శివరాత్రి ఉత్సవాల విజయవంతానికి సహకరించిన అధికారులకు ‘బీరంగూడ దేవస్థానం’ కృతజ్ఞతలు
అమీన్‌పూర్,ఫిబ్రవరి,24,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.బీరంగూడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిదేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాల విజయవంతానికి అహర్నిశలు శ్రమించిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను మంగళవారం దేవాలయ కమిటీ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపింది. అధికారులకు స్వామివారి ప్రసాదం అందజేత: దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో పాలకమండలి సభ్యులు అధికారులను కలిసి స్వామివారి శేషవస్త్రం మరియు ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో మెరుగైన సేవలందించిన:మెడికల్ డిపార్ట్‌మెంట్ అధికారిణి మోహిని, ట్రాఫిక్ ఏసీపీ ఆదిమురళి,...