📄 ePaper
Saturday, May 9, 2026
ADS
HomeSportసీఎం కప్ కబడ్డీ టోర్నమెంట్‌: సంగారెడ్డి జిల్లా బాయ్స్ టీమ్‘హెడ్...

సీఎం కప్ కబడ్డీ టోర్నమెంట్‌: సంగారెడ్డి జిల్లా బాయ్స్ టీమ్‘హెడ్ కోచ్‌’గా అమీన్‌పూర్ వాసి‘కె. పాండు’ఎంపిక.

📰 Generate e-Paper Clip

అమీన్‌పూర్,ఫిబ్రవరి,20,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.తెలంగాణ రాష్ట్ర స్థాయి ‘సీఎం కప్’ కబడ్డీ పోటీలకు సంగారెడ్డి జిల్లా బాయ్స్ జట్టు హెడ్ కోచ్‌గా అమీన్‌పూర్ జిహెచ్ఎంసి కి చెందిన కె. పాండు ఎంపికయ్యారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో ఈ నెల 20, 21, 22 తేదీల్లో నిర్వహించనున్న ఈ మెగా టోర్నమెంట్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల జట్లు తలపడనున్నాయి.ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఎస్‌జీఎఫ్ ప్రెసిడెంట్ సుభాష్ గౌడ్ కె. పాండును ప్రత్యేకంగా అభినందించారు. అమీన్‌పూర్ ప్రాంతానికి చెందిన క్రీడాకారుడు జిల్లా జట్టుకు కోచ్‌గా ఎంపిక కావడం పట్ల స్థానిక నాయకులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కె. పాండు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా ఎస్‌జీఎఫ్ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జట్టును పటిష్టంగా తీర్చిదిద్దామని, ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు మరియు స్థానిక నేతలు పాల్గొని పాండుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments