📄 ePaper
Friday, July 31, 2026
ADS
HomeNewsఘనంగా మాన్యవర్ కాన్షీరామ్ 92వ జయంతి వేడుకలు.

ఘనంగా మాన్యవర్ కాన్షీరామ్ 92వ జయంతి వేడుకలు.

📰 Generate e-Paper Clip

•రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

•పటాన్‌చెరు బీఎస్పీ అధ్యక్షులు పడమటి శ్రీశైలం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

    రామచంద్రపురం,మార్చి,15,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు, బహుజన రాజ్యాధికార నిర్మాత మాన్యవర్ కాన్షీరామ్ 92వ జయంతి వేడుకలను పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ అధ్యక్షులు పడమటి శ్రీశైలం ఆధ్వర్యంలో సోమవారం రామచంద్రపురంలోని ఈఎస్ఐ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా పడమటి శ్రీశైలం మాట్లాడుతూ.. దళితులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కాన్షీరామ్ గారు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధనలో ప్రతి కార్యకర్త భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సేవా దృక్పథంతో ఈరోజు ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించిన ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణ మరియు డాక్టర్ శైలజ కి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

    పాల్గొన్న ముఖ్య నాయకులు:

    ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జ్ సుంకు వినయ్ కుమార్, మరో ఇంచార్జ్ దర్శన్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, సీనియర్ నాయకులు సంజీవ, జనార్దన్, సంజీవ్ కుమార్, సురేందర్, బ్యాగరి శ్రీను, థామస్ మరియు ఇతర పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    RELATED ARTICLES
    - Advertisment -ADS

    Most Popular