📄 ePaper
Wednesday, April 15, 2026
ADS
Homepatancheru political newsహరీష్ రావు ని విమర్శించే స్థాయి నీకు లేదు.. కాటా...

హరీష్ రావు ని విమర్శించే స్థాయి నీకు లేదు.. కాటా శ్రీనివాస్ గౌడ్ కు సోయి లేదా?

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నేతపై విరుచుకుపడ్డ బిఆర్ఎస్ శ్రేణులు
  • ఘాటుగా సమాధానం ఇచ్చిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కాటా సునీత రాజేష్ గౌడ్

పటాన్‌చెరు,మార్చి,31,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పై కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం పటాన్‌చెరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి కాటా సునీత రాజేష్ గౌడ్, పటాన్‌చెరు బిఆర్ఎస్ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు కాంగ్రెస్ వైఖరిపై నిప్పులు చెరిగారు.

మీడియా సమావేశంలో ముఖ్య అంశాలు:

  • స్థాయి మరిచి మాట్లాడొద్దు: “హరీష్ రావు తెలంగాణ ఉద్యమ నాయకుడు, అభివృద్ధి ప్రదాత. అటువంటి వ్యక్తిని విమర్శించే స్థాయి, అర్హత కాటా శ్రీనివాస్ గౌడ్‌కు లేదు. రాజకీయాల్లో నీ అడ్రస్ ఎక్కడ?” అని సునీత రాజేష్ గౌడ్ నిలదీశారు.
  • మున్సిపల్ ఎన్నికల గుణపాఠం: గత మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, నీకు గట్టిగా బుద్ధి చెప్పినా ఇంకా సోయి రాలేదా? అని ధ్వజమెత్తారు. ప్రజలు తిరస్కరించినా ఇంకా అబద్ధాలతో పబ్బం గడుపుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
  • కుటుంబ నైతికతపై ప్రశ్న: సొంత అన్నదమ్ములను, కుటుంబ సభ్యులను గౌరవించలేని వ్యక్తి, ప్రజల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఈ మీడియా సమావేశంలో పటాన్‌చెరు బిఆర్ఎస్ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ నవీన్, శంకర్ యాదవ్, మాజీ చైర్మన్స్, మాజీ కౌన్సిలర్స్, మరియు నియోజకవర్గ స్థాయి బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments