📄 ePaper
Sunday, September 20, 2026
ADS
Home Blog Page 38

ప్రజలకు నీటి సమస్య రాకుండా చూడాలి డిపిఓ యాదయ్య,

0

చేగుంట,ఏప్రిల్,24,మెదక్ టుడే న్యూస్:ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకొని చేగుంట మండల కేంద్రంలో స్థానిక గ్రామపంచాయతీలో సర్పంచ్ స్రవంతి సతీష్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు, గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు చేయవలసిన అభివృద్ధి పనులపై చర్చించి ఏయే వార్డులో ఏ సమస్యలు ఉన్నాయో గ్రామ సభలో చర్చించి వాటిని చేసే విధంగా ప్రణాళిక తయారు చేసుకున్నారు ఈ గ్రామ సభకు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య హాజరై గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను పంచాయతీ ఈఓ ద్వారా అడిగి తెలుసుకున్నారు,
గ్రామంలో నీటి సమస్యను ఎక్కడెక్కడ తీర్చారు మ్యాప్ ఆధారంగా ఈవో జిల్లా పంచాయతీ అధికారికి సూచించడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య మాట్లాడుతూ పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకొని గ్రామాలలో గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని, వేసవికాలం దృష్టిలో పెట్టుకొని ప్రధానమైనటువంటి సమస్య మంచినీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆ సమస్య రాకుండా చూసుకోవాలని తెలిపారు, పంచాయతీ పాలకవర్గం సమిష్టిగా పనిచేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్నారని ఇదేవిధంగా పాలకవర్గం అంతా కలిసి ఉంటూ గ్రామాన్ని అని రంగాలలో అభివృద్ధి పరచాలని ఆయన తెలిపారు గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమాలు గాని రికార్డుల పరంగా గాని సమస్యల పరిష్కారంలో గాని పాలకవర్గం సమిష్టిగా పనిచేయడం జరుగుతుందని, రాబోయే రోజులు కూడా పాలకవర్గం ఇదే సమిష్టిగా పనిచేస్తూ ఉత్తమ గ్రామ పంచాయతీ ఎంపికయ్య విధంగా వారి పనితనంలో కనిపిస్తుందని ఆయన తెలిపారు, నేటి సమస్య తీర్చేందుకు పాత బోర్లను బ్లెస్సింగ్ చేయిస్తూ అవసరమైతే నూతన బోర్లు వేసి మంచినీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆ సమస్య రాకుండా చూసుకోవాలని తెలిపారు, పంచాయతీ ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి సతీష్ ఉప సర్పంచ్ మహ్మద్ రఫీ తోపాడు పాలకవర్గ సభ్యులు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

పొలంపల్లి గ్రామంలోపంచాయతీ రాజ్ దినోత్సవం పురస్కరించుకొని గ్రామసభ,

0

చేగుంట,ఏప్రిల్,23,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి అధ్యక్షతన పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామసభ నిర్వహించడం జరిగినది. వారు మాట్లాడుతూ గ్రామ సమస్యలు ఏవి ఉన్న ప్రజలు తన వద్దకు వచ్చి చెప్పవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్,ఉపసర్పంచ్ సత్య గౌడ్,ఆశా వర్కర్ లక్ష్మి,అంగన్వాడీ టీచర్ మమత,వార్డు సభ్యులు యాట మౌనిక,కొండి కమలమ్మ, శేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ కొండి మల్లేష్, గ్రామ ప్రజలు చింతకాయల కిషన్, గొల్ల శీను, తప్ప భాను, నరసింహులు పాల్గొనడం జరిగినది.

రాంపూర్ గ్రామంలో వడగండ్ల వర్షానికి నష్టపోయిన వరి పంటలను సర్వే చేసిన అధికారులు.

0

చేగుంట,ఏప్రిల్,23,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం రాంపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల రాళ్ల వర్షం వలన నష్టపోయిన రైతుల పొలాలను చేగుంట వ్యవసాయ అధికారులు ఈరోజు పరిశీలన చేయడం జరిగినది నష్టపోయిన రైతుల పేర్లు రాసుకోవడం జరిగింది. అనంతరం అధికారులు మాట్లాడుతూ అకాల రాళ్ల వర్షం వలన రైతుల చేతికి వచ్చిన పంట పూర్తిగా చాలా నష్టం జరిగింది. పై అధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు లు గ్రామ రైతులు పాల్గొనడం జరిగినది.

ప్రవేట్ పాఠశాల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.

0

ప్రధానోపాధ్యాయులు శ్రీ కిషన్

చేగుంట,ఏప్రిల్,23,మెదక్ టుడే న్యూస్:2025- 26 సంవత్సరంలో విద్యాభ్యాసంలో, చేగుంట మండలం చందాయిపేట్ పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాల లో గురువారం నాడు విద్యార్థులకు వారి ప్రగతి పత్రాలను ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ కిషన్ అందజేశారు,ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కిషన్ మాట్లాడుతూ విద్యార్థుల యొక్క ప్రగతి గురించి వివరిస్తూ మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరినీ అభినందనలు తెలుపుతూ , మా పాఠశాలలో ప్రవేట్ పాఠశాలకు దీటుగా విద్యార్థులకు మంచి ప్రతిభను కనబరిచినారని, చదువుతోపాటు ఆటలలో, క్విజ్ పోటీలలో, ముందుంటున్నారని తెలిపారు, రానున్న రోజులలో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు తమ పిల్లలను మా పాఠశాల చేర్పించవలసిందిగా కోరారు, నేటి నుండి పాఠశాలకు వేసవి సెలవులు ఉన్నాయన్నారు.

ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చేగుంట తహసిల్దార్ కు వినతి పత్రం,

0

చేగుంట,ఏప్రిల్,23,మెదక్ టుడే న్యూస్:జన గణన శిక్షణ ఎన్యుమరేటర్, సూపర్వైజర్ తరగతులను తీవ్రమైన ఎండల దృష్ట్యా ఉదయం పూట మాత్రమే నిర్వహించాలని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చేగుంట తహసిల్దార్ శివ ప్రసాద్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర కార్యదర్శి చల్లా లక్ష్మణ్, అధ్యక్షులు రావుల వెంకటేష్ , ఎస్ టి యు అధ్యక్షులు కొంతాలపల్లి పెంటా గౌడ్, యుటిఎఫ్ అధ్యక్షులు, బాల పోచయ్య, తపస్ ప్రధాన కార్యదర్శి తంగేళ్లపల్లి కృష్ణమూర్తి,టి ఆర్ టి ఎఫ్ ప్రధాన కార్యదర్శి దేవరాజ్, ఎస్ జి టి యు ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, తపస్ జిల్లా నాయకులు దేశపతి కృష్ణమూర్తి,పి ఆర్ టి యు జిల్లా నాయకులు చల్ల రామకృష్ణ, టి పి టి ఎఫ్ జిల్లా నాయకులు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

మాసాయిపేట హత్య కేసులో నలుగురి అరెస్ట్ తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్.

0

చేగుంట,ఏప్రిల్,22,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల పోలీస్ స్టేషన్ పరిధిలో గల మాసాయిపేట మండలం, మాసాయిపేట గ్రామంలో కల్లు దుకాణం వద్ద జరిగిన గొడవలో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులను చేగుంట పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 20న రాత్రి మాసాయిపేటలోని కల్లు దుకాణం వద్ద వడ్డెర నగేష్ అనే వ్యక్తి బాటిళ్లు పగలగొడుతుండగా, అదే గ్రామానికి చెందిన గుడ్డి దశరథ్ (49) వారించాడు. దీంతో ఆగ్రహానికి గురైన వడ్డెర శ్రీకాంత్, నగేష్, దుర్గా స్వామి, సందీప్‌లు కలిసి దశరథ్‌పై తీవ్రంగా దాడి చేశారు. ఈ క్రమంలో నిందితుడు శ్రీకాంత్ బండరాయితో దశరథ్ తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే దశరథ్ మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
మృతుని తమ్ముడు సిద్ధిరమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, డీఎస్పీ నేతృత్వంలో విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రజలు క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, కల్లు దుకాణాల వద్ద తప్పనిసరిగా సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ విచారణలో చేగుంట ఎస్ఐ చైతన్య రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం కావాలని వినతి,

0

చేగుంట,ఏప్రిల్,22,మెదక్ టుడే న్యూస్:చేగుంట (నార్సింగి) మండలంలోని వల్లూరు గ్రామం బస్టాండ్ వద్ద సర్వీసు రోడ్లకు బదులు పూర్తి సాయి అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ నేషనల్ హైవే 44 కామారెడ్డి పి డికి గ్రామ ప్రజల కోరిక మేరకు సర్పంచ్ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామస్తుల సమస్యను పై అధికారులకు దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిప్పిరి వినోద్ కుమార్,ఉప సర్పంచ్ మియాపూర్ రేఖ మధు, పాల్గొనడం జరిగినది.

రాంపూర్ గ్రామం లో వడగళ్ల రాళ్లు వర్షం నష్టపోయిన రైతులు.

0

చేగుంట,ఏప్రిల్,20,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం రాంపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం అకాల రాళ్ళ వర్షం వలన నష్టపోయిన రైతులు చేగుంట వ్యవసాయ అధికారులు రాంపూర్ గ్రామ సర్పంచ్ కాశబోయిన నాగమణి సుదర్శన్ ఉప్పసర్పంచ్ కాశబోయిన సిద్ధిరాములు పాలకవర్గం మరియు గ్రామ పెద్దలు వరి పంటలను పరిశీలించినారు. వారు మాట్లాడుతూ అకాల రాళ్ళ వర్షం వలన రైతుల చేతికి వచ్చిన పంట పూర్తిగా చాలా నష్టం జరిగింది.తక్షణమే జిల్లా అధికారులతో మాట్లాడి నష్ట పోయిన ప్రతి రైతు వివరాలు సేకరించాలని వారికి తెలియజేశారు.

రైతులను ఆదుకుంటాం చెరుకు శ్రీనివాస్ రెడ్డి-అకాల వర్షంతో అన్నదాత గుండెకు గుబేలు.

0

చేగుంట,ఏప్రిల్,20,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం మక్కరాజ్ పేట గ్రామంలో ఆదివారం సాయంత్రం అకాల రాళ్ళ వర్షం వలన నష్ట పోయిన వ్యవసాయ వరి పొలాలను సంబంధిత వ్యవసాయ అధికారులతో, చేగుంట తాసిల్దార్ శివ ప్రసాద్ కలిసి పరిశీలించిన దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి వారు మాట్లాడుతూ అకాల రాళ్ళ వర్షం వలన రైతుల చేతికి వచ్చిన పంట పూర్తిగా చాలా నష్టం జరిగింది.తక్షణమే జిల్లా అధికారులతో మాట్లాడి నష్ట పోయిన ప్రతి రైతు వివరాలు సేకరించాలని వారికి తెలియజేశారు అలాగే జిల్లా ఇంచార్జీ మంత్రి కి సమస్యను తెలియజేసి రైతులను ఆదుకుంటాం అని భరోసా ఇచ్చారు.ఎక్కువగా కౌలు రైతులు తీవ్రంగా నష్టం జరిగింది.పట్టా భూమి యజమానులు మీరు కూడా మానవత్వం చూపించిన మీ కౌలు రైతులకు కౌలు డబ్బులు తీసుకోకుండా వారికి అండగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా చేగుంట ఎఎంసి ఛైర్మెన్ తాడేం వెంగళరావు,తోగుట ఎఎంసి ఛైర్మెన్ అమరేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, పద్మ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సండ్రుగు శ్రీకాంత్,చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, గ్రామ సర్పంచ్,ఉపసర్పంచ్ మొగులయ్య, ఎఎంసి డైరెక్టర్లు,గ్రామ రైతులు,నాయకులు పాల్గొన్నారు

చేగుంట ఐ ఓ సి చర్చికి ప్రతినెల 5000 రూపాయలు చేగుంట ఉప సర్పంచ్ మొహమ్మద్ రఫీ.

0

చేగుంట,ఏప్రిల్,20,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని ఐ ఓ సి చర్చి సంఘం కాపరి ప్రభాస్ అయ్యగారి కి చేగుంట ఉపసర్పంచ్ రఫీ ప్రతి నెల సంఘాన్ని నడిపిస్తున్న సంఘ కాపరికి 5000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది.ఇలా తను ఉపసర్పంచిగా ఉన్నన్ని రోజులు ప్రతి నెల 5000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చాడు.ఎలాంటి ఆదాయం లేకుండా సంఘాన్ని నడిపిస్తున్న కానుకలతో నడుస్తున్నది అని విషయం తెలుసుకున్న ఉపసర్పంచి సంఘ కాపరి కి ప్రతి నెల 5000 రూపాయలు డొనేషన్ కింద ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు సుధాకర్,లక్ష్మణ్,జాన్, డాక్టర్ ప్రభాస్,నాగ మోహన్,భక్త పాల్, యూత్ సభ్యులు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.