📄 ePaper
Friday, March 20, 2026
ADS
HomeSportబీరంగూడలో రాష్ట్ర స్థాయి కబడ్డీ సంబరాలు-పోస్టర్ ఆవిష్కరించిన బీఆర్‌ఎస్ నాయకురాలు...

బీరంగూడలో రాష్ట్ర స్థాయి కబడ్డీ సంబరాలు-పోస్టర్ ఆవిష్కరించిన బీఆర్‌ఎస్ నాయకురాలు కాట సునీత రాజు గౌడ్.

📰 Generate e-Paper Clip

అమీన్ పూర్,మార్చి,16,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని బీరంగూడలో నిర్వహించ తలపెట్టిన “తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ ఛాంపియన్స్ ట్రోఫీ – సీజన్ 10” పోటీలకు రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రికను సోమవారం ‘టీమ్ పండు’ సభ్యులు బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి కాట సునీత రాజు గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి అందజేశారు.
​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడలకు పూర్వవైభవం తీసుకురావడంలో కబడ్డీ కీలక పాత్ర పోషిస్తుందని, ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం ద్వారా యువతలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా క్రమశిక్షణకు కూడా తోడ్పడతాయని పేర్కొన్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన క్రీడలను నిర్వహిస్తున్న టీమ్ పండు సభ్యులను ఆమె అభినందిస్తూ, పోటీలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

పోటీల వివరాలు:

  • ​తేదీలు: మార్చి 28 మరియు 29,
    2026.
  • ​వేదిక: మండే మార్కెట్ గ్రౌండ్స్, బీరంగూడ, పటాన్‌చెరు.

బహుమతులు:  మొదటి బహుమతి: రూ. 50,000/-

రెండవ బహుమతి: రూ. 30,000/-

  • ​మూడు మరియు నాలుగవ
    బహుమతులు: తలా రూ. 10,000/-

తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అనుమతితో నిర్వహించబడుతున్న ఈ పోటీలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ జట్లు పాల్గొననున్నాయి. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు టీమ్ పండు సభ్యులు మరియు క్రీడా ప్రేమికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments