📄 ePaper
Tuesday, September 22, 2026
ADS
HomeUncategorizedహుండీ లెక్కింపు వద్దే మీడియా.వాయిస్‌కు నో!

హుండీ లెక్కింపు వద్దే మీడియా.వాయిస్‌కు నో!

📰 Generate e-Paper Clip

హుండీ లెక్కింపు వద్దే మీడియా.వాయిస్‌కు నో!

“ఆఫీసు వద్ద ఇస్తా” అంటూ వెళ్లిపోయిన ఈవో.. తెరవెనుక జూనియర్ అసిస్టెంట్‌దే హవానా?

పాపన్నపేట,సెప్టెంబర్,22,మెదక్ టుడే న్యూస్:ఏడుపాయల వనదుర్గాభవాని దేవస్థానంలో హుండీ లెక్కింపు సందర్భంగా అధికారుల వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. హుండీ లెక్కింపు జరిగిన ప్రదేశంలో మీడియా ప్రతినిధులు వివరాల కోసం ఎదురుచూస్తుండగా, లెక్కింపు ఎంత వచ్చింది? అనే వివరాలను అక్కడే వెల్లడించకుండా ఈవో “ఆఫీస్ వద్ద వాయిస్ ఇస్తాను” అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు మీడియా ప్రతినిధులు చెబుతున్నారు.గతంలో హుండీ లెక్కింపు పూర్తి అయినా వెంటనే లెక్కింపు వివరాలను మీడియాకు వెల్లడించడంతో పాటు వాయిస్ ఇచ్చే ఆనవాయితీ ఉండేదని జర్నలిస్టులు పేర్కొంటున్నారు. అయితే ఈసారి లెక్కింపు జరిగిన ప్రదేశంలోనే మీడియా ఉన్నప్పటికీ వివరాలు వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఈ వ్యవహారంలో దేవస్థానంలోని జూనియర్ అసిస్టెంట్‌ అచ్చనపల్లి శ్రీనివాస్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హుండీ లెక్కింపు వంటి పారదర్శకతకు సంబంధించిన అంశంలో మీడియాకు సమాచారం ఇవ్వడంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తున్నారా? అసలు లెక్కింపు వివరాలను అక్కడికక్కడే వెల్లడించకుండా ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.భక్తుల కానుకలతో కూడిన హుండీ ఆదాయం విషయంలో పారదర్శకత పాటించడం దేవస్థానం అధికారుల బాధ్యత. మీడియాకు సమాచారం ఇవ్వడంపై ఆంక్షలు లేదా ప్రత్యేక విధానం ఏదైనా ఉంటే అధికారులు స్పష్టంగా వెల్లడించాలని జర్నలిస్టులు కోరుతున్నారు.హుండీ లెక్కింపు వివరాలు బహిరంగంగా వెల్లడించడంలో ఇంత గోప్యత ఎందుకు? అసలు తెరవెనుక ఏం జరుగుతోంది? అన్నది దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తేల్చాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular