వడియారంలో మురుగు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ సాయి కుమార్ గౌడ్.
చేగుంట,మార్చ్,16,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలోని 11, 12 వార్డుల్లో అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ పనులకు గ్రామ సర్పంచ్ సాయి కుమార్ గౌడ్ పాలకవర్గ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. మురుగు నీరు నిల్వ ఉండడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పనులను చేపట్టినట్లు తెలిపారు.గ్రామంలోని ఆయా వార్డుల్లో మురుగు నీటి పారుదల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ ద్వారా మురుగు కాలువల నిర్మాణం చేపడుతున్నామని సర్పంచ్ పేర్కొన్నారు. పనులు పూర్తయితే మురుగు నీరు నిల్వ ఉండకుండా సక్రమంగా...