📄 ePaper
Friday, July 31, 2026
ADS
HomeTelanganaఅధికారులు స్పందించాలి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి చేగుంట ఉప...

అధికారులు స్పందించాలి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి చేగుంట ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మహమ్మద్ రఫీ.

📰 Generate e-Paper Clip

చేగుంట,మే,25,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో పిఎసిఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం చేగుంట ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మహమ్మద్ రఫీ పరిశీలించారు.వారు మాట్లాడుతూ రైస్ మిల్లులకు వెళ్లిన లారీలు వెంటనే అన్లోడ్ చేయాలని సుమారు ఇక్కడ 3000 బస్తాల ధాన్యం నిల్వ ఉందని,ఇంకా కాంటా పెట్టని ధాన్యం చాలా ఉన్నది. త్వరగా అధికారులు స్పందించి రైస్ మిల్లులలో ఉన్న లారీలను త్వరగా అన్లోడ్ అయ్యే విధంగా చూడాలని వారన్నారు ఇక్కడ రైతులకు చాలా ఇబ్బంది ఉన్నది కొంచెం వర్షం వచ్చినా ధాన్యం తడిసిపోయి చేతికి వచ్చిన పంట కరాబ్ అవుతుంది అందువల్ల అధికారులు తొందరగా స్పందించి రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఉప సర్పంచ్ తో పాటు గ్రామ రైతులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular