📄 ePaper
Saturday, May 9, 2026
ADS
HomeNewsమేడే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు నిర్వహిద్దాం.

మేడే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు నిర్వహిద్దాం.

📰 Generate e-Paper Clip

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ రాజు
(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్ నగర్,మే,01, మెదక్ టుడే:
141వ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే నేడు. 1886 మే 1వ తేదీన చికాగో నగరంలో జరిగిన కార్మిక వర్గ పోరాటంపై విచక్షణ రహితంగా పెట్టుబడిదారీ వర్గం జరిపిన కాల్పుల్లో 5వేల మందికి పైగా కార్మికులు ప్రాణాలర్పించారు. దాని గుర్తుగానే నేటికీ ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటాం అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ రాజు అన్నారు. ఈరోజు షాద్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్ అధ్యక్షతన జరిగిన మే డే ఉత్సవాలు కార్యక్రమాలలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం. 44 చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్మికవర్గాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని ఎన్నికల్లో ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మారుస్తుందని. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? అని అడుగుతున్నాం. మే 1వ తేదీ స్ఫూర్తితో ప్రపంచ పోరాటాలతో పాటు మన దేశంలో కూడా అనేక పోరాటాలు జరిగాయి. వామపక్ష పార్టీ సంఘాలు తప్ప ఏ సంఘాలు కూడా కార్మిక చట్టాలు కట్టుబడి లేవు. వచ్చే కార్మికులు కూడా ప్రలోభాలకో, భయానికో, భక్తికో, బూర్జువా పార్టీలకు సంబంధించిన కార్మిక వర్గ సంఘాలలో ఉంటున్నారు. అంటే కార్మిక వర్గాన్ని నష్టపరచాలని ఆలోచిస్తూ ఉన్న సంఘాలకు తగిన బుద్ధి చెప్పాలి. కార్మిక వర్గం పక్షాన నిలబడే వామపక్ష సంఘాలను, అలాగే సీఐటీయూ తదితర సోదర సంఘాలను ఆదరించండి. కార్మికవర్గ చైతన్యంతో ప్రభుత్వాలను నిర్బంధించండి. ఈ ప్రభుత్వాలపై మన కుటుంబాలు మన మీద ఆధారపడి జీవించే వారందరికి చైతన్యం కలిగించండి. ఎన్నికల్లో వారిని ఓడించకపోతే నిరంతరం మనకు కష్టాలు తప్పవు. మన చట్టాలను కాపాడుకుంటూనే అనుకూలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. అనుకూలమైన ప్రభుత్వం అంటే బూర్జువా పార్టీలు కావు వాళ్లు మాటలు మార్చే ప్రభుత్వాలు అబద్దాలు చెప్పే ప్రభుత్వాలు. అందుకోసం వామపక్ష పార్టీలను ఎన్నుకోవాలని మేడే సందర్భంగా కార్మికవర్గానికి విన్నవిస్తున్నా అని వారు అన్నారు కార్యక్రమంల యుటిఎఫ్ సీనియర్ నాయకులు వెంకటరమణ జిల్లా కార్యదర్శి నరసింహులు. వెంకటయ్య శివారెడ్డి బిజిలి సత్యం రవికుమార్ రాములు బాలయ్య హునియా నాయక్ మున్సిపల్ యూనియన్ అధ్యక్ష యాదయ్య రాజు వెంకటయ్య ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు హెచ్ రాములు కె రాములు పాండు నాయక్
హమాలీ సంఘం నాయకులు శ్రీను రవి గ్రానైట్స్ టైల్స్ సంఘం నాయకులు జవహర్ పర్వతా లు శ్రీనివాస్ సమీర్ సిపిఎం పార్టీ నాయకులు బాలరాజు రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments