పీ శ్రీ మహేందర్ గారు జాతర ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును స్వయంగా పరిశీలించారు. బండ్ల ఊరేగింపు మార్గం, భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు తదితర అంశాలను అదనపు ఎస్పీ గారు క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఏడుపాయల వన దుర్గామాత జాతర రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతుండటంతో, బండ్ల ఊరేగింపును తిలకించేందుకు వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి తొక్కిసలాటలు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అదనపు ఎస్పీ గారు ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధంగా నియంత్రించడం, పార్కింగ్ ప్రాంతాల్లో సిబ్బందిని నియమించడం, క్యూలైన్లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.అలాగే జాతర ప్రాంతమంతటా నిరంతర పోలీస్ నిఘా కొనసాగిస్తూ, సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. జాతరను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని అదనపు ఎస్పీ తెలిపారు.

బీరంగూడలో ఘనంగా మహాశివరాత్రి అన్నదాన కార్యక్రమం–25 ఏళ్లుగా సేవా.

0

బీరంగూడలో ఘనంగా మహాశివరాత్రి అన్నదాన కార్యక్రమం – 25 ఏళ్లుగా సేవా యజ్ఞాన్ని కొనసాగిస్తున్న కాటా కృష్ణ గౌడ్, బిజిలి శ్రీరాములు బృందం.

అమీన్ పూర్,ఫిబ్రవరి,16,(మెదక్ టుడే) న్యూస్,ప్రతినిధి:అమీన్పూర్ బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గత 25 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతున్న నిత్య అన్నదాన కార్యక్రమం ఈ ఏడాది కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది.ప్రముఖ దాతలు కాటా కృష్ణ గౌడ్ మరియు బిజిలి శ్రీరాములు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈ మహత్కార్యాన్ని పాతికేళ్లుగా నిర్వహిస్తున్నారు. స్వామి వారిపై ఉన్న అపారమైన భక్తితో, దర్శనానికి వచ్చే భక్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమాన్ని వీరు నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు.నాలుగు రోజుల పాటు: మహాశివరాత్రి జాతర సందర్భంగా బీరంగూడలో నాలుగు రోజుల పాటు కన్నుల పండుగగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.భక్తులకు సౌకర్యం: సుదూర ప్రాంతాల నుండి వచ్చే వేలాది మంది భక్తులకు రుచికరమైన, శుచికరమైన భోజనాన్ని వడ్డిస్తున్నారు.
కుటుంబ సమేతంగా సేవ: కేవలం ఆర్థిక సాయమే కాకుండా, కాటా కృష్ణ గౌడ్ మరియు బిజిలి శ్రీరాములు కుటుంబ సభ్యులు స్వయంగా ఉండి భక్తులకు వడ్డన చేస్తూ తమ సేవా భావాన్ని చాటుకుంటున్నారు.మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులందరూ ఈ అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.

అభివృద్ధి కీ దాతలే .. పెద్ద దిక్కు .!

0

అభివృద్ధి కీ దాతలే .. పెద్ద దిక్కు .!

పాపన్నపేట,ఫిబ్రవరి,14,మెదక్ టుడే న్యూస్:రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7 న ఏర్పడి ఇటీవలే రెండు సంవత్సరాలు పూర్తి అయింది. మెదక్ జిల్లా ఏడుపాయలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు 2024 డిసెంబర్ 25 న విచ్చేసి వనదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ ప్రాంత అభివృద్ధికీ నిధులు కేటాయిస్తారని భక్తులు ఆశించిన అలాంటి ప్రకటన అప్పట్లో రాలేదు. భక్తుల ఆదాయంపై దృష్టి పెట్టారు కానీ,అభివృద్ధిపై లేదని,దేవాదాయ,ధర్మదాయ శాఖ,ప్రభుత్వం శాశ్వత నిర్మాణాలను చేపట్టడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దాతలే ప్రసాద విక్రయ కేంద్రం, వాహన పూజ షెడ్డు,అద్దె గదులు ఇలా వివిధ రూపాలలో సహాయం అందిస్తూ ఏడుపాయల అభివృద్ధి కీ పెద్ద దిక్కుగా మారారు. జాతరకు ముందే అధికారులు ఏర్పాట్ల పనుల కార్యచరణ ప్రకటిస్తారు. ఇటీవలే రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 35 కోట్లు మంజూరు కాగా పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు.ఈ ప్రాంత అభివృద్ధికీ స్థానిక మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు ప్రభుత్వ సహకారంతో నిధులను సకాలంలో అందిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు.

మెదక్ మున్సిపాలిటీలో తల్లి కొడుకుల విజయం.

0

మెదక్,ఫిబ్రవరి,13,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.మెదక్ పట్టణంలో 14వ వాడు అభ్యర్థి దొంతి లక్ష్మీ ముత్యం గౌడ్ మూడవసారి గెలిచి హ్యాట్రిక్ సాధించింది తన కుమారుడైన దొంతి నరేష్ గౌడ్ 15వ వార్డ్ మొదటిసారిగా గొరిపొందారు.

మెదక్ మున్సిపాలిటీ హంగ ఏర్పడింది బి ఆర్ ఎస్ 15 వార్డులు కాంగ్రెస్ 14 బిజెపి 2 బీఎస్పీ 1

0

మెదక్ టౌన్, ఫిబ్రవరి,13, మెదక్ టుడే న్యూస్,ప్రతినిధి:మెదక్ మున్సిపాలిటీలో హంగు ఏర్పడింది బి ఆర్ ఎస్ 15 వార్డులు గెలవగా కాంగ్రెస్ 14 వార్డులు బిజెపి రెండు వార్డులు బిఎస్పి ఒక వాడు గెలుపొందారు కాగా బీఎస్పీ అభ్యర్థి గెలిచిన వెంటనే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సమక్షంలో కాంగ్రెస్ చేరారు కాగా మెదక్ మున్సిపాలిటీలో హంగు ఏర్పడింది కాంగ్రెస్ 15 బీర్ ఎస్ 15 బిజెపి 2 మెదక్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి మహిళా రిజర్వు కావడంతో ఎవరికి వరిస్తుందో వేచి చూడాలి గెలిచిన విజేతలు
మొత్తం 112 మంది బరిలో ఉన్నారు.
ఒక్కరు ఏకగ్రీవం : 32 వ వార్డు గోదల మానస సాయిరాం
మొత్తం : 113 మంది.

1, వ వార్డ్  : ఔరంగాబాద్ ఏరియా వార్డ్ 
రిజర్వేషన్ : ఎస్సీ మహిళా
విజేత
బిఆర్ఎస్ అభ్యర్థి : చెప్పాలా రాజవ్వ సంజీవ్

2, వ వార్డ్ : ఆవుసుల పల్లి  ఏరియా వార్డ్
రిజర్వేషన్ : ఎస్టీ జెనరల్
విజేత
కాంగ్రెస్ అభ్యర్థి : ఎరుకల నరసింహులు

3, వ  వార్డ్ :  ఆవుసుల పల్లి  ఏరియా వార్డ్
రిజర్వేషన్ : జెనరల్ మహిళా
విజేత
బిఆర్ఎస్ అభ్యర్థి : కొట్టాల లలితమ్మ, విశ్వం.

4, వ వార్డ్   :  హౌసింగ్ బోర్డ్ కాలనీ మరియు  ఆర్టీసీ కాలనీ ఏరియాలు వార్డ్     
రిజర్వేషన్ : జెనరల్ మహిళా
విజేత
బిఆర్ఎస్ అభ్యర్థి : ధర్మ శెట్టి స్వరూప.

5, వ వార్డ్ : ఇందిరా కాలనీ మరియు మిలిటరీ కాలనీ ఏరియాలు వార్డ్
రిజర్వేషన్ : జెనరల్
విజేత
బిఆర్ఎస్ అభ్యర్థి : మామిడ్ల ఆంజనేయులు
6, వ వార్డ్  : జమ్మికుంట కాలనీ మరియు ఇంద్ర కాలనీ ఏరియాలు వార్డ్              
రిజర్వేషన్ : జెనరల్
విజేత
కాంగ్రెస్ అభ్యర్థి : కొడకంటి హరిత,నర్సింగరావు.

7, వ వార్డ్ : రాంనగర్ కాలనీ మరియు కోవతిస్లం ఏరియాలు, వార్డ్                
రిజర్వేషన్ : బీసీ మహిళా
విజేత
కాంగ్రెస్ అభ్యర్థి : శంసున్నీసా ,అంజత్ భాయ్.

8, వ వార్డ్ : రాంనగర్ కాలనీ ఏరియా వార్డ్         
రిజర్వేషన్ : బీసీ మహిళా
విజేత
బిఆర్ఎస్ అభ్యర్థి : :మాయాగంగామణి,
మల్లేశం.

9, వ వార్డ్  : వాసవి నగర్ కాలనీ మరియు ఆజంపుర కాలనీ ఏరియాలు  వార్డ్  
రిజర్వేషన్ : జెనరల్
విజేత
బిఆర్ఎస్ అభ్యర్థి: ఎం డి,  జుబేర్ అహ్మద్ (మెహతాబ్ మెడికల్ )

10, వ వార్డ్ : నర్స్ కేడు ఏరియా వార్డ్      
 రిజర్వేషన్ : జెనరల్ మహిళ
విజేత
కాంగ్రెస్ అభ్యర్థి : చింతల లక్ష్మీ స్వరాగిని, చింతల నర్సింలు కోడలు.

11, వ వార్డ్   : సాయి నగర్ కాలనీ మరియు వెంకట్రావు నగర్ కాలనీ మరియు బాబా కాలనీ మరియు రషీద్ కాలనీ ఏరియాలు వార్డ్              
రిజర్వేషన్ :  బీసీ మహిళ
విజేత
కాంగ్రెస్ అభ్యర్థి : నస్రిన్ బేగం, సంయోద్దీన్ సిస్టర్

12, వ వార్డ్ : రషీద్ కాలనీ మరియు పిల్లి కోటలు కాలనీ ఏరియాలు వార్డ్                
రిజర్వేషన్ :  బీసీ మహిళ
విజేత
బిఆర్ఎస్ అభ్యర్థి : అనిసా ఫాతిమా, ఇందాద్ ఆలీ.

13, వ వార్డ్ :  వడ్డెర కాలనీ మరియు చంద్రపాల్ వెంచర్ మరియు మార్కెట్ యార్డ్ కాలనీ ఏరియాలు వార్డ్             
 రిజర్వేషన్ : ఎస్సీ మహిళా
విజేత
బిఆర్ఎస్ అభ్యర్థి : చెదల సంధ్యారాణి , నవీన్

14, వ వార్డ్  : నవపేట్   ఏరియా వార్డ్       
 రిజర్వేషన్ : జెనరల్ మహిళా
విజేత
కాంగ్రెస్ అభ్యర్థి : దొంతి లక్ష్మి, ముత్యం గౌడ్

15, వ వార్డ్  : నవపేట్, గోడ్లల గడ్డ మరియు కట్టకింద కాలిని మరియు పిట్లంబేస్
ఏరియాలు వార్డ్
రిజర్వేషన్ : బీసీ జెనరల్
విజేత
కాంగ్రెస్ అభ్యర్థి : దొంతి నరేష్ గౌడ్.

16, వ వార్డ్ : దాయర కాలనీ, చమన్ , సంజీవయ్య కాలనీ ఏరియాలు  వార్డ్   
రిజర్వేషన్ : బీసీ జెనరల్
విజేత
బిఆర్ఎస్ అభ్యర్థి : అవారి రాజశేఖర్.

17, వార్డ్: సుభాష్ కాలనీ మరియు రిక్షా కాలనీ మరియు దాయర కాలనీ ఏరియాలు
రిజర్వేషన్  :  జెనరల్ మహిళా
విజేత
బీ ఎస్పీ అభ్యర్థి : బుజ్జరంపేట అరుణ,అఖిల్ అమ్మ.

18,వ వార్డ్  : గాంధీనగర్ కాలనీ వార్డ్           
రిజర్వేషన్ :  ఎస్సీ జెనరల్
విజేత
కాంగ్రెస్ అభ్యర్థి : పాత శశాంక్ తేజ్.రితీష్

19, వ వార్డ్ : ఫతే నగర్  మరియు చమన్ మరియు మిషన్ కాంపౌండ్ కాలనీ  మరియు గాంధీనగర్ ఏరియాలు వార్డ్                   
రిజర్వేషన్ : జెనరల్
విజేత
కాంగ్రెస్ అభ్యర్థి : గంట సంపత్.

20, వ వార్డ్ :  పతెనగర్ మరియు  మల గడ్డ  ఏరియాలు  వార్డ్
రిజర్వేషన్ : బీసీ జెనరల్
విజేత
కాంగ్రెస్ అభ్యర్థి : మహమ్మద్ మన్సూర్ హైమద్.

21, వ వార్డ్ : పతెనగర్ మరియు చమన్ మరియు పిట్లంబేస్ వార్డ్
 రిజర్వేషన్ : బీసీ మహిళ
విజేత
బిజెపి అభ్యర్థి : పబ్బ రాజమణి, లక్ష్మణ్.

22, వ  వార్డ్ : పతెనగర్ మరియు చింత బొంద మరియు  చమన్ ఏరియాలు వార్డ్
రిజర్వేషన్ : జెనరల్
విజేత
బిఆర్ఎస్ అభ్యర్థి : మహమ్మద్ గౌస్ ఖురేషి.

23, వ వార్డ్ : చమన్ మరియు పిట్లంబేస్ ఏరియాలు వార్డ్         
రిజర్వేషన్ : జెనరల్ మహిళ
విజేత
బిఆర్ఎస్ అభ్యర్థి : మద్దిబోయిన శృతి,  సంతోష్ ( పూసల )

24, వ  వార్డ్ : బ్రాహ్మణ విధి మరియు చమన్ మరియు జెన్ రోడ్డు ఏరియాలు వార్డ్
రిజర్వేషన్ :  బీసీ జెనరల్
విజేత
కాంగ్రెస్ అభ్యర్థి : కానుగు రాధిక, భూపతి రాజ్.

25, వ వార్డ్  :  పిల్లిడి మరియు బ్రాహ్మణ వీధి ఏరియాలు వార్డ్
రిజర్వేషన్ : బీసీ జెనరల్
విజేత
బిఆర్ఎస్ అభ్యర్థి :  కాజా సోయల్ మొహమ్మద్దీన్
 
26, వ  వార్డ్  :  ఆజంపుర మరియు శాంతినగర్ ఏరియాలు వార్డ్
రిజర్వేషన్ : ఎస్సీ జెనరల్
విజేత
బిఆర్ఎస్ అభ్యర్థి : మ్యాదరి దీపక్ కుమార్.

27, వ వార్డ్: గోల్కొండ ఏరియా వార్డ్
రిజర్వేషన్  : జెనరల్ మహిళా
విజేత
బిఆర్ఎస్ అభ్యర్థి : అస్తరి గల్లపల్లె రాణి, బాల రాజ్.

28, వ వార్డ్ : కోలీగడ్డ ఏరియా వార్డ్
 రిజర్వేషన్ : జెనరల్ మహిళా
విజేత
బిజెపి అభ్యర్థి : బోడికే అఖిల, భరత్ పల్స్ హాస్పిటల్

29, వ వార్డ్  : అరబ్ గల్లి మరియు మార్కెట్ మరియు కుమ్మరిగడ్డ ఏరియాలు వార్డ్      
రిజర్వేషన్ : బీసీ జెనరల్
విజేత
బిఆర్ఎస్ అభ్యర్థి : బట్టి ఉదయ్ కుమార్

30, వ వార్డ్:    పెద్ద బజార్ మరియు కుమ్మరి గడ్డ మరియు పుచ్చగడ్డ  నవాపేట్  ఏరియాలు
వార్డ్  
రిజర్వేషన్ : జెనరల్
విజేత
కాంగ్రెస్ అభ్యర్థి : అరుణాతి వెంకటరమణ

31, వ వార్డ్ : పిట్లంబేస్ మరియు
 పెద్దబజార్ భరహీమము మరియు  మార్కెట్  ఏరియాలు       
రిజర్వేషన్ : జెనరల్
విజేత
కాంగ్రెస్ అభ్యర్థి : తొడుపునూరి  శివ రామ కృష్ణ, తండ్రి చంద్రపాల్.

32, వ వార్డ్ : పిట్లంబేస్ ఏరియా వార్డ్
 రిజర్వేషన్ : జెనరల్ మహిళ
విజేత
కాంగ్రెస్ అభ్యర్థి : గోదల మానస, సాయిరాం
“”ఏకగ్రీవం గెలుపు  : గోదాల మానస సాయిరాం

కాంగ్రెస్  : 14
బి ఆర్ ఎస్ : 15
బిజెపి : 2
ఏఐఎంఐఎం : 0
బి ఎస్పీ : 1
ఇండిపెండెంట్ లు : 0

తెలంగాణ శ్రీశైలం ‘బీరంగూడ’.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధం!

0

5 లక్షల మంది భక్తులకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – దక్షిణ కాశీలో వైభవంగా ఉత్సవాలు

అమీన్ పూర్ ఫిబ్రవరి 14:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.ఆధ్యాత్మికతకు నిలయం, భక్తుల కొంగుబంగారం.. పటాన్‌చెరు నియోజకవర్గంలోని బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. సుమారు 1500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం, భక్తుల పాలిట “తెలంగాణ శ్రీశైలం”గా విరాజిల్లుతోంది. ఈ నెల 14 నుండి 18 వరకు జరిగే ఉత్సవాలకు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న ఆలయ యంత్రాంగం, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లను పూర్తి చేసింది.అభిషేకం చేస్తే శ్రీశైలం వెళ్ళినంత పుణ్యం!
ఈ ఆలయ విశిష్టత అనన్యం. బీరంగూడ స్వామివారికి అభిషేకం చేస్తే శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నంత ఫలితం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఐదవ శతాబ్దంలో బృగు మహర్షి స్వయంగా ఇక్కడ తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్టించారని ఆలయ చరిత్ర చెబుతోంది. ఇక్కడి రావి మరియు మర్రి చెట్టుకు 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉండటం విశేషం.

అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు.

ఆలయ చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్, ఈవో శశిధర్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు:
ట్రాఫిక్ & పోలీస్: ట్రాఫిక్ డీసీపీ, డీఎస్పీల పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 4-5 లక్షల మంది వస్తున్నారు కాబట్టి పార్కింగ్ మరియు క్యూ లైన్ల వద్ద ఎక్కడా ఇబ్బంది కలగకుండా సీసీ కెమెరాల నిఘా ఉంచారు.రెవెన్యూ & మున్సిపల్: అమీన్‌పూర్ ఎంఆర్వో వెంకటేష్, జీహెచ్‌ఎంసీ డీసీ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో పారిశుధ్యం, నీడ కోసం షెడ్లు మరియు తాగునీటి సౌకర్యం కల్పించారు.
ఆర్టీసీ: భక్తుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.

ఉత్సవాల ముఖ్య ఘట్టాలు

ఫిబ్రవరి 14: అఖండ దీపారాధనతో బ్రహ్మోత్సవాల శ్రీకారం.
ఫిబ్రవరి 15 (శివరాత్రి): అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాల రుద్రాభిషేకం.
ఫిబ్రవరి 16 (సోమవారం): ఉదయం 10:45కు స్వామివారి కళ్యాణం, సాయంత్రం రథోత్సవం.
ఫిబ్రవరి 18: పూర్ణాహుతితో ఉత్సవాల ముగింపు.

ప్రత్యేక ఆకర్షణ – కాలభైరవ, హనుమంతుని దర్శనం

ఈ క్షేత్రంలో మల్లికార్జున స్వామితో పాటు భ్రమరాంబ అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. ఇక్కడి కాలభైరవ స్వామికి అమావాస్య రోజున గుమ్మడికాయ దీపాలు వెలిగిస్తే భూమి వివాదాలు తొలగుతాయని, అలాగే శని దోష నివారణకు శనివారం హనుమంతుడికి ప్రదక్షిణలు చేయడం ఇక్కడి ప్రత్యేకత.

భక్తులకు విజ్ఞప్తి:
దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు క్రమశిక్షణతో దర్శనం చేసుకోవాలని, ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణలో పాల్గొనాలని చైర్మన్ సుధాకర్ యాదవ్ కోరారు.

ఆలయ ఈవో శశిధర్ మాట్లాడుతూ.

“ఈ ఏడాది మహాశివరాత్రికి రికార్డు స్థాయిలో 4 నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాము. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి ట్రాఫిక్ డీసీపీ మరియు డీఎస్పీ సహకారంతో ప్రత్యేక క్యూ లైన్లు, పార్కింగ్ వసతులు ఏర్పాటు చేశాము. ముఖ్యంగా శివరాత్రి రోజున భక్తులకు ఇబ్బంది కలగకుండా మంచినీరు, విద్యుత్ సరఫరా నిరంతరం ఉండేలా చూస్తున్నాము. గడ్డపోతారం మున్సిపాలిటీ, అమీన్‌పూర్ రెవెన్యూ మరియు పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఆలయ ప్రాంగణమంతా సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది” అని తెలిపారు.

ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ:

బీరంగూడ గుట్టను దక్షిణ కాశీగా భక్తులు కొలుస్తారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే శ్రీశైలం వెళ్ళినంత పుణ్యం దక్కుతుందని ప్రతీతి. భక్తుల కోసం ఈ నెల 14 నుండి 18 వరకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి సహకారంతో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ, వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచాము. భక్తులు అధికారులకు, ఆలయ సిబ్బందికి సహకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాను. ముఖ్యంగా సోమవారం జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవం మరియు రథోత్సవానికి భక్తులు భారీగా తరలిరావాలి” అని పిలుపునిచ్చారు.

చైన్ స్నాచింగ్ ఘటనలో వేగంగా స్పందించిన టేక్మాల్ పోలీసులు.

0

•స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుల అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు: టేక్మాల్ ఎసై అరవింద్

మెదక్,టేక్మాల్,ఫిబ్రవరి,13,మెదక్ టుడే న్యూస్:మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన్నట్లు టేక్మాల్ ఎస్‌ఐ అరవింద్ వెల్లడించారు. వివరాల ప్రకారం తంప్లూర్ గ్రామానికి చెందిన శ్యామల అనే మహిళ పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా, గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును అపహరించి అక్కడి నుండి పరారయ్యారు. బాధితురాలు వెంటనే టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సమాచార సేకరణ ఆధారంగా నిందితులైన పాపయ్య, పోచయ్య గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దొంగిలించిన మూడు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చైన్ స్నాచింగ్ ఘటనలు అధికమవుతున్నాయని ఎస్‌ఐ అరవింద్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ఏడుపాయల జాతర పెండింగ్ పనులు పూర్తి చేయాలి,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

0

పాపన్నపేట,ఫిబ్రవరి,13,మెదక్ టుడే న్యూస్:భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని,ఏడుపాయల జాతర పెండింగ్ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఏడుపాయల జాతర ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ,భక్తులకు అసౌకర్య కలవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ట్రాఫిక్, త్రాగునీరు, పార్కింగ్ పార్కింగ్, సంస్కృతిక కార్యక్రమాలు, దర్శన ఏర్పాట్లు , ఇతర పెండింగ్లో ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సంవత్సరం జాతరకు దాదాపు పది లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జాతరను ప్రశాంతంగా ముగించాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వీరేశం,వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఏడుపాయల మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు..

0

మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్.

పాపన్నపేట,ఫిబ్రవరి,12, మెదక్ టుడే న్యూస్:మహా శివరాత్రి సందర్బంగా మెదక్ జిల్లా ఏడుపాయలలో ఫిబ్రవరి 15 నుండి 17 వరకు జరిగే వనజాతర ఏర్పాట్లను మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ గురువారం పరిశీలించారు. ఆలయం ముందు నది పాయలో శివుడిని ఏర్పాటు చేసే ప్రాంతం,లడ్డు పులిహోర ప్రసాద విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఆలయ ఈఓ వీరేశం మీడియాతో మాట్లాడుతూ, ఈ మహాశివరాత్రి జాతరకు తెలంగాణ ప్రాంతమే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్ ఉన్నారు.

బిఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి- ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు.

0

మెదక్,ఫిబ్రవరి,8,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,మెదక్ ప్రజలను నమ్మించి మెదక్ వచ్చిన విధులను సిద్దిపేటకు తీసుకెళ్లి పదేళ్ల కాలంలో మోసం చేసిన బిఆర్ఎస్ దొంగల ముఠా హరీష్ రావుకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలోని 6,11,27,13 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో మెదక్ లో గెలుపొందిన ఎమ్మెల్యేలు హరీష్ రావు చుట్టు భజనలు చేస్తూ కాలం వృధా చేశారు తప్ప మెదక్ ను అభివృద్ధి చేయాలనే ఆలోచన రాకపోవడం ఈ ప్రాంత ప్రజలను మోసగిస్తూ మెదక్ ను అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురిచేసారని ఎమ్మెల్యే రోహిత్ ఆరోపించారు. మెదక్ ను అభివృద్ధి చేయడం కోసం కొట్లాడి నిధులు తేవాల్సిన గత ఎమ్మెల్యే అధిష్టానం దగ్గర వారి వ్యక్తిగత అభివృద్ధి కోసం ప్రయత్నం చేశారు తప్ప ఏనాడు మెదక్ పట్టణ ప్రాంత ప్రజల అవసరాల కోసం నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేయించాలనే ధ్యాస లేకపోవడంతో నేడు మెదక్ రంగాల్లో వెనుకబడి వినాయక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మెదక్ నియోజకవర్గం కొట్లాది నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మెదక్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు