📄 ePaper
Wednesday, March 11, 2026
ADS
HomeUncategorizedమండల వ్యాప్తంగా జోరుగా కల్తీ కల్లు దందా..

మండల వ్యాప్తంగా జోరుగా కల్తీ కల్లు దందా..

📰 Generate e-Paper Clip

మండల వ్యాప్తంగా జోరుగా కల్తీ కల్లు దందా.

•కల్తీ కల్లుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం.

•మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ….

•చోద్యం చూస్తున్న పోలీసులు….

పాపన్నపేట,నవంబర్,13, మెదక్ టుడే న్యూస్:

మత్తు పానీయాలను విక్రయిస్తూ సంపాదనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైనం ఇది. పాపన్నపేట  మండలంలో కల్తీకల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. స్వచ్ఛమైన కల్లుకు బదులు ప్రాణాంతకమైన మత్తు పదార్థాలను కలుపుతూ కృత్రిమ కల్లును తయారు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ధనవర్జనే లక్ష్యంగా కొందరు వ్యాపారులు కల్తీ కళ్ళు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. గీత కార్మికులకు శిక్షణ లేకుండా లైసెన్సులు ఇవ్వడం వల్ల నిజమైన కార్మికులకు అన్యాయం జరుగుతుందని విమర్శలు ఉన్నాయి. మండలంలోని, పాపన్నపేట, కుర్తివాడ, నార్సింగ్,ఎనకపల్లి, కొడపాక, యూసు పేట్, మల్లంపేట్,తదితర గ్రామాలలో కల్తీకల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయని స్వచ్ఛమైన కల్లుకు బదులు చెట్ల నుండి తీసిన కొద్దిపాటి కల్లులో, కృత్రిమ ప్రాణానంతక మత్తు పదార్థలు కలుపుతూ గ్రామీణ ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేయడం తప్ప చర్యలు తీసుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజల విమర్శలు వినిపిస్తున్నాయి. ఆల్ఫోజలం, డైజోఫామ్ లాంటి రసాయనతో కల్లు తయారు చేయడం వల్ల సేవించేవారు మత్తులోకి వెళ్లిపోవడం, అనారోగ్య సమస్యల కు గురికావడం, కాకుండా ప్రమాదాలకు కూడా గురవుతున్న సందర్భాలు ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు, బుద్ధి మందగించడం, బిపి షుగర్ లాంటి, వ్యాధుల దరిచేరి ఆస్కారం ఉండడమే కాకుండా, మత్తులో ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి, కల్తీ కల్లు తో ఎన్నో నష్టాలు జరుగుతున్న సందర్భాలు అనేకం. కళ్ళు సేవించే వారికి పైనుండి డైజోఫామ్, క్లోరోఫాములు అధికంగా వేయడంతో మత్తులో రోడ్డు జరుగుతున్న సందర్భాలు అనేకం.ఇంట్లో గొడవలు పడి ఆత్మ హత్య లు సైతం జరుగుతున్నాయి. దీంతో పలు కుటుంబాలు చిన్నభిన్నమవుతున్నాయి. ఎక్సైజ్ అధికారులు ఆయా ప్రాంతాల్లో తూతూ మంత్రంగా కల్లు దుకాణాలు తనిఖీ చేస్తూ మామూళ్లు తీసుకుంటూ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు, నిఘా విభాగం వారు స్పందించి కల్తీకల్లు పై నిగా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments