📄 ePaper
Sunday, September 20, 2026
ADS
Home Blog Page 39

చెరుకు శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నూతన గౌడ సంఘం మెదక్ జిల్లా ఇన్చార్జ్ అంజా గౌడ్.

0

చేగుంట,ఏప్రిల్,19,మెదక్ టుడే న్యూస్:చేగుంట నూతన గౌడ సంఘం మెదక్ జిల్లా ఇన్చార్జి అంజా గౌడ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే వారు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి వచ్చే ఎన్నికలలో కచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు కచ్చితంగా గెలిపించుకుందాము దుబ్బాక నియోజకవర్గం లో అన్న ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుపుతున్నాయి ఇంకా మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని వడియారం గుండెల్ని అంజా గౌడ్ అన్నారు.

దుబ్బాక శ్రీనివాస్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ సాయి కుమార్ గౌడ్.

0

చేగుంట,ఏప్రిల్,19,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజల తరఫున దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సర్పంచ్ సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ చెరుకు శ్రీనివాసరెడ్డి ఇప్పుడు దుబ్బాక ఇన్చార్జిగా మాత్రమే జన్మదిన జరుపుకుంటున్నాడు వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం. అప్పుడు ఎమ్మెల్యేగా పుట్టిన రోజు జరుపుకోవాలని నా ఆశ నా గ్రామ ప్రజల ఆశ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వడియారం గ్రామ సర్పంచ్ సాయికుమార్ గౌడ్, చేగుంట ఏఎంసీ చైర్మన్ వెంగళరావు, చేగుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ కుమార్, నలిన్ గౌడ్, చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీక్, దుబ్బాక అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రఫుల్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

చేగుంటలో  చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు.

0

చేగుంట,ఏప్రిల్,19,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణుల మధ్య అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ రెడ్డిని భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం గాంధీ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంగళరావు మాట్లాడుతూ.. మాజీ మంత్రి ముత్యం రెడ్డి ఆశయ సాధన కోసం శ్రీనివాస్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ మాట్లాడుతూ.. శీనన్న సహకారంతో మండలంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్షించారు. మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ,రాబోయే రోజుల్లో శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, డైరెక్టర్లు ముజామిల్, స్టాలిన్, ఆంజనేయులు, చౌదరి శ్రీనివాస్, నాయకులు అయిత పరంజ్యోతి, జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు కురుమ లక్ష్మి, సండ్రుగు శ్రీకాంత్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పొలంపల్లి సర్పంచ్,

0

చేగుంట,ఏప్రిల్,19,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల్ పోలంపల్లి గ్రామ శివారులోని మెదక్,చేగుంట వెళ్లే హైవే రోడ్డుపై అకాల సుడిగాలి వర్షంతో రోడ్డుపై చెట్టు రోడ్డుపై పడడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తాయి సమాచారం తెలుసుకొని స్పందించిన పొలంపల్లి సర్పంచ్ కొండి రాజలక్ష్మి స్వామి మెదక్ చేగుంట వెళ్లడానికి చెట్టును జెసిబి తో తొలగించడం జరిగినది.అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలి, హెల్మెట్ పెట్టుకోవాలి,ఓవర్ స్పీడ్ వెళ్లొద్దు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు చెడగొట్టు వర్షాలు సుడిగాలులు వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘo ఉపాధ్యక్షులుగా అఐత పరంజ్యోతి,

0

చేగుంట,ఏప్రిల్,19,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం చేగుంట గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులుఅఐత పరంజ్యోతి మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రోజున జిల్లా అధ్యక్షులు వల్లేర్ల రవీందర్ ఆదేశాలతో సిద్దిపేట వాస్తవులు మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గంప శ్రీనివాస్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులుగా అఐత పరంజ్యోతిని ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అయిత పరంజ్యోతి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గుప్త జిల్లా మాజీ అధ్యక్షు లు చంద్రపాల్ గుప్త, గంప శ్రీనివాస్ గుప్త అధ్యక్షులు రవీందర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు.జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేసిన అయిత పరంజ్యోతి కి చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నవీన్, చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, చేగుంట మాజీ ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి,మాజీ సొసైటీ చైర్మన్ ఇత రఘురాములు, చేగుంట ఉపసర్పంచ్ మహ్మద్ రఫీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు స్టాలిన్ నరసింహులు,ముజామిల్ , శ్రీనివాస్, వార్డు మెంబర్లు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

సమాచార హక్కు చట్టం సాధన కమిటీమెదక్ జిల్లా కార్యదర్శిగా చిక్కుడు మహేష్,

0

చేగుంట,ఏప్రిల్,19,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంనికి చెందిన చిక్కుడు మహేష్ ని ఆదివారం (ఆర్ టి ఐ ) సమాచార హక్కు చట్టం సాధన కమిటీ మెదక్ జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వ్యవస్థాపకుడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సందర్బంగా తనపై నమ్మకంతో జిల్లా కార్యదర్శి నియమించిన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్ కు. సుర స్రవంతి. మల్ల వెంకటేశం. రంగు మణిదీప్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ సంస్థ నియమ నిబకందనాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యాలయాలో అవినీతి నిర్ములనకు బాట సారధి గా నడుస్తానని అవినీతి పరులను బయటకు తీయడంతో పాటు సమాచార హక్కు చట్టం పై పౌరులకు విద్యార్థులకు అవగాహనా కలిగించేందుకు కృషి చేస్తానని మహేష్ పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మీడియా రంగంలో తనదైన శైలిలో ఎన్నో అవినీతి పరులని పట్టుబాట్టి వారికీ శిక్ష పడేలా చేసి ఎన్నో విజయాలను సాధించిన ఘనత ఉన్న వ్యక్తిగా అతని తోటి మీడియా మిత్రులు పేర్కొన్నారు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన వారికీ కృతజ్ఞతలు తెలిపిన జిల్లా కార్యదర్శి చిక్కుడు మహేష్

వడియారం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్లకు మొదటి బ్యాచ్ శిక్షణ తరగతులు ప్రారంభం.

0

చేగుంట,ఏప్రిల్,18,మెదక్ టుడే న్యూస్:జన గణన 2027 లో భాగంగా ఈరోజు చేగుంట మండలంలోనివడియారం గ్రామంలో గల జెడ్పిహెచ్ఎస్ లో ఎన్యుమరేటర్స్ మరియు సూపర్వైజర్లకు మొదటి బ్యాచ్కు శిక్షణ తరగతులు ప్రారంభం అయినదని తెలియజేశారు.ఈ శిక్షణా తరగతుల ను ఆర్డిఓ పర్యవేక్షించడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో ఆర్డీవో మాట్లాడుతూ ఏ న్యూమరేటర్లకు సూపర్వైజర్లకు హౌస్ లిస్టింగ్ కు సంబంధించిన కొన్ని సూచనలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా డిఎఫ్ఓ మాట్లాడుతూ జనగణన 2027 యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది.మండల చార్జ్ ఆఫీసర్ కే శివ ప్రసాద్ మాట్లాడుతూ జన గణనలో సూపర్వైజర్లు ఎన్యుమరేటర్లు యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడం జరిగింది. మొదటి బ్యాచ్ కు సంబంధించిన శిక్షణా తరగతులు 18, 20,21, తేదీలలో జరుగుతాయి.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీరజ మేడం ,ట్రైనర్స్గా సిహెచ్ లక్ష్మణ్ మరియు మల్లేశం ఏ ఎస్ ఓ భూమేష్ oపాల్గొనడం జరిగింది

టీఎన్జీవో షాద్నగర్ తాలూకా ఎన్నికలు నిర్వహణ.

0

(కరస్పాండెంట్ )
షాద్నగర్,ఏప్రిల్,18,మెదక్ టుడే న్యూస్:
షాద్నగర్ తాలూకాలోని పింఛనర్స్ భవన్‌లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్జీవో) తాలూకా స్థాయి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా శ్రీ పాలు బాయ్ ఈశ్వర్ వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా యూనియన్ నాయకులు శ్రీ శ్రీనివాస్, యశ్వంత్, రంగయ్య, ఆనంద్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో షాద్నగర్ తాలూకా టీఎన్జీవో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన సభ్యులు ఈ విధంగా ఉన్నారు:
అధ్యక్షుడు: జె. శ్రీనివాసులు (హెల్త్ ఎడ్యుకేటర్)
ప్రధాన కార్యదర్శి: శ్రీహరి (వీఆర్వో)
ముఖ్య సలహాదారు: శ్రీనివాసరాజు (లైబ్రేరియన్)
ఉపాధ్యక్షుడు: రాజశేఖర్ (ఫార్మసిస్ట్)
ఖజాంచీ: మహేందర్ గౌడ్
జాయింట్ సెక్రటరీ: డి. విజయలక్ష్మి (ఐసిడిఎస్)
పబ్లిసిటీ సెక్రటరీ: ప్రసన్నలత (సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం)
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు: ఎస్. రజని, ఎం. నరసింహ
అలాగే నామినేటెడ్ పోస్టులుగా హరీష్ రాజు, చరణ్‌లను ఎంపిక చేశారు.
ఎన్నికల అనంతరం ఎన్నికల అధికారి ఈశ్వర్ చేతుల మీదుగా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు జె. శ్రీనివాసులు మాట్లాడుతూ, ఎన్నికలు నిర్వహించిన జిల్లా మరియు కేంద్ర యూనియన్ నాయకులకు, అలాగే స్థానిక ఉద్యోగ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. టీఎన్జీవో అధ్యక్షుడిగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

వడియారం గ్రామంలో వినాయక స్టీల్ ఏర్పాటు చేసిన చలివేంద్రం ను ప్రారంభించిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్.

0

చేగుంట,ఏప్రిల్,18,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని వినాయక స్టిల్స్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రమును ప్రారంభించిన స్థానిక సర్పంచ్ సాయికుమార్ గౌడ్. సర్పంచ్ మాట్లాడుతూ,ఈ వేసవికాలంలో నీరు చాలా ముఖ్యమైనది మా గ్రామానికి వినాయక స్టీల్ వాళ్లు ఇక్కడ చలివేంద్రం పెట్టడం చాలా సంతోషకరంగా ఉన్నది ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర పెట్టడం వలన ప్రజలకు చాలా సౌకర్యం కరంగా ఉన్నది ఇలా పెట్టినందుకు వినాయక స్టీల్ కంపెనీ వారికి ప్రత్యేక ధన్యవాదములు అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయికుమార్ గౌడ్ సర్పంచ్ నాగరాజు పాలకవర్గ సభ్యు లు,గ్రామ ప్రజలు,వినాయక్ స్టీల్ లిమిటెడ్ ప్లాంట్ హెడ్ శ్రీనివాసాచార్యులు,మేనేజర్ స్వామి గౌడ్, కంపెనీ సిబ్బంది, పాల్గొనడం జరిగింది

ఇంటర్ విద్యాశాఖ డిప్యూటీ సెక్రటరీగా కృష్ణారెడ్డి.

0

చేగుంట,ఏప్రిల్,18,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం చేగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డికి పదోన్నతి లభించింది ఆయనను ఇంటర్ విద్యాశాఖ డిప్యూటీ సెక్రటరీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిది.ఈవిషయమై ప్రిన్సిపల్ ని అడగగా ఇక్కడ చేగుంటలో చాలా సంవత్సరాల నుండి ప్రిన్సిపాల్ గా ఉన్నాను ఇక్కడ పిల్లలు మంచిగా చదువుతారు ఇక్కడ నుండి వెళ్లాలంటే నాకు కొంచెం బాధాకరంగాఉన్నది అని అన్నారు. ఆయన హైదరాబాదులోని కార్యాలయంలో లో బాధ్యతలు స్వీకరించారు.ప్రభుత్వం తనపై ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ విద్యాశాఖ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.