సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు
చేగుంట,మార్చి,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలో గృహ అవసరాలకు గ్యాస్ ఎటువంటి కొరత లేదని తాసిల్దార్ శివప్రసాద్ తెలిపారు చేగుంట మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీని శనివారం ఆయన తనిఖీ చేసి నిల్వలను పరిశీలించారు. అందరికీ సరిపడా సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఎవ్వరు ఆందోళన చెందవద్దని మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన అన్నారు.

