📄 ePaper
Tuesday, March 10, 2026
ADS
Homepatancheru political newsశివరాత్రి ఉత్సవాల విజయవంతానికి సహకరించిన అధికారులకు 'బీరంగూడ దేవస్థానం' కృతజ్ఞతలు

శివరాత్రి ఉత్సవాల విజయవంతానికి సహకరించిన అధికారులకు ‘బీరంగూడ దేవస్థానం’ కృతజ్ఞతలు

📰 Generate e-Paper Clip

అమీన్‌పూర్,ఫిబ్రవరి,24,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.బీరంగూడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి
దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాల విజయవంతానికి అహర్నిశలు శ్రమించిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను మంగళవారం దేవాలయ కమిటీ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపింది.

అధికారులకు స్వామివారి ప్రసాదం అందజేత:

దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో పాలకమండలి సభ్యులు అధికారులను కలిసి స్వామివారి శేషవస్త్రం మరియు ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో మెరుగైన సేవలందించిన:
మెడికల్ డిపార్ట్‌మెంట్ అధికారిణి మోహిని, ట్రాఫిక్ ఏసీపీ ఆదిమురళి, ట్రాఫిక్ సీఐ లాలు నాయక్
అమీన్‌పూర్ ఎమ్మార్వో వెంకటేశం,
హెచ్‌ఎండబ్ల్యూఎస్ డీజీఎం చంద్రశేఖర్,
తదితర అధికారులకు దేవస్థానం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సమిష్టి కృషితోనే ఉత్సవాలు విజయవంతం:

ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, వైద్య మరియు జలమండలి శాఖలు అద్భుతంగా పనిచేశాయని కొనియాడారు. అధికారుల సమన్వయం వల్లే శివరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా, వైభవంగా జరిగాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్ రెడ్డి, ఆలయ పాలకమండలి సభ్యులు మహేష్, రమేష్ యాదవ్, శ్రీనివాస్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments