📄 ePaper
Saturday, May 9, 2026
ADS
HomeUncategorizedచికిత్స పొందుతూ మహిళ మృతి.

చికిత్స పొందుతూ మహిళ మృతి.

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,మార్చ్,3,మెదక్ టుడే న్యూస్:పురుగు మందు తాగి చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.గ్రామానికి చెందిన జిన్న దుర్గాభవాని(24) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది.తరచూ అనారోగ్య విషయమై ఇంట్లో బాధపడుతూ ఉండేది.గత నెల 27న రాతి వేళ ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగు మందు తాగింది.ఈ క్రమంలో కుటుంబీకులు గమనించి చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా హాస్పిటల్ కు తరలించారు.అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది.మృతురాలి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments