📄 ePaper
Thursday, March 19, 2026
ADS
HomeNewsవడియారంలో మురుగు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ సాయి...

వడియారంలో మురుగు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ సాయి కుమార్ గౌడ్.

📰 Generate e-Paper Clip

చేగుంట,మార్చ్,16,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలోని 11, 12 వార్డుల్లో అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ పనులకు గ్రామ సర్పంచ్ సాయి కుమార్ గౌడ్ పాలకవర్గ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. మురుగు నీరు నిల్వ ఉండడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పనులను చేపట్టినట్లు తెలిపారు.గ్రామంలోని ఆయా వార్డుల్లో మురుగు నీటి పారుదల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ ద్వారా మురుగు కాలువల నిర్మాణం చేపడుతున్నామని సర్పంచ్ పేర్కొన్నారు. పనులు పూర్తయితే మురుగు నీరు నిల్వ ఉండకుండా సక్రమంగా బయటకు వెళ్లేలా అవుతుందని దీంతో స్థానికులకు ఉపశమనం కలుగుతుందని చెప్పారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా అవసరమైన మౌలిక వసతుల కల్పనకు గ్రామ పంచాయతీ కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయి కుమార్ గౌడ్,ఉప సర్పంచ్ నాగరాజు, వార్డు సభ్యులు అనిల్ యాదవ్, శ్రవణ్, జనార్ధన్ గౌడ్, పున్నా వినయ్,సభా అంజుమ్, స్వప్నా,గొల్ల శంకర్ ,గౌటే రాజు, నదీమ్,నరేష్ గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments