చేగుంట,ఏప్రిల్,27,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని స్థానిక మెదక్ చౌరస్తా వద్ద పార్టీ మండల అధ్యక్షులు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జెండా ఎగరవేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా బి ఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలన పోవాలి కేసీఆర్ మళ్ళీ సీఎం గా రావాలి అని టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తేవడం జరిగిందని ముఖ్యంగా రైతులకు రైతుబంధు రైతు భరోసా వంటి పథకాలతో రైతులను ఆదుకున్న ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని వారు అన్నారు అబద్ధపు హక్కులతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఎక్కడ కూడా పూర్తి చేయలేకపోయారని వారు తెలిపారు, ఎంతోమంది ఆత్మ బలిదానాలు సబ్బండ వర్గాల ప్రజల ఆందోళనతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిందని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కేసిఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరిగిందని వారు గుర్తు చేశారు, ఈ కార్యక్రమంలో చేగుంట మండల బి ఆర్ ఎస్ పార్టీఅధ్యక్షులు నారాయణరెడ్డి , పట్టణ అధ్యక్షులు యాదగిరి ,మహమ్మద్ అలీ, డిష్ రాజు, సోమ సత్యనారాయణ, డాక్టర్ రమేష్ ,పట్నం తానీషా, కుర్ర లక్ష్మీనారాయణ, జర్నల్ సింగ్, వలప మహేష్, కటిక రాజేష్, ఆరిఫ్, మురాడి లక్ష్మణ్, కట్ట శీను, బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగినది
చేగుంట బీఆర్ఎస్ పార్టీ 26 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
ఏడుపాయల జాతరలో చిన్నారి వెండి కడియాలు అపహరించేందుకు యత్నించిన వ్యక్తి పట్టివేత.
మెదక్,ఏప్రిల్,26,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,ఆదివారం ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో, ప్రతి ఆదివారం ప్రత్యేకంగా క్విక్ రెస్పాన్స్ టీమ్ ( క్యూ ఆర్ టి) సిబ్బందితో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయబడుతోంది. ఈ క్రమంలో ఓ తల్లి షాపులో కొనుగోళ్లు చేస్తున్న సమయంలో, ఆమెతో ఉన్న చిన్నారిని ఓ దుండగుడు ప్రక్కకు తీసుకెళ్లి, చిన్నారి కాళ్లలో ఉన్న వెండి కడియాలను అపహరించి తన లోదుస్తుల్లో దాచుకున్నాడు.విధుల్లో అప్రమత్తంగా ఉన్న క్యూ ఆర్ టి సిబ్బంది ఈ ఘటనను గమనించి, వెంటనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రారంభంలో తనకు ఏమీ తెలియదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, పోలీసులు అతనిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, చిన్నారి వద్ద నుంచి అపహరించిన రెండు వెండి కడియాలు అతని వద్ద లభించాయి.పోలీసులు వెంటనే ఆ వెండి కడియాలను చిన్నారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన భక్తులు, పోలీస్ సిబ్బంది చూపిన అప్రమత్తత, సమయస్ఫూర్తిని అభినందించారు.
అనంతరం నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం పాపన్నపేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జాతరలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య.
పాపన్నపేట,ఏప్రిల్,26,మెదక్ టుడే న్యూస్:ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన యూసుఫ్ పేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం… గ్రామానికి చెందిన ఎర్ర అశోక్ (31) వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు.గత కొంత కాలంగా మద్యం సేవించి ఇంటికి వస్తున్నాడు.శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి మద్యం సేవించి రాత్రి సమయంలో ఇంటికి వచ్చాడు.కుమారుడికి అనారోగ్యంగా ఉంది త్వరగా రమ్మని చెప్తే ఆలస్యంగా ఇంటికి వచ్చావు..ప్రతి రోజు ఇలా మద్యం సేవించి వస్తే ఎలా అని భార్య లక్ష్మీ అనడంతో క్షణికావేశంలో ఇంట్లో ఉన్న ఓ గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబీకులు గది తలుపు గొళ్లెం పగులగొట్టి చూడగా ఉరి వేసుకుని కనిపించాడు.వెంటనే కొన ఊపిరితో ఉన్న అతన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు.భార్య ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
అనంతపురం పి టి సి లో 1976 బ్యాచ్ ఎస్‌ఐల గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా …

–హాజరైన కర్ణాటక ఎస్పి కుమార్..
(స్పెషల్ కరస్పాండెంట్)
(డా. కొమ్ము వెంకన్న బాబు)
అనంతపురం, ఏప్రిల్ 26,మెదక్ టుడే న్యూస్:
1976లో డైరెక్ట్‌గా నియామకమై అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (పి టి సి)లో శిక్షణ పొందిన ఎక్స్ ఐ, బ్యాచ్ సబ్-ఇన్‌స్పెక్టర్ల గోల్డెన్ జూబ్లీ గెట్-టుగెదర్ వేడుకలు శనివారం అనంతపురం పి టి సి ఆడిటోరియంలో అట్టహాసంగా నిర్వహించారు.
కార్యక్రమం ప్రారంభంలో బ్యాచ్‌కు చెందిన దివంగత సహచరుల స్మృతికి రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం పాల్గొన్న అధికారులు తమ 50 ఏళ్ల సేవా అనుభవాలను, వివిధ హోదాల్లో నిర్వహించిన బాధ్యతలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగంతో పంచుకున్నారు. “1976లో యువకులుగా అడుగుపెట్టిన ఈ ప్రాంగణంలోనే 50 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకోవడం జీవితంలో అరుదైన సందర్భం” అని వారు పేర్కొన్నారు.కర్ణాటక క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఎస్పీ శ్రీ కుమార్ గారు సతీసమేతంగా హాజరై బ్యాచ్ సభ్యులను అభినందించి, ప్రత్యేక మిఠాయిలను అందజేశారు. గిరి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హాజరైన అధికారులందరికీ టోపీలు, శాలువాలతో సన్మానించి, వారి ఫోటోలతో కూడిన జ్ఞాపికలను బహుకరించారు.ఈ గెట్-టుగెదర్ విజయవంతం కావడానికి బి. విజయ్ సింగ్, యం.యోహాన్, పి ఎస్ ఎస్ పి.బాబు తదితరులు సహకరించారు. కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన విందులో అధికారులు, వారి కుటుంబ సభ్యులు కలిసి సహపంక్తి భోజనం చేశారు.హైదరాబాద్, గుంటూరు, కర్నూల్, వరంగల్, వైజాగ్, ఏలూరు రేంజ్‌లు, హైదరాబాద్ సిటీకి చెందిన 1976 బ్యాచ్ అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తు జనరేషన్ కోసం పిటిసి ప్రాంగణంలో మామిడి మొక్కలను వివిధ రకాల నీడనిచ్చే మొక్కలను నాటారు. అనంతరం పాత జ్ఞాపకాల పునస్మరణ, ఫోటో సెషన్లు, ఆప్యాయ పలకరింపులతో వేడుకలు ఘనంగా ముగిశాయి.

ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు.
వేడుకలో పాల్గొన్న జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు అయిత పరంజ్యోతి
చేగుంట,ఏప్రిల్,26,మెదక్ టుడే న్యూస్:చేగుంట పట్టణ కేంద్రంలో శ్రీ వాసవీ మాత జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యక పరమేశ్వరి దేవాలయం లో నిర్వహించిన కుంకుమ అర్చన కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగాయిఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అలంకరణలు, పుష్పాభిషేకాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు అయిత పరంజ్యోతి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, జిల్లా, మండల ప్రజలందరికీ, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం పెరగాలని, ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలోఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తుడుపునూరి నాగేష్ గుప్తా, రాజేశ్వర్ గుప్తా,చంద్రమౌళి గుప్తా, బాలేశం గుప్తా, రాములు, శంకర్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జన గణన 2027 మొదటి దశ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి చేగుంట మండల తహసీల్దార్,
చేగుంట,ఏప్రిల్,25,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని వడియారంజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మూడు రోజుల జన గణన శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమానికి చేగుంట మండల ఛార్జ్ ఆఫీసర్ శివప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన గణన 2027 మొదటి దశలో భాగంగా ఇండ్ల గణన నిర్వహిస్తామని, రెండు దశలలో 72 మంది ఎనుమారేటర్స్ కు, 13 మంది సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చామని, వారందరూ మే 9 నుండి మూడు రోజులపాటు హౌసింగ్ లిస్టింగ్ బ్లాక్ మ్యాపింగ్ చేస్తారని, మే 11 నుంచి మండలంలోని అన్ని గ్రామాలలో ఇండ్ల గణన నిర్వహిస్తామని, సూపర్వైజర్లు, ఎనుమారేటర్స్ ఎటువంటి తప్పులు లేకుండా ఇండ్ల గణన నిర్వహించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ట్రైనర్ చల్లా లక్ష్మణ్, జంగం మల్లేశం, ఏఎస్ఓ భూమేష్, సూపర్వైజర్స్ , ఎనిమరేటర్స్ తదితరులు పాల్గొన్నారు
నమూనా జనగణన క్షేత్ర పర్యటనను పరిశీలించిన తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి.
చేగుంట,ఏప్రిల్,25,మెదక్ టుడే న్యూస్:జనగణన శిక్షణలో భాగంగా ఈరోజు చేగుంట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో మూడు రోజుల సెన్సార్ శిక్షణ కార్యక్రమం జరిగింది. శిక్షణ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు ఎనుమారేటర్స్, సూపర్వైజర్స్ వడియారం గ్రామంలో నమూనా జనగణన నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తున్నారో తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎనుమారేటర్స్, సూపర్వైజర్స్ సెన్సెస్ 2027 మొదటి దశ నమూనా జనగణన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తప్పుడు లేకుండా చేయాలని వారు అన్నారు.కార్యక్రమంలో చేగుంట తాసిల్దార్ శివప్రసాద్, ఏ ఎస్ ఓ భూమేష్, ఫీల్డ్ ట్రైనర్స్ చల్లా లక్ష్మణ్, జంగం మలేష్,ఎనిమరేటర్స్ రాజశేఖర్, ప్రభాకర్,గోవింద్, ఎం, ఏ.నయీం తదితరులు పాల్గొన్నారు
రిటైర్డ్ ఎస్పీ కీర్తిశేషులు పి. పద్మాకర్ రావు జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం.
(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్ నగర్, ఏప్రిల్ 25,మెదక్ టుడే న్యూస్:
రిటైర్డ్ ఎస్పీ కీర్తిశేషులు పి. పద్మాకర్ రావు జయంతిని పురస్కరించుకుని, వారి స్మృతికి నివాళిగా రాంనగర్ ఆంగన్వాడీ కేంద్రంలో ఘనంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వారి కుమారుడు డా. నంద కిశోర్ (యు ఎస్ ఏ) సౌజన్యంతో, ఆయన బావమరిది విక్రమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సామాజిక వేత్త, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పద్మాకర్ రావు తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన అంకిత భావంతో విధులు నిర్వహించిన తీరు ఆదర్శప్రాయమని కొనియాడారు. గత పది సంవత్సరాలుగా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులను, ముఖ్యంగా విక్రమ్‌ను అభినందించారు.
అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న పద్మను కూడా అభినందించిన ఆయన, పద్మాకర్ రావు కుటుంబం చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. చిన్నారుల భవిష్యత్తు దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన పరికరాలు, పిల్లలకు అవసరమైన వస్తువులు అందించడం గొప్ప విషయమని అన్నారు.ఈసందర్భంగా ప్రజలకు పిలుపునిస్తూ, పద్మాకర్ రావు కుటుంబం చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
సేవా కార్యక్రమం లో భాగంగా
రాంనగర్ అంగన్వాడీ కేంద్రానికి ఎల్ ఈ డి టీవీ, క్యారమ్ బోర్డు, ప్లేట్లు, గ్లాసులు అందజేత
చిన్నారులకు పండ్లు, స్వీట్లు పంపిణీ
23 అంగన్వాడీ కేంద్రాలకు 250 పలకలు పంపిణీ
ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై సుశీల, సీడీపీఓ ఉదయ, కౌన్సిలర్ వాణి, దుర్గా ప్రసాద్, శివాని, పిల్లల తల్లిదండ్రులు, రాంనగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.సీడీపీఓ ఉదయ మాట్లాడుతూ: “ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమైనవి. నిర్వాహకులు చేపడుతున్న ఈ కార్యక్రమం అభినందనీయం.” అని అన్నారు.
ఎస్సై సుశీల మాట్లాడుతూ: “చిన్నారుల కోసం ఇలాంటి సేవలు చేయడం గొప్ప విషయం అని పేర్కొంటూ నిర్వాహకులను అభినందించారు.”
చినిర్వాహకులను సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి, వందన సమర్పణ చేశారు.

చౌడమ్మగుట్ట ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా పల్లకీ సేవపల్లకీ సేవలో పాల్గొన్న సీఐ సీతారాం దంపతులు.
(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్, ఏప్రిల్ 25: మెదక్ టుడే న్యూస్:
షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలిపూర్ గ్రామంలోని చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన భక్త బృందం ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు.శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ “శ్రీరామ జయరామ్, జయ జయ రామ్” నినాదాలతో భక్తులు ఊరేగింపుగా పాల్గొన్నారు. భక్తి గీతాలు, భజనలతో ఆలయ ప్రాంగణం మార్మోగి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఆలయ ప్రధాన అర్చకులు రఘుపతిరావు, రాఘవేంద్రాచార్యతో పాటు అర్చకులు ప్రమోద్, సునీల్ పంతులు ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమానికి షాద్‌నగర్ సీఐ కె. సీతారాం దంపతులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీ సేవలో పాల్గొన్నారు. అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో వారిని శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు.
మున్సిపాలిటీ 6వ వార్డు మాజీ కౌన్సిలర్ పులిమామిడి లతాశ్రీ శ్రీశైలం గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దేవాలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తించి దేవాలయ కమిటీ సభ్యులు పూలమాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.అలాగే మండువేసవిలో భక్తుల దాహార్తిని తీర్చేందుకు దాత బొట్టు రమేష్ చల్లని మంచినీటిని అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పులిమామిడి శ్రీశైలం గౌడ్, జి. వసంతరావు, అన్నారం రఘు గౌడ్, గడ్డమీద రమేష్ ముదిరాజ్, శంకర్ గౌడ్, లక్ష్మారెడ్డి, యాదగిరి, తులసిరామ్, రఘునందన్ రెడ్డి, సుప్ప నర్సింలు, నారాయణ, వీర్లపల్లి కృష్ణయ్య, శంకరయ్య, వీఆర్వో బచ్చన్న, సుప్ప కృష్ణయ్య, పి. ప్రవీణ్ గౌడ్, పద్మా వెంకటేష్, జగన్, గోరియా నాయక్, కొత్త సత్తయ్య గౌడ్, శ్రీనివాస్, రమేష్, రవి, హనుమంత్ రెడ్డి, రవీందర్, నరసింహులు, మాజీ వార్డు సభ్యులు సింగపాగ లక్ష్మయ్య, భజన భక్త బృందం మహిళలు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం భక్తుల ఉత్సాహం, సమన్వయంతో విజయవంతంగా ముగిసింది.

పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా,
చేగుంట,ఏప్రిల్,24,మెదక్ న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా పంచాయతీరాజ్ అధికారి యాదయ్య హాజరైనారు. వారిని గ్రామ సర్పంచ్ పాలకవర్గ సభ్యు లు శాలువాతో సన్మానం చేసినారు అనంతరం వారు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామ అభివృద్ధిని చేసుకోవాలని అని అన్నారు తను కూడా వడియారం గ్రామపంచాయతీ అభివృద్ధికి సహకరిస్తాన ని హామీ ఇచ్చారు ఒకేసారి అన్ని పనులు కాకుండా ఒకటి ఒకటి చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయికుమార్ గౌడ్, ఉప సర్పంచ్ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి విజయపాల్ రెడ్డి,గ్రామపంచాయతీ పలకవర్గం పాల్గొనడం జరిగినది.










