చేగుంట,జూన్,4,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేగుంట మండలంలోని మొత్తం 25 గ్రామపంచాయతీలకు గాను, మొదటి విడత కింద గురువారం 6 గ్రామపంచాయతీలలో ప్రత్యేక గ్రామసభలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సభలకు మండల, గ్రామస్థాయి అధికారులు,సర్పంచులు, పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామసభల్లో ప్రధానంగా వర్షాకాలం సన్నద్ధత, సురక్షిత తాగునీరు, ఘన వ్యర్థాల నిర్వహణ, జల సంరక్షణ – మన సంరక్షణ, మొక్కల పెంపకం – వన మహోత్సవం, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, వరద నిర్వహణ-భద్రత అనే ఏడు రకాల కీలక అంశాలపై ప్రజలతో ముమ్మరంగా చర్చించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో ఎదురయ్యే ప్రత్యేక అవసరాలు, స్థానిక సమస్యల నిమిత్తం ఆయా అంశాలపై గ్రామసభలలో ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం జరిగింది.

