📄 ePaper
Saturday, August 1, 2026
ADS
Homecollector MEDAKజిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు ఘనంగా వీడ్కోలు.

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు ఘనంగా వీడ్కోలు.

📰 Generate e-Paper Clip

మెదక్,ఫిబ్రవరి,28,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు ఘనంగా వీడ్కోలు

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు జిల్లాలోని ఉద్యోగులు,ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు.

పూలమాలలు శాలువాలు వివిధ జ్ఞాపకాలతో కలెక్టర్ గారితో పనిచేసిన కాలాన్ని గుర్తుకు చేసుకున్నారు.
జిల్లా కలెక్టర్ విద్య వైద్యంలో జిల్లాలో సమూల మార్పులు తీసుకొచ్చారని పలువురు జిల్లా అధికారులు పునరుద్గాటించారు.

విద్య వైద్యం ప్రధానోజెండాగా కలెక్టర్ రాహుల్ రాజ్ రెండు సంవత్సరాల కాలం బిజీ బిజీగా గడిచిపోయిందని పలువురు తెలిపారు.

ప్రజలకు ఉద్యోగులకు పలు సలహాలు సూచనలు ఇస్తూ మార్గదర్శకులుగా ఏ చిన్న సమస్యనైనా అలవోకగా పరిష్కరించి పలువురి మన్ననలు పొందాడని జిల్లా అధికారులు అన్నారు.

పూర్వపు కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఇక్కడి ప్రజలతో తనకు విడదీయరాని బంధం ఏర్పడిందని, ఇక్కడి నుండి వెళ్లడం బాధాకరమైన హృదయంతో వెళ్తున్నట్లు తెలిపారు. తనకు సహకరించిన అధికారులకు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

కలెక్టర్ ను, వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనంలో పూలు చల్లుతూ కలెక్టర్ కార్యాలయం నుంచి మెయిన్ గేటు వరకు తీసుకెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో ప్రజలు, ఉద్యోగులు, జిల్లా అధికార యంత్రాంగం అంతా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular