📄 ePaper
Wednesday, May 13, 2026
ADS
HomeNewsఉన్నత స్థాయికి ఎదిగిన సేవాభావం కలిగి ఉండాలి - అదనపు...

ఉన్నత స్థాయికి ఎదిగిన సేవాభావం కలిగి ఉండాలి – అదనపు ఎస్ పి మహేందర్..

📰 Generate e-Paper Clip

ఉన్నత స్థాయికి ఎదిగిన సేవాభావం కలిగి ఉండాలి – అదనపు ఎస్ పి మహేందర్..

•ఉన్నత స్థాయికి ఎదిగిన సేవాభావం కలిగి ఉండాలి – అదనపు ఎస్ పి మహేందర్..

పాపన్నపేట,నవంబర్,22,మెదక్ టుడే న్యూస్:

జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం ముగింపు సమావేశంలో పాల్గొన్న ఎస్ పి  వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, శిబిరానికి ముందు, శిబిరం తర్వాత మీలోని ప్రవర్తన మారిందని తాను మాట్లాడుతూ,మీరు ఉన్నత స్థాయికి వెళ్ళినా సేవా లక్షణం కలిగినప్పుడే జీవితంలో తృప్తి పొందగలమని ఈ క్యాంపు వాలంటీర్ల యొక్క పరివర్తనను, క్రమశిక్షణను, అంకిత భావాన్ని పెంపొందింపజేస్తాయని అన్నారు.
ప్రారంభం కంటే గొప్ప ముగింపు ముఖ్యం- జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి

ఆదివారం నాడు ప్రారంభించిన ఈ క్యాంపు శనివారం ముగింపు సమావేశంలో మాట్లాడుతూ, క్యాంపు ప్రారంభం నుండే వాలంటీర్లు గ్రామ సర్వే, శ్రమదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరం, అనేక అవగాహన కార్యకలాపాల ద్వారా ఈ క్యాంపును అద్భుతంగా ముగించారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలు మీ భవిష్యత్తులో ఉపయోగపడతాయి.

మా గ్రామంలో మార్పుకు నాంది పలికారు- ప్రశాంత్ రెడ్డి

ఈ వారం రోజుల పాటు మీరు చేసిన కార్యక్రమాల ద్వారా మా ప్రజలను పరిశుభ్రత వైపు, విజ్ఞానం వైపు, ఆరోగ్యం వైపు ఆలోచింపజేసారు. మూఢనమ్మకాలను విడనాడారు. మీ ఈ సేవకు గానూ మా గ్రామాన్ని ఎంచుకున్నందుకు ఎన్ ఎస్ ఎస్, బృందానికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వాలంటీర్లు అందరికీ ఎస్ పి , డిఐఈఓ లు సర్టిఫికెట్ లు అందజేశారు. అని ఎన్ఎస్ఎస్, ప్రోగ్రాం ఆఫీసర్ జూలకంటి శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నర్సింలు,అధ్యాపకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments