📄 ePaper
Wednesday, November 4, 2026
ADS
Homeమెదక్ జిల్లా వార్తలుజ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం, రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ...

జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం, రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ –ఎం.డి. రైసోద్దీన్

📰 Generate e-Paper Clip

మెట్ పల్లి సెప్టెంబర్ 28 (మెదక్ టుడే న్యూస్) న్యూస్ ప్రతినిధి.కోరుట్ల నియోజకవర్గంలోమెట్‌పల్లి పట్టణములో పాత బస్టాండ్ శాస్త్రి విగ్రహం దగ్గరఏఐసీసీ పిలుపు, టీపీసీసీ ఆదేశాల మేరకు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ గజంగి నందయ్య గారి నేతృత్వంలో, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి శ్రీ జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో మెట్‌పల్లిలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎం.డి. రైసోద్దీన్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేయాల్సిన రాజ్యాంగబద్ధ బాధ్యత కలిగి ఉందన్నారు. ఓటర్ల జాబితా సవరణ, ఓటర్ల పేర్ల తొలగింపు, ఎస్‌ఐఆర్ వంటి అంశాల్లో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ కోసం జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించినట్లు రైసోద్దీన్ తెలిపారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు పూర్తి విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, బర్ల సూరి, కౌన్సిలర్లు బత్తుల నరేష్, గుడికందుల అజయ్, మాసుల ప్రవీణ్, అజీమ్, రెబస్ మహేష్, దావనపెళ్లి రాజారాం, మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ జాకీర్, లవ్ కుమార్, జెట్టి లక్ష్మణ్, మార్గం కిరణ్, ఉల్లెందుల రమేష్, దానపల్లి గణేష్, పులిమామిడి ప్రవీణ్ కుమార్, వెంకటేష్, జలాల రాజగోపాల్, బర్ల వంశీ, ఫసి, షేక్ మమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular